ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేస్తూనే ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పేర్ని నాని వ్యాఖ్యానించారు. కాపులు ఈబీసీల్లో సగం అంటూ మరోసారి చంద్రబాబు కొత్త నాటకానికి తెర తీశారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో ఇచ్చిన కాపు రిజర్వేషన్ హామీ ఏమైందని, మంజునాథ కమిషన్ పేరుతో కాలయాపన చేశారంటూ మండిపడ్డారు. గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మీడియా సమావేశంలో మాట్లాడారు.