
కాపు ఉద్యమం చల్లబడలేదు
ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపుజాతికి ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న ప్రధాన ....
► చంద్రబాబు ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయాలి
► కాపు కులస్తుల ఆర్థిక స్థితిగతులను త్వరలోనే కమిటీకి నివేదిస్తాం
► తుని ఘటనపై పారదర్శక విచారణ జరపాలి
► కాపు ఉద్యమనేత, మాజీమంత్రి ముద్రగడ
విజయవాడ (గుణదల): ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు కాపుజాతికి ఇచ్చిన హామీలను నేరవేర్చాలన్న ప్రధాన డిమాండ్‌తోనే తాము ఉద్యమిస్తున్నామని కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నేరవేర్చే వరకు తన ఉద్యమం ఆగబోదని స్పష్టం చేశారు. ఆదివారం నగరంలోని ఐవీ ప్యాలెస్‌లో జరిగిన అమరావతి సర్వకాపు సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాపుల అభ్యున్నతికి కృషి చే స్తున్నామని ప్రకటించిన ప్రభుత్వం, వారికి రిజర్వేషన్లు కల్పించే అంశంలో రాజ్యాంగపరంగా ఉన్న వెసులుబాటును మాత్రం పట్టించుకోవటం లేదని అన్నారు. 1966 వరకు కాపులకు అమల్లో ఉన్న రిజర్వేషన్లను ప్రభుత్వం అకారణంగా రద్దు చేసిందని ఆరోపించారు.
కాపు ఉద్యమం తీవ్రతను గమనించిన చంద్రబాబు ప్రభుత్వం ప్రభుత్వ పెద్దలతో వీధినాటకాలాడించి ఉద్యమం చల్లారిందనే ప్రచారం చేస్తోందని, కానీ ఉద్యమం ఏ మాత్రం చల్లబడలేదని, తన దీక్ష సమయంలోప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే మళ్లీ వెంటనే ఉద్యమిస్తానని ప్రకటించారు. కాపుల ఆర్థికస్థితిగతులపై ఓ నమూనాను రూపొందించామని, కాపు సంఘం రాష్ట్ర కమిటీలు, జిల్లా కమిటీలు గ్రామస్థాయిలో పూర్తి వివరాలు సేకరించి తనకు అందజేస్తే కాపు రిజర్వేషన్‌లపై ఏర్పాటైన రామనాథం కమిటీకి ఇస్తామని తెలిపారు. తుని ఘటనను అవకాశంగా తీసుకుని ప్రభుత్వం కాపులను వేధిస్తోందని ఆయన ఆరోపించారు. ఆ ఘటనపై విచారణ పారదర్శకంగా జరగటం లేదని, సంబంధం లేని వారిని కూడా కేసుల్లో ఇరికిస్తున్నారని అన్నారు.
విచారణ పారదర్శక ంగా జరపకపోతే తాను మరోమారు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు. కాపుల ఉపాధికల్పనకు కాపు కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 కోట్లు ఇంతవరకు విడుదల కాలేదని, దీనికి జన్మభూమి కమిటీ అడ్డుపడుతోందని చెప్పారు. ఇటీవల మచిలీపట్నంలో రంగా విగ్రహాన్ని ఎవరు కూల్చారో అందరికీ తెలుసని, అలాంటి దుశ్చర్యలకు పాల్పడేవారు కేవలం విగ్రహాలను మాత్రమే కూలగలరు తప్ప మా గుండెల్లో రంగాకి కట్టుకున్న గుడిని ఎవరూ కూల్చలేరని తెలిపారు. రంగా హత్యనంతరం కాపుజాతి విచ్ఛిన్నమైందని, తిరిగి అంద రూ సంఘటితమవ్వాల్సిన సమయం ఆసన్నమైందని వివరించారు. అంతకుముందు ముద్రగడను అమరావతి సర్వకాపు సమ్మేళనం నిర్వాహకులు గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాపు ఉద్యమనాయకులు, వివిధ కాపు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ముద్రగడకు ఘన స్వాగతం
సీతానగరం (తాడేపల్లిరూరల్): కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంకు ప్రకాశం బ్యారేజి వద్ద తాడేపల్లి కాపు సంఘంనేతలు ఆదివారం రాత్రి ఘన స్వాగతం పలికారు. ఆదివారం విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ముద్రగడ మంగళగిరిలో ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు వె ళుతున్నారన్న విషయం తెలుసుకున్న కాపు సంఘం నేతలు ప్రకాశం బ్యారే జి వద్దకు చేరుకుని ఆయనకు పూల మాలలతో ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాపుసంఘం నేతలు తోట సాంబశివరావు, వైఎస్సార్‌సీపీ పట్టణగౌరవ అధ్యక్షుడు కేళి వెంకటేశ్వరరావు, అంబటి తిరుపతిరావు, ర మణ, పూనపు భాస్కరరావు, బండా రు కామేశ్వరరావు, వెంకటేశ్వరరావు, శంకరరావు తదితరులు ఉన్నారు.