
చలో అమరావతితో చావో రేవో
ఎన్నికల సమయంలో కాపు జాతికి ఇచ్చిన హామీలు అమలు చేయాలని సీఎం చంద్రబాబుకు గుర్తు చేసేందుకు జూలై 26 నుంచి చావోరేవో చలో అమరావతి కార్యక్రమం
తమ జాతి చంద్రబాబు వద్దకు వెళ్లి రిజర్వేషన్లు ఇమ్మని కోరలేదని, ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం కోసం ఆయనే హామీ ఇచ్చి ఓట్లేయించుకు న్నారని గుర్తు చేశారు. అధికారం చేపట్టి మూడేళ్లు దాటినా కాపులకు రిజర్వేషన్‌లు కల్పించకపోవడం మోసం కాదా అని ప్రశ్నించారు. హామీని అమలు చేయకుంటే జూలై 26వ తేదీ నుంచి పాదయాత్ర చేసి తీరతానని స్పష్టం చేశారు. ముద్రగడ పాదయాత్ర జూలై 26 కిర్లంపూడిలోని ఆయన నివాసం నుంచి ప్రారంభమవు తుంది. తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా మీదుగా అమరావతి వరకు 116 గ్రామాల మీదుగా సాగనుంది. కాగా, ముద్రగడ పాదయాత్ర చేసేందుకు అనుమ తి అడగరు. ఆయన అడకపోతే ప్రభుత్వం ముందుకు సాగనివ్వదని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు.