
'చంద్రబాబు సర్కారు అబద్ధాల మేడ'
చంద్రబాబు ప్రభుత్వమే అబద్ధాల మేడ అని కాపు సంఘం నేత కటారి అప్పారావు ధ్వజమెత్తారు.
హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వమే అబద్ధాల మేడ అని కాపు సంఘం నేత కటారి అప్పారావు ధ్వజమెత్తారు. తమకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కాపులు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారని, ముద్రగడ పద్మనాభం పిలుపుమేరకు తుని సభకు లక్షలమంది తరలివచ్చారని గుర్తుచేశారు. తుని సభ నాటి నుంచి కాపు నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు.
ముద్రగడ పద్మనాభం నిరాహార దీక్ష సవాల్‌పై చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే చంద్రబాబు కాపు నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నికలో కాపులంతా చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని కటారి అప్పారావు కోరారు.