కాపు నేత ముద్రగడ పద్మనాభం భారీ మద్దతుదారుల నడుమ మరోసారి ఆదివారం పాదయాత్రకు బయలుదేరడం కిర్లంపూడిలో తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పించాలని కోరుతూ గత కొన్నిరోజులుగా పాదయాత్ర చేసేందుకు ముద్రగడ చేస్తున్న ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే.