
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అరాచక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం పెదనడిపల్లి గ్రామసభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అవినీతి పాలన రాజ్యమేలుతుందని ఆరోపించారు. ఇసుక నుంచి మట్టి వరకు అంతా మాఫియాగా మారిందని విమర్శించారు. డబ్బులు ఇస్తే తప్ప ప్రభుత్వ పథకం ఏది కూడా ప్రజలకు అందడం లేదని మండిపడ్డారు.
రాష్ట్రంలో పాలన పడకేసింది.. ఆరోగ్యశ్రీ అటకెక్కిందని విమర్శించారు. మరో వంద రోజులో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పాలన రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా వైఎస్ జగన్‌కు దీవెనలు అందించాలని కోరారు.