సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్‌లో సాగునీటి సలహా మండలి గురువారం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. రబీ పంటకు జిల్లాలో 4,36,533 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రబీకి గోదావరి నుంచి కాలువలకు డిసెంబరు 1వ తేదిన సాగునీరు విడుదల చేసి.. వచ్చే ఏడాది మార్చి 31న కాలువలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు 2020 జూన్ 6న గోదావరి నుంచి కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గోదావరి డెల్లా పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాలువలను పరిరక్షించి డ్రైయిన్‌లను ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. కాలువల్లో పూడికతీతలో కాంట్రాక్టర్లు పాల్పడుతున్న అవకతవకలపై దృష్టి సారించాలని సూచించారు.
మరోవైపు.. మేయర్ పావని తీరుపై కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ, వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డ్డిని విమర్శించే అర్హత మేయర్ పావనికి లేదంటూ మండిపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేసి ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ అధికారుల ఫైల్స్ నేరుగా చూసే అధికారం మేయర్‌కు లేదని, ఒక వైపు గౌరవ వేతనంతీసుకుంటూ కారు అద్దె తీసుకోవడం మేయరుకు సరికాదని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment