Dhadishetti raja
-
‘అలా మాట్లాడటానికి యనమలకు సిగ్గుండాలి’
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ఆదాయం కోసం మాట్టాడుతన్న టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావులకు సిగ్గుండాలని ఏపీ ప్రభుత్వ విప్ దాడిశేట్టి రాజా మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మేము అప్పుటు చేసి రాష్ట్రాన్న దీవాళ తీశామని.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిపాలించలేరని చెప్పిన మాటలు యనమలకు గుర్తులేదా అన్నారు. బురదలో పందులు దొర్లుతున్నాయి.. మీరు దోర్లుతున్నారు కాస్తా బాధ్యతగా మాట్లాడమని యనమల, వెంకట్రావ్‌లను ఆయన హెచ్చరించారు. (‘ప్రతిపక్ష నేత లేక పనికిమాలిన వాడివా’) ఇక ఎల్లో మీడియాలో గంటల తరబడి చంద్రబాబు చేస్తున్న ప్రసంగం విని... ప్రజలు మాకీ కర్మేంటి బాబు అంటూ దండాలు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల బాగోగులు చూడకుండా ప్రతి అరగంటకు పచ్చ మీడియా ముందు ప్రెస్మిట్లు పెట్టేవారన్నారు. ప్రజల హృదయం తెలిసిన వ్యక్తి సీఎం జగన్ అన్నారు. లాక్డౌన్ వంటి పరిస్థితుల్లో మహిళలకు వడ్డిలేని రుణాలు ఇచ్చి అన్ని వర్గాల ప్రజలను ఆర్థికంగా ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. కరోనా పరీక్షల్లో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని కేంద్రమే గుర్తించిందని చెప్పారు. కరోనాను అరికట్టడంలో సీఎం జగన్ విజయం సాధిస్తున్నారన్నారు. అంతేగాక దేశానికి దిక్చూచిగా కరోనాను నివారిస్తారని ఆయన అన్నారు. (ఏపీని అన్ని రాష్ట్రాలు అభినందిస్తున్నాయి..) -
‘ఫౌండేషన్ పేరుతో కోట్లు దోచేశారు’
సాక్షి, తుని(తూర్పుగోదావరి): నమ్మి ఓట్లేసిన ప్రజలకు వెన్నుపోటు పొడవడంలో సిద్ధహస్తులైన కోన ప్రాంత టీడీపీ నేతలు యనమల ఫౌండేషన్‌కు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ (సీఎస్ఆర్) నిధులను దుర్వనియోగం చేశారని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శించారు. కోన ప్రాంతం పెరుమాళ్లపురం పంచాయతీ తలపంటిపేట గ్రామంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా ఖర్చు చేసే సీఎస్ఆర్ నిధులను ఫౌండేషన్‌ను మళ్లించుకుని జల్సాలు చేస్తున్నారని విమర్శించారు. వివిధ కంపెనీలు స్థానికంగా ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం రెండు శాతం నిధులను సీఎస్ఆర్ నిధులుగా కేటాయిస్తాయన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆ నిధులను యనమల ఫౌండేషన్‌కు మళ్లించుకుని, పిల్లలకు పెన్సిళ్లు, బ్యాగులు ఇచ్చి విస్తృత ప్రచారం చేసుకున్నారని అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు చూపించి రూ.కోట్లు దోచుకున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రాకముందు ఈ ప్రాంతంలో పర్యటించిన చంద్రబాబు తీరప్రాంత డ్రైనేజీ సమస్యపై అప్పట్లో ధర్నా చేసి హడావుడి చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆ తరువాత టీడీపీ ఐదేళ్లు అధికారంలో ఉన్నా డ్రైనేజీ సమస్యను పట్టించుకోలేదన్నారు. ఆర్థిక మంత్రిగా ఉన్న ఈ ప్రాంత నేత కూడా పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం డెంగీ, వైరల్ జ్వరాలకు నిలయంగా మారిందన్నారు. ఏడాదిలోగా జమ్మేరు కాలువల ఆధునికీకరణ చేసి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే అన్నారు. పెరుమాళ్ల పురంలో డిగ్రీ కళాశాలకు సొంత భవనం నిర్మించడంతోపాటు మండలానికి పీజీ, జూనియర్ కళాశాల మంజూరుకు కృషి చేస్తానన్నారు. తొండంగి మండలంలోని అత్యధికంగా పూరి గుడిసెలు ఉన్నాయన్నారు. పార్టీ, కుల, మత వర్గ బేధం లేకుండా అర్హులైన వారికి ఇళ్ల స్థలాలు, ఇళ్లు నిర్మిస్తామన్నారు. సున్నా వడ్డీ రుణాల పంపిణీ అనంతరం డ్వాక్రా మహిళల సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు రూ.3.20 కోట్ల చెక్కును మండల మహిళా సంఘానికి అందజేశారు. తొలుత పంపాదిపేట, బుచ్చియ్యపేట గ్రామాల్లో గ్రామ సచివాలయాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. రబీ సాగునీటి విడుదలకు చర్యలు పంపా, కోదాడ ఉప్పు చెరువు ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది రబీ సాగుకు నీరందించేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రాజా విలేకరులకు తెలిపారు. పంపా ఆయకట్టు పరిధిలో 12 వేల ఎకరాలకు 1.03 టీఎంసీల నీరు అవసరమన్నారు. ప్రస్తుతం పంపాలో 0.23 టీఎంసీల నీరు ఉందన్నారు. ఏలేరు జలాలను మళ్లించేందుకు కలెక్టర్, జిల్లా ఇరిగేషన్ అధికారులతోపాటు విశాఖ జిల్లా ఇరిగేషన్ అధికారులతో చర్చించినట్టు తెలిపారు. నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉన్నందున ఏడు వేల ఎకరాలకు పూర్తి స్థాయిలో నీరందించేందుకు కృషి చేస్తామన్నారు. పిఠాపురం బ్రాంచి కెనాల్ ద్వారా కోదాడ ఉప్పు చెరువు ఆయకట్టు పొలాలకు రబీ సాగుకు నీరందిస్తామన్నారు. సభలో ఎమ్మెల్యే రాజాను పార్టీ నాయకులు, విద్యార్థులు, వివిధ వర్గాలకు చెందిన ప్రజలు సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కొయ్యా మురళి, పార్టీ మండల కనీ్వనర్ బత్తుల వీరబాబు, మండల యూత్ కనీ్వనర్ ఆరుమిల్లి ఏసుబాబు చౌదరి, యాదాల రాజబాబు, మత్స్యకార నాయకులు మేరుగు ఆనందహరి, చొక్కా కాశీ, పెరుమాళ్ల లోవరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు అంగుళూరి అరుణ్‌కుమార్, మండలంలోని ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు. -
‘ద్వారంపూడిని విమర్శించే హక్కు ఆమెకు లేదు’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి గురువారం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. రబీ పంటకు జిల్లాలో 4,36,533 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రబీకి గోదావరి నుంచి కాలువలకు డిసెంబరు 1వ తేదిన సాగునీరు విడుదల చేసి.. వచ్చే ఏడాది మార్చి 31న కాలువలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు 2020 జూన్ 6న గోదావరి నుంచి కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గోదావరి డెల్లా పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాలువలను పరిరక్షించి డ్రైయిన్లను ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. కాలువల్లో పూడికతీతలో కాంట్రాక్టర్లు పాల్పడుతున్న అవకతవకలపై దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు.. మేయర్ పావని తీరుపై కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డ్డిని విమర్శించే అర్హత మేయర్ పావనికి లేదంటూ మండిపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేసి ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ అధికారుల ఫైల్స్ నేరుగా చూసే అధికారం మేయర్‌కు లేదని, ఒక వైపు గౌరవ వేతనంతీసుకుంటూ కారు అద్దె తీసుకోవడం మేయరుకు సరికాదని హితవు పలికారు. -
మంచి పాలనతోనే విస్తారంగా వర్షాలు
అన్నవరం (తూర్పుగోదావరి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సుపరిపాలనతోనే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో విస్తారంగా వర్షాలు కురిసి రిజర్వాయర్లు నిండాయని, ఇప్పుడు జగన్ పాలనలో వర్షాలు బాగా పడుతున్నానయని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన శనివారం అన్నవరంలోని పంపా రిజర్వాయర్ నీటిని ఆయకట్టుకు విడుదల చేసేందుకు వచ్చారు. దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు రిజర్వాయర్‌లోని స్లూయిజ్ గేట్లను ఎత్తడంతో పంపా నీరు మెయిన్ కెనాల్ ద్వారా ఆయకట్టు పొలాలకు పరుగులు తీసింది. దీనిద్వారా తుని, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లోని 12,500 ఎకరాలకు నీరందుతుంది. అంతకుముందు ఎమ్మెల్యేలిద్దరూ పండితుల మంత్రోచ్ఛారణల మధ్య గంగమ్మ తల్లికి పూజలు చేసి పసుపు, కుంకుమ, పూలు, చీర సమర్పించి హారతి ఇచ్చారు. ‘పంపా’ అభివృద్ధికి కృషి పంపా రిజర్వాయర్ అభివృద్ధికి కృషి చేస్తామని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ అన్నారు. పంపా ఆయకట్టులోని 12,500 ఎకరాలకు, అలాగే అన్నవరం దేవస్థానం అవసరాల కోసం రిజర్వాయర్‌లో నిత్యం నీరుండేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరనున్నట్లు తెలిపారు. ఏలేరు ప్రాజెక్ట్ నుంచి లేదా పుష్కర ఎత్తిపోతల పథకం కాలువ నుంచి పంపాకు శాశ్వత ప్రాతిపదికన నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే పంపా రిజర్వాయర్‌లో నిత్యం నీరు ఉంటుందన్నారు. రోజుకు 50 క్యూసెక్కుల నీరు విడుదల పిఠాపురం డీఈ శేషగిరిరావు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు పంపా ఆయకట్టులోని పొలాల్లో నీరు నిల్వ ఉందన్నారు. అందువల్ల రిజర్వాయర్ నుంచి 50 క్యూసెక్కుల నీటిని ప్రస్తుతం విడుదల చేస్తున్నామన్నారు. రైతుల అవసరాన్ని బట్టి నీటి విడుదల పెంచుతామన్నారు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 99.5 అడుగుల నీరు ఉందన్నారు. కార్యక్రమంలో ఇరిగేషన్ సామర్లకోట ఈఈ రామ్‌గోపాల్, డీఈ శేషగిరిరావు, పార్టీ నాయకులు వెంకటేష్, నాగం గంగబాబు, శెట్టిబత్తుల కుమార్‌రాజా, రాయవరుపు భాస్కరరావు, కొండపల్లి అప్పారావు, దడాల సతీష్, బొబ్బిలి వెంకన్న, బీఎస్వీ ప్రసాద్, అల్లాడ సూరిబాబు పాల్గొన్నారు. -
‘మరో పోరాటానికి వైఎస్ జగన్ సిద్ధం’
సాక్షి, తూర్పు గోదావరి: ఆంధ్రప్రదేశ్ ప్రజానీకమంతా సంజీవనిగా భావిస్తున్న ‘ప్రత్యేక హోదా’ కోసం అవసరమైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హోదా సాధించేంతవరకూ వైఎస్సార్సీపీ పోరాడుతూనే ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆయన కాకినాడలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. శుక్రవారం తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలలో 80 శాతం తొలి ఏడాదే నెరవేర్చబోతున్నామని తెలిపారు. కాపులకు ఇచ్చిన మాట ప్రకారం తొలి బడ్జెట్లోనే రూ.2 వేల కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. కాపులను చంద్రబాబు కేవలం ఓటు బ్యాంకుగానే వాడుకున్నారని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో వారిని ఎన్నో అవమానాలకు గురిచేశారని గుర్తుచేశారు. కాపు రిజర్వేషన్ల సాధన ఉద్యమ సందర్భంగా తుని రైలు దహనం ఘటనలో టీడీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులు ఎత్తివేస్తామని దాడిశెట్టి రాజా ప్రకటించారు. తుని రైలు దహనంలో టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ ప్రమేయం ఉందని ఆయన ఆరోపించారు. టీడీపీ హయాంలో అవసరానికి మించి అప్పులు చేసినట్లు యనమల అంగీకరించారని, ఓటమి అనంతరం తమపై నిందలు వేయడం సరికాదని హితవుపలికారు. కాపు రిజర్వేషన్లు సాధ్యం కాదని వైఎస్ జగన్ ముందే చెప్పినట్లు గుర్తుచేశారు. అయినప్పటికీ వారంతా తమ పార్టీకే ఓటు వేశారని అభిప్రాయపడ్డారు. -
‘నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి’
సాక్షి, తూర్పు గోదావరి: కృష్ణా కరకట్టపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు కూడా సమర్థించిందని వైఎస్సార్సీపీ తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా అన్నారు. హైకోర్టు తీర్పును కూడా అగౌరవ పరిచే విధంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని.. ఇది ఖచ్చితంగా కోర్టు తీర్పు ఉల్లంఘనే అని విమర్శించారు. మాజీ మంత్రి యనమల ఒక రకమైన నిస్పృహలో ఉన్నారని, సీఎం జగన్‌పై ఆయన చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు తమ నోటిని అదుపులోకి పెట్టుకుని మాట్లాడాలని రాజా హెచ్చరించారు. చంద్రబాబు నాయుడి తుగ్లక్ పాలన చేయబట్టే ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారని ఎద్దేవా చేశారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీకి 23 ఎమ్మెల్యే లు, ముగ్గురు ఎంపీలతో ప్రజలు సరిపెట్టారని.. వైఎస్ జగన్ పరిపాలనను రాష్ట్ర ప్రజలంతా కొనియాడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేత దిశగా ప్రభుత్వం ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. -
ఇసుక తోడేళ్లండీ... ఓటేద్దామా చెప్పండీ..!
సాక్షి, తూర్పుగోదావరి : ఇసుక ఉచితం అనగానే చాలా బాగుందని అనుకున్నారంతా... కానీ ఆ ‘ఉచితం’ టీడీపీ నేతలకనే విషయం అర్థమైన జనం నివ్వెరపోయారు. ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధుల ‘నిధులు’ సంపాదనకు పెద్దపీట వేయడమే కాకుండా తమ అనుచరులకూ చోటు కల్పించడంతో విలువైన సంపదంతా దోపిడీకి గురవుతోంది. కోట్ల రూపాయల విలువైన ఇసుకను వందలాది ట్రాక్టర్లతో తోడేస్తున్నా సంబంధిత అధికారులు ప్రేక్షకపాత్ర వహించడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. తుని: రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకువెళ్తామని, రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసిన అమాత్యులు సహజ సంపదను అనుచరులు కొల్లగొడుతున్నా అడ్డుకట్ట వేయకపోగా అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి తాండవ నదిలో టన్నుల కొద్దీ ఇసుకను అడ్డదారుల్లో విక్రయించేసి కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ఆర్థిక శాఖా మంత్రి యనమల రామకృష్ణుడి ఇలాకాలో సోదరుడు యనమల కృష్ణుడు ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తూ నదీమతల్లిని నిలువెల్లా చెరిచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక తాండవనదిలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు చేపట్టి సుమారు రూ.200 కోట్లు అక్రమార్జన చేశారు. ఇప్పుడు అదే నాయకుడు తుని నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అన్న అండదండలతో ఇసుక మాఫియాను నడపించిన నాయకుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటే ప్రజలకు భరోసా ఎక్కడ ఉంటుందని రాజకీయ విశ్లేషుకులు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించిన ప్రతిపక్ష ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేశారు. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోవడానికి ‘నేను మరాను, మీకు అండగా’ ఉంటానని చెబుతున్నారు. ఐదేళ్లగాలో స్వేచ్ఛగా మాట్లాడే అవకాశం ఇవ్వని నాయకులు మేలు చేస్తామని వాగ్దానాలు చేస్తుంటే జనం నివ్వెరబోతున్నారు. వందల కోట్లు ఆర్జన... విశాఖ జిల్లా నాతవరం మండలంలో తాండవ ప్రాజెక్టు ఉంది. తూర్పు, విశాఖ జిల్లాలో పరిధిలో సుమారు 55 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తోంది. నాతవరం నుంచి పెంటకోట వరకు సుమారు 45 కిలోమీటర్లు మేర తాండవ నరదీ పరీవాహక ప్రాంతం ఉంది. ప్రాజెక్టు నుంచి అదనపు జలాలు సముద్రంలోకి నది ద్వారా వెళతాయి. వరద నీటికి నదిలో వేల క్యూబిక్ మీటర్లు ఇసుక నిల్వలు చేరతాయి. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు తాండవ ఇసుకపై కన్ను వేశారు. చేతిలో అధికార మంత్రదండం ఉండడంతో కోటనందూరు నుంచి తుని వరకు అనధికారికంగా ఇసుక తవ్వకాలు జరిపారు. రోజుకు వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లతో ఇతర ప్రాంతాలకు రవాణా చేశారు. ఐదేళ్ల వ్యవధిలో వేలాది క్యూబిక్ మీటర్ల ఇసుకను రూపాయి పెట్టుబడి లేకుండా అమ్ముకున్నారు. సగటున రోజుకు 100 లారీలు, 200 ట్రాక్టర్లు ఇసుకను తరలించారు. లారీకు రూ.5వేలు, ట్రాక్టర్‌కు రూ.1000లు చొప్పున వసూలు చేశారు. ఇందులో ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా సొమ్ములు వసూలు చేయించారు. ఎక్కడా అధికార పార్టీ కీలకనేత పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నదిలో కలిసి పోయిన రైతుల భూములు... నదిలో ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వకాలు జరపడంతో నదీ గమనం మారిపోయింది. నదికి ఇరు వైపులా పంట భూములు నదిలో కలిసి పోయాయి. కోటనందూరు నుంచి తుని వరకు వందల ఎకరాల భూమిని రైతులు కోల్పోయారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో భూమి ఉంది. వ్యవసాయం చేసుకునే అవకాశం లేదు. ఇరిగేషన్ అధికారులు నది విస్తీర్ణం (వెడల్పు) ఎంతో ఇప్పటికీ తేల్చలేదు. నదిలో ఉన్న ఇసుక అయిపోవడంతో సమీపంలో ఉన్న పంట భూముల్లో తవ్వకాలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన రైతులపై కేసులు బనాయించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇసుక మాఫియా ధాటికి వ్యవసాయ బోర్లు కూడా నిరుపయోగమయ్యాయి. స్థానిక రెవెన్యూ అధికారుల నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. సార్వత్రిక ఎన్నికల బరిలో అధికార పార్టీ తరఫున యనమల కృష్ణుడు పోటీలో నిలవడంతో ఇసుక మాఫియా ప్రభావం ఎన్నికలపై పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. రైతుల పక్షాన ఎమ్మెల్యే రాజా పోరాటం... ఇసుక మాఫియా ఆగడాలను భరించలేక సంబంధిత రైతులు, బాధితులు ప్రతిపక్ష ఎమ్మెల్యే రాజాను ఆశ్రయించారు. రైతుల భూముల్లో తవ్వకాలు చేయడంపై ప్రశ్నించిన ఎమ్మెల్యే రాజాపై అధికార పార్టీ నాయకులు ఒత్తిడితో పోలీసులు కేసులు పెట్టారు. 2015లో తుని మండలం డి.పోలవరంలో ఏకంగా ఎమ్మెల్యేపై అట్రాసిటీ కేసు బనాయించారు. ఇదే రీతిలో ఇసుక తవ్వకాలపై పోరాటం చేసినా పలువురు ప్రతిపక్ష నాయకులపై కేసులు పెట్టారు. పంట భూమి నదిలో కలసిపోయింది నాకు కోటనందూరులో తాండవ నదిని ఆనుకొని రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇసుక తవ్వకాలతో తాండవ నది గట్టుతోపాటు నా పొలం కూడా నదీ గర్భంలో కలిసిపోయింది. ఇసుకను తవ్వవద్దని చెప్పినా పట్టించుకోవడం లేదు. అధికారుల దృష్టికి తీసుకెళ్తే రెండు, మూడు రోజులు ఆపి మళ్లీ యథావిధిగా కొనసాగిస్తున్నారు. ఇలా నాలుగేళ్లుగా సాగుతోంది. పెద్ద వర్షాలు వస్తే నా పొలం చాలా వరకూ నదిలో కలిసిపోయే ప్రమాదం ఉంది. – అల్లూరి రాజు, రైతు, కాకరాపల్లి ఇసుక మాఫియా జులుం తాండవ నదిలో ఇసుక తోలకాలతో గట్టు కోతకు గురై పొలాలు ఏటిలో కలసిపోతున్నాయి. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా అవైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. నదిలో ఎక్కడికక్కడ పెద్దపెద్ద గోతులు పెట్టేశారు. భవిష్యత్తులో ఏరు భారీగా వస్తే వ్యవసాయ మకాంలకు వెళ్లేందుకు ఏరు దాటేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇంతటి దారుణాన్ని మునుపెన్నడూ చూడలేదు. – ఆళ్ల అప్పారావు, రైతు, బొద్దవరం శ్మశానాలనూ వదలలేదు ఇసుక అక్రమార్కులు తాండవ నది ఒడ్డులు, నీటి అడుగు భాగం, చివరకు శ్మశానాలను సైతం వదలలేదు. వేల లారీల ఇసుకను దూర ప్రాంతాలకు తరలించేశారు. ఇంతటి అక్రమాలు జరుగుతున్నా స్థానికులకు మాత్రం ఇసుక కొరత ఉంది. ఇసుక అక్రమాలను ఎవరూ అడ్డుకోలేకపోయారు. అధికారులు, పాలకులే ఇసుక అక్రమాలను ప్రోత్సహించారు. –చింతకాయల సన్యాసిపాత్రుడు, రైతు, అల్లిపూడి కోతకు గురవుతున్న భూములు... విచ్చల విడిగా ఇసుక తవ్వకాలతో విలువైన పంట భూములు తాండవ నదిలో కలసిపోతున్నాయి. నది లోతు పెరిగిపోయింది. భూగర్భ జలాలు క్షీణించి బోరుబావులు పని చేయడంలేదు. 200 అడుగుల వరకూ కొత్త బోరులను తవ్వించాల్సి వస్తుంది. – చిటెకల వరహాలబాబు, రైతు, డి.పోలవరం -
చంద్రబాబు కంటే నేరస్తుడెవరున్నారు?
తూర్పుగోదావరి, తొండంగి (తుని): సొంత మామ ఎన్టీఆర్‌ను నమ్మించి, వంచించి, వెన్నుపోటు పొడిచి, అవినీతి, అక్రమాలకు, కుట్రలకు, కుతంత్రాలకు పాల్పడిన ముఖ్యమంత్రి చంద్రబాబును మించిన నేరస్తుడు, మోసగాడు రాష్ట్రంలో వేరెవ్వరూ లేరని తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. తొండంగి మండలం కోన ప్రాంతం జి.ముసలయ్యపేట పంచాయతీలోని మత్స్యకార గ్రామం ఎల్లయ్యపేటలో ఆయన సమక్షంలో సుమారు వంద కుటుంబాలకు చెందిన మత్స్యకారులు, యువత పార్టీ నాయకుడు సింగిరి సింగారం ఆధ్వర్యాన గురువారం వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగానిర్వహించిన సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగినంత అవినీతి దేశంలోని ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదన్నారు. పాకిస్తానీయుల సహకారంతో జరిగిన ఉగ్రదాడిపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం బలపడటం, ఆయనకు వెల్లువెత్తుతున్న ప్రజాదరణను చూసి చంద్రబాబు, టీడీపీ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నా రు. ఆ భయంతోనే ఎన్నికల ముందు జగన్ ప్రకటిం చిన పథకాలను కాపీ కొడుతున్నారని, అయినప్పటి కీ చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అ న్నారు. విలువలకు, విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్న జగన్‌ను విమర్శించే అర్హత టీడీపీకి లేదన్నారు. టీడీపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌గా ఉన్న ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడికి ఆ సమయంలో ప్రజల కోసం ఈ పథకాలేవీ గుర్తుకు రాలేదని రాజా విమర్శించారు. ఆయన కూడా చంద్రబాబు మాదిరిగా కోన ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. నమ్మి ఓట్లేసిన జనం ప్రాణాలను హరించేవిధంగా దివీస్ కుంపటిని పెట్టడంతోపాటు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని భూ దోపిడీ, తీరంలో ఇసుక దోపిడీ, ఒంటిమామిడి పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ స్థలం కబ్జా వంటి అవినీతి, అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడిన యనమలకు వైఎస్ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. చంద్రబాబు, అనుచరగణం కంటే పెద్ద నేరస్తులు ఎవరుంటారని ప్రశ్నించారు. అక్రమ కేసులతో కోన ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే తుని నియోజకవర్గంలో యనమల సోదరుల అవినీతిని నడిరోడ్డుకీడుస్తానని రాజా హెచ్చరించారు. యనమల పాలనపై ప్రజలు పూర్తిగా విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పేందుకు తుని నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార సంఘం జిల్లా కన్వీనర్ కారే శ్రీనివాసరావు, పార్టీనాయకులు మాకినీడి గాంధీ, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, కొయ్యా శ్రీనుబాబు, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, రాజానగరం మాజీ సర్పంచ్ చోడిపల్లి శ్రీనివాసరావు, మేరుగు ఆనందహరి, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చొక్కా కాశీ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దగా చేశారు...
-
రాజకీయ స్వార్థం కోసం జగన్ వ్యాఖ్యల వక్రీకరణ
సాక్షి, కాకినాడ: కాపు రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడిన మాటలను ఒక వర్గం మీడియా, టీడీపీ, మరికొందరు నేతలు రాజకీయ స్వార్థం కోసం వక్రీకరించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కురసాల కన్నబాబు మండిపడ్డారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇతర నేతలతో కలసి ఆదివారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. జగ్గంపేట సభలో కాపు రిజర్వేషన్ల అంశం ప్రస్తావనకు సంబంధించి అక్కడ ఎదురైన సందర్భాన్ని పక్కనపెట్టి కాపు రిజర్వేషన్లకు జగన్ వ్యతిరేకమనే ధోరణిలో వక్రభాష్యం చెబుతున్నారంటూ మండిపడ్డారు. కొంతమంది యువకులు ప్లకార్డులు పట్టుకుని కాపు రిజర్వేషన్లపై వైఎస్సార్సీపీ వైఖరి చెప్పాలని కోరిన సందర్భంలో జగన్ అనేక వాస్తవ విషయాలను తన ప్రసంగంలో వివరించారని ఆయన తెలిపారు. చంద్రబాబు దగా చేశారు... రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత వివిధ రాష్ట్రాల్లో రిజర్వేషన్లకు సంబంధించిన అంశాలు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్న విషయాన్ని జగన్ విశదీకరించారన్నారు. ఈ వాస్తవం తెలిసినా టీడీపీని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రిజర్వేషన్లు ఇచ్చేస్తానంటూ కాపులకు చంద్రబాబు హామీ ఇచ్చి దగా చేశారని కన్నబాబు దుయ్యబట్టారు. న్యాయపరమైన అడ్డంకుల్లేకుండా రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో పొందుపరిచేలా చూడాల్సిన చంద్రబాబు ఆ పని ఎందుకు చేయలేకపోయారని నిలదీశారు. కేంద్రంలో మంత్రి పదవులు పంచుకుని అధికారాన్ని అనుభవించిన చంద్రబాబు సర్కారు ఆరోజే కాపు రిజర్వేషన్ల అంశాన్ని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి ఉంటే.. కర్ణాటక తరహాలో బీసీల ప్రయోజనాలు, హక్కులకు భంగం కలగకుండా ఇక్కడ కూడా 50 శాతానికి మించి రిజర్వేషన్లు వచ్చి ఉండేవి కాదా? అని ప్రశ్నించారు. ఈ నేపథ్యాన్ని వివరిస్తూ చంద్రబాబులా గాలి మాటలు తాను చెప్పలేనని, బూటకపు హామీలు ఇవ్వలేనని జగన్ స్పష్టం చేశారన్నారు. కాపులను మభ్యపెట్టే క్రమంలో మంజునాథన్ కమిషన్ వేసి దాని నివేదిక పూర్తికాకుండా, చైర్పర్సన్ సంతకం కూడా లేకుండా ఓ నివేదికను కేంద్రానికి పంపి చంద్రబాబు చేతులు దులుపుకున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో చంద్రబాబును ప్రశ్నించలేకపోగా, వాస్తవాలను మాట్లాడుతున్న తమ పార్టీ అధ్యక్షుడు జగన్‌పై మాత్రం అర్థంలేని విమర్శలతో దుమ్మెత్తిపోస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఎన్నోసార్లు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా చంద్రబాబు ఒక్కసారైనా కాపు రిజర్వేషన్ల అంశాన్ని అక్కడ అడగలేకపోయారని కన్నబాబు విమర్శించారు. ఢిల్లీ పర్యటనల్లో పోలవరం ప్రాజెక్టు పనులను సొంత మనుషులకు కట్టబెట్టుకోవడం, లాలూచీ వ్యవహారాలను చక్కబెట్టుకోవడానికే ప్రాధాన్యమిచ్చారే తప్ప ఏనాడూ రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బాబు తప్పు కనిపించట్లేదు కానీ.. జగన్ మాటల్ని వక్రీకరిస్తారా? కాపు రిజర్వేషన్లకు సంబంధించి గతంలో తమ పార్టీ చెప్పిన మాటలకు ఎప్పటికీ కట్టుబడే ఉంటుందని కన్నబాబు తెలిపారు. కాపుల ఆర్థికాభివృద్ధికి ఐదేళ్లలో రూ.ఐదువేల కోట్లు ఇస్తానని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని ఆయన గుర్తు చేస్తూ.. తమ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు ఇచ్చిన దానికి రెట్టింపు ఇస్తామని చెప్పిన జగన్ మాటల్లోని చిత్తశుద్ధిని అర్థం చేసుకోవాలని సూచించారు. నాలుగేళ్లు అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు మ్యానిఫెస్టోలోని అంశాలను అమలు చేయకపోయినా ప్రశ్నించకపోవడం, ప్రశ్నించడానికే పార్టీ అన్న పవన్‌కల్యాణ్ స్పందించకపోయినా మాట్లాడని నేతలు, జగన్ వ్యాఖ్యలను వక్రీకరించడంలో మాత్రం ముందుంటున్నారని ఆయన మండిపడ్డారు. ప్రధాని అభ్యర్థినని మోదీ, రాజకీయాల్లో సీనియర్‌గా ఉన్న తనను మళ్లీ గెలిపించాలని చంద్రబాబు కోరితే తప్పుగా కనిపించట్లేదని, తమకు అధికారమిస్తే ప్రజలకు మంచి చేస్తానన్న జగన్ మాటలను మాత్రం అడుగడుగునా వక్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు. జగన్ హామీలు అమలు చేయాలంటే అమెరికా బడ్జెట్ కూడా సరిపోదంటూ చేస్తున్న వ్యాఖ్యలపై కన్నబాబు మండిపడ్డారు. వైఎస్ హయాంలో ఉచిత విద్యుత్‌పైనా, గృహ నిర్మాణాల పథకాలపైనా ఇలాంటి విమర్శలే చేసిన విషయాన్ని గుర్తుచేస్తూ.. ఆచరణలో వాటిని వైఎస్ అమలు చేసి చూపించారన్నారు. దేశవ్యాప్తంగా 48 లక్షల ఇళ్లు నిర్మిస్తే, ఒక్క ఉమ్మడి రాష్ట్రంలోనే వైఎస్ 48 లక్షల ఇళ్లను నిర్మించారని పేర్కొన్నారు. చంద్రబాబు సర్కారు హయత్ హోటళ్లకు, విదేశీ, స్వదేశీ పర్యటనల్లో వాడే విమాన చార్జీలకు చేసే దుబారాను తగ్గించుకుంటే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయవచ్చునన్నారు. ఎన్ని తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేసినా జగన్ వ్యాఖ్యల్లోని సారాంశాన్ని కాపు కులస్తులు అర్థం చేసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ముద్రగడపై రాజా ఫైర్.. తన కుటుంబంపై జగన్ చూపించిన ప్రేమలో మొసలికన్నీరు కనిపిస్తుందంటూ కాపు ఉద్యమనేత ముద్రగడ చేసిన వ్యాఖ్యలపై తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా మండిపడ్డారు. తుని ఘటన నేపథ్యంలోనూ, ఆ తరువాత జరిగిన ఉద్యమంలో ముద్రగడ కుటుంబం పట్ల ప్రభుత్వం అనుసరించిన దుందుడుకు వైఖరిని ఖండిస్తూ ముద్రగడకు తాము మద్దతుగా నిలిచిన విషయాన్ని మర్చిపోరాదన్నారు. ఆకలి కేకలతో కాపు యువత కంచాలు కొడితే కేసులు పెట్టిన చంద్రబాబు తీరు తియ్యగానూ, జగన్ వ్యాఖ్యలు చేదుగానూ కనిపిస్తున్నాయా? అని నిలదీశారు. ముద్రగడ ఒక అజెండా పెట్టుకుని వేరొకరితో రాజకీయంగా ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో తన ఉనికిని కాపాడుకునేందుకు తమ పార్టీపై నిందలు వేస్తున్నారని విమర్శించారు. జగన్‌పై యనమల చేస్తోన్న వ్యాఖ్యలపైనా రాజా విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు 50సార్లు రాజ్యాంగ సవరణ జరిగిందంటూ యనమల మాట్లాడారని, వాస్తవానికి 101సార్లు రాజ్యాంగ సవరణ జరిగిన విషయం కూడా ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు. రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లపై న్యాయం జరుగుతుందన్న యనమల వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ నాలుగేళ్లుగా ఏ గుడ్డిగాడిదకు పళ్లు తోముతున్నావని నిలదీశారు. కాపుల్లో జగన్‌పై విశ్వాసం: జక్కంపూడి జగన్ వల్ల తమకు న్యాయం జరుగుతుందన్న విశ్వాసం కాపు సామాజికవర్గంలో ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. మాట ఇస్తే కట్టుబడే వ్యక్తిత్వం, నమ్ముకున్నవారికి న్యాయం చేసే తత్వం జగన్‌కు ఉందన్నారు. చంద్రబాబు రెండునాల్కల ధోరణితో ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారని మండిపడ్డారు. ముద్రగడ విమర్శలపై ఆయన స్పందిస్తూ.. గతంలో ఉద్యమ సమయంలో జగన్ అనుమతితోనే తామంతా ముద్రగడ వెంట నడిచిన విషయాన్ని మరువరాదన్నారు. ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా గోదావరి వంతెనపై అశేష జనవాహినితో కనిపించిన స్పందనకు బాబు పునాదులే కదిలాయని, అందుకే జగన్ మాట్లాడే ప్రతిమాటను వక్రీకరిస్తూ తమకు అనువుగా మలుచుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ పిఠాపురం, పెద్దాపురం, ప్రత్తిపాడు కోఆర్డినేటర్లు పెండెం దొరబాబు, తోట సుబ్బారావు నాయుడు, పర్వత ప్రసాద్, మాజీమంత్రి కొప్పన మోహనరావు, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్యేలపై దాడులు దుర్మార్గం: ఉమ్మారెడ్డి
హైదరాబాద్: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాపై టీడీపీ నేతల దాడిని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తీవ్రంగా ఖండించారు. అవినీతి, దౌర్జన్యాలను జోడెద్దులుగా టీడీపీ సర్కార్ నడిపిస్తోందని మండిపడ్డారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధులు ఆఖరికి ఎమ్మెల్యేలపై కూడా దాడులు దుర్మార్గమని చెప్పారు. ఈ ఘటన ఇసుకమాఫియా వికృతచేష్టలకు పరాకాష్ట' అని అన్నారు. అధికారం శాశ్వతం కాదని టీడీపీ నేతలు గుర్తుపెట్టుకోవాలని ఉమ్మారెడ్డి హితవు పలికారు. కాగా, తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గం డీ పోలవరంలో తెలుగు తమ్ముళ్లు ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడటంపై వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు తమ్ముళ్లు దాడిశెట్టి ఎమ్మెల్యే గన్‌మెన్‌పై దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.