కాపుల రిజర్వేషన్ బిల్లు - 2017కు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శనివారం ఆమోదం తెలిపింది. బిల్లు ఆమోదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో మాట్లాడారు. బ్రిటిష్ కాలంలో కాపులకు రిజర్వేషన్లు ఉండేవని చెప్పారు. స్వతంత్రం వచ్చిన తర్వాత కారణాలు చెప్పకుండా రిజర్వేషన్లు తీసేశారన్నారు. 2016లో కాపుల రిజర్వేషన్‌పై మంజునాథ కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.