సాక్షి, అమరావతి: కాపులు, బీసీలకు మధ్య వైరాన్ని సృష్టించారని వైఎస్సార్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం అన్ని కులాలను వంచించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. కాపులకు కంటితుడుపుగా రిజర్వేషన్లు ఇచ్చి చేయి దులుపుకున్నారన్నారు.
ఢిల్లీకి పంపిన కాపు రిజర్వేషన్లపై తాజా స్టేటస్ ఇవ్వాలని ఆయన కోరారు. ఏ వ్యవస్థలోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు సక్రమంగా పనిచేయలేదని విమర్శించారు. కాపులపై పెట్టిన తప్పుడు కేసులు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment