మాజీమంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం చుట్టూ చంద్రబాబు సర్కారు ఉచ్చు బిగిస్తోంది. కాపు రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 26న కిర్లంపూడి నుంచి తలపెట్టిన చలో అమరావతి పాదయాత్రకు అనుమతి లేదంటూ అడ్డుకునేందుకు చంద్రబాబు సర్కార్ ముందస్తు కుట్రలు పన్నుతోందని ముద్రగడ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు.