సాక్షి, హైదరాబాద్ : రాజకీయ పార్టీలు, నేతలు పదవుల కోసం, అభివృద్ధి కోసం బీసీలను తాకట్టు పెడితే చరిత్ర క్షేమించదని బీసీ జాతీయ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. పార్లమెంటులో 36 రాజకీయ పార్టీలున్నా ఏ ఒక్క పార్టీ బీసీల పక్షాన పోరాడటానికి ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వివిధ బీసీ సంఘాల ఆధ్వర్యంలో విద్యానగర్‌లోని బీసీ భవనంలో బీసీల చైతన్య పోరు గర్జన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంటులో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ పెట్టాలన్న డిమాండ్‌తో రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఈ నెల 15న నల్లగొండలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశంలో 56 శాతంగా జనాభా ఉన్న బీసీలకు 70 ఏళ్లుగా అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు పెట్టే వరకు పార్టీలకతీతంగా బలమైన ఉద్యమాలు చేయడానికి బీసీలు ముందుకు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ర్యాగ అరుణ్, భూఫేస్, సాగర్, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment