కాపుల రిజర్వేషన్లపై చంద్రబాబుది మోసపూరిత విధానమని ఏపీ పీసీసీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. నంద్యాల ఉప ఎన్నికలు, ముద్రగడ పద్మనాభం పాదయాత్ర నేపథ్యంలో కాపులను ప్రభావితం చేసేందుకు ప్రభుత్వం మరో వంచనకు దిగిందని ఆయన ధ్వజమెత్తారు. మంజునాథ్ కమిషన్ నివేదిక ఏమైంది..? కమిషన్ ఎటువంటి సిపార్సులు చేసిందో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఏ ప్రతిపాదికన చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రశ్నించారు.