![YSRCP Leaders Slams Chandrababu Over Dharma Porata Deeksha In Delhi - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2019/02/11/chandra-babu-naidu.jpg.webp?itok=calA4SHR)
సాక్షి, గుంటూరు: సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చేపట్టింది ధర్మపోరాట దీక్ష కాదని అది దొంగ పోరాట దీక్ష అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీనే ముఖ్యమన్న చంద్రబాబు మాటలు అందరికీ గుర్తున్నాయన్నారు. సోమవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ కలిసి ఏపీని భ్రష్టు పట్టించాయన్నారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని ఉమ్మారెడ్డి సూచించారు.
17న ఏలూరులో వైఎస్సార్ సీపీ ‘బీసీ గర్జన’
రాష్ట్రంలోని బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 17న ఏలూరులో బీసీ గర్జన మహాసభను నిర్వహించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. ఏలూరు సభలోనే బీసీ అధ్యయన కమిటీ సమర్పించిన నివేదికను వైఎస్ జగన్ ప్రకటిస్తారని పేర్కొన్నారు. చంద్రబాబు దృష్టిలో బీసీలు ఓటు బ్యాంకు మాత్రమేనని విమర్శించారు. అధికారం కోసం రకరకాల హామీలివ్వడం, అనంతరం వదిలేయడం ఆయనకే చెల్లుతుందన్నారు. రోజుకో నాటకంతో బీసీలను మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి బీసీలే తగిన బుద్ధి చెప్పాలని బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment