సిద్దవటం(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా సిద్దవటం మండలం ఉప్పరపల్లి గ్రామంలో బీసీ బాలికల వసతి గృహన్ని రాజంపేట ఎమ్మెల్యే మల్లికార్జునరెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వెనుకబడిన తరగతుల సంక్షేమమే ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. బీసీ జనాభా ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో బాలికల కోసం బీసీ వసతి గృహాన్ని ఏర్పాటు చేయడం సంతోషం కలిగించే విషయమని చెప్పారు.