Irrigation Advisory Council meeting
-
ఆ జిల్లా ప్రజలకు ఇది శుభవార్తే..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఒకటి, దిగువన రెండు బ్యారేజీల నిర్మాణానికి త్వరలోనే టెండర్ల ప్రక్రియ చేపడతామని కృష్ణా జిల్లా ఇంచార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన కృష్ణా జిల్లా 33వ నీటిపారుదల సలహామండలి సమావేశం జరిగింది. ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, సింహాద్రి రమేష్, మొండితోక జగన్మోహన్రావు, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు. ఒకే జిల్లాలో మూడూ బ్యారేజీల నిర్మాణం శుభ పరిణామం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్.. బ్యారేజీల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. నేడు కేబినెట్ సమావేశంలో కూడా ఈ అంశం చర్చకు వచ్చిందన్నారు. (చదవండి: 30 లక్షల ఇళ్ల పట్టాలు: ఏపీ కేబినెట్ ఆమోదం) ‘‘గత ఏడాది రబీకి 16 టీఎంసీల నీరు ఇచ్చాం. ఈ ఏడాది 26 టీఎంసీలు ఇస్తున్నాం. బందరు కాలువకు కూడా 1 టీఎంసీ నీరు ఇవ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాది నీటి లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువగా ఇవ్వాలని నిర్ణయించాం. గత ఏడాది కంటే రెట్టింపుగా ఈ సారి నీటిని ఇస్తున్నాం. టెయిల్ఎండ్ ప్రాంతాలకు మంచి ఉపయోగకరం. ప్రయారిటీ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించామని’’ మంత్రి తెలిపారు. ఇబ్బందులు ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకురావాలని, అన్ని పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. (చదవండి: ప్రభుత్వ అధికారులను కూడా వదలం) -
‘ద్వారంపూడిని విమర్శించే హక్కు ఆమెకు లేదు’
సాక్షి, తూర్పుగోదావరి : కాకినాడ కలెక్టరేట్లో సాగునీటి సలహా మండలి గురువారం సమావేశమైంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రులు మాట్లాడుతూ.. రబీ పంటకు జిల్లాలో 4,36,533 ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందించాలని నిర్ణయం తీసుకున్నారు. రబీకి గోదావరి నుంచి కాలువలకు డిసెంబరు 1వ తేదిన సాగునీరు విడుదల చేసి.. వచ్చే ఏడాది మార్చి 31న కాలువలు మూసివేయనున్నట్లు వెల్లడించారు. మళ్లీ ఖరీఫ్ సీజన్‌కు 2020 జూన్ 6న గోదావరి నుంచి కాలువల ద్వారా సాగు నీరు విడుదల చేయనున్నట్లు తెలిపారు. గోదావరి డెల్లా పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని అధికారులకు మంత్రులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా కాలువలను పరిరక్షించి డ్రైయిన్లను ప్రక్షాళన చేయాలని స్పష్టం చేశారు. కాలువల్లో పూడికతీతలో కాంట్రాక్టర్లు పాల్పడుతున్న అవకతవకలపై దృష్టి సారించాలని సూచించారు. మరోవైపు.. మేయర్ పావని తీరుపై కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ చంద్రకళా దీప్తీ, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తప్పుబట్టారు. నగర ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డ్డిని విమర్శించే అర్హత మేయర్ పావనికి లేదంటూ మండిపడ్డారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ఉద్యమాలు చేసి ద్వారంపూడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారని గుర్తుచేశారు. మున్సిపల్ అధికారుల ఫైల్స్ నేరుగా చూసే అధికారం మేయర్‌కు లేదని, ఒక వైపు గౌరవ వేతనంతీసుకుంటూ కారు అద్దె తీసుకోవడం మేయరుకు సరికాదని హితవు పలికారు. -
చిన్నబుచ్చుకున్న పెద్దరికం
ఇరిగేషన్ ఎస్ఈపై ఊగిపోయిన మంత్రి ఉమా - కిందిస్థాయి సిబ్బంది ఎదుటే అవమానం - అధికారులకు అడుగడుగునా పరాభవం - మంత్రి తీరుతో మనస్తాపం - ఇరిగేషన్ సలహామండలి సమావేశంలో ఉమా ఓవరాక్షన్ సాక్షి, విజయవాడ : మీకు సిగ్గూఎగ్గు లేదా.. ఏం ఎందుకు పనిచేయరు.. నొప్పి ఏమైనా ఉందా.. నేను చెప్పినట్లు వింటే ప్రమోషన్లు.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు.. పదేళ్లుగా రూమ్‌లోనే కూర్చుని ధనయజ్ఞం చేశారు.. ఇక మిమ్మల్ని మిట్టమధ్యాహ్నం కాల్వ గట్ల మీద పరిగెత్తిస్తా.. డబ్బులు బొక్కేయడానికి చూస్తున్నారు.. ఏం రామకృష్ణా నీ పెద్దరికాన్ని కాపాడుకో... ఇలా పనిచేస్తే ఏమాత్రం ఊరుకోను! ...ఈ బెదిరింపులు ఏదైనా సంస్థలో చిరుద్యోగులతో పనిచేయించేందుకు అధికారి చేసిన హెచ్చరికలనుకుంటే పొరబడినట్లే. జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఇంజినీర్లపై తొలిసారిగా మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలివి. మంగళవారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల సలహా మండలి సమావేశం కలెక్టర్ బాబు ఎ. అధ్యక్షతన జరుగగా ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. మీడియాను కూడా అనుమతించారు. వీరందరి ఎదుట మంత్రి ఉమా ఇంజినీర్లు మనస్సు నొచ్చుకునే విధంగా హంగామా చేశారు. ఎస్ఈ రామకృష్ణ జిల్లాలోనే వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎదుటే ఏకవచనంలో మాట్లాడుతూ ఆయన పనితీరు బాగోలేదంటూ ఎండగట్టారు. ఆత్మస్తుతి.. పరనింద ఆత్మస్తుతి చేసుకోవడంలో దేవినేని ఉమా ఆయనకు ఆయనే సాటి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం రాకుండా అప్పుడప్పుడు ఆయన్ను స్తుతిస్తుంటారు. సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కాల్వగట్లపై పడుకుంటున్నారని, తానూ కాల్వగట్లపైనే తిరుగుతున్నానని, రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానంటూ గొప్పలు చెప్పుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో అధికారులు ఏసీ రూమ్లకే పరిమితమై ధనయజ్ఞం చేశారని, ఇక నుంచి వారిని మిట్టమధ్యాహ్నం కాల్వగట్ల వెంబడి పరిగెత్తిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అడుగడుగునా అక్షింతలు... కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులతోపాటు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ఆలస్యం కావడంపై జేఈలు, ఏఈలను నిలబెట్టి అక్షింతలు వేశారు. ప్రతి అంశంలో ఒక్కో అధికారిని లేచి నిలబడి సమాధానం చెప్పండని ఆదేశించారు. రైతు సదస్సుల కోసం ఒక్కొక్క మండలానికి రూ.50వేలు మంజూరయ్యాయని, వాటిని బొక్కేయకుండా ఖర్చు చేయండంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది.