Kurasala Kannababu Slams Pawan Kalyan - Sakshi
Sakshi News home page

‘స్పృహ లేకుండా మాట్లాడటం..బురద చల్లేయడం పవన్‌కు అలవాటు’

Published Tue, Jul 11 2023 3:01 PM | Last Updated on Tue, Jul 11 2023 3:49 PM

Kurasala Kannababu Slams Pawan Kalyan - Sakshi

సాక్షి,  ‍కాకినాడ : పవన్‌ కళ్యాణ్‌పై ఎమ్మెల్యే కురసాల కన్నబాబు మండిపడ్డారు. అవగాహనలేమితోనే వాలంటీర్లపై పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతున్నాడని, ప్రజల్లో ఏం జరుగుతుందో పవన్‌కు తెలియడం లేదని విమర్శించారు. స్పృహ లేకుండా మాట్లాడటం, బురద చల్లేయడం పవన్‌కు అలవాటైందని, సీఎం జగన్‌పై కక్ష, ద్వేషం, అసూయతోనే పవన్‌ మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు కురసాల కన్నబాబు. వాలంటీర్లతో మంగళవారం సమావేశమైన కురసాల.. అనంతరం మాట్లాడుతూ ‘ప్రజల్లో వాలంటీర్లకు, ప్రభుత్వానికి  మంచి పేరు రావడంతో పవన్‌కు  కడుపు మంట.పవన్ కు కొంచెమైన ఆలోచన.. సభ్యత ఉందా?, సభ్యత సంస్కారం లేకుండా ఎవరిని పడితే వాళ్ళను దూషిస్తున్నాడు.

వాలంటీర్ల వ్యవస్ధను సిఎం జగన్ తీసుకువచ్చారాని  తప్పుడుగా చిత్రికరించాలని కోరిక. 2021 నేషనల్ క్రైం రికార్డ్ బ్యూరో నివేధిక ప్రకారం మహిళల అదృశ్యంలో ఎపీ 11 వ స్ధానం లో ఉంది. రికవరీలో 2 వ స్ధానం లో ఉంది. మరీ మనకన్న ముందున్న 10  రాష్ట్రాల్లో వాలంటీర్ వ్యవస్ధ లేదు కదా?, ఆ రాష్ట్రాల్లో మహిళల అదృశ్యానికి కారణం ఎవరూ?,  స్పృహ లేకుండా మాట్లాడడం.. బురద చల్లేయడం పవన్‌కు అలవాటు అయ్యింది. దీని మీద చర్చలు జరగాలి.. మనం వెళ్ళి షూటింగ్ లు చేసుకోవాలి అన్న తీరులో పవన్ ఉన్నాడు. 2.80 లక్షల మంది మనోభావాలు దెబ్బ తీశానన్న ఆలోచన పవన్‌కు లేదు’ అని కురసాల పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement