BC Associations
-
కులగణనపై కుతంత్రాలెందుకు?
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనపై కుతంత్రాలెందుకు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను బీసీ సంఘాలు సూటిగా ప్రశ్నించాయి. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన కులగణనను అడ్డుకునేందుకు పవన్ కుయుక్తులు పన్నడంపై బీసీల నేతలు మండిపడుతున్నారు. ఎన్నికల వేళ కుల గణన ఎందుకంటూ పవన్ ఎక్స్‌లో ఓ లేఖ ఉంచడంపై బీసీ సంఘాల నేతలు శనివారం అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పోరాడుతున్నప్పటికీ దేశంలో కులగణన చేపట్టలేదని వారు గుర్తు చేశారు. బీసీల ఆవేదనను అర్థం చేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో కుల గణన చేపట్టారని తెలిపారు. బీసీలకు మేలు చేసేలా సీఎం జగన్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని పెద్ద మనస్సుతో స్వాగతించాల్సిది పోయి పెడర్ధాలు తీసి అడ్డుకునే కుట్రలు చేయడం తగదని బీసీ నేతలు స్పష్టం చేస్తున్నారు. పలువురు బీసీ నేతలు ఏమన్నారంటే.. వారి మాటాల్లోనే.. పవన్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది పవన్ కళ్యాణ్ బీసీ వ్యతిరేకి అని మరోమారు తేటతెల్లమైంది. బీసీల మేలు కోరి సీఎం వైఎస్ జగన్ పెద్ద మనస్సుతో కుల గణన చేపట్టారు. దాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పవన్ అనడం ఆయన సంకుచిత వైఖరికి అద్దంపడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పేద పిల్లల కోసం సీఎం జగన్ ఇంగ్లిష్ మీడియం పెడితే చంద్రబాబు ప్రోద్బలంతో కోర్టులో కేసులు వేయించారు. ఇప్పుడు కుల గణనను అడ్డుకునేందుకు కోర్టులో వేస్తానని పవన్ అంటున్నాడు. అంటే చట్టాలు చంద్రబాబు, పవన్‌కు ఏమైనా చుట్టాలా? పేదలకు మంచి జరిగితే సహించకుండా కోర్టుల్లో వేస్తామనడం సరైనదేనా? మహాత్మ జ్యోతిరావు పూలే, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, నారాయణ గురు, సాహు మహారాజ్, పెరియర్ రామస్వామి వంటి మహనీయుల ఆలోచనలను అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే తపనతో సీఎం జగన్ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాటిని చూసి సహించలేక చంద్రబాబు, పవన్ కుట్రలు, కుతంత్రాలతో వ్యవహరిస్తున్నారు. బీసీల పట్ల దుర్మార్గంగా వ్యహరిస్తున్న చంద్రబాబు, పవన్‌కు తగిన గుణపాఠం చెబుతాం. – చింతపల్లి గురుప్రసాద్, బీసీ కులాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రాజకీయాలకు అతీతంగా సహకరించాలి జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలు విద్య, ఉపాధి రంగాల్లో తగిన వాటా పొంది అభివృద్ధి చెందాలంటే జన గణనలో కులగణన చాలా కీలకం. పదేళ్లకు ఒకసారి నిర్వహించే జన గణనలో కులం కాలమ్ చేర్చి బీసీల లెక్కలు తేల్చాలని దశాబ్దాల తరబడి జాతీయ స్థాయిలో అనేక పోరాటాలు చేస్తున్నాం. దేశంలోని అనేక బీసీ సంఘాలు జాతీయ స్థాయిలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నాయి. తాజాగా దేశంలో నిర్వహించాల్సిన జన గణనలో కులం కాలమ్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంలేదు. కులగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ పంపించింది. అయినా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదు. కేంద్ర నిర్ణయం కోసం చూడకుండా రాష్ట్రంలోనైనా కుల గణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కుల గణన ప్రారంభమైంది. బీహార్ తర్వాత ఏపీలోనే కుల గణన చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతో పరిణతితో ఈ కార్యక్రమం చేపట్టారు. దీన్ని అభినందించాల్సింది పోయి కోర్టులకు వెళ్లి అడ్డుకుంటామనే తీరు సరికాదు. న్యాయపరమైన సమస్యలు సృష్టిస్తే కులగణన ఆగితే బీసీలకు తీవ్ర అన్యాయం చేసినవారవుతారు. ప్రతి ఒక్కరూ రాజకీయాలకు అతీతంగా ఆలోచించి కుల గణనకు సహకరించి బీసీలకు మేలు జరిగేలా చూడాలి. – కేశన శంకరరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీఎం జగన్ దేశానికే ఆదర్శం ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక న్యాయం (సోషల్ జస్టిస్)ను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం ఆయన చేపట్టిన అనేక విప్లవాత్మక చర్యలు దేశంలోని అనేక రాష్ట్రాలు అనుసరించేలా ఉన్నాయి. దేశంలో కుల గణన చేపట్టకపోవడంతో రాష్ట్రంలో సీఎం జగన్ చేసి చూపిస్తున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ సహకరించాలి. అడ్డుకునే ప్రయత్నాలు చేయడం సరికాదు. కుల గణనను అడ్డుకునే రాజకీయ పార్టీలు బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు. – ఎన్వీ రావు, ఇంటర్నేషనల్ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు బాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు రాజకీయ దుర్బుద్ధితో కుల గణనను అడ్డుకుంటే చంద్రబాబు, పవన్‌కు బీసీలు బుద్ధి చెబుతారు. బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుని చంద్రబాబు దగా చేశాడు. ఇప్పుడు అధికారం లేకుండానే టీడీపీ, జనసేన బీసీల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి. చంద్రబాబు డైరెక్షన్లోనే మాట్లాడుతున్న పవన్ ఇప్పుడు కుల గణనను అడ్డుకునేలా కోర్టుకు వెళ్తానని అంటున్నాడు. కుల గణనతో బీసీలకు మేలు జరగడాన్ని కూడా వీళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. బీసీలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్‌కు వెన్నుదన్నుగా నిలిచి సత్తా చూపిస్తాం. – కాసగాని దుర్గారావు, బీసీ నాయకుడు -
8న బీసీల ఆత్మీయ సమ్మేళనం
సాక్షి, అమరావతి: బీసీల ఆత్మీయ సమ్మేళనాన్ని వచ్చేనెల 8న విజయవాడలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని సంకల్పించినట్లు రాష్ట్ర బీసీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వెల్లడించారు. ఈ సమ్మేళనానికి సీఎం వైఎస్ జగన్‌ను కూడా ఆహ్వానిస్తామని వారు తెలిపారు. సీఎం జగన్ మూడున్నరేళ్ల పాలనలో బీసీ వర్గాలకు జరిగిన మేలును గుర్తుచేసుకుంటూ, గ్రామ సర్పంచ్ నుంచి పార్లమెంటు సభ్యుల వరకూ బీసీ ప్రజాప్రతినిధులంతా కలిసి ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో శనివారం వారు సమావేశమయ్యారు. రాబోయే రోజుల్లో బీసీల కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే అంశంపై చర్చించారు. తమది బీసీల ప్రభుత్వమని, బీసీ డిక్లరేషన్‌లో చెప్పిన ప్రతి మాటను సీఎం జగన్ నెరవేరుస్తున్నారని నేతలు తెలిపారు. రాష్ట్రంలో 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని.. ఆయా కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటుచేసిన ఘనత సీఎం జగన్‌దేనని వివరించారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం బీసీలకే ఇచ్చారని గుర్తుచేశారు. అందువల్ల బీసీలంతా క్విట్ బాబూ... అంటున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశానికి బీసీ మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, ఎంపీ మార్గాని భరత్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్, పార్థసారథి, హాజరయ్యారు. వారు మీడియాతో మాట్లాడారు. బీసీల కల ఇన్నాళ్లకు సాకారం పాలనలో బడుగులకు భాగస్వాములుగా చేయాలని స్వాతంత్య్ర కాలం నుంచి పోరాటం జరుగుతోంది. కానీ, ఇన్నేళ్లకు సీఎం జగన్ సాకారం చేశారు. 25 మంది మంత్రుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చెందిన 17 మందికి స్థానం కల్పించిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది. అంబేద్కర్ సూర్తితో రాష్ట్రంలో పాలన సాగుతోంది. చంద్రబాబు ఆటలు ఇక ఏపీలో సాగవు. – విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా? మధ్యవర్తుల ప్రమేయం లేకుండా బీసీలకు దాదాపు రూ.86 వేల కోట్లకు పైగా మూడున్నరేళ్లలో సీఎం ఇచ్చారు. చంద్రబాబు బీసీలకు చేసిన మేలు ఏమిటో చెప్పలగరా? జనాభా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పార్లమెంటులో ప్రైవేటు బిల్లు పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీనే. – మార్గాని భరత్, ఎంపీ, రాజమహేంద్రవరం బీసీలకు మేలు చేసింది జగనన్నే రాష్ట్ర చరిత్రలో ఎవరూ చేయని విధంగా, బీసీలను గుర్తించి, బీసీలకు మేలు చేసింది జగనన్నే. కాబట్టి బీసీ సమాజం అంతా ఆయనకు అండగా నిలబడుతుంది. దేశంలోని 29 రాష్ట్రాల్లో ఏపీ ఒక్కటే బీసీల రాష్ట్రం. భవిష్యత్తులో ఇంకా ఏం చేయాలన్న దానిపై బీసీల సమ్మేళనంలో మేధోమథనం చేస్తాం. విజయవాడలో 10 వేల మంది ప్రజాప్రతినిధులతో దీనిని నిర్వహించాలని నిర్ణయించాం. – కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం బీసీ కార్పొరేషన్లు ఏర్పడి రెండేళ్లు పూర్తి మూడున్నరేళ్ల పాలనలో బీసీలకు జరిగిన మేలు, బీసీల జీవన ప్రమాణాలు ఎలా పెరిగాయి, గ్రామస్థాయి నుంచి బీసీ వర్గాలకు పెరిగిన రాజకీయ ప్రాధాన్యత.. తదితర అంశాలపై చర్చించాం. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటుచేసి, వందల మంది డైరెక్టర్లను నియమించాం. అన్ని స్థాయిల్లోని బీసీ ప్రజాప్రతినిధులతోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, సభ్యులు, డైరెక్టర్లు అందర్నీ ఈ సమ్మేళనానికి ఆహ్వానిస్తాం. – బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణు నీకా దమ్ము, ధైర్యం ఉందా బాబూ? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మంత్రివర్గంలో 70 శాతం పదవులిస్తానని చెప్పే దమ్ము, ధైర్యం ఉందా బాబు నీకు? 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన నువ్వు ఏనాడైనా ఆ వర్గాల బాగును పట్టించుకున్నావా? మన సీఎంను చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఆ బాటలో నడవాలని చూస్తున్నాయి. – గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ చెప్పనివి కూడా చేస్తున్నాం బీసీల అభ్యున్నతికి దిశ, దశ నిర్దేశించిన నాయకుడు సీఎం జగన్. గత ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించి అధికారంలోకి వచ్చాక అందులో చెప్పిన ప్రతి అంశాన్నీ అమలుచేశారు. డిక్లరేషన్‌లో చెప్పని అంశాలనూ అమలుచేస్తున్నారు. మూడున్నరేళ్ళలో ఈ ప్రభుత్వం రూ.1.76 లక్షల కోట్లను డీబీటీ ద్వారా ప్రజలకు అందిస్తే, అందులో 50 శాతానికి పైగా బీసీలకు అందాయి. – పార్టీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, విప్ జంగా కృష్ణమూర్తి -
సీఎం జగన్ లాంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు: విడదల రజిని
-
బీసీ క్రీమీలేయర్ రద్దు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు క్రీమీలేయర్‌ను విధించి, రిజర్వేషన్లు సంపూర్ణంగా అమలుకాకుండా అడ్డుకుంటున్నారని, తక్షణమే క్రీమీలేయర్‌ను రద్దు చేయాలని అఖిల భారత బీసీ సంఘాల నేతలు డిమాండ్ చేశారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా దేశ జనాభాలో అరవై శాతం ఉన్న బీసీలకు కేవలం 18% రిజర్వేషన్లు అమలు అవుతున్నాయన్నారు. అఖిల భారత బీసీ ఉద్యోగుల ఫెడరేషన్ నేతృత్వంలో ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో జాతీయస్థాయి సమావేశం మంగళవారం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు, ఓబీసీ పార్లమెంటు సభ్యుల ఫోరం మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు, ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్రావు, మహారాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ తైవాడే, బీసీ సెంట్రల్ కమిటీ చైర్మన్ భాగ్యలక్ష్మి, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కరుణానిధి, అఖిల భారత ఓబీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కిరణ్ సహా పలువురు పాల్గొని ప్రసంగించారు. దేశంలో వెంటనే బీసీ జనగణన చేపట్టాలని, కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసి బీసీల సంక్షేమానికి కనీసం రూ. లక్ష కోట్లు కేటాయించాలని వక్తలు కోరారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టులో కనీసం లక్షమందితో ఢిల్లీ్లలో బీసీల మహాప్రదర్శన చేపట్టాలని నిర్ణయించినట్లు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపా రు. సమావేశానికి దానకర్ణచారి, పాండు మల్లేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. -
జడ్జీల నియామకాల్లో సామాజిక న్యాయం పాటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: న్యాయమూర్తుల నియామక ప్రక్రియలో సామాజిక న్యాయం అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు బీసీ సంక్షేమ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలోని సీజేఐ నివాసంలో బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, కేసన శంకర్రావుల ఆధ్వర్యంలోని బీసీ ప్రతినిధుల బృందం జస్టిస్ ఎన్వీ రమణను కలిసింది. ఈ సందర్భంగా న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు పెంచాలన్నారు. సీజేఐను కలిసిన వారిలో బీసీ నేతలు యుగేందర్ గౌడ్, క్రాంతికుమార్, శ్రీనివాస్, విక్రమ్‌గౌడ్, శ్యామ్, నరేశ్, శ్రీనివాస్‌గౌడ్, రంగనాథ్, విజయ్, సాయితేజ తదితరులున్నారు. అనంతరం ఢిల్లీలోని రోహిణిలో బీసీ పెడరేషన్ జాతీయ కార్యాలయాన్ని జస్టిస్ ఈశ్వరయ్య ప్రారంభించారు. -
డిసెంబర్లో ఓబీసీ మహాగర్జన
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్రీయ ఓబీసీ మహాసంఘ్ డిమాండ్ చేసింది. ఇందుకోసం డిసెంబర్ మొదటివారంలో ఢిల్లీలో ఓబీసీ మహాగర్జన నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం తెలంగాణ భవన్లో మహాసంఘ్ జాతీయ అధ్యక్షుడు బాబాన్‌రావు తేవాడే అధ్యక్షతన సమావేశం జరిగింది. జనగణనలో కులాల వారీగా లెక్కలు తీయాలని, నీట్లో ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓబీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని కోరారు. అలాగే క్రీమిలేయర్ ఆదాయ పరిమితిని పెంచడంతోపాటు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలన్నారు. ఇలా మొత్తం 8 డిమాండ్లకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బీసీ సంఘాల అధ్యక్షులు కేసన శంకరరావు, జాజుల శ్రీనివాస్‌గౌడ్, 24 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు, తదితరులు పాల్గొన్నారు. క్రీమిలేయర్‌ను రద్దు చేయండి క్రీమిలేయర్‌ను రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆదాయ పరిమితిని 8 లక్షల నుంచి 20 లక్షలకు పెంచాలని బీసీ ప్రతినిధుల బృందం.. కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేసింది. అలాగే దేశంలోని జాతీయ ప్రాజెక్టులు, పార్కులు, పర్యాటక స్థలాలకు మహాత్మ జ్యోతిబా పూలే పేరు పెట్టాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కలిసి విన్నవించింది. కాగా.. యూజీ, పీజీ వైద్య విద్య సీట్ల కేటాయింపుల్లో ఓబీసీలకు అన్యాయం జరుగుతోందని, ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఓబీసీ ఫెడరేషన్ జాతీయ కార్యదర్శి జె.లక్ష్మీనరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఢిల్లీలో పలువురు ఎంపీలను కలిసి ఆయన వినతిపత్రం అందించారు. -
ఓబీసీ ప్రత్యేక శాఖపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటుపై ప్రధాని మోదీతో చర్చిస్తానని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం తనను కలిసిన బీసీ సంఘాల నేతలకు ఆమె హామీ ఇచ్చారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు కేశన శంకర్, జాజుల శ్రీనివాస్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. జాతీయస్థాయిలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు, జనగణనలో కులాల వారీగా జనాభా లెక్కలు చేపట్టాలని పార్టీ తరఫున కూడా ప్రధాని మోదీని కోరతానని అప్పాదళ్ (ఎస్) అధ్యక్షురాలు కూడా అయిన అనుప్రియ పటేల్ హామీ ఇచ్చారని వారిరువురూ తెలిపారు. ఓబీసీలకు మద్దతుగా దేశంలోని అన్ని పార్టీల మద్దతు కోరాలని ఆమె సూచించారన్నారు. స్థానిక రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించండి స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత లేదని.. వాటిని 50 శాతానికి పెంచి చట్టబద్ధత కల్పించాలని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్‌ను బీసీ సంక్షేమ సంఘం నేతలు కోరారు. ఈ మేరకు ఆదివారం వారు మంత్రికి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల నేతలు కుమ్మర క్రాంతికుమార్, కనకాల శ్యామ్ కుర్మా, రాచాల యుగేందర్ గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, తాటికొండ విక్రంగౌడ్, శేఖర్ సగర, రావులకొల్ నరేష్, ఈడిగ శ్రీనివాస్‌గౌడ్, పీ రంగనాథ్, పానుగంటి విజయ్, మూర్తి, సాయితేజ, సతీష్, సత్యం సగర, తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
సాక్షి, నెట్వర్క్: బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం పలుచోట్ల పూలె, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారంటూ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేకా ప్రతాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, హోం మంత్రి మేకతోటి సుచరిత, అనంతపురంలో మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పాల్గొన్నారు. చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీకాకుళంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, వేముల, లింగాల, బద్వేలు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, చాపాడు, రాజంపేట తదితర ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, డోన్, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. విశాఖలో బీచ్‌రోడ్డు, విశాఖ దక్షిణ, మధురవాడ, ఎన్ఏడీ జంక్షన్, కొత్త గాజువాక, పిలకవానిపాలెంల్లో సంబరాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లతో... బీసీల్లో ప్రతి కులానికీ గుర్తింపు
సాక్షి, అమరావతి: బీసీ కులాల్లోని నాయకుల గుర్తింపునకు ప్రత్యేకంగా రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని పలువురు బీసీ సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన రాజకీయ నాయకులు తప్ప ఆచరణలో చూపినవారు లేరని ఆయా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యారని, ఇప్పటికే ఎమ్మెల్యేలు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు ఇవ్వడంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. అణగారిన కులాల్లో ఆత్మ విశ్వాసం దేశంలోనే బీసీలను ఈ స్థాయిలో గౌరవించిన రాజకీయ నాయకులు ఎవరూ ఇంతవరకు లేరు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అణగారిన బీసీ కులాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. సీఎం నిర్ణయంతో భిక్షాటన, సంచార జాతుల వారూ పాలనలో భాగస్వాములు అయ్యారు. చైర్మన్లకు ప్రొటోకాల్ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా వారి విన్నపాలు మన్నిస్తారు. బీసీల్లో ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి వెళతాయి. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచి వ్యవస్థకు శ్రీకారం బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష కాదని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బీసీల్లోని దాదాపు అన్ని కులాల నాయకులకు గుర్తింపు వచ్చింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు గ్రామ స్థాయిలో బీసీల వృత్తులపై అధ్యయనం చేయాలి. – పి.హనుమంతరావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుభ పరిణామం కార్పొరేషన్ల ఏర్పాటు శుభ పరిణామం బీసీ కులాలకు తగిన గుర్తింపు ఇలాంటి పదవుల ద్వారానే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం కాకూడదు. – కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వృత్తులను ప్రోత్సహించాలి బీసీల్లో కుల వృత్తులకు జీవం పోసేందుకు ఇది దోహద పడుతుంది. కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించడం ద్వారా ఆయా కులాలను ఆర్థికంగా ఆదుకోవచ్చు. జిల్లా స్థాయిలోనూ ఈ కార్పొరేషన్లకు ఒక కమిటీ ఉంటే బాగుంటుంది. – టి. వేణుగోపాల్ యాదవ్, జాతీయ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ అద్భుతాల్లో ఇది ఒకటి సీఎం వైఎస్ జగన్ చేసిన అద్భుతాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ బడుల్లో నాడు–నేడుతోపాటు బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు ఒకటి.ఎన్టీఆర్ ఒక స్థాయిలో బీసీల్లో రాజకీయ నాయకత్వ పెంపునకు పునాది వేశారు. వైఎస్ జగన్ అన్ని స్థాయిల్లో పునాదులు వేశారు. – కిర్ల కృష్ణారావు, సామాజిక సేవకుడు, కార్మిక నాయకుడు 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం చంద్రబాబు కేవలం 11 బీసీ కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి తక్కిన కులాలకు తీరని అన్యాయం చేశారు. వైఎస్ జగన్ బీసీల్లోని అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేస్తూనే అందులో 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం. అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న వారికి అధికారంతో కూడిన హక్కులు కల్పించారు. – డాక్టర్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, అఖిలభారత బీసీ ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు -
గుంటూరులో సీఎం జగన్‌కు పాలభిషేకం
సాక్షి, గుంటూరు: 56 బీసీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం కోసం పాలకమండలి సభ్యులను నియమించినందకు ఆ కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు గుంటూరు నగరం పాలెంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, జిల్లా ఇన్చార్జి మంత్రి రంగనాథ రాజు పాలాభిషేకం చేశారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, జ్యోతిరావు పూలే విగ్రహాలకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మేరుగ నాగార్జున, విడుదల రజిని ,ఉండవల్లి శ్రీదేవి, అన్నాబత్తుని శివ కుమార్, మద్దాల గిరిధర్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, మద్య విమోచన ప్రచార కమిటీ చైర్మన్ లక్ష్మణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సంఘ అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ, ‘బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు పాలకమండలి నియమించడం గొప్ప శుభపరిణామం. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్దపీట వేశారు. బీసీలు రాజకీయంగా ,ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి కావాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ ఎన్నికల ముందే ప్రణాళికను సిద్ధం చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి బీసీ వర్గాలకు మేలు చేశారు కాబట్టే సీఎం జగన్ గెలుపులో బీసీలు భాగస్వాములయ్యారు. సీఎం జగన్ క్యాబినెట్లో అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు 60 శాతం పైగానే ఉన్నారు’ అని అన్నారు. అదేవిధంగా హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ, ‘ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌లా కాకుండా బ్యాక్ బోన్ కాస్ట్‌గా నిలబెట్టారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి బాటలు వేశారు. సీఎం జగన్ దేశానికే ఆదర్శం. గత ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకు రాజకీయాలకు మాత్రమే వాడికుంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అభివృద్ధికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరుకు 4 కార్పొరేషన్ చైర్మన్లు రావడం ఆనందకరం. కార్పొరేషన్ ఏర్పాటుతో సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవచ్చు’ అని అన్నారు. ఇక చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని మాట్లాడుతూ, ‘ సువర్ణ అక్షరాలతో లిఖించబడిన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో జ్యోతిరావు పూలే కనిపించారు. దేశ రాజకీయాల్లో సీఎం జగన్‌కు ముందు ఆ తరువాత అన్న కోణంలో రాజకీయాలు నడుస్తున్నాయి. బీసీ కులాలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందడానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు ధన్యవాదాలు’ అని అన్నారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీ రంగనాధ రాజు మాట్లాడుతూ, ‘ దేశంలో ఎక్కడా లేని లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల అభివృద్ధికి పెద్ద పీట వేశారు. ఎవరికి తెలియని కులాలను కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని అభివృద్ధి చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. గుంటూరు జిల్లాకు నాలుగు బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కడం ఆనందంగా ఉంది. కార్పొరేషన్లను ఏర్పాటు చేయడం ద్వారా ఆ కులాల్లోని సమస్యను పరిష్కరించవచ్చు’ అని పేర్కొన్నారు. చదవండి: ఏపీలో బీసీలు.. బ్యాక్ బోన్ క్లాస్ -
ఏపీ: బీసీలకు సాధికారత
సాక్షి, అమరావతి: ‘బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడాన్ని టీడీపీ కుట్రపూరితంగా అడ్డుకుంటే వెనుకంజ వేస్తామా! సాంకేతిక కారణాలతో బీసీలకు తగినంత రిజర్వేషన్లు ఇవ్వడం కుదరకపోతే మిన్నకుండిపోతామా?.. కానే కాదు.. వైఎస్సార్సీపీ తరఫున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయిస్తాం. బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అందిస్తాం..’ అని సీఎం వైఎస్ జగన్ ప్రకటించడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తోంది. దేశంలో తొలి నాయకుడు.. బీసీల సాధికారత, సామాజిక న్యాయం దిశగా సత్వరం స్పందించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దేశవ్యాప్తంగా విశ్లేషకులు ప్రశంసిస్తున్నారు. 59.85 శాతం రిజర్వేషన్ల జీవోను టీడీపీ న్యాయ వివాదాలతో అడ్డుకున్నా సీఎం జగన్ వెనుకంజ వేయకుండా, బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా పార్టీ పరంగా వారికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం సీట్లు ఇస్తామని వెంటనే నిర్ణయం తీసుకున్నారని బీసీ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాయి. దేశంలో ఇలాంటి సాహసోపేత నిర్ణయం తీసుకున్న తొలి నాయకుడు సీఎం జగన్ అని పేర్కొంటున్నాయి. దేశంలోని అన్ని పార్టీలూ ఇదే విధానాన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాకారమవుతుందని సూచిస్తున్నాయి. బీసీలను వంచిస్తూ కపట నాటకాలాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మరోసారి కోలుకోలేని గుణపాఠం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేత నిర్ణయం క్షేత్రస్థాయి నుంచి రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని సమూలంగా మారుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సుదీర్ఘ కాలం నుంచి దామాషా ప్రకారం రాజకీయ అధికారాన్ని కోరుతున్న బీసీ వర్గాలు ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. బీసీల పక్షపాతి వైఎస్ జగన్ బీసీలను ఓటుబ్యాంకుగా వాడుకున్న నేతలనే ఇన్నాళ్లూ చూశాం. బీసీల అభ్యున్నతిపై చిత్తశుద్ధితో వ్యవహరించిన నేతను ఒక్క సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలో మాత్రమే చూశామని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బీసీల సంక్షేమం, రాజ్యాధికారం దిశగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ వర్గాలకు 34 శాతం సీట్లు రిజర్వు చేసేందుకు వీలుగా మొత్తం రిజర్వేషన్లను 59.85 శాతంగా నిర్ణయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది డిసెంబర్లోనే జీవో 176 జారీ చేయడం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న తమ నిరీక్షణ ఫలించిందని బీసీ వర్గాలు హర్షం వ్యక్తం చేశాయి. అయితే ఆ జీవోను వ్యతిరేకిస్తూ టీడీపీ నేత కోర్టును ఆశ్రయించడం, 59.85 శాతం రిజర్వేషన్లను న్యాయస్థానం కొట్టివేయడంతో బీసీ వర్గాలు తీవ్ర నిస్పృహకు గురయ్యాయి. సత్వరమే స్పందించారు.. న్యాయస్థానం ఉత్తర్వుల కారణంగా బీసీలకు చట్టప్రకారం 24 శాతం మాత్రమే రిజర్వేషన్లు కల్పించాల్సిన పరిస్థితి అనివార్యమైంది. ఇలాంటి స్థితిలో మరో నేత ఎవరైనా అధికారంలో ఉంటే సాంకేతిక, న్యాయపరమైన అంశాలను సాకుగా చూపించి బీసీలకు రిజర్వేషన్లను తగ్గించేవారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీల అభ్యున్నతిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. న్యాయపరమైన అంశాల కారణంగా బీసీలకు చట్టప్రకారం 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వలేకపోతున్నందున పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. పార్టీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. అద్భుత నిర్ణయం రిజర్వేషన్లపై కోర్టు కేసులతో కాలయాపన చేయాలన్న టీడీపీ ఎత్తుగడలకు లొంగకుండా ముఖ్యమంత్రి జగన్ పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు ప్రకటించడం అద్భుత నిర్ణయమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రశంసించారు. బీసీ రిజర్వేషన్లపై వైఎస్సార్ సీపీ పార్లమెంటరీ పక్ష నేత వి.విజయసాయిరెడ్డి ద్వారా గతంలోనే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టడం బీసీలపట్ల సీఎం జగన్ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. చంద్రబాబు టీడీపీ నేత బిర్రు ప్రతాపరెడ్డితో కోర్టులో కేసు వేయించి ఆ జీవోను అడ్డుకున్నారని విమర్శించారు. మళ్లీ బీసీలను మోసగించేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి డ్రామాకు తెర తీశారని దుయ్యబట్టారు. అయితే ముఖ్యమంత్రి జగన్ ఏమాత్రం కాలయాపన చేయకుండా పార్టీపరంగా 34 శాతం సీట్లు కేటాయిస్తామని ప్రకటించడం ద్వారా బీసీలకు తగిన న్యాయం చేశారని చెప్పారు. చిత్తశుద్ధితో అధిగమించిన సీఎం రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ప్రవచించిన స్ఫూర్తిని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో చూపించారని విశ్లేషకులు కొనియాడుతున్నారు. సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తూ బీసీలకు తగినన్ని సీట్లు కేటాయించడం లేదని, చిత్తశుద్ధితో దీన్ని అధిగమించవచ్చని సీఎం వైఎస్ జగన్ నిరూపించారని ప్రశంసిస్తున్నారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాజ్యాంగ సవరణ చేసేవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విధాన నిర్ణయాన్ని దేశంలోని ఇతర నేతలు కూడా అనుసరించాలని బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. బీసీల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనం – ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ‘పార్టీ పరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎన్నికల కోసం రాజకీయ డ్రామాలాడటం వైఎస్సార్సీపీ విధానం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని వైఎస్సార్సీపీ ఇప్పటికే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో బీసీలకు అత్యధికంగా సీట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీసీల తరపున ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా. ఇదే రీతిలో పార్లమెంట్లో రాజ్యాంగ సవరణకు కూడా కృషి చేయాలని కోరుతున్నా’ తొలి సీఎం జగన్.. – జస్టిస్ ఈశ్వరయ్య, అఖిల భారత బీసీ సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు ‘సామాజిక న్యాయ సాధనలో ముఖ్యమంత్రి జగన్ చుక్కానిలా నిలిచారు. దామాషా ప్రకారం బీసీలకు సీట్లు కేటాయించాలని నిర్ణయించిన మొదటి ముఖ్యమంత్రి ఆయనే. దేశంలో మరే సీఎంగానీ, పార్టీ అధ్యక్షుడుగానీ ఇంతటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదు. ముఖ్యమంత్రి జగన్‌ను చొరవను అభినందిస్తున్నాం’ దేశానికి ఆదర్శం.. – హనుమంతు లజపతిరాయ్, మాజీ వీసీ, అంబ్కేడర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం ‘పార్టీపరంగా బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయం దేశానికి ఆదర్శప్రాయం. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీలు దీన్ని అనుసరిస్తే సామాజిక న్యాయం సాధ్యపడుతుంది’ బీసీ గర్జన హామీ చిత్తశుద్ధితో అమలు.. జనాభా ప్రాతిపదికన బీసీలకు అన్ని పదవుల్లోనూ పెద్దపీట వేస్తామని ఎన్నికల ముందు ఏలూరులో నిర్వహించిన ‘బీసీ గర్జన’లో ఆనాడు ప్రతిపక్ష నేత హోదాలో సీఎం జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్లుగానే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో ఇతర పార్టీల కంటే అత్యధికంగా బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు కేటాయించారు. ఎన్నికల ముందు దక్కిన ఒకే ఒక్క ఎమ్మెల్సీ పదవిని బీసీ వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తికి ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రివర్గంలో బీసీలకు అగ్రస్థానం కట్టబెట్టారు. బీసీ వర్గానికి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, బీసీ ‘ఈ’ కేటగిరీకి చెందిన మైనార్టీ నేత అంజాద్ బాషను ఉప ముఖ్యమంత్రులుగా నియమించారు. కీలకమైన రెవెన్యూ, పురపాలక, జలవనరులు, రోడ్లు–భవనాలు, మార్కెటింగ్, కార్మిక, మైనార్టీ, బీసీ సంక్షేమ శాఖలను వెనుకబడిన వర్గాలకు కేటాయించారు. స్పీకర్ పదవికి బీసీ వర్గానికి చెందిన తమ్మినేని సీతారాం ఎన్నికయ్యేలా కృషి చేశారు. తాజాగా క్షేత్రస్థాయి నుంచి రాజ్యాధికారాన్ని అందించేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ తరపున బీసీలకు 34 శాతం సీట్లు కేటాయించాలని నిర్ణయించారు. రుణపడి ఉంటాం.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంతో బీసీ కులాలకు ఎంతో మేలు జరుగుతుంది. టీడీపీ హామీ ఇచ్చి మోసం చేస్తే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మాట నిలబెట్టుకుని అండగా నిలుస్తోంది. బీసీలంతా ముఖ్యమంత్రికి రుణపడి ఉంటారు. – గదుల వెంకట్రావు, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, విజయనగరం బీసీలకు సముచిత స్థానం బీసీలకు రాజ్యాధికారం దిశగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ కూర్పు, బడ్జెట్, సీట్ల కేటాయింపులో బీసీలకు సముచిత స్థానం కల్పించి గత 30 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా అమలు చేస్తున్నారు. అద్భుతమైన ఆలోచనలతో ముందుకు సాగుతున్నారు – మహంతి శ్రీరవి, తూర్పుకాపు అభినందనీయం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అదనంగా 10 శాతం సీట్లు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఎమ్మెల్యేలకు టికెట్ల కేటాయింపు, మంత్రివర్గంలో చోటుతోపాటు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్ట్ పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత సీఎంకే దక్కుతుంది. – శంకరయ్య, సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యాయం జరుగుతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. పార్టీ తరపున 10 శాతం అదనంగా సీట్లు కేటాయించడం అభినందనీయం. రాజ్యాంగబద్ధంగా అదనపు రిజర్వేషన్లు పొందలేని బీసీలకు దీనివల్ల న్యాయం జరుగుతుంది. – అనుమోలు చుక్కయ్య, బీసీ సంఘం కృష్ణా జిల్లా మాజీ అధ్యక్షుడు బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టు.. బీసీ వ్యతిరేక శక్తులకు చెంపపెట్టులా బలహీన వర్గాలకు అదనంగా 10 శాతం సీట్లు వైఎస్సార్సీపీ తరపున ఇవ్వాలని సీఎం జగన్ నిర్ణయించడం అభినందనీయం. బీసీలు రాజ్యాధికారం దిశగా అడుగులు వేసేందుకు దోహదపడుతుంది. – కోలా అశోక్, కృష్ణబలిజ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మాట నిలబెట్టుకున్నారు బీసీలకు ఇచ్చిన మాటను జగనన్న నిలబెట్టుకున్నారు. బీసీలను ఎదగనివ్వకుండా కుయుక్తులు పన్నుతున్న టీడీపీకి తగిన బుద్ధి చెప్పారు. కోర్టు తీర్పుతో రిజర్వేషన్లు తగ్గినప్పటికీ వైఎస్సార్సీపీ పరంగా స్థానిక ఎన్నికల్లో బీసీలకు పది శాతం అదనంగా టికెట్లు ఇవ్వాలని నిర్ణయించడం గొప్ప విషయం. – ప్రకాష్, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఏపీ రజక సంఘాల ఐక్యవేదిక చరిత్రాత్మక నిర్ణయం స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున బీసీలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకం. బీసీలు సీఎంకు రుణపడి ఉంటారు. గత ప్రభుత్వాలు బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూశాయి. బీసీలకు ఎలాంటి అవకాశాలు కల్పించలేదు. – లక్ష్మీనారాయణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, అనంతపురం మహిళలకు అవకాశం బీసీలకు సీట్లు పెరగడం వల్ల ఇన్నాళ్లూ ఇంటికే పరిమితమైన గృహిణులు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికై విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయి. బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. – మానేపల్లి వీరేష్, స్వర్ణకారుడు, అమలాపురం బాబుది కాటు తంత్రం .. జగన్‌ది సామాజిక మంత్రం బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు పన్నిన కుట్రలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమర్థంగా తిప్పికొట్టారని బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. బలహీన వర్గాలకు జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయిస్తామంటే చంద్రబాబుకు ఎందుకంత కడుపుమంటని ప్రశ్నిస్తున్నాయి. గత ఎన్నికల్లో గుణపాఠం నేర్పినా బుద్ధి మారని టీడీపీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో చావుదెబ్బ తప్పదని స్పష్టం చేస్తున్నాయి. -
చంద్రబాబుకు గుణపాఠం చెప్తాం
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ హెచ్చరించారు. బీసీ ఉద్యమాన్ని బలహీనం చేయడానికి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు 14 బీసీ సంఘాల నేతలు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్యను విమర్శిస్తే రూ. 50 లక్షలు ఇస్తామని చంద్రబాబు తెలంగాణకు కొంతమంది నేత లను పంపించి బీసీ నేతలతో బేరసారాలు చేస్తున్నారని ఆరోపించారు. బీసీ నేతలను డబ్బులతో కొనడానికి కుట్రలు చేస్తున్నా రన్నారు. గత ఎన్నికల్లో కృష్ణయ్యను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసి బీసీ ఓట్లు దండుకొని ఏపీలో బాబు అధికారం చేపట్టారని విమర్శిం చారు. చంద్రబాబు కృష్ణయ్యను ఎంత అణచివేసినా ఏనాడూ బాబును విమర్శించలేదని, వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. బీసీలకు నేడు లభిస్తున్న పథకాలు కృష్ణయ్య పోరాటం వల్ల వచ్చినవేనని, బీసీ ఉద్యమ నాయకుడిగా అనేక త్యాగాలు చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోకపోతే ఏపీ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తామని హెచ్చరించారు. -
‘కృష్ణయ్య బీసీ గర్జనకు వెళితే నీకేంటి?’
హైదరాబాద్: బీసీ డిమాండ్ల సాధనకు, ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రోజుల్లో బీసీలకు పెద్దపీట వేసేందుకు వైఎస్సార్సీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి నిర్వహించిన బీసీ గర్జన సభకు తమ నాయకుడు ఆర్.కృష్ణయ్య వెళితే మీకు వచ్చిన నొప్పేంటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును 14 బీసీ సంఘాల నేతలు ప్రశ్నించారు. బీసీల సమస్యలు, డిమాండ్లు కృష్ణయ్యకు తెలుసు కాబట్టే జగన్ ముఖ్య అతిథిగా పిలిచారన్నారు. గర్జన సభకు కృష్ణయ్య వెళ్లడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటని నిలదీశారు. మంగళవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ మాట్లాడుతూ.. బీసీల నేతగా ఎదిగిన కృష్ణయ్యపై విమర్శలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ సభకు వెళ్లితే కృష్ణయ్యను తప్పు పట్టాల్సిన అవసరం ఏముందని వీహెచ్‌ని ప్రశ్నించారు. అంతకుముందు బీసీ సంఘాల నేతలంతా చీపుర్లు పట్టుకుని వీహెచ్‌కి తగిన గుణపాఠం చెబుతామంటూ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ అధ్యక్షుడు నీరడి భూపేష్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. -
ఈ నెల 17న ఏలూరులో బీసీ బహిరంగ సభ
-
బీసీ సంఘాల నేతలది ఆర్థిక రాజకీయం
సాక్షి, హైదరాబాద్: కొందరు బీసీ సంఘాల నేతలు ఆర్థిక రాజకీయం చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి లింగంపల్లి కిషన్‌రావు మండిపడ్డారు. మంగళవారం ఆయన టీఆర్ఎస్ నేత చిక్కాల రామారావుతో కలిసి తెలంగాణ భవ న్లో విలేకరులతో మాట్లాడారు. ‘బీసీ రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్‌ను తప్పుపడుతూ కొన్ని పార్టీలు, బీసీ సంఘాల నేతలు మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం. కొందరు బీసీ సంఘాల నేతల ముసుగులో ఆర్థిక రాజకీయం చేస్తున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వానికి బీసీలు బ్రహ్మరథం పట్టారు. టీఆర్ఎస్ 88 సీట్లు గెలిచేందుకు తోడ్పడ్డారు. కేసీఆర్‌ను విమర్శిస్తున్న నాయకుల వెంట బీసీలు లేరు. బీసీల కోసం ఏ సీఎం ప్రవేశపెట్టని పథకాలు కేసీఆర్ ప్రవేశపెట్టారు. బీసీలకు రాజకీయంగా ఉన్నత పదవులిచ్చి గౌరవించారు. అందుకే బీసీలు ఓట్లతో ఆశీర్వదించారు’అని వ్యాఖ్యానించారు. -
బీసీల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు: ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: బీసీలకు జనాభా ప్రాతిపది కన రిజర్వేషన్ల కేటా యింపు విషయంలో బీసీ సంఘాలు చేస్తున్న పోరాటాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. జనాభా ప్రాతిపది కన బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని గురువారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు పంచాయతీ ఎన్నిక ల్లో బీసీలకు కేవలం 22 శాతం రిజర్వేషన్లు కేటా యించారని, దీని వల్ల రాష్ట్రంలోని అనేక గ్రామా ల్లో బీసీలకు పంచాయతీల్లో రిజర్వేషన్లు దక్కకుండా పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీలలో కూడా ఏ, బీ, సీ, డీ, ఈ విభజన ప్రకారం కులాల గణన చేయాల్సి ఉందని, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా 34 శాతం ఉన్న రిజర్వేషన్లను కేవలం 22 శాతానికి పరిమితం చేసిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించి బీసీలకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘాలు చేయనున్న నిరవధిక పోరాటాల లో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాలు పం చుకోవాలని ఉత్తమ్ పిలుపునిచ్చారు. -
‘పంచాయతీ’ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు వీలుగా పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించడంతోపాటు బీసీ ఓటర్లను లెక్కించి, వాటి ఆధారంగా రిజర్వేషన్లను ఖరారు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెలంగాణ బీసీ మహాజన సమితి ప్రతినిధి యు.సాంబశివరావు, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సంయుక్తంగా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో న్యాయశాఖ కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డైరెక్టర్, తెలంగాణ బీసీ సహకార ఆర్థిక సంస్థలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై నేడు(బుధవారం) ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్ తొట్టతిల్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. అశాస్త్రీయ గణన వల్లే బీసీలకు సమస్య... ఈ ఆర్డినెన్స్ సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్ధమని పిటిషనర్లు పేర్కొన్నారు. న్యాయస్థానాల తీర్పుల ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించడానికి వీల్లేదని, అయితే, ఈ తీర్పులన్నీ కూడా బీసీ జనాభా, బీసీ ఓటర్ల లెక్కలు తేల్చకుండా జారీ చేసినవాటికి మాత్రమే వర్తిస్తాయని తెలిపారు. అశాస్త్రీయ పద్ధతుల ద్వారా తేల్చిన లెక్కల ఆధారంగా బీసీ రిజర్వేషన్లు ఇచ్చారంటూ వాటిని న్యాయస్థానాలు కొట్టేశాయని వివరించారు. పూర్తిస్థాయిలో బీసీ జనాభా, ఓటర్లు తేలితే తప్ప, బీసీలకు న్యాయమైన రిజర్వేషన్లు కల్పించడం సాధ్యం కాదన్నారు. అసాధారణ పరిస్థితుల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తమిళనాడులో సర్వీసు రంగంలో 69 శాతం రిజర్వేషన్లను సుప్రీంకోర్టు అనుమతించిందని, అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీలు 69 శాతం ఉన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుందని వివరించారు. సమగ్ర కుటుంబ సర్వే లెక్కలున్నాయిగా... 2014లో రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిందని, ఇందులో బీసీ జనాభా 55 నుంచి 67 శాతం వరకు ఉన్నట్లు తేలిందని పిటిషనర్లు పేర్కొన్నారు. సుప్రీంకోర్టుగానీ, ఏ హైకోర్టుగానీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగ, చట్ట విరుద్ధంగా ప్రకటించలేదని తెలిపారు. కేవలం శాస్త్రీయపద్ధతిలో బీసీ జనాభాను లెక్కించకపోవడాన్నే న్యాయస్థానాలు తప్పుపట్టాయన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 243ఈ ప్రకారం ప్రతి ఐదేళ్లకోసారి పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కాబట్టి బీసీ జనాభా లెక్కలను తేల్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపైనే ఉందని వారు వివరించారు. ఎన్నికలు ఎప్పుడు పెట్టాలన్న దానిపై ప్రభుత్వానికి స్పష్టత ఉంటుందని, కాబట్టి ముందుగానే బీసీ జనాభాలెక్కలను సిద్ధం చేసుకోవడం ప్రభుత్వ బాధ్యతఅని అన్నారు. రాజ్యాంగాన్ని మోసం చేయడమే ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి, బీసీ రిజర్వేషన్లను 34 శాతానికే పరిమితం చేసిందని పిటిషనర్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు వారి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించిన ప్రభుత్వం, బీసీల రిజర్వేషన్లను మాత్రం తగ్గించిందన్నారు. అందుబాటులో ఉన్న సమగ్ర కుటుంబ సర్వే లెక్కల ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు ఖరారు చేయకుండా ఆర్డినెన్స్ తీసుకురావడం బీసీలను, రాజ్యాంగాన్ని మోసం చేయడమేనన్నారు. అందువల్ల ఆర్డినెన్స్ అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు. ముందు బీసీల లెక్కలను తేల్చమని హైకోర్టు చెప్పింది బీసీ జనాభా లెక్కలు తేల్చకుండా ఈ ఏడాది జూన్‌లో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందని, దీనిపై హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయని పిటిషనర్లు పేర్కొన్నారు. విచారణ జరిపిన హైకోర్టు ఈ ఏడాది జూన్ 26న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ, ముందు బీసీ జనాభా, ఓటర్ల గణనను పూర్తి చేసి ఆ తరువాతే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టంగా చెప్పిందన్నారు. అక్టోబర్‌లో కూడా బీసీ జనాభా లెక్కలు తేల్చిన తరువాత మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఇంత స్పష్టంగా హైకోర్టు ఆదేశాలున్నా రాష్ట్ర ప్రభుత్వం బీసీ జనాభా గణనకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. బీసీ జనాభా లెక్కలను తేల్చేందుకు చట్టం 15 రోజుల గడువునిస్తుంటే, ప్రభుత్వం మాత్రం 11–14 నెలల గడువు కావాలని కోరుతోందన్నారు. హైకోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో స్టే ఎత్తివేత కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని, తద్వారా బీసీల ప్రయోజనాలను పరిరక్షించడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. -
ఇందిరా పార్క్ వద్ద బీసీల మహా ధర్నా
హైదరాబాద్: రాబోయే పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 23 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీలు మహా ధర్నాకు దిగారు. ధర్నాలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు, జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీలపై కేసీఆర్ కక్ష కట్టారు: జాజుల ఎన్నికల్లో ఆశీర్వదించిన బీసీలపైనే కేసీఆర్ కక్ష కట్టారని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన గంటల వ్యవధిలోనే బీసీల రిజర్వేషన్లను 34 నుంచి 23 శాతానికి తగ్గిస్తూ ఆర్డినెన్స్ చేశారని విమర్శించారు. బీసీల రిజర్వేషన్ల సమస్యపై 24 గంటల్లోగా శాశ్వత పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. బీసీల రిజర్వేషన్లను రక్షించుకునేందుకు జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. సమస్యకు పరిష్కారం చూపకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారమా?: ఎల్ రమణ బలహీనవర్గాలకు రాయితీలు..దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ విమర్శించారు. సీఎం అఖిలపక్ష సమావేశం నిర్వహించి సమస్య పరిష్కరించాలన్నారు. ఎస్సీ, ఎస్టీలను కలుపుకునిపోయి బీసీ రిజర్వేషన్లను రక్షించుకోవాలని సూచించారు.బీసీ రిజర్వేషన్లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని కోరారు. రిజర్వేషన్ల పోరాటంలో టీటీడీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రాణం పోయినా ఊరుకునేది లేదు:వీహెచ్ ప్రాణం పోయినా ఊరుకునేది లేదు..బీసీలకు రిజర్వేషన్ల పెంపు కోసం పోరాటం ఆపేది లేదని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లోని బీసీ ఎమ్మెల్యేలు రిజర్వేషన్లపై మాట్లాడాలని కోరారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికీ బయట పెట్టలేదని చెప్పారు. బీసీల ఓట్ల కోసం స్కీమ్‌లు పెట్టారు...ఎన్నికల్లో గెలిచాక బీసీల రిజర్వేషన్లు తగ్గించారు. బీసీల పట్ల సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి లేదు..బీసీలు అధికారంలో భాగస్వామ్యం కావాలని కోరారు. సమగ్ర కుటుంబసర్వేలో 54 శాతం బీసీలు ఉన్నారని ప్రకటించిన వాస్తవమా కాదా చెప్పాలన్నారు. బీసీలు చట్టసభల్లోకి వెళ్లకుండా గొర్లు,బర్లు కాసుకునే బతకాలా అని సూటిగా అడిగారు. కేసీఆర్ పిట్టల దొర : షబ్బీర్ కేసీఆర్ ఒక పిట్టల దొర అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. బీసీలకు రిజర్వేషన్లను పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్ధతు ఉంటుందని స్పష్టం చేశారు. 34 శాతం కోసం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. సీఎం నిర్ణయం హాస్యాస్పదం: పొన్నాల సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని పీసీసీ మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య అన్నారు. బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన ఆర్డినెన్స్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి చట్టబద్దం చేయలేదని వెల్లడించారు. బీసీలు రాజ్యాధికారం కోసం పోరాటం చెయ్యాలని సూచించారు. -
ప్రజాప్రతినిధులను బయట తిరగనివ్వం
సాక్షి, విజయవాడ : జీవో 550పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ద్వారా స్టే ఉత్తర్వుల కోసం ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు చేపట్టాలని బీసీ సంఘం నేత కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్టార్‌ను బీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. 2018 ఎంబీబీఎస్ సీట్ల వెబ్ కౌన్సిలింగ్లో బీసీ రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2001 నాటి జీవో 550 ప్రాతిపదికగా తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రభుత్వానికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, బీసీల ప్రజా ప్రతినిధులను బయట తిరగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. -
‘చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు’
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. బుధ వారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రిని కలసి బీసీల సమస్యల గురించి చర్చించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% స్థానాలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బీసీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తీసివేయాలన్నారు. బీసీ అట్రాసిటీ యాక్ట్ తేవాలని కోరామన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. 8న పాండిచ్చేరిలో పర్యటించి అక్కడి అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు. -
బీసీలకు వెంటనే సబ్సిడీ రుణాలివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్, బీసీ కుల ఫెడరేషన్ల ద్వారా దరఖాస్తు చేసుకున్న 5.77 లక్షల మందికి సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని 16 బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ చేసింది. మంగళవారం బీసీ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా సబ్సిడీ రుణాలివ్వలేదని ఆరోపించారు. బీసీ కార్పొరేషన్లకు రూ.5వేల కోట్లు కేటాయించినా అందులో కేవలం రూ.210 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారన్నారు. గ్రామ సభల ద్వారా ఎంపిక చేసి రుణాలిస్తామని మంత్రి పేర్కొనడం అన్యాయమన్నారు. ఇలా చేస్తే అధికార పార్టీ నేతలు, అధికారుల చుట్టూ తిరుగుతూ లంచాలివ్వాల్సిన దుస్థితి ఏర్పడుతుందని చెప్పారు. ఇటీవల సబ్సిడీ ట్రాక్టర్లను టీఆర్ఎస్ కార్యకర్తలకే ఇచ్చారని, బీసీ రుణాలు కూడా అలాగే ఇస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. రాష్ట్రంలో 60 లక్షల బీసీ కుటుంబాలుంటే కేవలం దరఖాస్తు చేసుకున్న 5 లక్షల మందికి రుణాలు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. అర్హులైన బీసీలందరికీ వెంటనే రుణాలు మంజూరు చేయాలని సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సంఘం నేతలు గుజ్జ కృష్ణ, భిక్షపతి, మల్లేశ్, వేముల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
17 నుంచి బీసీ సంఘాలతో ములాఖత్
హైదరాబాద్: ‘కులాలుగా బలపడదాం.. బీసీలుగా ఏకమవుదాం’అనే నినాదంతో ఈ నెల 17 నుంచి ములాఖత్ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఆదివారం ఇక్కడ జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన ప్రసంగించారు. బీసీల్లో విద్యాభివృద్ధి, రాజకీయ చైతన్యం, ఓటు విలువ తెలిపేందుకు రాష్ట్రంలో ఉన్న 112 బీసీ కుల సంఘాలతో ఈ ములాఖత్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నుంచి దీనిని ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సభలు, సమావేశాలను నిర్వహిస్తామని చెప్పారు. రాష్ట్రం కోసం తన ప్రాణాలను ధారపోసిన మారోజు వీరన్న స్మారక స్థూపాన్ని పరిరక్షించాలని సీఎం కేసీఆర్‌కు జాజుల విజ్ఞప్తి చేశారు. -
15న చలో నల్లగొండ
సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పార్టీలు, నేతలు పదవుల కోసం, అభివృద్ధి కోసం బీసీలను తాకట్టు పెడితే చరిత్ర క్షేమించదని బీసీ జాతీయ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలున్నా ఏ ఒక్క పార్టీ బీసీల పక్షాన పోరాడటానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని బీసీ భవనంలో బీసీల చైతన్య పోరు గర్జన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ పెట్టాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 15న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో 56 శాతంగా జనాభా ఉన్న బీసీలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టే వరకు పార్టీలకతీతంగా బలమైన ఉద్యమాలు చేయడానికి బీసీలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ అరుణ్, భూఫేస్, సాగర్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
సాక్షి, కాకినాడ : కాపులను బీసీల్లో చేరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిల్లును తీసుకురావడంపై బీసీ సంఘాలు శనివారం ఆందోళనకు దిగాయి. తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని కలెక్టరేట్ ఎదుట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేశాయి. టైర్లకు నిప్పు అంటించి రోడ్డుపై వేయడంతో కలెక్టరేట్ వైపు నుంచి వెళ్తున్న రవాణా వ్యవస్థను స్తంభించింది. ఆందోళనకారులు ఆర్టీసీ బస్సుల టైర్లలో గాలి తీసేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాపులను బీసీల్లో చేర్చడం వల్ల వెనుకబడిన తరగతుల వర్గాల వారికి నష్టం జరుగుతుందని బీసీ సంఘాలు ఆరోపించాయి. బీసీల మెరుపు ముట్టడితో కలెక్టరేట్ వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమంలో బీసీ సంఘాలు భారీ ఎత్తున పాల్గొన్నాయి. -
బకాయిలుండగానే మళ్లీ నోటిఫికేషనా?
తెలంగాణ సర్కారుపై బీసీ సంఘాల ధ్వజం సాక్షి, హైదరాబాద్: గత ఏడాది ఫీజు బకాయిలు ఇవ్వకుండా, ఈ విద్యా సంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా స్కాలర్షిప్లు, ఫాస్ట్ పథకంపై తేల్చకుండా ఎంసెట్ నోటిఫికేషన్‌ను ఎలా ఇస్తారని బీసీ సంఘాలు తెలంగాణ ప్రభుత్వాన్ని నిలదీశాయి. ఈ ఏడాదే దిక్కులేదని, వచ్చే ఏడాదికి ఎంసెట్ నోటిఫికేషన్‌ను ప్రకటించడం ప్రభుత్వ దివాలా కోరుతనానికి నిదర్శనమని విమర్శించాయి. ప్రభుత్వం పట్టింపులకు పోకుండా ఫీజు బకాయిలను విడుదలచేసి, రీయింబర్స్‌మెంట్‌పై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశాయి. లేనిపక్షంలో రెండు, మూడు రోజుల్లో అఖిలపక్ష పార్టీలు, విద్యార్థి, ప్రజా, జేఏసీ ఉద్యమ సంస్థలతో సమావేశమై ప్రభుత్వానికి విద్యార్థి ఉద్యమ రుచిని చూపుతామని హెచ్చరించాయి. ప్రభుత్వ నాన్చివేత ధోరణిపై నిలదీసిన విద్యార్థులపై కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో టీఆర్ఎస్ నాయకులు దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ఆర్.కృష్ణయ్య (జాతీయ బీసీ సంక్షేమ సంఘం), జాజుల శ్రీనివాస్‌గౌడ్ (తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం), జి.మల్లేశ్‌యాదవ్ (బీసీ ఫ్రంట్), గుజ్జ కృష్ణ (బీసీ సంఘం), సి.రాజేందర్(బీసీ సంఘర్షణ సమితి), నీల వెంకటేశ్ (బీసీ యువజన సంఘం), కుల్కచర్ల శ్రీనివాస్ (బీసీ విద్యార్థి సంఘం) ప్రశ్నించారు. ఉద్యమ పార్టీ నుంచి మంత్రిగా బాధ్యతలను చేపట్టిన కేటీఆర్ దీనిని ఖండించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకానికి గండికొట్టడానికి ఆంధ్ర పాలకులు చేయని సాహసాన్ని తెలంగాణ ప్రభుత్వం చేస్తోందని ధ్వజమెత్తారు. ‘ఫాస్ట్’కమిటీ వేసి ఆరునెలలైనా ఇంతవరకు విధివిధానాలు రూపొందించక పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.