సాక్షి, విజయవాడ : జీవో 550పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు ద్వారా స్టే ఉత్తర్వుల కోసం ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు చేపట్టాలని బీసీ సంఘం నేత కొలనుకొండ శివాజీ డిమాండ్ చేశారు. బుధవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ రిజిస్టార్‌ను బీసీ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా కొలనుకొండ శివాజీ మాట్లాడుతూ.. 2018 ఎంబీబీఎస్ సీట్ల వెబ్ కౌన్సిలింగ్‌లో బీసీ రిజర్వేషన్ విద్యార్థులకు అన్యాయం జరిగిందన్నారు.
మొదటి విడత కౌన్సిలింగ్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2001 నాటి జీవో 550 ప్రాతిపదికగా తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం ప్రభుత్వానికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతోందని, బీసీల ప్రజా ప్రతినిధులను బయట తిరగనివ్వమని ఆయన స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment