
సాక్షి, హైదరాబాద్ : రిజర్వేషన్ల విషయంలో అమలుకాని హామీలు ఇవ్వలేనంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీసీ నేత, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య స్పందించారు. వైఎస్ జగన్ రాజకీయ నాయకుడిగా కంటే వాస్తవికవాదిగా మాట్లాడారని ఆయన అన్నారు. రిజర్వేషన్ అనేది కేంద్రం పరిధిలోని అంశమని, రిజర్వేషన్లు ఒక పరిమితి మించి ఇవ్వాలనుకుంటే రాజ్యాంగ సవరణ అవసరవుతుందని ఆర్. కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.