కాపులను బీసీల్లో చేర్చే చర్యలను అడ్డుకోవాలని భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు.
భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్
విజయనగరం క్రైం : కాపులను బీసీల్లో చేర్చే చర్యలను అడ్డుకోవాలని భారతీయ యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మయూర హోటల్‌లో జరిగిన యాదవ మహాసభ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో 14 శాతం జనాభా కలిగి సామాజికంగా, ఆర్థికంగా, వృత్తిపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న యాదవుల అభివృద్ధికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
కాపులను బీసీ జాబితాలో చేర్చే రాష్ట్ర ప్రభుత్వ చర్యలను.. మం జూనాథ కమిషన్‌ను అడ్డుకోవాలన్నారు. ఈ సందర్భంగా యాద శంఖరావం మాసపత్రికను విజయనగరం మున్సిపల్ చైర్మన్ ప్రసాదుల రామకృష్ణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో మహాసభ జాతీయ ఉపాధ్యక్షుడు భరణికాన రామారావు, కార్యదర్శి అంగిరేకుల వరప్రసాద్ యాదవ్, రాష్ట్ర కోశాధికారి రామ్మోహన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గొంప అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అధ్యక్షుడిగా మన్యాలకృష్ణ యాదవ్ ఎన్నిక..
భారతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడిగా మన్యాలకృష్ణ యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎం.రామలింగస్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రసాదుల రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొయ్యాన సన్యాసిరావులు నియమించినట్లు వెంగళరావు యాదవ్ ప్రకటించారు. రాష్ట్ర కమిటీలో గదుల సత్యలత, చీసపు పార్వతి, గువ్వల తిరుపతి, ఇసరపు శేఖర్, గార సత్యనారాయణ, పల్లా అప్పలస్వామి, ఇప్పిలి కొండలకు చోటు కల్పించినట్లు చెప్పారు.