అగ్రి గోల్డు బాధితులకు అండగా జగన్‌ | Agrigold Victims Hopes On YS Jagan Mohan Reddy | Sakshi
Sakshi News home page

అగ్రి గోల్డు బాధితులకు అండగా జగన్‌

Published Tue, Apr 2 2019 10:10 AM | Last Updated on Tue, Apr 2 2019 10:10 AM

Agrigold Victims Hopes On YS Jagan Mohan Reddy - Sakshi

జననేతకు అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు వివరిస్తున్న విశ్వనాథ్‌రెడ్డి, రాము

సాక్షి, రాజంపేట రూరల్‌: వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్‌సీపీనీ అధికారంలోకి తెచ్చుకుందామని అగ్రిగోల్డ్‌ కస్టమర్స్‌ అండ్‌ ఏజెంట్స్‌ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ రాష్ట్ర , జిల్లా ఉపాధక్షుడు తుమ్మల రాము అగ్రిగోల్డ్‌ బాధితులను కోరారు. సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని లోటస్‌పాండ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బి. విశ్వనాథ్‌రెడ్డితో వెళ్లి కలిశామని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్‌ బాధితుల కష్టాలు జననేతకు వివరించామన్నారు.

అధికారంలోకి రాగానే మూడు నెలలలోపు రూ.1183 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి న్యాయం చేస్తానని జగన్‌ భరోసా ఇచ్చారని రాము తెలియజేశారు. దశల వారిగా ప్రతి కస్టమర్‌కు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే బాబు ప్రభుత్వం న్యాయం చేయక పోగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. 250 మందికి పైగా రైతులు క్షోభతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి భాధితుడు ఫ్యాన్‌ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మంగళవారం నుంచి అగ్రిగోల్డ్‌ భాధితులు ప్రచా రం చేయాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాజంపేట శాఖ అధ్యక్షుడు పీవీ సుబ్బారావు, ఉపాధ్యక్షుడు తదితరులు ఉన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement