కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. రైళ్లు, బస్సులు తగులబెడితే బీసీల్లో చేరుస్తారా అని ప్రశ్నించారు.
గుంటూరు: కాపులను బీసీల్లో చేర్చితే సహించేది లేదని బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. రైళ్లు, బస్సులు తగులబెడితే బీసీల్లో చేరుస్తారా అని ప్రశ్నించారు. ఒత్తిడి ఉందని హడావుడిగా కమిషన్ వేస్తానంటే కోర్టులో ఒప్పుకోవని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికే కాపులంతా అభివృద్ధి చెందారని ఆయన అన్నారు. వారికి డిప్యూటీ సీఎంతోపాటు నాలుగు మంత్రి పదవులు ఉన్నాయని చెప్పారు. వారిని బీసీల్లో చేర్చితే తమకు ఒక్క మంత్రి పదవి కూడా రాకుండా చేస్తారని కృష్ణయ్య అన్నారు.