చంద్రబాబు దగా చేశారు... | YSRCP Leaders kanna babu speaks Over Kapu Reservation At Kakinada | Sakshi
Sakshi News home page

చంద్రబాబు దగా చేశారు...

Published Mon, Jul 30 2018 6:54 AM | Last Updated on Thu, Mar 21 2024 7:48 PM

కాపు రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, మరికొందరు నేతలు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇతర నేతలతో కలసి ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.

జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎదురైన సందర్భాన్ని పక్కనపెట్టి కాపు రిజర్వేషన్లకు జగన్‌ వ్యతిరేకమనే ధోరణిలో వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టుకుని కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్‌సీపీ వైఖరి చెప్పాలని కోరిన సందర్భంలో జగన్‌ అనేక వాస్తవ విషయాలను తన ప్రసంగంలో వివరించారని ఆయన తెలిపారు.  

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement