'నేను మొదటి ముద్దాయిని'
గత నెలలో తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో తానే మొదటి ముద్దాయినని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు.
కసింకోట: గత నెలలో తూర్పుగోదావరి జిల్లా తుని కాపు గర్జన సందర్భంగా చోటు చేసుకున్న ఘటనల్లో తానే మొదటి ముద్దాయినని కాపు రిజర్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. నాటి ఘటనలకు సంబంధించిన కేసుల్లో తన తర్వాతే ఎవరైనా వస్తారని, భయపడాల్సిన పనిలేదన్నారు.
కాపు వర్గానికి చెందిన సూర్యనారాయణ అనే వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించేందుకు శనివారం విశాఖ జిల్లా కసింకోటకు వచ్చిన ముద్రగడ విలేకరులతో మాట్లాడారు. కాపు గర్జనలో పాల్గొన్న వారిపై కాకుండా ప్రమేయం లేని వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోందన్నారు. తమది ఆకలి కేకే కానీ, వినోదం కోసం చేసింది కాదన్నారు. తుని గర్జనలో పాల్గొన్నవారు, సహకరించిన వారు, రవాణా సదుపాయాలు కల్పించిన వారి పేర్లతో సీఎం, డీజీఎంలకు ఇప్పటికే లేఖలు కూడా రాశానని చెప్పారు.