ఇరిగేషన్ ఎస్‌ఈపై ఊగిపోయిన మంత్రి ఉమా
- కిందిస్థాయి సిబ్బంది ఎదుటే అవమానం
- అధికారులకు అడుగడుగునా పరాభవం
- మంత్రి తీరుతో మనస్తాపం
- ఇరిగేషన్ సలహామండలి సమావేశంలో ఉమా ఓవరాక్షన్
సాక్షి, విజయవాడ : మీకు సిగ్గూఎగ్గు లేదా.. ఏం ఎందుకు పనిచేయరు.. నొప్పి ఏమైనా ఉందా.. నేను చెప్పినట్లు వింటే ప్రమోషన్లు.. లేకపోతే కఠిన చర్యలు తప్పవు.. పదేళ్లుగా రూమ్‌లోనే కూర్చుని ధనయజ్ఞం చేశారు.. ఇక మిమ్మల్ని మిట్టమధ్యాహ్నం కాల్వ గట్ల మీద పరిగెత్తిస్తా.. డబ్బులు బొక్కేయడానికి చూస్తున్నారు.. ఏం రామకృష్ణా నీ పెద్దరికాన్ని కాపాడుకో... ఇలా పనిచేస్తే ఏమాత్రం ఊరుకోను!
...ఈ బెదిరింపులు ఏదైనా సంస్థలో చిరుద్యోగులతో పనిచేయించేందుకు అధికారి చేసిన హెచ్చరికలనుకుంటే పొరబడినట్లే. జలవనరుల శాఖలో సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఇంజినీర్లపై తొలిసారిగా మంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్న దేవినేని ఉమా చేసిన వ్యాఖ్యలివి. మంగళవారం ఉదయం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జలవనరుల సలహా మండలి సమావేశం కలెక్టర్ బాబు ఎ. అధ్యక్షతన జరుగగా ఆ శాఖ మంత్రి దేవినేని ఉమా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య), బోడే ప్రసాద్, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. మీడియాను కూడా
అనుమతించారు. వీరందరి ఎదుట మంత్రి ఉమా ఇంజినీర్లు మనస్సు నొచ్చుకునే విధంగా హంగామా చేశారు. ఎస్‌ఈ రామకృష్ణ జిల్లాలోనే వివిధ హోదాల్లో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. ఆయన కింద పనిచేసే సిబ్బంది ఎదుటే ఏకవచనంలో మాట్లాడుతూ ఆయన పనితీరు బాగోలేదంటూ ఎండగట్టారు.
ఆత్మస్తుతి.. పరనింద
ఆత్మస్తుతి చేసుకోవడంలో దేవినేని ఉమా ఆయనకు ఆయనే సాటి. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆగ్రహం రాకుండా అప్పుడప్పుడు ఆయన్ను స్తుతిస్తుంటారు. సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు కాల్వగట్లపై పడుకుంటున్నారని, తానూ కాల్వగట్లపైనే తిరుగుతున్నానని, రోజుకు 18 గంటలు కష్టపడుతున్నానంటూ గొప్పలు చెప్పుకున్నారు. పదేళ్ల కాంగ్రెస్ హయాంలో అధికారులు ఏసీ రూమ్‌లకే పరిమితమై ధనయజ్ఞం చేశారని, ఇక నుంచి వారిని మిట్టమధ్యాహ్నం కాల్వగట్ల వెంబడి పరిగెత్తిస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు.
అడుగడుగునా అక్షింతలు...
కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులతోపాటు ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు ఆలస్యం కావడంపై జేఈలు, ఏఈలను నిలబెట్టి అక్షింతలు వేశారు. ప్రతి అంశంలో ఒక్కో అధికారిని లేచి నిలబడి సమాధానం చెప్పండని ఆదేశించారు. రైతు సదస్సుల కోసం ఒక్కొక్క మండలానికి రూ.50వేలు మంజూరయ్యాయని, వాటిని బొక్కేయకుండా ఖర్చు చేయండంటూ మంత్రి వ్యాఖ్యానించారు. సుమారు నాలుగు గంటలపాటు ఈ హైడ్రామా సాగింది.
చిన్నబుచ్చుకున్న పెద్దరికం
Published Wed, May 6 2015 5:43 AM | Last Updated on Sun, Sep 3 2017 1:33 AM
Advertisement
Advertisement