
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
సాక్షి, తిరుపతి: కాపు రిజర్వేషన్లపై ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి యూటర్న్ తీసుకోలేదని ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ స్పష్టంచేశారు. శుక్రవారం స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే కాపుల ఆర్థికాభివృద్ధికి వైఎస్ జగన్ పదివేల కోట్లు ఇస్తానని చెప్పడంపట్ల ఆనందం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై తమ పార్టీ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని మండిపడ్డారు.
కాపులకే మేలు జరగాలని వైఎస్ జగన్ కోరుకుంటున్నారని తెలిపారు. రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలోనిది కావున ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తమ అధ్యక్షుడు మాట్లాడారని బొత్స వెల్లడించారు. తరుచుగా యూటర్న్ తీసుకునేది చంద్రబాబేనని.. గత చరిత్ర చూస్తే అర్థమవుతుందని విమర్శించారు. వైఎస్ జగన్ మోసం చేయడని, అబద్దాలు చెప్పడని, ఇప్పటివరకు ఏ విషయంలోనూ వైఎస్ జగన్ యూటర్న్ తీసుకోలేదని బొత్స వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment