
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రమంత్రి హన్స్‌రాజ్ గంగారామ్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య కోరారు. బుధ వారం హైదరాబాద్‌కు వచ్చిన కేంద్రమంత్రిని కలసి బీసీల సమస్యల గురించి చర్చించారు. పార్లమెంట్ లో బీసీ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50% స్థానాలు కేటాయించాలని కోరినట్లు తెలిపారు. బీసీ విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లపై ఉన్న క్రీమీలేయర్‌ను తీసివేయాలన్నారు.
బీసీ అట్రాసిటీ యాక్ట్ తేవాలని కోరామన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి హామీ ఇచ్చినట్లు తెలిపారు. 8న పాండిచ్చేరిలో పర్యటించి అక్కడి అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టడానికి సీఎంపై ఒత్తిడి తెస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment