
కాకినాడ కలెక్టరేట్ ముందు టైర్లకు నిప్పంటించిన బీసీ సంఘాలు
సాక్షి, కాకినాడ : కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి.
టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థను స్తంభించింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి.
బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment