agrigold issue
-
పుష్పగా మారిన టీడీపీ ఎమ్మెల్యే
ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు పుష్పాను మించిపోయారు. అగ్రిగోల్డ్ ఆస్తులు తమ్ముళ్లకు అక్షయపాత్రగా మారాయి. అనాదీనంగా పడి ఉన్న ఆ సంస్థ భూముల్లోని రూ.కోట్ల విలువైన జామాయిల్ కర్రను కొల్లగొట్టేస్తున్నారు. సీఐడీ పర్యవేక్షణలో ఉన్న ఈ భూముల్లోని సంపదను స్థానిక ప్రజాప్రతినిధి అనుచరులను అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నారు. మంత్రి లోకేశ్ అనుచరుడు అక్రమ సంపాదనలో వాటా ఇవ్వాలంటూ డిమాండ్ చేశాడు. ఈ వ్యవహారంలో తగ్గేదే లేదంటూ.. ప్రజాప్రతినిధి వర్గం తెగేసి చెప్పడంతో తమ్ముళ్ల మధ్య చిచ్చు రేగింది.సాక్షి నెల్లూరు: ప్రభుత్వ అదీనంలో ఉన్న అగ్రిగోల్డ్ భూముల్లో సంపద దోచుకునేందుకు తమ్ముళ్లు పుష్పా సినిమా తరహాలో వ్యవహరిస్తున్నారు. ఈ పరిణామాలు పచ్చనేతల మధ్య చిచ్చు రేపాయి. వరికుంటపాడు మండలం భాస్కరపురం రెవెన్యూ పరిధిలో అగ్రిగోల్డ్ సంస్థ భూములు ఉన్నాయి. ఆ భూముల్లోని విలువైన జామాయిల్ కర్రను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తన అనుచరులను పెట్టి అక్రమంగా నరికి స్వాహా చేస్తున్నారు. పది రోజులుగా జరుగుతున్న ఈ దందాపై ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియాల్లో విస్తృతంగా కథనాలు వస్తున్నాయి. పుష్పా తరహాలో రాత్రి పగలు తేడా లేకుండా జామాయిల్ కర్ర అక్రమ రవాణా జరుగుతున్నా.. రెవెన్యూ, పోలీ స్, సీఐడీ అధికార యంత్రాంగం కళ్లకు గంతలు కట్టుకున్నట్లు వ్యవహరిస్తోంది. టీడీపీ అధినాయకత్వం కూడా పట్టీపట్టనట్లు ఉండిపోయింది. వాటా కోసం లోకేశ్ అనుచరుడు రచ్చ అగ్రిగోల్డ్ సంపదను కాపాడి బాధితులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నోరు మెదపడం లేదు. దీన్ని అవకాశంగా తీసుకుని కంచే చేను మేసిన చందంగా ప్రజాప్రతినిధి తమ అనుచరుల ద్వారా ‘కర్ర’ స్కామ్‌కు పాల్పడుతున్నారు. రూ.కోట్లు విలువ చేసే కలప సంపదలో తన వాటా సంగతి ఏమిటంటూ మంత్రి లోకేశ్ అనుచురుడు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి బి.వెంగళరావు (ఇతని సొంతూరు దుత్తలూరు మండలం ఏరుకొల్లు) పేచీ పెట్టి.. రచ్చ చేస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం కర్ర నరికే ప్రాంతం కనియంపాడు వెళ్లి మకాం పెట్టారు. ఈ విషయం తెలుసున్న ఎమ్మెల్యే అనుచరుడు మండలానికి చెందిన ఓ టీడీపీ నేతను రంగంలోకి దింపి, సమస్య లేకుండా రాజీ ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో లోకేశ్ అనుచరుడు సోమవారం నేరుగా అక్రమంగా జామాయిల్ కర్ర నరికే కనియంపాడు భూముల్లోకి మరో వ్యక్తితో కలిసి కారులో వెళ్లారు. అక్కడ లోడ్ చేసి బయలు దేరేందుకు సిద్ధంగా ఉన్న లారీ ముందు దారికి అడ్డంగా కారు పెట్టాడు. తహసీల్దార్‌కు ఫిర్యాదు చేసేందుకు కార్యాలయానికి వెళ్లి తిరిగి వచ్చే లోపు ఎమ్మెల్యే అనుచరులు కారు అద్దాలు «ధ్వంసం చేశారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దోపిడీని ప్రశ్నించేదెవరు? ప్రజల సొత్తును అక్రమార్కులు దోచేస్తుంటే వారి ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, పోలీసులు, సీఐడీ, రెవెన్యూ యంత్రాంగం నోరు మెదపడం లేదు. బాధితుల తరఫున ఉద్యమాలు చేసిన ప్రతిపక్ష పారీ్టలు, ప్రజా సంఘాలు మౌనవ్రతం పాటిస్తున్నాయి. చిన్న తప్పు చేస్తే పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పే పోలీసు యంత్రాంగం కళ్లేదుటే దోపిడీ జరుగుతున్నా పట్టించుకోకపోవడం చూసి ప్రజలు మండిపడుతున్నారు.భూముల్లో రూ.50 కోట్ల సంపద అగ్రిగోల్డ్ సంస్థ డిపాజట్దార్లు నుంచి సేకరించిన నగదుతో ఉదయగిరి నియోజకవర్గంలో వరికుంటపాడు మండలం భాస్కరపురం, కనియంపాడు, తూర్పుపాళెంతో పాటు దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి, సీతారామపురం, కలిగిరి మండలాల్లో 17 వేల ఎకరాల భూములు కొనుగోలు చేశారు. అందులో దాదాపు 15 వందల ఎకరాల్లో జామాయిల్ సాగు చేశారు. ఈ భూముల్లో సాగులో ఉన్న కర్ర సంపద సుమారు రూ.50 కోట్లు ఉంటుందని అంచనా. వీటిలో ప్రస్తుతం వరికుంటపాడు మండలంలో రూ.10 కోట్లు విలువ చేసే జామాయిల్ కర్రను నరికి స్వాహా చేస్తున్నారు. -
అగ్రిగోల్డ్ బూచి... ప్రత్తిపాటి భూముల లాలూచీ
సాక్షి, అమరావతి: సామాన్య డిపాజిటర్లను నిండా ముంచేసిన అగ్రిగోల్డ్ కుంభకోణం మాటున టీడీపీ పెద్దలు కొల్లగొట్టిన భూములపై ప్రభుత్వం కొరఢా ఝళిపించింది. అందులో మొదటి అడుగుగా టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం అగ్రిగోల్డ్ నుంచి కొల్లగొట్టిన భూములను అటాచ్ చేయాలని నిర్ణయించింది. పుల్లారావు కుటుంబానికి చెందిన 6.19 ఎకరాలను అటాచ్ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోమ్ శాఖ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని ఆసరాగా చేసుకొని టీడీపీ నేతలు ఆ సంస్థకు చెందిన భూములను కొల్లగొట్టారు. ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం కూడా ఆ భూ దోపిడీలో అడ్డగోలుగా లబ్ధి పొందింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం (అప్పటి ప్రకాశం జిల్లా) గురిజేపల్లిలోని సర్వే నంబర్లు 104/1, 104/3, 104/4, 104/5, 104/6, 103/2లో ఉన్న 6.19 ఎకరాలను హస్తగతం చేసుకుంది. అప్పటికే అగ్రిగోల్డ్ కంపెనీపై కేసు నమోదైంది. ఆ కేసు పేరుతో భయపెట్టి సెటిల్మెంట్ కింద ఆ భూమి తమ పరం చేసేలా డీల్ కుదుర్చుకున్నారు. అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గా వ్యవహరించిన కనుకొల్లు ఉదయ్ దినకర్ పేరిట ఉన్న ఆ 6.19 ఎకరాలను పుల్లారావు భార్య తేనే వెంకాయమ్మ పేరిట బదిలీ చేశారు. ఈమేరకు గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 2015లో రిజిస్ట్రేషన్ చేయించారు. అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆ భూములను కామేపల్లి లక్ష్మీ ప్రసాద్, చెరుకూరి కోటేశ్వరరావు, కామేపల్లి గ్రానైట్స్ పేరిట బదిలీ చేసేశారు. ఈ విధంగా అగ్రిగోల్డ్ భూములను హస్తగతం చేసుకున్నారు. అటాచ్‌మెంట్‌కు అనుమతి ఈ కేసు దర్యాప్తును సీఐడీ అధికారులు వేగవంతం చేశారు. డిపాజిటర్ల నిధులతో అగ్రిగోల్డ్ కంపెనీ కొనుగోలు చేసిన భూములను ప్రత్తిపాటి పుల్లారావు కుటుంబం దక్కించుకుందని గుర్తించారు. దాంతో ఆ భూములను అటాచ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఐడీ పంపిన ప్రతిపాదనలను హోమ్ శాఖ ఆమోదించి అటాచ్‌మెంట్‌కు అనుమతి జారీ చేసింది. -
Fact Check: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంది జగనే
సాక్షి, అమరావతి: ప్రజల బాధలు చంద్రబాబుకు పట్టవు. సీఎం వైఎస్ జగన్ బాధితులకు మేలు చేస్తే రామోజీరావు మనసు ఒప్పుకోలేదు. ఏదో ఒక బురద కథతో బాధితులను పక్కదోవ పట్టించాలన్న దుగ్ధ ఆయనది. అందుకే ఈనాడులో ఓ అసత్య కథనం అచ్చేశారు. అసలు అగ్రిగోల్డ్ కుంభకోణం వెలుగుచూసింది చంద్రబాబు ప్రభుత్వం హయాంలోనే. అయినా లక్షలాది అగ్రిగోల్డ్ బాధితులను చంద్రబాబు గాలికి వదిలేశారు. పైగా, ఆ కుంభకోణం సాకుగా చూపి అగ్రిగోల్డ్‌కు చెందిన అమరావతిలోని అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్‌ను ఆ సంస్థ నుంచి చేజిక్కించుకోవాలని చంద్రబాబు, లోకేశ్ పన్నాగాలు పన్నారు. కొన్ని ఆస్తులను మరికొందరు నేతలు అక్రమంగా గుంజుకున్నారు. అంతే తప్ప బాధితుల కోసం వీసమెత్తు కూడా పనిచేయలేదు. ఈ విషయాలన్నీ రామోజీకి ఎరుకే. కానీ, చంద్రబాబు కోసమే పనిచేసే ఆయనకు ఇవేమీ పట్టవు. సీఎం వైఎస్ జగన్ మేలు చేసిన ఏదో రకంగా బురద వేసి, బాధితులను పక్కదారి పట్టించడానికే ప్రయత్నిస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపైనే టీడీపీ కన్ను టీడీపీ ప్రభుత్వంలో వెలుగుచూసిన అగ్రిగోల్డ్ కుంభకోణాన్ని చంద్రబాబు, టీడీపీ నేతలు ఆస్తుల సంపాదనకు అక్షయ పాత్రగా మలచుకోవాలని పన్నాగం పన్నారు. తమను ఆదుకోవాలని అగ్రిగోల్డ్ బాధితులు రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసినా కనికరించలేదు. కేసులను బూచిగా చూపి అగ్రిగోల్డ్ ఆస్తులను చవగ్గా కొట్టేయడానికి ఆ సంస్థ యాజమాన్యంతో తెరచాటు మంతనాలు సాగించారు. ప్రధానంగా రాజధాని అమరావతి పరిధిలో ఉన్న వందల కోట్ల విలువైన హాయ్‌ల్యాండ్‌ను హస్తగతం చేసుకోవాలని చంద్రబాబు తనయుడు లోకేశ్ పంతం పట్టారు. టీడీపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన ఇంటెలిజెన్స్ విభాగం ఉన్నతాధికారి ద్వారా మంత్రాంగం చేశారు, 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లో దాదాపు 25 ఎకరాల్లో భవనాలు, సామగ్రి ఉన్నాయి. ఆ భూములు, భవనాలు, సామాగ్రిని అడ్డదారిలో రూ.200 కోట్లకే హస్తగతం చేసుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. అందుకోసం అగ్రిగోల్డ్ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసుకుని వ్యక్తిగత ఖాతాలకు మళ్లించేందుకు టీడీపీ ప్రభుత్వం సహకరించింది. ప్రతిఫలంగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను కారు చౌకగా టీడీపీ ముఖ్యులకు విక్రయించింది. అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు 2016 ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం ఆ సంస్థ యాజమాన్యానికి చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలకు నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే 2015 జనవరి 19న టీడీపీ ప్రభుత్వంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్, హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాలు కొనడం గమనార్హం. అగ్రిగోల్డ్ డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో ఉన్న వందల కోట్ల విలువైన ఆస్తులపై అప్పట్లో సీఐడీ దృష్టి పెట్టలేదు. రూ. 976 కోట్లను 156 కంపెనీలకు మళ్లించిన విషయాన్నీ పట్టించుకోలేదు. బాధితుల గోడునూ పట్టించుకోలేదు. తక్షణం రూ.300 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు ఎంతో కొంత ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఒక్క పైసా విదల్చలేదు. బాధితులు మూడున్నరేళ్లపాటు పోరాటం చేసినప్పటికీ టీడీపీ ప్రభుత్వం పైసా సాయం చేయలేదు. అయినా ఈనాడు రామోజీరావు ఏనాడూ ప్రశ్నించలేదు. ఒక్క ముక్కా రాయలేదు. బాధితులపై సానుభూతీ చూపలేదు. బాధితులను ఆదుకున్న సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడుతూ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు రెండు దశల్లో రూ.929.75 కోట్లు చెల్లించారు. 10.37లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకున్నారు. రాష్ట్రంలో 11,57,497 మంది డిపాజిటర్లు అగ్రిగోల్డ్ సంస్థలో రూ.3,944.70కోట్లు డిపాజిట్ చేశారు. వారిలో రూ.10వేలు లోపు డిపాజిట్ చేసినవారికి మొదటి విడతలో, రూ.20వేలు లోపు డిపాజిట్ చేసినవారికి రెండో విడతలో ప్రభుత్వం వారి డిపాజిట్ మొత్తాలను చెల్లించింది. మిగిలిన వారికి కూడా డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అయితే, న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాలు అడ్డంకిగా మారాయి. ఈ సమస్యల పరిష్కారానికి జగన్ ప్రభుత్వం కార్యాచరణను వేగవంతం చేసింది. సీఐడీ అటాచ్ చేసిన ఆ సంస్థ భూములను వేలం ద్వారా విక్రయించి, బాధితులకు చెల్లించడానికి వేగంగా చర్యలు చేపట్టింది. అందుకోసం ఏలూరు ప్రత్యేక న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ అటాచ్ చేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను ఈడీ కూడా తరువాత అటాచ్ చేయడంతో న్యాయపరమైన సమస్యలు తలెత్తాయి. సీఐడీ అటాచ్ చేసిన ఆస్తులను ఈడీ అటాచ్ చేయడానికి వీల్లేదని ప్రభుత్వం న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లింది. దీనిపై ప్రస్తుతం న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. న్యాయపరమైన అడ్డంకులు తొలగిన వెంటనే ఆస్తులు వేలం వేసి మిగిలిన బాధితులకు డిపాజిట్ మొత్తం చెల్లించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. వీటిపై ఏనాడూ ప్రశ్నించని రామోజీ ♦ నాడు అగ్రిగోల్డ్ యాజమాన్యానికి కొమ్ముకాసిన చంద్రబాబు ♦ దేశంలో అలా చేసిన మొదటి పాలకుడు సీఎం జగన్ ♦ రెండు విడతల్లో 10.37 లక్షల మందికి రూ.929.75 కోట్లు చెల్లింపు ♦ హాయ్‌ల్యాండ్‌తో సహా ఆ సంస్థ ఆస్తులు కొట్టేసేందుకుకుతంత్రం ♦ బాధితులు రోడ్డెక్కినా కనికరించనిటీడీపీ ప్రభుత్వం ♦ ప్రత్తిపాటి పుల్లారావు భార్య పేరుతో 14 ఎకరాలు కొనుగోలు ♦ న్యాయ ప్రక్రియ పూర్తికాగానే మిగిలినవారికీ చెల్లింపునకు సన్నాహాలు ప్రైవేటు సంస్థ బాధితులకు అండగా నిలిచింది దేశంలో జగనే ఓ ప్రైవేటు సంస్థ డిపాజిటర్లను మోసం చేస్తే బాధితులను ఆదుకున్న చరిత్ర దేశంలో ఎక్కడా లేదు. ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే చేసి చూపించారు. దేశంలోని మిగతా ప్రభుత్వాలకు దిశానిర్దేశం చేశారు. అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో 19,18,865 మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380.29 కోట్లు వసూలు చేసి, వారందరినీ నిలువునా ముంచింది. ఏ ఒక్క రాష్ట్రం కూడా అగ్రిగోల్డ్ బాధితుల గోడును పట్టించుకోలేదు. రాష్ట్రంలో 2019 వరకు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వంలోని పెద్దలు అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను చేజిక్కించుకునేందుకు యత్నించారు తప్ప, బాధితులకు అండగా నిలవాలని మాత్రం భావించ లేదు. కానీ, ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీకి కట్టుబడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచారు. అయినా ఈనాడు రామోజీరావుకు కంటగింపుగానే ఉంది. జగన్మోహన్రెడ్డి చేసిన మంచి ప్రచారంలోకి వస్తే.. చంద్రబాబు చేసిన చెడు ప్రజలకు మరింతగా గుర్తుకు వస్తుందన్నదే ఆయన ఆందోళన. అందుకే అగ్రిగోల్డ్ బాధితులపై అన్యాయమంటూ రామోజీ మొసలి కన్నీరు కార్చారు. -
అగ్రిగోల్డ్ కేసు: తాజాగా వెలుగులోకి సంచలనాత్మక అంశాలు
సాక్షి, హైదరాబాద్: అనేక రాష్ట్రాల్లో బినామీ పేర్ల మీద భూములు, ఇతరత్రా ఆస్తులు కూడబెట్టిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో అనేక సంచలనాత్మక అం శాలు వెలుగులోకి వస్తున్నాయి. అగ్రిగోల్డ్ పెద్దలు అనేక సంస్థల పేరిట వేల ఎకరాలు కొనుగోలు చేసి వాటిని మూడోకంటికి తెలియకుండా అమ్మకం సాగిస్తున్నారన్న అంశాన్ని ప్రస్తుతం సీఐడీ అధికారులు వెలుగులోకి తీసుకువచ్చినట్టు తెలిసింది. అంతేగాకుండా బినామీ కంపెనీల ఆస్తులను జప్తు చేయకుండా ఉండేందుకు గతంలో దర్యాప్తు అధికారులుగా వ్యవహరించిన వారితోపాటు సీనియర్ అధికారులకు భారీగా ముడుపులు ముట్టజెప్పినట్లు దర్యాప్తులో బయటపడ్డట్టు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై సీఎం కార్యాలయానికి సైతం నివేదిక చేరినట్టు తెలుస్తోంది. 76 ఎకరాలు అటాచ్ చేయకుండా.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో 76 ఎకరాల అగ్రిగోల్డ్ బినామీ ఆస్తులను అటాచ్ చేయకుండా ఉం డటంతోపాటు మరో 156 ఎకరాల బదలాయింపు పై అగ్రిగోల్డ్ నిందితులు, మ«ధ్యవర్తులు, సీఐడీ అధికారుల మధ్య రూ.3 కోట్ల డీల్ కుదిరినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు సీఐడీలోని కీలక అధికారులకు కోటి రూపాయలు అడ్వాన్స్‌గా ముట్టినట్టుగా తాజా దర్యాప్తులో బయటపడినట్టు విశ్వసనీయంగా తెలిసింది. మిగిలిన రూ.2 కోట్ల వ్యవహారంలో మధ్యవర్తులు, అగ్రిగోల్డ్ పెద్దల నడుమ తేడాలు రావడంతో సంబంధిత అధికారులకు ఆ డబ్బు చేరలేదన్న అంశం కూడా వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పోలీస్ పెద్దలకు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ జరుపుతున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి. దర్యాప్తు అధికారుల మార్పు ఇందుకే..! తాజా పరిణామాలతో అగ్రిగోల్డ్ కేసులో దర్యాప్తు అధికారుల మార్పిడికి కారణం ఏమిటో తెలిసిందని అంటున్నారు. బాధిత కుటుంబాలకు న్యాయం చే యాల్సింది పోయి, కొంతమంది అధికారులు ము డుపులకు కక్కుర్తి పడి నిందితులతో చేతులు కలిపినట్టు ఆరోపణలు వచ్చాయని, ఈ కారణంగానే దర్యాప్తు అధికారులను మార్చి తాజాగా కేసును పునర్విచారణ చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లు! బినామీ ఆస్తులను మూడో కంటికి తెలియకుండా చేతులు మార్చిన వ్యవహారంలో అగ్రిగోల్డ్ పెద్దలే రింగ్ లీడర్లుగా ఉన్నారని సీఐడీ గుర్తించింది. బినామీ ఆస్తుల అటాచ్మెంట్ వ్యవహారంపై సీఐడీ అధికారులు నిందితులను ఇటీవల విచారించగా అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. బినామీ ఆస్తుల అమ్మకానికి.. కంపెనీలకు ఎలాంటి సంబంధం లేని మహబూబ్‌నగర్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో పాటు మాజీ పోలీస్ కానిస్టేబుల్‌ను మధ్యవర్తులుగా పెట్టుకున్నట్టు సీఐడీ గుర్తించింది. ఆయా భూములు అమ్మేందుకు సంబంధిత బినామీ కంపెనీల డైరెక్టర్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్‌కు పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చారు. ఈ క్రమంలో 2016లో 76 ఎకరాలను ఓ రియల్ ఎస్టేట్ కంపెనీతో పాటు మాజీ కానిస్టేబుల్‌కు సంబంధిత బ్రోకర్ అమ్మేశాడు. ఈ వ్యవహారంపై విచారణ సాగించాల్సిన, ఆ భూములను అటాచ్ చేయాల్సిన అప్పటి సీఐడీ అధికారులు నిర్లక్ష్యం వహించినట్టు తాజా విచారణలో బయటపడింది. అగ్రిగోల్డ్ పెద్దలు జైలు నుంచే సంబంధిత కంపెనీల డైరెక్టర్ల ద్వారా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌తో మంతనాలు సాగించి 76 ఎకరాల భూమిని అమ్మించినట్టు గుర్తించారు. ఇలాంటి లావాదేవీలు బయటకురాకుండా చేయడంతో పాటు ఆస్తుల అటాచ్‌మెంట్‌ను అప్పటి అధికారులు తొక్కిపెట్టినట్టు ప్రస్తుతం ఆరోపణలు వస్తున్నాయి. -
అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమిస్తాం: చాడ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. హిమాయత్‌నగర్‌లో మఖ్దూంభవన్‌లో భాగం హేమంతరావు అధ్యక్షతన గురువారం జరిగిన అగ్రిగోల్డ్ బాధితులు సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ సంస్థ మూతబడి ఏడేళ్లు కావస్తున్నా తెలంగాణలో బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. -
అగ్రి గోల్డ్ ఆస్తుల బహిరంగ వేలం
-
‘అగ్రిగోల్డ్ ఆస్తులు కొల్లగొట్టేందుకు చంద్రబాబు యత్నించారు’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు, టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో నీచ రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మధురనగర్‌లో అగ్రిగోల్డ్ బాధితులు సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాటు కార్పొరేటర్ జానరెడ్డి, అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు అగ్రిగోల్డ్ ఆస్తులను దోచుకోవాలని ప్రయత్నాలు చేశాడని అన్నారు. సీఎం వైఎస్ జగన్ పరిపాలనలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగిందని తెలిపారు. 2014 నుంచి 2019లో టీడీపీ ప్రభుత్వం అమరావతి పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. చదవండి: Andhra Pradesh: రూ.వెయ్యి కోట్లతో ప్లైవుడ్ యూనిట్ టీడీపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులకు ఇచ్చిన మాట నెరవేర్చారని, గ్రామ సచివాలయం ద్వారా సీఎం జగన్ అగ్రిగోల్డ్ బాధితులను గుర్తించారని తెలిపారు. రాష్ట్రంలో సీఎం జగన్ పేదరికం నిర్మూలన చేస్తున్నారని తెలిపారు. నాడు-నేడు ద్వారా విజయవాడ నగర అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై చంద్రబాబు చేస్తున్న విమర్శలు సరికాదన్నారు. -
‘మేము మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం చరిత్ర’
సాక్షి, తాడేపల్లి: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటామని ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రెండో విడత డబ్బులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లా నుంచి చంద్రశేఖర్ రావు అనే వాచ్మెకానిక్ మాట్లాడుతూ.. ‘‘ఐదు సంవత్సరాల పాటు అగ్రిగోల్డ్ కంపెనీలో రోజుకు 40 రూపాయల చొప్పున 18,500 కట్టాను. 2016లో సంస్థను ఎత్తేశారని తెలిసి ఎంతో బాధపడ్డాను. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగలేదు. మీరు పాదయాత్రలో మాకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దానిలో భాగంగానే మొదటివిడతలో పదివేల రూపాయలలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. రెండో విడతలో భాగంగా 20వేల రూపాయలోపు బాధితులమైన మాకు ఈ రోజు డబ్బులు ఇచ్చారు’’ అని తెలిపారు. ‘‘దీని గురించి వలంటీర్లు మా ఇంటికి వచ్చి.. వివరాలు తెలుసుకుని.. దగ్గరుండి అప్లికేషన్ నింపారు. ఆన్లైన్లో అప్లై చేశారు. ఈ నెల 24 న డబ్బులు వస్తాయని చెప్పారు. మమ్మల్ని ఆదుకున్నందుకు చాలా సంతోషం. ప్రైవేట్ కంపెనీలో డబ్బులు పెట్టి.. మోసపోతే.. ప్రభుత్వం ఆదుకోవడం నిజంగా చరిత్రే. పోయాయనుకున్న డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. మీలాంటి సీఎం ఉన్నందుకు గర్వపడుతున్నాను’’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు. గుంటూరు నుంచి ఉషా రాణి మాట్లాడుతూ.. ‘‘నా భర్త డెలివరీ బాయ్‌గా పని చేసేవారు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయాలని భావించి.. అగ్రిగోల్డ్‌లో నెలనెల పొదుపు చేశాం. కానీ 2016లో కంపెనీని ఎత్తేశారని తెలిసి మా కష్టం బూడిదలో పోసిన పన్నీరయ్యిందని బాధపడ్డాం. మా డబ్బులు తిరిగి ఇప్పించాల్సిందిగా గత ప్రభుత్వాలను అభ్యర్థించాం. మీకోసం కార్యక్రమంలో అప్లికేషన్ పెట్టినా లాభం లేదు. ఏడాదిన్నర పాటు నేను ఒక్కదానే ఆఫీసుల చుట్టూ తిరిగాను. ఆ బాధలు వర్ణించలేను. పాదయాత్రలో మీరు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానని మాట ఇచ్చారు. దాని ప్రకారమే మొదటి విడతలో పది వేల రూపాలయలోపు బాధితులకు డబ్బులు ఇచ్చారు. దాంతో నాకు నమ్మకం కలిగింది’’ అన్నారు. ‘‘ఈరోజు రెండో విడతలో భాగంగా 20 వేల రూపాలయ లోపు లబ్ధిదారుల ఖాతాలో డబ్బులు జమ చేశారు. నేను 15 వేల రూపాయలు కట్టాను. నా కష్టార్జితం తిరిగి వస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఇద్దరుపిల్లలు. వారికి అమ్మ ఒడి, విద్యా కానుకు ఇలా అన్ని పథకాలు అందుతున్నాయి. నాడు-నేడులో భాగంగా స్కూళ్ల రూపురేఖలు మార్చారు. ఇప్పుడవి గవర్నమెంట్ బడుల్లా లేవు.. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే రీతిలో ఉన్నాయి. వలంటీర్లు ఇంటి దగ్గరకే వచ్చి అన్ని ఇస్తుండటంతో ఎంతో మేలు జరగుతుంది. మా ఆయనకు తెలియకుండా పెట్టిన డబ్బులు పొగొట్టుకుని.. ఎంత బాధపడ్డానే నాకే తెలుసు. ఓ అన్నలా మీరు నాకు తోడుండి.. నా డబ్బులు నాకు తిరిగి ఇస్తున్నారు. మీరు తండ్రిని మించిన తనయుడిగా నిలిచారు’’ అంటూ కృతజ్ఞతలు తెలిపింది. కర్నూలు నుంచి చిరువ్యాపారం చేసుకునే విశాలాక్షి మాట్లాడుతూ.. ‘‘వాళ్లు, వీళ్లు చెప్పిన మాటలు విని అగ్రిగోల్డ్ సంస్థలో నెలకు ఐదు వందల రూపాయల చొప్పున 11,500 రూపాయలు దాచుకున్నాను. 2016లో అగ్రిగోల్డ్ సంస్థ ఎత్తేశారని తెలిసి చాలా బాధపడ్డాను. డబ్బులు తిరిగి వస్తాయా రావా అని ఆందోళన పడ్డాను. చంద్రబాబు ప్రభుత్వంలో దీని గురించి ఎన్ని అభ్యర్థనలు చేసినా ఫలితం లేదు. ఇక డబ్బులు రావని ఆశలు వదిలేసుకున్నాను. ఆ సమయంలో మీరు పాదయాత్రలో మా సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అప్పుడు అగ్రిగోల్డ్ సమస్య గురించి మీకు విన్నవించుకున్నాం’’ అన్నారు. ‘‘అధికారంలోకి వచ్చాకా మీరు వలంటీర్లను పంపి మా వివరాలను తెలుసుకుని.. మా డబ్బులు మాకు తిరగి ఇప్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. దీన్ని ఈ రాఖీ పండుగకు మీరు నాకు ఇచ్చిన కానుకగా భావిస్తున్నాను. డబ్బులు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. మన ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకం నాకు అందుతుంది. ఏ ప్రభుత్వం ప్రజల సమస్యల గురించి ఇంతలా ఆలోచించలేదు. మీరే ఎప్పటికి సీఎంగా ఉండాలి అని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
AgriGold: 300 మంది ఆత్మహత్యలకు చంద్రబాబే కారణం
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలోనే అగ్రిగోల్డ్ వ్యవస్థ పుట్టిందని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషు పేర్కొన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే అగ్రిగోల్డ్ బాధితులకు శఠగోపం పెట్టారని తెలిపారు. సోమవారం ఏర్పాటుచేసిన ఓ సమావేవంలో ఆయన మాట్లాడారు.. 300 మంది అగ్రిగోల్డ్ బాధితుల ఆత్మహత్యలకు చంద్రబాబే కారణమని చెప్పారు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడే వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు భరోసా ఇచ్చారని గుర్తుచేశారు. -
Andhra Pradesh: సంస్కరణలతో విద్యావిప్లవం
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలపడమే లక్ష్యంగా విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచి ఉత్తమ విద్యార్థులుగా, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బృహత్తర బాధ్యతను ప్రభుత్వం తన భుజస్కందాలపై వేసుకుంది. విద్యాపరంగా, వ్యవస్థాపరంగా పెను మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థను ఆరు రకాలుగా వర్గీకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని శుక్రవారం వెలగపూడిలోని సచివాలయంలో నిర్వహించారు. సమావేశంలో పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. 2021–22కిగాను ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు ఆగస్టు 10న ఆర్థిక సహాయం అందించనున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో దశ నగదు చెల్లింపులను మంత్రివర్గం ఆమోదించింది. అభ్యంతరంలేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల క్రమబద్ధీకరణకు ఆమోదం తెలిపింది. బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్‌లను ఆమోదించింది. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. మంత్రివర్గం సమావేశం వివరాలను రవాణా, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు ఇవీ.. రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విద్యావేత్తలతో చర్చించి సంస్కరణలు.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల అభ్యసన స్థాయిలపై ప్రభుత్వం వివిధ సర్వేలను నిర్వహించింది. విద్యావేత్తలతో చర్చించి విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న అంగన్వాడీ కేంద్రాలు, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల విధానంలో సంస్కరణలు తెస్తూ ఆరు రకాలుగా వర్గీకరించింది. ►శాటిలైట్ ఫౌండేషన్ స్కూల్స్: ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 ►ఫౌండేషన్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1, ప్రీప్రైమరీ 2 లతోపాటు ఒకటి, రెండో తరగతులు ►ఫౌండేషన్ ప్లస్ స్కూల్స్ : ప్రీప్రైమరీ 1 నుంచి ఐదో తరగతి వరకు ►ప్రీ హైస్కూల్స్: మూడో తరగతి నుంచి ఏడు (లేదా) ఎనిమిదో తరగతి వరకు ►హై స్కూల్స్ : మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు ►హై స్కూల్ ప్లస్ స్కూల్స్: మూడో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ విద్యా సంస్థలకు మహర్దశ ఈ ఏడాది జగనన్న విద్యా కానుక పథకం అమలుకు మంత్రివర్గం ఆమోదించింది. విద్యాకానుక, మనబడి, నాడు– నేడు ద్వారా ఇప్పటికే విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న కార్యక్రమాలు సత్ఫలితాలనిస్తున్నాయని మంత్రివర్గం పేర్కొంది. ప్రభుత్వ విద్యాసంస్థల దశ, దిశ మారుతోందని తెలిపింది. పాఠశాలలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు నాడు – నేడు తొలి విడత కోసం రూ.3,669 కోట్లను ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది. ఈ పనుల కోసం మొత్తం రూ.16,021.67 కోట్లు వెచ్చించనుంది. తద్వారా కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూళ్లను తీర్చిదిద్దనుంది. 10న ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం కింద ఆగస్టు 10న అర్హులైన నేతన్నల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. సొంత మగ్గం ఉన్న అర్హులైన చేనేత కార్మికుల కుటుంబాలకు రూ.24 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అందుకోసం బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించింది. అగ్రిగోల్డ్ బాధితులకు రెండో విడత చెల్లింపులు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది. రెండో దశ చెల్లింపులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.10 వేల నుంచి రూ.20 వేల లోపు డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 5 వరకూ అందిన వివరాల ప్రకారం నాలుగు లక్షల మంది డిపాజిట్‌దారులకు ప్రభుత్వం దాదాపు రూ.511 కోట్లు చెల్లించనుంది. రూ.10 వేల లోపు డిపాజిట్‌దారులు 3.4 లక్షల మందికి గతంలోనే రూ.238.7 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆక్రమణల క్రమబద్ధీకరణ ఇలా.. అభ్యంతరాలు లేని ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను క్రమబద్ధీకరించేందుకు మంత్రివర్గం ఆమోదించింది. 300 చ.గజాల వరకు అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాలను క్రమబద్ధీకరించేందుకు విధి విధానాలు ఇలా ఉన్నాయి... ►ఉత్తర్వులు వెలువడిన నాటి నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది. ►2019 అక్టోబరు 15 నాటి వరకూ ఉన్న వాటిని క్రమబద్ధీకరిస్తారు. ►75 చ. గజాల వరకు భూమి బేసిక్ వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. లబ్ధిదారుడు కేటగిరీ–1కు చెందినవారైతే ఉచితంగా పట్టా, డి ఫారం పట్టా పంపిణీ చేస్తారు. ►75 నుంచి 150 చ.గజాల వరకూ భూమి బేసిక్‌వాల్యూలో 75 శాతం రుసుము చెల్లించాలి. ►150 నుంచి 300 చ.గజాల వరకూ భూమి బేసిక్ వాల్యూలో 100 శాతం రుసుము వసూలు చేస్తారు. ►మాస్టర్ ప్లాన్, జోనల్ డెవలప్మెంట్, రోడ్ డెవలప్మెంట్ ప్లాన్‌లో ప్రభావితమైన భూములకు ఈ క్రమబద్ధీకరణ వర్తించదు. ►అప్రూవ్డ్ లే అవుట్లలోని నిర్మాణాలకు వర్తించదు. అసైన్డ్ చట్టంలో సవరణలు.. అసైన్డ్ చట్టం–1977(పీవోటీ)లో సవరణలను మంత్రివర్గం ఆమోదించింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున అందుతున్న విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. చట్టంలోని సెక్షన్ 3(2ఎ), సెక్షన్ 3(2బీ) సవరించేందుకు ఆమోదం తెలిపింది. ►అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇల్లు విక్రయానికి ప్రస్తుతం ఉన్న గడువు 20 ఏళ్ల నుంచి పదేళ్లకు తగ్గించారు. ►సవరించిన చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని ఎవరైనా విక్రయిస్తే వాటిని ఆమోదిస్తారు. ►చట్టం అమలులోకి వచ్చేనాటికి అసైన్డ్ ఇంటి స్థలం/అసైన్డ్ ఇంటిని అమ్మాలని అనుకుంటే నిర్దేశించిన రుసుములను అనుసరించి అనుమతులు ఇస్తారు. ప్రైవేట్ భూమి తీసుకుంటే బదులుగా మరోచోట.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు స్థలాల కొరత సమస్య తీర్చేందుకు మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రైవేట్ భూమి తీసుకుని బదులుగా మరోచోట ప్రభుత్వ భూమి ఇవ్వాలని నిర్ణయించింది. ప్రాధాన్యత క్రమంలో గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భవనాలు నిర్మిస్తారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీలు, అంగన్వాడీ కేంద్రాలు, విత్తన అభివృద్ధి కేంద్రాలు, మల్లీ ఫెసిలిటీ కేంద్రాలు, 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాలు మొదలైన వాటికి భూములు సేకరించి అవసరమైన నిర్మాణాలు చేపడతారు. నిర్దేశిత సమయంలో నిర్మాణాలను పూర్తి చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు పోర్టుల రివైజ్డ్ డీపీఆర్‌లకు ఆమోదం బందరు, భావనపాడు పోర్టుల రివైజ్డ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లను మంత్రివర్గం ఆమోదించింది. రూ.5,155.73 కోట్లతో బందరు పోర్టు రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. 36 నెలల్లో పోర్టు నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. భావనపాడు పోర్టు మొదటి దశ కోసం రూ.4,361.90 కోట్లతో రివైజ్డ్ డీపీఆర్ రూపొందించారు. భూసేకరణ, పోర్టు మొదటి దశ నిర్మాణాన్ని 30 నెలల్లో పూర్తి చేయాలని నిర్దేశించారు. కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్లు రాష్ట్రంలో కొత్తగా నాలుగు ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి మంత్రివర్గం పరిపాలన అనుమతులు జారీ చేసింది. బుడగట్లపాలెం (శ్రీకాకుళం), పూడిమడక(విశాఖపట్నం), బియ్యపుతిప్ప(పశ్చిమ గోదావరి), కొత్తపట్నం(ప్రకాశం)లలో ఈ ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తారు. అందుకోసం రూ.1,720.61 కోట్లతో డీపీఆర్‌ను ఆమోదించారు. స్వచ్ఛతకు ‘క్లాప్’ ‘క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమాన్ని మంత్రివర్గం ఆమోదించింది. ఇళ్ల వద్ద నుంచి చెత్త సేకరించి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాలను నిర్వహిస్తారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు చేపడతారు. పోలవరం నిర్వాసితులకు అదనంగా రూ.550 కోట్లు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రభుత్వం దాదాపు రూ.550 కోట్లు అదనంగా ఖర్చు చేయనుంది. గతంలో నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ‘రుడా’ ఏర్పాటు రాజమహేంద్రవర్గం పట్టణాభివృద్ధి సంస్థ (రుడా)ను ఏర్పాటు చేస్తూ మంత్రివర్గం తీర్మానించింది. రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్‌తోపాటు కొవ్వూరు, నిడదవోలు, గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ, ఏలూరు పట్టణాభివృద్ధి సంస్థలోని కొంత భాగాన్ని రుడా పరిధిలోకి తెచ్చారు. మొత్తం 3 పట్టణ స్థానిక సంస్థలు, 17 మండలాలు, 207 గ్రామాలతో 1,566.44 చ.కి.మీ. పరిధితో ‘రుడా’ ఏర్పాటు చేశారు. గోదావరి పట్టణాభివృద్ధి సంస్థ పేరును కాకినాడ పట్టణాభివృద్ధి సంస్థ(కుడా)గా మార్చారు. మొత్తం 1,236.42 చ.కి.మీ. పరిధిలోని కుడాలో 5 పట్టణ స్థానిక సంస్థలు, 15 మండలాలు, 172 గ్రామాలు ఉన్నాయి. ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలు పెంపు రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్(ఏపీజీడీసీ)లో ప్రభుత్వ రంగ సంస్థలు ఏపీఐఐసీ, ఏపీఎంబీ వాటాలను గణనీయంగా పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. వాటి వాటాను 50 నుంచి 74 శాతానికి పెంచేందుకు ఆమోదముద్ర వేసింది. ►నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి టెక్నో ఎకనామిక్ ఫీజ్‌బిలిటీ అధ్యయన నివేదికకు ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ హిందూ రెలిజియస్ ఇనిస్టిట్యూషన్స్, ఎండోమెంట్ యాక్ట్ 1987లో సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీకి మంత్రివర్గం ఆమోదం. టీటీడీ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల అభివృద్ది, అర్చకుల సంక్షేమం కోసం చర్యలు తీసుకునేందుకు ఈ ఆర్డినెన్స్ రూపొందించారు. ►ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదం. ఈ మేరకు చట్ట సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ జారీ కానుంది. ►చిత్తూరు జిల్లా పుంగనూరు రవాణా శాఖ కార్యాలయంలో ఒక మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్, సీనియర్ /జూనియర్ అసిస్టెంట్లు, ముగ్గురు హోంగార్డు పోస్టుల మంజూరు. ►ఈ నెల 13న ప్రదానం చేయనున్న వైఎస్సార్ లైఫ్‌టైం ఎఛీవ్మెంట్ అవార్డులకు మంత్రివర్గం ఆమోదం. ►రాష్ట్ర హైకోర్టు అభిప్రాయం మేరకు హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలుకు తరలించాలని నిర్ణయం. ►హైకోర్టు అభిప్రాయాల మేరకే రాష్ట్ర మావన హక్కుల సంఘం కార్యాలయాన్ని కూడా కర్నూలుకు తరలించాలని నిర్ణయం. మానవహక్కుల సంఘం కార్యాలయంలో కార్యదర్శి, డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –జ్యుడిషియల్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, పీఆర్వో పోస్టులకు మంత్రివర్గం ఆమోదం. ►ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తలో రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్, డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్, అసిస్టెంట్ రిజిస్ట్రార్–జ్యుడిషియల్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ –అక్కౌంట్స్, లోకాయుక్త, ఉపలోకాయుక్త, రిజిస్ట్రార్లకు పీఏలు, అక్కౌంట్స్ ఆఫీసర్, లైబ్రేరియన్, మోటార్‌సైకిల్ మెసెంజర్ పోస్టుల మంజూరు. ►గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు ఆమోదం. ►రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్– 2021కి మంత్రివర్గం ఆమోదం. ►మత్స్య ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ఉత్పత్తిలో 30 శాతం స్థానికంగానే వినియోగించేందుకు తగిన మౌలిక సదుపాయాల కల్పన. ప్రీ ప్రాసెసింగ్ యూనిట్లు, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఆక్వాహబ్‌లు, వీటికి అనుబంధంగా రిటైల్ దుకాణాల ఏర్పాటు. ►పశు సంవర్థకశాఖలో 19 ల్యాబ్ టెక్నీషియన్, 8 ల్యాబ్ అటెండెంట్ల పోస్టుల మంజూరు. కాంట్రాక్టు పద్ధతిలో టెక్నీషియన్లను, అవుట్ సోర్సింగ్‌పై అటెండెంట్లను నియమిస్తారు. ►రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం. ఉద్యానవన పంటల సాగు చట్ట సవరణకు ఆమోదం. ఖరీఫ్‌లో ఇప్పటిదాకా 42.27 లక్షల ఎకరాల్లో సాగు రాష్ట్రంలో ఖరీఫ్ సాగు, పంటల పరిస్థితుల వివరాలను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 42.27 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. రాష్ట్రవ్యాప్తంగా సాధారణ వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో లోటు వర్షపాతం ఉంది. వైఎస్సార్ జిల్లాలో 70.2 శాతం, అనంతపురం జిల్లాలో 65.6 శాతం, కర్నూలు జిల్లాలో 25.5 శాతం, చిత్తూరు జిల్లాలో 58.6 శాతం అధికంగా వర్షపాతం నమోదైంది. అగ్రికల్చర్ అడ్వైజరీ సమావేశాలు, పంటల ప్రణాళికను అధికారులు మంత్రివర్గానికి వివరించారు. రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులు, ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలు, వ్యాక్సినేషన్ వివరాలను వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలియచేశారు. -
ఏపీ కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే..
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆగస్టులో అమలు చేయనున్న నవరత్నాల పథకాలతో పాటు పలు అంశాల అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దానిలో భాగంగా 2021-22 ఏడాది వైఎస్ఆర్ నేతన్న నేస్తం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సొంత మగ్గంపై నేసే కార్మిక కుటుంబాలకు 24 వేల రూపాయల చొప్పున ఆర్థికసాయం ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను బడ్జెట్లో రూ.199 కోట్లు కేటాయించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు పరిహారం చెల్లింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 20 వేల రూపాయల డిపాజిట్‌దారులకు ఆగస్టు 24న పరిహారం పంపిణీ చేయడానికి అంగీకరించింది. ఈ క్రమంలో ప్రభుత్వం 4 లక్షల మందికి సుమారు రూ.500 కోట్లు ఇవ్వనుంది. రూ.10 వేలలోపు 3.4 లక్షలమంది డిపాజిట్‌దారులకు ఇప్పటికే పంపిణీ చేసింది. కేబినెట్ ఆమోదించిన అంశాలు ఇవే.. ►క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమానికి కేబినెట్ ఆమోదం. ►జగనన్న స్వచ్ఛ సంకల్పం కింద.. అర్బన్, రూరల్ ప్రాంతాల్లో 100 రోజులపాటు చైతన్య కార్యక్రమాలు. ►ఇంటింటికీ చెత్త సేకరణ విధానం, పూర్తి శాస్త్రీయ పద్ధతుల్లో వ్యర్థాల నిర్వహణ. ►రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు. ►ఇకపై కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ►అభ్యంతరం లేని ప్రభుత్వ స్థలాల్లోని ఆక్రమణల క్రమబద్ధీకరణ. ►అనధికారికంగా ఏర్పాటు చేసుకున్న ఆవాసాల క్రమబద్ధీకరణకు ఆమోదం. ►1977నాటి ఏపీ అసైన్డ్, భూముల చట్టం.. చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. ►మచిలీపట్నం పోర్టు నిర్మాణం కోసం రివైజ్డ్ డీపీఆర్‌కు కేబినెట్ ఆమోదం. ►శ్రీకాకుళం జిల్లా భావనపాడు పోర్ట్ రివైజ్డ్ డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం. ►ఏపీఐఐసీ, ఏపీఎంబీల వాటాలు 50 నుంచి 74 శాతం పెంపునకు ఆమోదం. ►ఫిషింగ్ హార్బర్ల నిర్మాణానికి పరిపాలనాపరమైన అనుమతులకు ఆమోదం. ►నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద పీపీపీ పద్ధతిలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి... టెక్నో ఎకనామిక్ ఫీజుబిలిటీ స్టడీ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం. ►ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం. ►పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అదనంగా రూ.10 లక్షల ప్యాకేజీకి ఆమోదం. ఇందుకోసం సుమారు రూ. 550 కోట్లు కేటాయించింది. ►ఈనెల 13న వైఎస్ఆర్ లైఫ్‌టైం ఎచీవ్మెంట్ అవార్డులకు కేబినెట్ ఆమోదం. ►హైకోర్టు ఆదేశానుసారం ఏపీలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్ కార్యాలయాలు, హైదరాబాద్‌లో ఉన్న లోకాయుక్త కార్యాలయాన్ని కర్నూలు తరలించాలని నిర్ణయం. ►రాష్ట్ర మానవహక్కుల సంఘం కార్యాలయాన్నీ కర్నూలుకు తరలించాలని నిర్ణయం. ►గ్రామ, వార్డు సచివాలయాల శాఖలో డైరెక్టర్ పోస్టు మంజూరుకు కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో పశు సంపదను పెంచేందుకు.. ఆంధ్రప్రదేశ్ బొవైనీ బ్రీడింగ్ ఆర్డినెన్స్- 2021కి కేబినెట్ ఆమోదం. ►రాష్ట్రంలో మత్స్య ఉత్పత్తుల పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. ►రైతు భరోసా కేంద్రాల్లో విత్తన ఉత్పత్తి పాలసీ ప్రతిపాదనలకు ఆమోదం. ►ఉద్యాన పంటల సాగుకు సంబంధించి చట్టసవరణకు కేబినెట్ ఆమోదం. ఇక్కడ చదవండి: ఏపీ కేబినెట్: ప్రాథమిక దశలోనే మంచి విద్య అందించేలా విప్లవాత్మక చర్యలు -
అగ్రిగోల్డ్ బాధితులకు ఆగస్టు 24న డబ్బులు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు ఊరట కల్పిస్తూ రూ.20 వేలలోపు డిపాజిట్ చేసిన వారికి ఆగస్టు 24వ తేదీన డబ్బులు చెల్లించనున్నట్లు సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు చెల్లించిన విషయం తెలిసిందే. ‘స్పందన’లో భాగంగా సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆగస్టులో చేపట్టనున్న కార్యక్రమాలను ప్రకటించడంతో పాటు కోవిడ్, ఉపాధి హామీ పనులు, వైఎస్సార్ అర్బన్ క్లినిక్స్, గృహ నిర్మాణం, ఇళ్ల స్థలాల పంపిణీ తదితర అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి (వైద్య ఆరోగ్యశాఖ) ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్ అడ్మినిస్టేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, గృహనిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, పట్టణాభివృద్ధి, పురపాలకశాఖ స్పెషల్ సీఎస్ వై శ్రీలక్ష్మి, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి ఉషారాణి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి(హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ పాల్గొన్నారు. సమీక్షలో ముఖ్యాంశాలు ఇవీ.. ఇళ్ల నిర్మాణ పనులపై సమీక్ష మొదటి విడతలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టాం. ఇందులో 10.01 లక్షల ఇళ్ల పనులు ప్రారంభం అయ్యాయి. లే అవుట్లలో నీరు, కరెంట్ చాలావరకూ కల్పించారు. మిగిలిపోయిన సుమారు 600కిపైగా లే అవుట్లలో నీటి వసతిని కల్పించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్న ఆప్షన్‌ను 3.18 లక్షల మంది ఎంచుకున్నారు. వీరిలో 20 మందితో ఒక గ్రూపు ఏర్పాటు చేయాలి. స్థానికంగా మేస్త్రీలను గుర్తించి పనులను ఆ గ్రూపులకు అనుసంధానం చేయాలి. ఆగస్టు 10 కల్లా గ్రూపుల ఏర్పాటు పూర్తికావాలి. వర్షాలు ప్రారంభమైనందున ఇసుక పంపిణీలో అవాంతరాలు లేకుండా చూసుకోవాలి. ఇళ్ల నిర్మాణం ద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది. టిడ్కో ఇళ్లకు అనర్హులైన వారి స్థానంలో కొత్త లబ్ధిదారులను ఎంపిక చేయాలి. వచ్చే స్పందన లోగా ఈ పని పూర్తి కావాలి. ఇక ముందూ ఫోకస్డ్గా టెస్టులు ఇక ముందూ ఫోకస్డ్గా కోవిడ్ టెస్టులు జరగాలి. లక్షణాలు ఉన్నవారికి పరీక్షలు చేయాలి. ఎవరైనా కోరితే వారికి కూడా పరీక్షలు చేయాలి. ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలి. థర్డ్‌వేవ్ వస్తుందో లేదో తెలియదు కానీ మనం అప్రమత్తంగా ఉండాలి. మందులు, బయోమెడికల్ ఎక్విప్మెంట్లను సిద్ధం చేసుకోవాలి. వ్యాక్సినేషన్ రాష్ట్రంలో 1.53 కోట్ల మందికి ఇప్పటివరకూ ఒక డోసు వాక్సిన్ ఇచ్చాం. దాదాపు 7 కోట్ల డోసులు అవసరం ఉంటే 1.53 కోట్ల డోసులు వేశాం. వ్యాక్సినేషన్ విషయంలో ఇంకా మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. 45 ఏళ్లకు పైబడ్డ వారికి 75.89 శాతం మందికి వ్యాక్సిన్ ఇచ్చాం. దీన్ని 90 శాతం వరకూ తీసుకెళ్లాలి. తర్వాత మిగిలిన ప్రాధాన్యతా వర్గాలకు వ్యాక్సిన్లు ఇవ్వాలి. టీచర్లు, గర్భిణులు, కాలేజీ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతం ఉంది. రెండో వేవ్‌లో కొన్ని జిల్లాల్లో 25 శాతం పాజిటివిటీ రేటు చూశాం. క్రమంగా తగ్గుతూ వచ్చింది. కోవిడ్ నివారణకు కలెక్టర్లు నుంచి గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్లు, ఆశావర్కర్లు, డాక్టర్లు, ఏఎన్ఎంలు అందరూ కలసికట్టుగా పనిచేశారు. అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. నిర్మాణ పనులు వేగవంతం కావాలి గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైఎస్సార్ హెల్త్‌క్లినిక్స్, ఏఎంసీ, బీఎంసీల నిర్మాణంపై దృష్టిపెట్టండి. రాష్ట్రవ్యాప్తంగా 10,929 గ్రామ సచివాలయాలను నిర్మిస్తున్నాం. సచివాలయాల నిర్మాణంలో కృష్ణా, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలు వెనకబడి ఉన్నాయి. కలెక్టర్లు దీనిపై ధ్యాస పెట్టాలి. సెప్టెంబరు 30 కల్లా నిర్మాణ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. 10,408 ఆర్బీకేలు నిర్మిస్తున్నాం. ఆర్బీకేలలో బేస్మెంట్ లెవల్లో తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు జిలాల్లో నిర్మాణాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డిసెంబరు 31 కల్లా పూర్తిచేసేలా దృష్టిపెట్టాలి. 4,530 గ్రామ పంచాయతీలకు ఫైబర్ కనెక్షన్లు డిసెంబర్ కల్లా వస్తాయి. ఆ సమయానికి డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలి. డిజిటల్ లైబ్రరీలను పూర్తిచేస్తే సంబంధిత గ్రామాల నుంచే వర్క్‌ఫ్రం హోం అవకాశాలను కల్పించగలుగుతాం. ఆగస్టు 15 కల్లా వీటి నిర్మాణాలు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. స్పందన కార్యక్రమాన్ని మళ్లీ ప్రారంభించడం సంతోషకరం. కోవిడ్ కారణంగా ఇన్నాళ్లుగా జరగలేదు. మళ్లీ పునఃప్రారంభం కావడం సంతోషకరం. ప్రజలకు మంచి జరిగే కార్యక్రమం ఇది. ఇళ్ల పట్టాల పంపిణీ మొదటి దశలో 30 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 3,69,448 మందికి కోర్టు కేసుల కారణంగా అందలేదు. ఈ కేసులు త్వరగా పరిష్కారమై వారికి మంచి జరగాలని దేవుడిని కోరుకుంటున్నా. ఇళ్ల పట్టాల మంజూరుకు సంబంధించి 10,007 దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. వీటిని వెంటనే పరిశీలించి అర్హులను గుర్తించాలి. అర్హులుగా తేల్చిన 1,90,346 మందికి వెంటనే పట్టాలు ఇవ్వాలి. ఇందులో ప్రస్తుతం ఉన్న లే అవుట్లలో దాదాపు 43 వేల మందికి పట్టాలు, మరో 10,652 మందికి ప్రభుత్వ స్థలాల్లోనే పట్టాలు ఇవ్వాలి. మరో 1.36 లక్షల మందికిపైగా లబ్ధిదారులకు భూ సేకరణ చేయాల్సి ఉంది. ఆ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలి. 15 నుంచి జగనన్న పచ్చతోరణం.. ఆగస్టు 15 నుంచి 31 వరకూ రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. దీన్ని చేరుకునేలా కలెక్టర్లు చొరవ తీసుకోవాలి. ఆగస్టు 5 నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు కావాలి. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలి. గ్రామాల్లో సర్పంచులు, వలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయాలి. మొక్కలు నాటగానే సరిపోదు. నీరు పోయడం, సంరక్షణపై దృష్టిపెట్టాలి. మొక్కలు పచ్చగా కళకళలాడేలా శ్రద్ధ వహించాలి. -
అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపులకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన మాట మేరకు ఇప్పటికే రూ.10 వేల లోపు డిపాజిట్లు రూ.263.99 కోట్ల మేర చెల్లించిన సంగతి తెలిసిందే. తాజాగా రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేందుకు తెలంగాణ హైకోర్టు సోమవారం అనుమతి ఇచ్చింది. దీంతో మరోమారు డిపాజిట్ల చెల్లింపునకు ప్రభుత్వానికి లైన్ క్లియర్ అయ్యింది. వార్డు సచివాలయాల ద్వారా డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ సేకరిస్తుందని తెలంగాణ హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. సేకరించిన డిపాజిట్‌దారుల వివరాలను సీఐడీ డీఎస్పీ, ఆర్డీవో పరిశీలిస్తారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి దరఖాస్తులను ధృవీకరిస్తారు. కలెక్టరేట్ ద్వారా అర్హులైన డిపాజిటర్లకు బ్యాంకు ఖాతాలో డబ్బును జమ చేస్తామని ఏజీ శ్రీరామ్ కోర్టుకు వివరించారు. మార్చి 31 నాటికి పంపిణీ ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. కాగా, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై తమ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఆంధ్ర బ్యాంకు, ఎస్బీఐలు తెలంగాణ హైకోర్టు దృష్టికి తెచ్చాయి. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ కేసును ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్ వేసింది. దీనిపై హైకోర్టు చీఫ్ జస్టిస్ (సీజే) నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం పేర్కొంది. -
అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టంపై సుప్రీంలో పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 అమలు కావడం లేదంటూ సుప్రీంకోర్టులో శనివారం పిటిషన్ దాఖలు అయింది. తెలంగాణ అగ్రిగోల్డ్ కస్టమర్ అండ్ ఏజెంట్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆండాళు రమేష్ బాబు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అగ్రిగోల్డ్ కంపెనీ 8 రాష్ట్రాలకు చెందిన 32 లక్షల మంది కస్టమర్ల చేత 6700 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయించుకొని బోర్డ్ తిప్పేశారు. మోసపోయిన బాధితులకు న్యాయం జరగాలని ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. వివిధ హైకోర్టుల్లో అగ్రిగోల్డ్ కేసులు 5 సంవత్సరాలుగా పెండింగులో ఉన్నాయి. సెబీ ఉత్తర్వులు కూడా అమలు కావడం లేదు. ఆయా ప్రభుత్వాలు సైతం ఆస్తులు అటాచ్ మెంట్ చేస్తున్నారు తప్ప బాధితులకు డబ్బుల పంపిణీ చేయడం లేదు. ఐ.ఎమ్.ఇ , సిరిగోల్డ్ , అక్షయ గోల్డ్, అభయ గోల్డ్, హీరాగోల్డ్, అగ్రిగోల్డ్, బొమ్మరిల్లు, ఎన్ మార్ట్ లాంటి 200 కంపెనీలు 50 లక్షల మంది కస్టమర్ల వద్ద వేలకోట్ల రూపాయల డిపాజిట్ లను వసూల్ చేసి మోసం చేసాయి.ఇలా మోసం చేసిన కంపెనీలపై అక్రమ డిపాజిట్ల నిరోధక చట్టం 2019 ప్రకారం కఠిన శిక్షలు అమలు చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని సుప్రీంకోర్టును కోరినట్లు పిటిషనర్ రమేష్ బాబు, తెలిపారు. కోర్టులలో కేసులు నడుస్తున్నా ప్రభుత్వాలు బాధితులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించకపోవడంతో వేలాది మంది ఆత్మహత్య లకు పాల్పడడం నిజంగా బాధాకరం అని తెలిపారు. ఈ కేసు సుప్రీంకోర్టు లో ఈ నెల 26వ తేదీన విచారణ కు రానున్నట్లు పిటిషనర్ రమేష్ బాబు వెల్లడించారు. -
ఆపన్నహస్తం ప్రజా పాలనకు ఏడాది
-
ప్రతిపక్ష నేతపై నేను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదు: స్పీకర్
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నాయకుడి విషయంలో తాను చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖలో శుక్రవారం బాలల సంరక్షణ పరిరక్షణ వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం సభలో చర్చకు సిద్ధమైనప్పుడు ప్రతిపక్షం ఆటంకం కలిగిస్తే.. ఇది సరికాదని ప్రతిపక్ష నాయకుడికి చెప్పానే తప్ప విమర్శించలేదన్నారు. రానున్న శీతాకాల సమావేశాల్లో సభలో ఓ ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరిస్తే తాను స్వాగతిస్తానన్నారు. అపార అనుభవం ఉన్న ప్రతిపక్ష నాయకుడు స్పీకర్‌తో ఎలా మెలగాలో తెలుసుకుని.. వచ్చే అసెంబ్లీ సమావేశాలను ప్రజా శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలని కోరారు. ఫిరాయింపులకు పాల్పడితే ఏ పార్టీ వారినైనా ఉపేక్షించేది లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు. -
అగ్రిగోల్డ్ విలన్ చంద్రబాబే
సాక్షి, గుంటూరు : అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగకుండా అడుగడుగునా అడ్డుకున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వారికి న్యాయం చేస్తే ఓర్వలేకపోతున్నారని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కోఆర్డినేటర్ లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. ప్రభుత్వం తొలి దశలో రూ.1150 కోట్లు కేటాయించి రూ.20 వేల లోపు బాధితుల కష్టాలు తీర్చేందుకు ముందుకొచ్చిందని, రూ.10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారి ఖాతాల్లో ఇప్పటికే నగదు జమయిందని తెలిపారు. దీనిని భరించలేని చంద్రబాబు నాయుడు, లోకేశ్, ఇతర టీడీపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం చూస్తే సిగ్గేస్తుందని చెప్పారు. అగ్రిగోల్డ్‌పై నారా లోకేశ్ ట్విట్టర్లో అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. అగ్రిగోల్డ్‌పై నిజానిజాల నిగ్గు తేల్చుకునేందుకు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. లోకేశ్ తన ట్విట్టర్లో పెట్టిన దానికి కట్టుబడి ఉండే పక్షంలో తన చాలెంజ్‌ను స్వీకరించాలని సవాలు విసిరారు. లేని పక్షంలో తన ట్విట్టర్ ఖాతా క్లోజ్ చేసి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ అంశంపై కోర్టుకు వెళ్లినప్పుడు ఎస్.ఎల్. గ్రూప్ వారి ఆస్తులను టేకోవర్ చేస్తానందని, 2018, ఏప్రిల్ 3న ఆ గ్రూప్ సభ్యులతో చంద్రబాబు ఢిల్లీలో మంతనాలు జరిపి వారిని బెదిరించడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. 2018 ఏప్రిల్ 3వ తేదీ అర్ధరాత్రి ఢిల్లీ ఏపీ భవన్ సాక్షిగా చంద్రబాబు –అగ్రిగోల్డ్ ఎం.డి. సీతారామ్, ఎస్.ఎల్.గ్రూప్ సుభాష్ చంద్ర, మాజీ ఎంపీ అమర్ సింగ్‌తో చీకటి ఒప్పందానికి ప్రయత్నించారని ఆరోపించారు. అందుకు భయపడే ఎస్ఎల్ గ్రూప్ వెనక్కు తగ్గిందని వెల్లడించారు. ఆ సమావేశం జరిగిన వారం తర్వాత ఆ గ్రూప్ సభ్యులు అగ్రిగోల్డ్ ఆస్తులు కొనడం లేదని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారని అప్పిరెడ్డి గుర్తు చేశారు.వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన అయిదు నెలల్లోనే ఇచ్చిన హామీల్లో 80 శాతం అమలుచేసి ప్రజల మన్నన పొందారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ గుంటూరు పార్లమెంట్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య పాల్గొన్నారు. -
సభా ప్రాంగణానికి చేరుకున్న సీఎం
-
అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేయాలని చూశాడు
-
బాధితుల్ని మోసం చేసిన చంద్రబాబు
-
అగ్రిగోల్డ్ బాధితులకు జగన్ సర్కార్ అండ!
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ కార్యరూపం దాలుస్తోంది. ఐదేళ్ల పోరాటంలో అడుగడుగునా దగాపడ్డ అగ్రిగోల్డ్ బాధితుల కల సాకారమవుతోంది. బాధితుల్లో 3,69,655 మందికి తొలివిడతలో చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధంచేసింది. గుంటూరులోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేతుల మీదుగా గురువారం (7వ తేదీ) డబ్బుల పంపిణీ కార్యక్రమం జరగనుంది. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలను గట్టెక్కించడానికి.. నేనున్నానంటూ ఆనాడు ప్రతిపక్షనేతగా వైఎస్ జగన్ ఇచ్చిన భరోసా నేడు బాధితులకు అండగా నిలుస్తోంది. నమ్మించిన సంస్థ నట్టేటముంచింది. ఆదుకోవాల్సిన సర్కార్ అక్రమాలకు తెగబడింది. రోజువారీ కష్టం చేసుకునేవారి నుంచి, చిన్నా, మధ్యతరగతి వర్గాలను ఆకర్షించిన అగ్రిగోల్డ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వారి నుంచి 6,380 కోట్ల రూపాయలను సేకరించింది. ఆకర్షణీయమైన వడ్డీరేట్లు, పటిష్టమైన ఏజెంట్ల వ్యవస్థతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు మొత్తం ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది నుంచి డిపాజిట్లు సేకరించింది. విజయవాడ కేంద్రంగా అవ్వా వెంకట రామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ అనతికాలంలోనే వేలకోట్ల రూపాయలను ప్రజలనుంచి సేకరించి, పెద్ద ఎత్తున ఆస్తులను కొనుగోలు చేసింది. వివిధ రకాల స్కీంలలో సేకరించిన డిపాజిట్లకు నగదును, భూములను ఇస్తామని చెప్పి వాటిని అందించలేకపోయింది. చివరికి మోసపోయామని గ్రహించిన డిపాజిట్‌దారులు పోలీసులను ఆశ్రయించడంతో ఏపీతోపాటు పలుచోట్ల అగ్రిగోల్డ్ యాజమాన్యంపై కేసులు నమోదయ్యాయి. రెక్కాడితే కానీ డొక్కాడని కష్టజీవుల నుంచి మధ్యతరగతి మహిళలు పొదుపుగా దాచుకున్న మొత్తాల వరకు డిపాజిట్ల రూపంలో అగ్రిగోల్డ్‌కు చేరాయి. ఆస్తులను మింగేందుకు గత సర్కార్ కుట్రలు.. అవసరానికి ఆదుకుంటాయని భావించిన సొమ్ము కాస్తా.. తిరిగి రాదని గ్రహించిన అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ గత ఐదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వానికి పదేపదే విన్నవించుకున్నారు. ఆదుకోవాల్సిన చంద్రబాబు సర్కార్ నుంచి స్పందన లేకపోవడం, మరోవైపు గత ప్రభుత్వంలోని కొందరు పెద్దలే బినామీ పేర్లతో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నించడం వివాదాస్పదమైంది. సంస్థ ఆస్తులను అమ్మి, తమకు చెల్లింపులు చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందంటూ అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమానికి అండగా నిలిచింది. అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటుచేసి అప్పటి చంద్రబాబు సర్కార్ కుట్రలను అడ్డుకుంది. ఇదేక్రమంలో ప్రజాసంకల్పయాత్రలోనూ అడుగుడునా అగ్రిగోల్డ్ బాధితులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ను కలిసి తమ కష్టాలను వివరించారు. న్యాయం చేయాల్సి ప్రభుత్వమే తమ కష్టాన్ని కాజేయాలని చూస్తోందని మొరపెట్టుకున్నారు. వారి బాధలను విన్న వైఎస్ జగన్ తమ ప్రభుత్వం రాగానే ప్రాధాన్యతాక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తానంటూ హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటిని తుడిచే చర్యలు వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే జరిగిన తొలి మంత్రివర్గ సమావేశంలోనే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేసే నిర్ణయంపై తీర్మానం చేశారు. మొదటి బడ్జెట్లోనే బాధితుల కోసం 1,150 కోట్ల రూపాయలను కేటాయిస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకున్నారు. ఇప్పటికే న్యాయస్థానాల పరిధిలో అగ్రిగోల్డ్ ఆస్తుల విక్రయప్రక్రియలో జాప్యం కొనసాగుతున్న నేపథ్యంలో న్యాయ నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వం ముందుగానే బాధితులకు చెల్లింపులు చేయాలనే నిర్ణయాన్ని కార్యరూపంలోనికి తీసుకువచ్చారు. 10వేల రూపాయల లోపు డిపాజిట్ చేసిన బాధితులకు చెల్లింపులు చేసేందుకు గత నెల అక్టోబర్ 18వ తేదీన 263.99 కోట్ల రూపాయలను విడుదల చేస్తూ హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్ఎం కిషోర్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. దీనితో ఒక్కసారిగా అగ్రిగోల్డ్ బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. రాష్ట్రంలోని పదమూడు జిల్లాల పరిధిలో ఒకేసారి చెల్లింపుల ద్వారా 3,69,655 మందికి న్యాయం జరుగుతోంది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల రీగా ఈ సొమ్మును బాధితులకు అందచేయనున్నారు. అలాగే ఇరవై వేల రూపాయల లోపు ఉన్న మరో 4లక్షలమంది డిపాజిట్‌దారులకు కూడా చెల్లింపులు జరిపేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాల వారీగా అగ్రీగోల్డ్ బాధితులకు తొలిదశ పంపిణీ వివరాలు జిల్లాలు బాధితుల సంఖ్య చెల్లించే మొత్తం విశాఖపట్నం 52,005 45,10,85,805 విజయనగరం 57,941 36,97,96,900 శ్రీకాకుళం 45,833 31,41,59,741 పశ్చిమ గోదావరి 35,496 23,05,98,695 తూర్పుగోదావరి 19,545 11,46,87,619 కృష్ణాజిల్లా 21,444 15,04,77,760 గుంటూరు 19,751 14,09,41,615 ప్రకాశం 26,586 19,11,50,904 నెల్లూరు 24,390 16,91,73,466 అనంతపురం 23,838 20,64,21,009 వైఎస్సార్ కడప 18,864 13,18,06,875 కర్నూలు 15,705 11,14,83,494 చిత్తూరు జిల్లా 8,257 5,81,17,100 -
అగ్రిగోల్డ్ బాధితుల కన్నీరు తుడిచేలా..
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేసి, నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. వారికోసం కేటాయించిన నిధులను పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గుంటూరు పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో ఈ నెల 7వ తేదీన నిర్వహించే సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బుల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. రూ.10 వేలలోపు డిపాజిట్లు చేసిన వారికి తొలుత చెల్లింపులు చేస్తారు. మలిదశలో రూ.20 వేలలోపు డిపాజిట్లు చెల్లించేందుకు కసరత్తు ప్రారంభించారు. ప్రతి బాధితుడికీ న్యాయం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టనుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వైఎస్ జగన్ తమను ఆదుకోవాలంటూ వేలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు పాదయాత్ర సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. మన ప్రభుత్వం వచ్చాక తప్పనిసరిగా న్యాయం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టగానే బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం సైతం చేశారు. అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించేలా బడ్జెట్లో రూ.1,150 కోట్లు కేటాయించారు. రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబరు 18న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలిదశలో రూ.10 వేల లోపు డిపాజిట్లు చెల్లించాలని భావించారు. అయితే, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు సైతం చెల్లించి వీలైనంత ఎక్కువ మందిని ఆదుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిస్ట్రిక్ట్ లీగల్ సెల్ అథారిటీ(డీసీఎల్) ప్రతిపాదనల ప్రకారం జిల్లాల వారీగా రూ.10 వేలలోపు డిపాజిట్ల చెల్లింపులు జరగనున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాల్లో తొలి విడత రూ.10 వేల లోపు డిపాజిట్లు మొత్తం రూ.263,99,00,983 చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రూ.6,380 కోట్లకుపైగా వసూళ్లు విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు డైరెక్టర్లతో కలిసి 1995లో ఏర్పడిన ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ సంస్థ ఆంధ్రప్రదేశ్‌తో పాటు మరో ఏడు రాష్ట్రాల్లో 32 లక్షల మంది డిపాజిటర్ల నుంచి రూ.6,380 కోట్లకు పైగా సేకరించింది. చివరకు వారికి భూములు ఇవ్వక.. సొమ్ము తిరిగి చెల్లించకపోవడంతో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై అప్పటి సీఎం చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా ఆ పార్టీ పెద్దలు సంస్థ ఆస్తులు కొట్టేసేందుకు కుట్రలు సాగించారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ‘అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ’ ఏర్పాటై ఉద్యమాలు నిర్వహించింది. బాధితుల జీవితాల్లో వెలుగులు ‘‘సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ అగ్రిగోల్డ్ బాధితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. గత ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవాల్సింది పోయి మానసిక క్షోభకు గురిచేసింది. అప్పటి ప్రభుత్వ పెద్దలు అగ్రిగోల్డ్‌కు చెందిన కొన్ని విలువైన ఆస్తులను కారుచౌకగా కొట్టేశారు. టీడీపీ నాయకులు అగ్రిగోల్డ్ ఆస్తులపై చూపిన శ్రద్ధను బాధితులపై చూపలేదు’’ – లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్ -
అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం
-
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు
-
అగ్రిగోల్డ్ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లింపు
సాక్షి అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఇప్పటికే రూ.1,150 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. తొలుత రూ.263.99 కోట్లు విడుదల చేస్తూ అక్టోబర్ 18న ఉత్తర్వులిచ్చింది. తొలి దశలో రూ.10 వేలలోపు డిపాజిట్లు చెల్లించాలని భావించింది. అయితే, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంలో జాప్యం జరుగుతున్నందున రూ.20 వేల లోపు డిపాజిట్లు చెల్లించి, వీలైనంత ఎక్కువ మంది బాధితులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఇందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ డీజీపీ, సీఐడీ అధికారులను ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులిచ్చింది. అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే బాధితులను ఆదుకునేలా మంత్రివర్గ సమావేశంలో తీర్మానం చేశారు. బాధితులకు చెల్లించడానికి రూ.1,150 కోట్లు కేటాయించారు. ఏమిటీ అగ్రిగోల్డ్? విజయవాడకు చెందిన అవ్వా వెంకటరామారావు, మరికొందరు కలిసి 1995లో ‘అగ్రిగోల్డ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్’ స్థాపించారు. ఏపీతోపాటు మరో ఏడు రాష్ట్రాల్లో ప్రజల నుంచి భారీగా డిపాజిట్లు సేకరించారు. అధిక వడ్డీల ఆశ చూపించి, దాదాపు 32 లక్షల మంది నుంచి రూ.6,380 కోట్లు వసూలు చేశారు. వారికి భూములు ఇవ్వకపోగా, చెల్లించిన డిపాజిట్లు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. అగ్రిగోల్డ్ సంస్థకు చెందిన భూములను విక్రయించి, తమకు డబ్బులు చెల్లించాలని గత టీడీపీ ప్రభుత్వానికి మొరపెట్టుకున్నారు. ఫలితం లేకపోవడంతో ఉద్య మాలు చేశారు. తాము అధికారంలోకి రాగానే డిపాజిట్లు చెల్లిస్తామని, బాధితులను ఆదుకుంటా మని వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చి.. మాట నిలబెట్టుకుంటూ నిధులు కేటాయించారు. -
‘జగన్ ఏం చేస్తాడులే.. అనుకున్నారు’
సాక్షి, కాకినాడ : అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు తెచ్చుకున్నారని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశంసించారు. శనివారం కాకినాడలో మాట్లాడిన ఆయన .. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్ ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించారని గుర్తు చేశారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే.. అంటూ చంద్రబాబు రూ. 65 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, వేల కోట్ల అప్పులతో ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోయారని మంత్రి విమర్శించారు. ఇచ్చిన మాట కోసం మొదటగా రూ. 10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా చెల్లించబోతోందని తెలిపారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో ఉన్న తాము ఇవాళ ఆనందం వ్యక్తం చేసే రోజు అని హర్షం వెలిబుచ్చారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున పోరాటం చేసిన తర్వాత తమ కార్యాలయంలోనే దాదాపు 80 శాతం మంది బాధితులు తమపేర్లు ఇచ్చారని వెల్లడించారు. ఇవ్వాళ ఏ కష్టం వచ్చినా వైఎస్ జగన్ ఉన్నాడనే ధైర్యంతో రాష్ట్ర ప్రజలు ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. రామచంద్రాపురం చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం వల్ల ప్రజాప్రతినిధులుగా మేం గర్వపడుతున్నామన్నారు. నిధులు మంజూరు చేయడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. -
కష్టాల కడలిలో ఎదురొచ్చిన నావలా...
సాక్షి, గరుగుబిల్లి (విజయనగరం): బిడ్డల చదువులు.. పిల్లల పెళ్లిళ్లు..తదితర అవసరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఉన్నంతలో రూపాయి, రూపాయి కూడబెట్టి ..కాస్త ఎక్కువ రాబడి వస్తుందన్న ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో పెట్టుబడి పెట్టిన ఎంతోమంది నిలువునా మునిగిపోయారు. లాభాలు ఇస్తుందనుకున్న ఆ సంస్థ అర్ధంతరంగా బోర్డు తిప్పేయడంతో వేలాదిమంది డిపాజిటర్లు దిక్కుతోచని పరిస్థితిని ఎదుర్కొన్నారు. అపారంగా ఆస్తులున్నా పొదుపరులకు ఆ సంస్థ ఒక్క పైసాకూడా విదల్చలేదు. ఆదుకుంటామని చెప్పిన గత టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఆ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను కబళించేందుకు కుయుక్తులు పన్నారే తప్ప... బాధితుల గోడు పట్టించుకోలేదు. చివరకు కోర్టుకు వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. ఒక దశలో న్యాయం జరుగుతుందని ఆశించి, నాటి పాలకులు ఏదో చేస్తారనే భ్రమపడిన బాధితులు వారు చెప్పిన విధంగా గత ఏడాది పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తమ వివరాలు అందించారు. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్లు చేయించిన ఎంతోమంది ఏజెంట్లు బాధితుల వేదనలు వింటూ, వారి ఛీత్కారాలు భరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో కొంతమంది బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు. నేనున్నానంటూ... కష్టాల కడలిలో చిక్కుకుపోయినవారికి గట్టున చేర్చే నావ ఎదురొచ్చినట్లుగా.. అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నేనున్నాంటూ కనిపించారు. రాష్ట్రంలో ప్రజాసంకల్పయాత్ర చేసిన సమయంలో ఆయనకు అగ్రిగోల్డ్ బాధితులు చాలామంది తమ గోడు వెళ్లబోసుకున్నారు. తాము మోసపోయిన తీరును వివరించారు. వారి ఆవేదనను అర్ధం చేసుకున్న జగన్ మోహన్‌రెడ్డి.. తాను అధికారంలోకి వస్తే మేలు చేస్తారనిని హమీ ఇచ్చారు. ఈ మేరకు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి కోసం రూ.1,150 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ముందుగా రూ.20వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ ప్రభుత్వ పక్షాన చెల్లింపులు జరిపే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. అఖండమైన ప్రజాతీర్పుతో అధికారంలోకి వచ్చిన ఆయన పాదయాత్రలోను, ఎన్నికల సమయంలోను ఇచ్చిన హమీలను ఒక్కొక్కటిగా నెరవేర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రూ.20 వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్లను చెల్లించేందుకు వైఎస్సార్సీపీ సర్కార్ తీసుకొన్న నిర్ణయంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం చేయలేని పనిని సీఎంగా పదవి చేపట్టిన కొద్ది రోజులలోనే జగన్ మోహన్‌రెడ్డి చేయడంపై బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముప్పతిప్పలు పెట్టారు.. అగ్రిగోల్డ్ బాధితులకు సత్వరమే న్యాయం చేయమని కోర్టు చెప్పినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. సరికదా బాధితులను పోలీస్స్టేషన్లకు, కోర్టులకు రమ్మంటూ ముప్పతిప్పలు పెట్టారు. ఆఖరికి ఎన్నికల సమయంలోనైనా చేస్తారనుకుంటే అగ్రిగోల్డ్ ఆస్తులను కబళించే ప్రయత్నం చేశారే తప్ప బాధితుల గోడు వినలేదు. ఆ సమయంలో పాదయాత్రలో అగ్రిగోల్డ్ బాధితుల వేదన విన్న జగన్మోహన్రెడ్డి ..ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన వెంటనే ముందుగా రూ.20 వేల లోపు డిపాజిట్లు వేసిన వారందరికీ న్యాయం చేసే ప్రయత్నం చేయడం అభినందనీయం. - ఉరిటి రామారావు, వైఎఆర్సీపీ మండల కన్వీనర్,గరుగుబిల్లి. న్యాయం జరగలేదు పిల్లల చదువులు,పెళ్లిళ్లి కోసం అగ్రిగోల్డ్ సంస్థలో దాచుకొన్న సొమ్ములను తిరిగి ఇప్పించడంలో కోర్టులు కూడా ఏమీ చేయలేకపోయాయి. ఆ సంస్థకున్న ఆస్తులు ఏమయ్యాయో కానీ బాధితులు మాత్రం బాధల్లోనే ఉన్నారు. సీఎం జగన్ రూ.20 వేల లోపున్న డిపాజిట్లను చెల్లిస్తానని చెప్పడం బాగుంది. – మండల శంకరరావు, ఎంపీటీసీ సభ్యుడు, తోటపల్లి -
అగ్రి ఆనందం
సాక్షి,కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : అగ్రిగోల్డ్ బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఊరటనిచ్చారు. ఇన్నాళ్లు ఎందుకూ పనికి రాని మెచ్యూరిటీ బాండ్లకు ముఖ్యమంత్రి జీవం పోశారు. రూ.20 వేలలోపు బాండ్లకు రూ.1150 కోట్లు విడుదల చేస్తామని ప్రకటించారు. దీంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోందని సంబర పడుతున్నారు. పది రోజుల్లో పండుగ వచ్చింది... అగ్రిగోల్డ్ బాధితుల్లో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. దాచుకున్న సొమ్ముకు భద్రత ఉంటుందని, నాలుగు పైసలు వడ్డీ రూపంలో కలసి వస్తే కుటుంబానికి ఆసరాగా ఉంటుందని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేశారు. చివరకు బాండ్లకు మెచ్యూరిటీ వస్తున్న సమయంలో అప్పటి టీడీపీ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు అగ్రిగోల్డ్ యాజమాన్యంతో కుమ్మక్కై పేదలను ముంచారు. కంపెనీ అడ్రస్‌ను గల్లంతు చేశారు. బాధితులు రోడ్లెక్కి ఆందోళనలు చేసినా చంద్రబాబునాయుడు స్పందించలేదు. పైగా అగ్రిగోల్డ్ కొన్ని ఆస్తులను కొట్టేయడంలో నారా లోకేష్ హస్తం ఉందనే ప్రచారం జరిగింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ, అసెంబ్లీ బయట అగ్రిగోల్డ్ బాధితులకు అండగా నిలిచారు. ధర్నాలు, రాస్తారోకోలు చేశారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీశారు. వైఎస్ జగన్ అసెంబ్లీలో పోరాడిన తీరుకు ప్రభుత్వం దిగి వచ్చి రూ.250 కోట్లతో రూ.10 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు అందజేస్తామని హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని యథావిథిగా అమలు చేయలేకపోయారు. ఇదే క్రమంలోఅధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోపు అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటానని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లో ప్రకటించారు. దీంతో వారందరూ ఆయనకు అండగా నిలిచారు. తనకు అండగా నిలిచిన అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా సోమవారం వెలగపూడి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో రూ.20 వేలలోపు మెచ్యూరిటీ బాండ్లకు రూ.1150 కోట్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించడంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మూడు నెలల్లో న్యాయం చేస్తానని పది రోజుల్లో తమకు న్యాయం చేయడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 45 వేల మందికి లబ్ధి... జిల్లాలో అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు, చిట్టీలు వేసిన వారి సంఖ్య 75 వేలు. ఇందులో వినియోగదారులు, ఏజెంట్లు ఉన్నారు. కొందరు ఏజెంట్లు బాధితులకు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయంతో జిల్లాలో దాదాపు 45 వేల మందికి న్యాయం జరుగుతుంది. -
‘అగ్రి’డబ్బు రావాలంటే.. బాబు జాబు పోవాలి
సాక్షి, గార్లదిన్నె : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు రావాలంటే బాబు జాబుపోవాలి..వైఎస్ జగన్మోహన్రెడ్డి రావాలని అనంతపురం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, అగ్రిగోల్డ్ బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జేఏసీ నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నాయకులు వై.నారాయణరెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో అగ్రీగోల్డ్ బాసట కమిటీ సభ్యులు, జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. పేదలు,నిరుపేదలు రోజూ కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారని, సంస్థ దివాలా తీయడంతో ఇక తమ డబ్బులు రావని, మనస్థాపంతో రాష్ట్రంలో 263 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఈసమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు గుర్తించారన్నారు. గత ఏడాది డిసెంబర్ 28న అగ్రిగోల్డ్ అసోసియేషన్ అమర నిరాహారణ దీక్షలు చేయగా, ప్రభుత్వం మాత్రం రూ.250 కోట్లు డబ్బులేని జీవో ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిస్తే మన అందరి ప్రభుత్వం వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే మూడు నెలలో రూ.1,183 కోట్లు విడుదల చేసి, రూ.20వేల లోపు ఉన్న 14 లక్షల మందికి ఉపశమనం కలిగిస్తామని భరోసా ఇచ్చారన్నారు. శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి జొన్నల గడ్డ పద్మావతి, ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యతోపాటు జిల్లాలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అఖండ మోజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈనెల 8న జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాసట కమిటీ జేఏసీ నాయకులు రాజగోపాల్, దస్తగిరి, రామచంద్ర ఆచారి, కుళ్లాయప్ప, గోపాల్ రెడ్డి, కృష్టమోహన్, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్తిపాటి @ ప్రజాధనం లూటీ
సాక్షి, గుంటూరు : మన నియోజకవర్గ ఎమ్మెల్యేకు మంత్రి పదవి వచ్చింది. ఇక ప్రతి మండలంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని నాలుగేళ్ల క్రితం చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలు భావించారు. ప్రత్తిపాట్టి పుల్లారావుకు నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు తమ సమస్యలకు పరిష్కారం చూపిస్తారని ఆశలు పెట్టుకున్నారు. ఆయనకు పదవి వచ్చిన దగ్గర నుంచి అవినీతి జడలు విప్పింది. ఊరూవాడా అక్రమాలు జోరు పెరిగింది. నీరు– చెట్టు పథకం మంత్రితోపాటు ఆయన అనుచరులకు వరంగా మారింది. అధికారం అండ ఉండడంతో పత్తి కొనుగోలులో గోల్మాల్ చేశారు. అవినీతి తోడేళ్లుగా మారి గ్రావెల్‌ను మింగేస్తూ.. అందినకాడిని మట్టి బొక్కేశారు. అగ్రిగోల్డ్ బాధితుల ప్రాణాలు ఆరిపోతుంటే.. ఆ సంస్థ భూములు అన్యాయంగా చెరబట్టారు. అక్రమాలపై ప్రశ్నించి జర్నలిస్టుల కలాల కంఠానికి ఉరి బిగించారు. మంత్రి భార్య రాజ్యాంగేతర శక్తిగా మారి ప్రజలను పీడించారు. అన్ని శాఖల అధికారులను గుప్పిట్లో పెట్టుకుని కమీషన్లు దండుకున్నారు. ఇలా ఐదేళ్ల పాలనలో వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. మొత్తంగా చిలకలూపేట నియోజకవర్గంలో అభివృద్ధికి పాతరేసి.. అవినీతి, అక్రమాలు, అరాచకాల కోటగా మార్చేశారు. అగ్రిగోల్డ్ భూముల కొనుగోలు... ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం గురిజేపల్లిలో అగ్రిగోల్డ్ భూమి ఉంది. గతంలో వెంచర్లు వేసి భూమి అభివృద్ధి చేయటానికి సంస్థ వీటిని కొనుగోలు చేసింది. ఈ భూమి అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ డైరెక్టర్ కనుకొల్లు ఉదయదినాకర్ పేరుపై రిజిస్టర్ అయ్యింది. అగ్రి గోల్డ్ భాగస్వామి అయిన ఇతని వద్ద నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సతీమణి తేనె వెంకాయమ్మ (ప్రత్తిపాటి వెంకటకుమారి) 2015 జనవరి 19వ తేదీన ఖాతా నంబర్ 525, సర్వే నంబర్లు 104–6, 104–5,104–4,104–3,104–1,103–2ల ప్రకారం మొత్తం 6.19 ఎకరాలను కొనుగోలు చేశారు. తిరిగి గతేడాది ఏప్రిల్ 17వ తేదీ అగ్రి ప్రాజెక్టు సంస్థకు చెందిన బండా శ్రీనివాసబాబు నుంచి సర్వే నంబర్ 101–1లోని 5.44 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అదే రోజు అంటే ఏప్రిల్ 17వ తేదీ మంత్రిప్రగడ విజయ్‌కుమార్ వద్ద నుంచి సర్వే నంబర్లు 104–1,104–2,104–3 ద్వారా 2.60 ఎకరాలు, సర్వే నంబర్ 104–4లో ఉన్న 0.57 ఎకరాలను కొనుగోలు చేశారు. మొత్తం అగ్రిగోల్డ్‌కి చెందిన 14.81 ఎకరాల భూమిని మంత్రి సతీమణి పేరుపై కొనుగోలు చేశారు. ఇలా కొనుగోలు చేసిన మొత్తం భూమిని అదే ఏడాది జూన్ 4వ తేదీన గుంటూరుకు చెందిన కామేపల్లి వెంకటేశ్వరరావుకు, పెదకాకాని మండలం, ఉప్పలపాడుకు చెందిన చెరుకూరి నరసింహారావులకు విక్రయించారు. అగ్రి గోల్డ్ భూమిని రహస్యంగా భాగస్వాములు వేరే వ్యక్తులకు ఎకరా రూ.32 లక్షలకు అమ్మటానికి వ్యవహారం నడిచింది. ఇందుకు సంబంధించిన వేర్వేరు వ్యక్తులతో అగ్రిమెంటు కూడా రాయించుకున్నారు. విషయం తెలిసిన మంత్రి వీరిని బెదిరించి అగ్రిమెంట్లు రద్దు చేయించారు. తాను కేవలం ఎకరాకు రూ.20 లక్షలు మాత్రమే ఇస్తానని చెప్పటంతో గత్యంతరం లేక నష్టానికి మంత్రికి భూములు అమ్మారు. భూములు కొన్న మంత్రి జూన్‌లో ఇవే భూములను ఎకరాకు రూ.52 లక్షలకు విక్రయించారు. ఈ వ్యవహారంలో కోట్ల రూపాయలు మంత్రికి లాభంగా దక్కాయి. అక్షరం గొంతు నొక్కి చిలకలూరిపేట పట్టణానికి చెందిన విలేకరి ఎంవీఎన్ శంకర్‌పై(హత్యకు గురైనప్పుడు ఆంధ్రప్రభ ఆర్సీ ఇన్చార్జి) 2014 నవంబర్ 25వ తేదీన తెలుగు యువత పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దిబోయిన శివ, మరో ముగ్గురు దాడి చేశారు. గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ అదే రోజు అర్ధరాత్రి మృతి శంకర్ మృతి చెందాడు. తొలుత ఆధారాలు లేవని కేసు మూసివేసేందుకు ప్రయత్నించగా.. జర్నలిస్టు సంఘాలు పోరాటం చేయడంతో ముగ్గురిపై కేసు నమోదు చేశారు. వీరు కేవలం పాత్రధారులు మాత్రమే. సూత్రధారులను మాత్రం అరెస్టు చేయ లేదు. సీసీఐలో భారీ కుంభకోణం 2014–15 కాలంలో ప్రత్తిపాటి పుల్లారావు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల మంత్రిగా ఉన్న సమయంలో మార్కెట్ యార్డుల ద్వారా ఈ కుంభకోణం జరిగింది. విశాఖపట్టణం నుంచి గుంటూరు వచ్చిన సీబీఐ అధికారుల బృందం సీసీఐ కార్యాలయంలో విచారణ నిర్వహించింది. అప్పట్లో జరిగిన పత్తి కుంభకోణంలో దాదాపు రూ.540 కోట్ల అక్రమాలు చోటు చేసుకున్నాయని విచారణలో వెల్లడైంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళలో సీసీఐ రాష్ట్ర వ్యాప్తంగా 43 మార్కెట్ యార్డుల్లో పత్తికొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాల ద్వారా రైతుల నుంచి సీసీఐ పత్తి కొనుగోలు చేయాలి. అయితే ముందే రైతుల నుంచి వ్యాపారులు, దళారీలు పత్తి క్వింటాకు రూ. 3 వేలలోపు కొని రూ. 4 వేలు, రూ.4100 చొప్పున సీసీఐకి విక్రయించారు. కొనుగోలు చేసిన పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురాకుండా గ్రామాల నుంచే నేరుగా జిన్నింగ్ మిల్లులకు తరలించారు. ఈ వ్యవహారంలో సీసీఐ బయ్యర్లు, మార్కెటింగ్ శాఖ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. గ్రామాల నుంచి వ్యాపారులు నేరుగా కొనుగోలు చేసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేసినట్లు రికార్డులు సృష్టించారు. కాటా వేయని పత్తికి కాటా వేసినట్లు చార్జీలు, మార్కెట్ యార్డుల నుంచి సీసీఐ జిన్నింగ్ చేయించే మిల్లులకు పత్తిని తరలించినట్లు రవాణా చార్జీలు ఖర్చు రాసి డబ్బులు దండుకున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని భారత పత్తి కొనుగోలు సంస్థ (సీసీఐ)లో జరిగిన అవినీతి ప్రభుత్వాన్ని కుదిపేసింది. ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు రావటంతో కంటితుడుపుగా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దర్యాప్తునకు ఆదేశించింది. విచారణ అనంతరం 2016 నవంబర్‌లో చిలకలూరిపేట మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి కే నాగవేణి సహా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 26 మంది మార్కెటింగ్ శాఖ అధికారులు, సిబ్బందిని సస్పెండ్ చేశారు. కప్పం కట్టనిదే ఫైల్ కదలదు చిలకలూరిపేట నియోజకవర్గంలో రెవెన్యూ, మున్సిపల్ ఇలా ఏ కార్యాలయంలో ఫైల్ కదలాలన్నా మేడమ్‌ను కలిసి కప్పం కట్టాల్సిందే. ల్యాండ్ కన్వర్షన్ ఎకరాకు రూ.1 లక్ష వసూలు చేస్తున్నారు. మంచినీటి సరఫరా పేరుతో ఇప్పటి వరకు రూ. 5 కోట్ల వరకు దండుకున్నారు. ఎంత పెద్ద వర్క్ అయినా మూడు, నాలుగు భాగాలుగా విభజించి ఒక్కరికే నామినేషన్ పద్ధతిలో అప్పగిస్తూ భారీగా ముడుపులు తీసుకున్నారు. బాణా సంచా వ్యాపారుల నుంచి ఏటా రూ. కోటి చొప్పున ఇప్పటి వరకు రూ. 5 కోట్లు, పాన్ పరాగ్, గుట్కా హోల్‌సేల్ వ్యాపారుల నుంచి రూ. 3 కోట్లు వసూలు చేశారు. గుంటూరులో కల్తీ కారం తయారీదారులను బెదిరించి రూ. 8 కోట్లు దండుకున్నారు. నకిలీ విత్తనాల కుంభకోణం సైతం వీరి కనుసన్నల్లోనే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. విత్తనాలను బ్లాక్ చేసి కిలో లక్ష రూపాయలకు అమ్మించారు. అతి ఖరీదైన భూమి కబ్జా చిలకలూరిపేటలోని ఓగేరు వాగు పక్కనే ఉన్న సుమారు ఎకరాల స్థలాన్ని మంత్రి పుల్లారావు అనుచరులు ఆక్రమించి ప్లాట్లు వేసేశారు. 12 ఏళ్ళ క్రితం వాగు నుంచి వరద నీరు పట్టణంలోకి రాకుండా కరకట్టలు నిర్మించారు. ఆ సమయంలో అక్కడ ఎస్టీలు కొందరు గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారు. దీంతో కొంత స్థలాన్ని వదిలేసి కరకట్ట నిర్మించారు. ఇది మంత్రి అనుచరులకు వరంగా మారింది. తమ పూర్వీకుల పేరుతో పట్టాలు ఉన్నట్లుగా సృష్టించి మంత్రి అండదండలతో పూర్ణాసింగ్, మాధవ్‌సింగ్, శంబుసింగ్ అనే వ్యక్తులు ఆక్రమించి ప్లాట్లు వేశారు. సుమారు రూ. 4 కోట్ల విలువ చేసే స్థలం కబ్జాకు గురైంది. మంత్రి కన్నుపడిన యడవల్లి భూముల్లో గ్రానైట్ విలువ : రూ. 3000 కోట్లు పేదల బియ్యం రవాణాలో అక్రమాలు : రూ. 200 కోట్లు ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో గ్రావెల్ దోపిడీ : రూ.500 కోట్లు మున్సిపల్ పనుల్లో మంత్రి భార్య కమీషన్ : రూ.150 కోట్లు పేట కేంద్రంగా సీసీఐ కుంభకోణం : రూ. 540 కోట్లురూ. టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలను అడ్డుపెట్టుకుని దోచుకున్న మొత్తం : 150 కోట్లు అగ్రి గోల్డ్ ఆస్తుల కొనుగోలులో లబ్ధి : సుమారు 5 కోట్లు -
అగ్రి గోల్డు బాధితులకు అండగా జగన్
సాక్షి, రాజంపేట రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నిలిచి వైఎస్సార్సీపీనీ అధికారంలోకి తెచ్చుకుందామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ రాష్ట్ర , జిల్లా ఉపాధక్షుడు తుమ్మల రాము అగ్రిగోల్డ్ బాధితులను కోరారు. సోమవారం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని లోటస్‌పాండ్‌లో రాష్ట్ర అధ్యక్షుడు బి. విశ్వనాథ్‌రెడ్డితో వెళ్లి కలిశామని ఆయన చెప్పారు. అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు జననేతకు వివరించామన్నారు. అధికారంలోకి రాగానే మూడు నెలలలోపు రూ.1183 కోట్లు కేటాయించి 13 లక్షల మందికి న్యాయం చేస్తానని జగన్ భరోసా ఇచ్చారని రాము తెలియజేశారు. దశల వారిగా ప్రతి కస్టమర్‌కు డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని తెలియజేశారు. నాలుగు సంవత్సరాలుగా పోరాటాలు చేస్తుంటే బాబు ప్రభుత్వం న్యాయం చేయక పోగా అన్యాయం చేసిందని మండిపడ్డారు. 250 మందికి పైగా రైతులు క్షోభతో కన్నుమూశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రతి భాధితుడు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని పిలుపు నిచ్చారు. మంగళవారం నుంచి అగ్రిగోల్డ్ భాధితులు ప్రచా రం చేయాలని కోరారు. జననేతను కలిసిన వారిలో రాజంపేట శాఖ అధ్యక్షుడు పీవీ సుబ్బారావు, ఉపాధ్యక్షుడు తదితరులు ఉన్నారు. -
కొంపలు కూల్చారు
సాక్షి, ఒంగోలు సబర్బన్: అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడు నోట్లో శని అన్నట్లు తయారైంది అగ్రిగోల్డ్ బాధితుల పరిస్థితి. అగ్రిగోల్డ్ సంస్థకు వేల కోట్ల విలువగల ఆస్తులున్నా వాటిని అమ్మి బాధితులకు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అడ్డు గోడలా మారారు. దాదాపు రూ.15 వేల కోట్లకు పైగా విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై చంద్రబాబు కన్ను పడింది. ఆయనతోపాటు ఆయన పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా గద్దల్లా వాలిపోయారు. ఇంకేముంది దొరికిన కాడికి ఆస్తులు లాగేసుకున్నారు. అయినా ఇంకా డిపాజిట్‌దారులకు చెల్లించేదానికన్నా ఎక్కువగానే ఉన్నాయి. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు బాధితులపై కనికరం లేకుండాపోయింది. నాలుగున్నరేళ్లుగా బాధితులను అవిగో ఇస్తున్నా.. ఇవిగో ఇస్తున్నా అంటూ ఊరిస్తూ.. ఉసూరుమనిపిస్తున్నారంటే చంద్రబాబుది ఎంత కాఠిన్యమైన మనస్సో అర్థమవుతుంది. చివరకు ఆయన ఐదేళ్లు పరిపాలనా ఫలాలు అనుభవించాడు. కానీ బాధితులకు మాత్రం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా విదల్చలేదు. వేల కుటుంబాలను నిలువునా ముంచాడనటంలో సందేహం లేదు. రూపాయి రూపాయి కూడబెట్టుకున్న వారు కొందరు.. ఉన్నదానిలోనే కొంత దాచుకున్న వారు మరి కొందరు.. వడ్డీ వస్తుందిలే అని ఉన్నది మొత్తం డిపాజిట్ చేసిన ఇంకొందరు.. వృత్తి పని, ఉద్యోగాలు చేస్తూ ప్రవృత్తిగా డిపాజిట్ల సేకరణ చేపట్టిన వారు ఇంకొందరు.. ఇలా అగ్రిగోల్డ్ సంస్థను నమ్మిన వారంతా దగా పడ్డారు. డబ్బు తిరిగొస్తుందో రాదోననే ఆందోళనలో ప్రాణాలు సైతం తీసుకున్నారు. అవ్వా వెంకట రామారావు చైర్మన్‌గా 1995లో అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించిన నాటి నుంచి సంస్థపై కేసులు పెట్టే వరకు ఎందరో నమ్మి డబ్బు దాచుకుంటే వారి నోట్లో మట్టి కొట్టి చోద్యం చూస్తున్నారు. సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని డిపాజిటర్లకు డబ్బు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుక మడతేసింది. దేశంలోని ఆరు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు ఉన్నారు. ప్రస్తుతం వారు అగ్రిగోల్డ్ బాధితులుగా మారారు. ఏపీ సీఐడీ లెక్కల ప్రకారం 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. ఒక్క మన రాష్ట్రంలోనే 19.52 లక్షల మంది ఉన్నారు. డిపాజిటర్లకు మొత్తం రూ.6,380 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. ఒకానొక సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా అగ్రిగోల్డ్ ఆస్తులు మొత్తం రూ.10 వేల కోట్లు ఉన్నాయని ప్రకటించారు. ఇకపోతే పలువురు మంత్రులు రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. ఇన్ని ఆస్తులున్నప్పుడు బాధితులకు డబ్బు చెల్లించేందుకు అభ్యంతరం ఏమిటీ అంటే ఆలస్యమయ్యేకొద్దీ డైరెక్టర్ల పేరు మీద, సంస్థలోని బినామీల పేరుమీద ఉన్న ఆస్తులను కొట్టేయడానికి పరిపాలనలో ఉన్న పెద్దలు వేసిన ఎత్తుగడ. అందుకే గత నాలుగున్నరేళ్లుగా కాలయాపన చేస్తూ బాధితుల ఉసురు పోసుకుంటున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. తాను ఎంతో అనుభవమున్న ముఖ్యమంత్రిని అని చెప్పుకుంటున్న చంద్రబాబు తన అనుభవాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి అమాయకులను, కడు పేద వారిని నిలువునా మోసం చేసి కంటి మీద కునుకు లేకుండా చేయటంలో దిట్ట అనిపించుకుంటున్నాడు. చివరకు గుంటూరు–విజయవాడ హైవేపై ఉన్న హాయ్‌ల్యాండ్ లాంటి రూ.వందల కోట్ల విలువ గల ఆస్తిని కొట్టేయటానికి కూడా వెనుకాడలేదంటే బాధితులను ఆదుకోవాలన్న ఆలోచన ఏమేరకు ఉందో అర్థమవుతుంది. ఆది.. అంతం.. బాబు జమానాలోనే.. 1995లో అగ్రిగోల్డ్ సంస్థను అప్పటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రోత్సహించారు. అప్పట్లో చంద్రబాబు ఈ సంస్థకు చెందిన కొన్ని ప్రారంభోత్సవాలకు కూడా వెళ్లారు. డిపాజిట్ల ద్వారా అగ్రిగోల్డ్ కూడబెట్టిన ఆస్తులు దాదాపు రూ.10 వేల కోట్లకు పైగా చేరాయి. చివరకు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఆ సంస్థ బోర్డు తిప్పేసింది. దీంతో బాధితులు రోడ్డున పడ్డారు. లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులు లబోదిబోమంటున్నారు. జేబు సంస్థ సీఐడీతో కాలయాపన సీఐడీని తన కనుసన్నల్లో పెట్టుకుని కోర్టుకు ఎప్పడికప్పుడు సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేయడమే ధ్యేయంగా పెట్టుకున్నారు సీఎం చంద్రబాబు. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా కనీసం చలనం లేకుండా ముఖ్యమంత్రి చెప్పినట్టు నడుచుకుంటూ బాధితులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నాలుగు సంవత్సరాలుగా ఆస్తులన్నీ గుర్తించామని చెబుతున్న సీఐడీ గత మూడు నెలల క్రితం అగ్రిగోల్డ్ వ్యవహారంలో చంద్రబూబు, రాష్ట్ర సీఐడీ విభాగం అధికారులు హైడ్రామాకు తెరలేపారు. సంవత్సరాల తరబడి అగ్రిగోల్డ్ బాధితులు తమకు న్యాయం చేయాలంటూ కాళ్లా...వేళ్లా పడినా కనికరించని చంద్రబాబు ప్రభుత్వం ఇక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ 2019 డిసెంబరులో కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. వేల కోట్ల రూపాయల విలువగల ఆస్తులు స్వాధీనం చేసుకున్న సీఐడీ పోలీసులు కోర్టుకు కూడా సక్రమంగా ఆస్తుల వివరాలు అందించకుండా దాచిపెట్టి ఉంచారు. అధునాతనంగా జిల్లాల వారీగా కొత్తగా కొన్ని ఆస్తులు కనుగొన్నామని చెప్పడం బాధితుల ముఖాలకు మసిపూసి మారేడు కాయ చందంగా తయారైంది. చివరకు సీఐడీ అధికారుల పనితీరు ఎలా ఉందంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. కళ్ల ముందు జిల్లాలో రూ.కోట్ల విలువైన ఆస్తులు ఉన్నా గతంలో తూతూ మంత్రంగా అగ్రిగోల్డ్ ఆస్తులు గుర్తించినట్లు కోర్టులకు సమాధానాలు చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ.. తీరా ఎన్నికలు సమీపిస్తుండే సరికి ప్రభుత్వ పెద్దల ఎత్తుగడలకు ఊతమిస్తూ సాక్షాత్తు సీఐడీ అధికారులు ఇప్పుడు కొత్తగా ఏదో కష్టపడినట్టు.. నూతనంగా ఆస్తులు గమనించామని చెప్పటం విడ్డూరంగా మారింది. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు ఔరా.. అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఎన్నికల వేళ ‘ఎల్లో’ నాటకం ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.250 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి మాత్రమేనని చెప్పారు. అలా చూసుకున్నా సీఐడీ గణాంకాల ప్రకారం 6.49 లక్షల మంది ఉన్నారు. ఆ లెక్కన చూసుకుంటే బాధితులకు రూ.336 కోట్లు అవసరం ఉంది. రూ.250 కోట్లు చెల్లించిన ప్రభత్వం మిగతా రూ.86 కోట్ల సంగతి చెప్పనేలేదు. అది కూడా ఎన్నికలు దగ్గర పడేసరికి ప్రకటించారు. ఇక ఎన్నికల షెడ్యూలు వచ్చింది ఎన్నికల తేదీ ఏప్రెల్ 11.. అంటే ఎన్నికల లోపు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బు వచ్చే పరిస్థితి లేనట్లే. అదికూడా రూ.10 వేల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారికి మాత్రమే. రోజు వారీ, నెలవారీ, మూడు నెలల వారీ చెల్లించిన వారికి డబ్బు చెల్లించే అవకాశమే లేదు. బాధితుల ఒత్తిడికి గ్రామాలు విడిచిన ఏజెంట్లు అగ్రిగోల్డ్ ఏజెంట్లుగా మారి డిపాజిట్లు వసూలు చేసిన వారు బాధితుల ఒత్తిడితో స్వగ్రామాలు వదిలి వెళ్లిపోయారు. కొందరైతే భార్యా పిల్లలను సైతం వదిలి వెళ్లారు. ఊరుకాని ఊర్లలో హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లలో పనిచేసి జీవనం సాగిస్తున్నారు. బలికోరిన అగ్రిగోల్డ్.. డిపాజిట్ డబ్బులు వస్తున్నాయని ఆశపెట్టటంతో ఎంతగానో ఎదురుచూసిన బాధితులు నాలుగున్నర సంవత్సరాలుగా రాకపోయేసరికి ఎంతో మనోవేదన చెందారు. డబ్బుపై ఆశలు వదలుకున్న బాధితులు ఆత్మహత్యలే శరణ్యంగా భావించారు. దీంతో రాష్ట్రం మొత్తం మీద 260 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లాలో 28 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఈ మరణాలకు చంద్రబాబే బాధ్యుడని అగ్రిగోల్డ్ బాధితులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదిలా ఉండగా బాండ్ల వెరిఫికేషన్ పేరిట బాధితులను జిల్లా నలు మూలలనుంచి జిల్లా కేంద్రానికి రప్పించి మరీ పరిశీలన చేశారు. గతంలో పోలీసులతో పరిశీలింపజేసిన ప్రభుత్వం తీరా ఎన్నికలు దగ్గరపడే సరికి మళ్లీ రెండోసారి కోర్టుల ద్వారా బాండ్ల వెరిఫికేషన్ అని పితలాటకం పెట్టింది. రెండు దఫాలుగా వ్యవప్రయాసలకోర్చి ఒంగోలు వచ్చినా బాధితులకు డబ్బు ఇవ్వలేదు. కళ్లకు గంతలు కట్టుకున్న సీఐడీ జిల్లాలో వందల ఎకరాలు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఖరీదైన స్థలాలు నేరుగా అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నా సీఐడీ అధికారులు గుర్తించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో ఏకంగా అగ్రిగోల్డ్ పేరుతో 112.99 ఎకరాల భూములు ఉన్నాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు పండ్ల తోటలు, వృక్ష జాతి పంటల విస్తీర్ణాల వివరాల నమోదులో బయటపడిన ఆస్తులివి. కానీ ఈ ఆస్తుల వివరాలను సిఐడీ హైకోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొనలేదు. బొంతగుంటపల్లి సర్వే నంబర్ 22లో 8.52 ఎకరాలు, 23లో 5.94, 24లో 7.39, 25లో 21.94, 45లో 11.25, 46లో 9.16, 47లో 12, 49/1లో 3.58, 52లో 13.80, 53లో 7.01, 55లో 12.40 ఎకరాలు, మొగుళ్లూరు గ్రామంలోనూ 57.42 ఎకరాలు అగ్రిగోల్డ్ పేరుమీద ఉన్నాయి. సర్వే నంబర్ 334/1లో 10.31 ఎకరాలు, 334/2లో 3.77, 335/1లో 20.83, 335/2లో 8.42, 336లో 14.09 ఎకరాలు ఉన్నాయి. డైరెక్టర్ల అరెస్ట్‌లో సీఐడీ డ్రామాలు సంస్థ చైర్మన్‌తో పాటు పలువురు డైరెక్టర్లను అరెస్ట్ చేసిన పోలీసులు దాదాపు 20 మందికి పైగా డైరెక్టర్లను అరెస్ట్ చేయకుండా వదిలేశారు. అరెస్టయిన వారితో పాటు బయట ఉన్న డైరెక్టర్ల బినామీ ఆస్తులను వేల కోట్ల రూపాయల విలువగల వాటిని ఇప్పటికే కొట్టేశారు కూడా. ఇకపోతే ప్రశాశం జిల్లాలో ఉన్న ప్రధాన డైరెక్టర్లను సీఐడీ అధికారులు అరెస్ట్ కూడా చేయలేదు. కొందరిని అరెస్ట్ చేసిన సీఐడీ.. వీరిని విడిచిపెట్టడంపై విమర్శలొస్తున్నాయి. జిల్లాలో అగ్రిగోల్డ్ డైరెక్టర్లు ఐదుగురు ఉన్నారు. వారిలో ఎస్వీపీ ఆంజనేయులుతో పాటు సంతపేటలోని అగ్రిగోల్డ్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న జి.శేషగిరిరావు, కరవదికి చెందిన శిగాకొల్లి మోహనరావు, పెరిదేపికి చెందిన పి.శివరామకృష్ణ, స్థానిక రంగారాయుడు చెరువు సమీపంలో వ్యాపారిగా స్థిరపడిన సాయిని శ్రీనివాసరావు డైరెక్టర్లుగా ఉన్నారు. నేరుగా డైరెక్టర్ల పేర్ల మీద, వారి కుటుంబ సభ్యుల పేర్ల మీద రూ.వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి. సంతనూతలపాడు మండలం ఎండ్లూరు గ్రామానికి చెందిన, ప్రస్తుతం ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో నివాసం ఉంటున్న ప్రధాన డైరెక్టర్ ఎస్వీపీ ఆంజనేయులు కోట్ల రూపాయలకు పడగలెత్తారు. జిల్లాలో ఇప్పటి వరకు 170.41 ఎకరాల భూములు అగ్రిగోల్డ్ పేరుతో ఉన్నట్లు గుర్తించారు. ఇంకా గుర్తించాల్సిన ఆస్తులు చాలా ఉన్నాయి. దానికితోడు వెలిగండ్ల మండలం బొంతగుంటపల్లి గ్రామంలో 16.24 ఎకరాల భూమి ఎస్వీపీ ఆంజనేయులు పేరుమీద ఆస్తులు ఉన్నాయి. సర్వే నంబర్లు 21/1, 35/1, 35/2, 36, 17/2, 32/1లో ఉన్న ఈ ఆస్తిని ఎస్వీపీ ఆంజనేయులు 2007 డిసెంబర్ 18న కొనుగోలు చేశారు. అదే గ్రామంలో నేరుగా అగ్రిగోల్డ్ పేరు మీద 21/1 సర్వే నంబర్లో 5.50 ఎకరాలు ఉంది. ప్రకటనలకే పరిమితం అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామని బాండ్లు సేకరిస్తూ ఉన్నారు. కానీ ఇంత వరకు న్యాయం జరగలేదు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక సార్లు బాధితులకు న్యాయం చేస్తారని చెప్పారు. ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నాం. నేను అగ్రిగోల్డ్ వలన రూ.లక్ష నష్టపోయా. – మారం రామిరెడ్డి, దర్శి అగ్రిగోల్డ్ లో చేరి తీవ్రంగా నష్ట పోయా అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరి తీవ్రంగా నష్ట పోయాం. డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం రాకపోవడంతో జీవనాధారం కోసం అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా చేరా.రూ.2 లక్షలకు పైగా పాలసీ కట్టించా. ఆ సంస్థను మూసివేయడంతో డబ్బు ఇప్పించాలని పాలసీదారులు గోల చేస్తున్నారు. ఏమి చేయాలో అర్థం కావడం లేదు. – గోను వెంకటనారాయణరెడ్డి, అగ్రిగోల్డ్ ఏజెంట్, జంగంవారిపల్లి డబ్బు కోసం ఎదురు చూస్తున్నా.. నేను కిరాణా వ్యాపారం చేస్తుంటా. దానిమీద వచ్చే ఆదాయంతో నెలకు కొంత మొత్తం చెల్లిస్తూ అగ్రిగోల్డ్ సంస్థలో సుమారు 1.20 లక్షలు దాచుకున్నా. ఇప్పుడేమో కంపెనీ దివాళా తీసింది. నా డబ్బులు ఎప్పుడు వస్తాయో అర్థం కావడం లేదు. ఇటీవల రూ.10 వేల లోపు డిపాజిట్ చెల్లిస్తామని చెప్పారు. దీనికి సంబంధించి కోర్టు వద్ద అధికారులకు 15 వేల రూపాయల విలువ గల బాండ్లు, బ్యాంక్ పాస్ పుస్తకం ఇచ్చాం. 20 రోజుల్లో వస్తాయన్నారు. ఎప్పుడు ఇస్తారా అని ఎదురుచూస్తున్నా. - కందగడ్డల సుబ్రహ్మణ్యం, సింగరాయకొండ ఆత్మహత్య చేసుకుంటున్నా జాలి లేదా? అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వ పెద్దలకు కనీసం జాలి కూడా ఉండటం లేదు. లక్షల కుటుంబాలు బజారున పడ్డాయి. కొత్తగా సీఐడీ అధికారులు జిల్లాతో పాటు రాష్ట్రంలో అగ్రిగోల్డ్ ఆస్తులు కనుగొన్నామని చెప్పటం విడ్డూరంగా ఉంది. ఆస్తులను సీఐడీ అధికారులు ఎప్పుడో కనుగొన్నారు. డైరెక్టర్ల ఆస్తులు కూడా కనుగొన్నారు. కానీ అన్నీ తెలియనట్టు సీఐడీ అధికారులు నటిస్తున్నారు. ఇది అత్యంత దారుణం. సంస్థ దెబ్బకు తమకు నష్టమేమీ జరుగలేదు. కేవలం ప్రభుత్వం వల్లనే తాము పూర్తిగా నష్టపోయాం. – అద్దంకి కోటేశ్వరరావు, అగ్రిగోల్డ్ ఏజెంట్ జగనన్నతోనే అయితేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జగనన్న ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ కస్టమర్లకు, ఏజెంట్లకు న్యాయం జరుగుతుంది. మా కుటుంబ సభ్యులం రూ.3 లక్షలదాకా అగ్రిగోల్డ్ సంస్థకు కిస్తీలు కట్టా. అదే విధంగా ఏజెంటుగా సుమారు 300 మందితో రూ.1.50 కోట్లమేర డిపాజిట్లు కట్టించా. నేటికి ఒక్కరికి కూడా నయాపైసా రాలేదు. గతంలో డబ్బు ఇస్తామని పోలీస్‌స్టేషన్‌లో బాండ్లు, ఇతర వివరాలు అందజేశాం. నేడు మళ్లీ కోర్టు ఆదేశాలతో రూ..10 వేల లోపు డిపాజిటర్ల వివరాలు ఇవ్వాలంటున్నారు. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టీడీపీ ప్రభుత్వం, నాయకులే అగ్రిగోల్డ్ సొమ్మును కాజేసి కస్టమర్లను అన్యాయం చేయాలని చూస్తున్నట్లు ఉంది. అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరాటం చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయితేనే అగ్రిగోల్డ్ డిపాజిట్లు తిరిగి వస్తాయని నమ్మకముంది. రానున్న ఎన్నికల్లో జగన్‌కు అండగా ఉంటాం. – ఎ.వెంకట సుబ్బమ్మ, అగ్రిగోల్డ్ కస్టమర్, ఏజెంట్, పామూరు -
13లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తాం
-
పేదలే సమిధలుగా అగ్లీ స్కాం
అది 32.02 లక్షల మంది ఆత్మఘోష.. 8 లక్షల మంది ఏజెంట్ల మనోవేదన.. ఏడు రాష్ట్రాలను కుదిపేస్తున్న కుంభకోణం.. అధిక వడ్డీకి ఆశపడిన చిరుజీవుల నుంచి డిపాజిట్లు సేకరించి నిండా ముంచేశారు.. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆ డబ్బుతో ఆస్తులు కొన్నారు. ఆ ఆస్తులను అమ్మి బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన ప్రభుత్వ పెద్దలు వాటిని అక్రమంగా దక్కించుకునే ఎత్తులు వేశారు. ఐదేళ్ల నుంచినిరవధికంగా పోరాడుతున్న అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినేదెవరు? 10 వేల కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల సమాహారమిది. అగ్రిగోల్డ్ కుంభకోణమిది.. దేశంలో ఏడు రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది చిరుద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు కష్టపడి పైసాపైసా కూడబెట్టిన సొమ్మును అగ్రిగోల్డ్ సంస్థలో మదుపు చేశారు. 1995 నుంచి డిపాజిట్ చేసిన డిపాజిటర్లకు సొమ్ము చెల్లించకుండా 2014లో సంస్థ చేతులెత్తేసింది. దీంతో రూ.7,623 కోట్లు డిపాజిట్ చేసిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్–నికోబార్ దీవులకు చెందిన 32,02,632 ఖాతాదారులు, మరో 8 లక్షల మంది ఏజెంట్లు రోడ్డున పడ్డారు. మొత్తం ఖాతాదారుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు 19,43,497 మంది ఉన్నారు. వీరు మొత్తం రూ.3,965 కోట్లు డిపాజిట్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం రాగానే అగ్రిగోల్డ్ యాజమాన్యం డిపాజిటర్లకు సొమ్ము చెల్లించకుండా చేతులెత్తేయడంతో బాధితులు పోలీస్స్టేషన్ల గడప తొక్కారు. అగ్రిగోల్డ్ మోసాలపై దేశంలో 29 కేసులు నమోదు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 15 కేసులు, తెలంగాణలో మూడు, కర్ణాటకలో 9, అండమాన్–నికోబార్, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఈ కేసు సీబీఐకి వెళితే తాము అనుకున్నట్టు జరగదనే ఎత్తుగడతో చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా సీఐడీకి కేసును అప్పగించింది. ప్రజల నుంచి ప్రభుత్వంపై తీవ్ర నిరసన వ్యక్తం కావడంతో అగ్రిగోల్డ్ మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకటరామారావుతోపాటు పలువురు డైరెక్టర్లను కంటితుడుపు చర్యగా అరెస్టు చేయించింది. అతి విలువైన అగ్రిగోల్డ్ ఆస్తులపై ప్రభుత్వ పెద్దలు కన్నేయడంతో సీఐడీ దర్యాప్తు సైతం సక్రమంగా జరగలేదనే విమర్శలున్నాయి. సీఐడీ దర్యాçప్తు చేస్తున్న తీరును అనేకమార్లు హైకోర్టు కూడా తప్పుపట్టింది. మొత్తం కుంభకోణం- 10,000 కోట్లు (దాదాపు) 7 రాష్ట్రాల్లోని బాధితులు- 32.02 లక్షలు ఏపీలో బాధితులు- 19.43లక్షలు దేశవ్యాప్తంగా నమోదైన కేసులు- 29 ఆత్మహత్యలు- 280 ఏపీలో కేసులు- 15 అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను కూడబెట్టుకోవడానికి మళ్లించింది. డిపాజిటర్లను మోసం చేసి అగ్రిగోల్డ్ సంస్థ దోషిగా నిలబడిన దశలో బాధితులకు న్యాయం చేయకుండా అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తులను కొట్టేయడానికి ప్రభుత్వ పెద్దలే గద్దల్లా వ్యవహరించారనే విమర్శలున్నాయి. అధిక వడ్డీ ఆశ చూపి ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో వేలాది ఎకరాలను కొనుగోలు చేసింది.. ఎన్నో ఆస్తులను కూడబెట్టింది. రియల్ ఎస్టేట్, అగ్రిఫామ్స్, హాయ్‌ల్యాండ్, బయోప్రొడక్ట్ ప్రాజెక్టులు, అగ్రి మిల్క్ తదితర 156 అనుబంధ సంస్థలకు ప్రజల డిపాజిట్లను మళ్లించింది. అంతటితో ఆగకుండా బంగారం, వెండి, వాహనాలు, భవనాలు వంటి స్థిర, చరాస్తులను పెద్ద ఎత్తున కూడబెట్టింది. ఈ నేపథ్యంలో అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలే వాటిని గద్దల్లా తన్నుకుపోవడానికి ప్రయత్నించారు. వాస్తవానికి.. ఇటువంటి భారీ కుంభకోణంలో ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి అగ్రిగోల్డ్ డైరెక్టర్లను అందరినీ అరెస్టు చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఆ కంపెనీకి, దాని యాజమాన్యానికి ఉన్న ఆస్తులు అమ్మి వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు చెల్లించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. అయితే.. ఈ కుంభకోణం బయటకు రాకముందే అగ్రిగోల్డ్ ఆస్తులను యాజమాన్యం అమ్మేసుకుంది. ఉన్న డబ్బును తమ సొంత అకౌంట్లకు మళ్లించుకుంది. ఇదంతా ప్రభుత్వ సహాయ, సహకారాలతోనే చేసిందనే విమర్శలున్నాయి. అందుకు ప్రతిఫలంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం కోట్లు విలువ చేసే కొన్ని కీలక ఆస్తులను నామమాత్రపు ధరలకే ప్రభుత్వ పెద్దలకు అమ్మేసింది. ఆస్తుల అటాచ్మెంట్లో ఆలస్యం, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడాన్ని బట్టి వీరి బంధం ఎంత బలమైందో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ పెద్దలు, యాజమాన్యానిది బలమైన బంధం అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్మోహన్రావు 2016, ఏప్రిల్ 30న టీడీపీలో చేరారు. చంద్రబాబుకు, అగ్రిగోల్డ్ యాజమాన్యానికి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఇదొక నిదర్శనం. అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను గతంలో టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, మాగంటి మురళీమోహన్‌లు కారుచౌకగా దక్కించుకునే ప్రయత్నాలు చేశారనే విమర్శలున్నాయి. అప్పట్లో హాయ్‌ల్యాండ్‌ను కొనుగోలు చేయడానికి వీరు బేరమాడినట్టు కథనాలు కూడా రావడం గమనార్హం. వాస్తవానికి 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్ భవనాలు, సామాగ్రి దాదాపు 25 ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూములు, భవనాలు, సామాగ్రి లెక్కగట్టినా మార్కెట్ విలువ భారీగానే ఉంటుందని, కానీ కారుచౌకగా దక్కించుకునే ప్రయత్నాలు జరిగాయనే విమర్శలున్నాయి. కాగా.. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో రాక ముందే అంటే.. 2015 జనవరి 19న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్ హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. మంత్రి భూములు కొనుగోలు చేశాక 2015, ఫిబ్రవరి 20న అగ్రిగోల్డ్ ఆస్తులను అటాచ్మెంట్ చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జీవో ఇవ్వడం గమనార్హం. డిపాజిటర్లు చెల్లించిన మొత్తానికి వడ్డీ కలుపుకుంటే రూ.10 వేల కోట్ల కుంభకోణమైన అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల వాస్తవ విలువలో పరస్పర విరుద్ధ అంచనాలు ఉన్నాయి. దాదాపు 23 వేల ఎకరాలతోపాటు అనేక భవనాలు, ఇతర ఆస్తుల విలువ రూ.3,940 కోట్లు అని గతంలో ప్రకటించిన సీఐడీ తాజాగా రూ.3,861 కోట్ల 76 లక్షలని ప్రకటించడం గమనార్హం. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.2,200 కోట్లు ఉంటుందని ఎస్సెల్ గ్రూప్ సంస్థ పేర్కొంటే, వాటి విలువ రూ.2,500 కోట్లు ఉంటుందంటూ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు చెప్పారు. వాస్తవానికి రూ.10 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన అగ్రిగోల్డ్ ఆస్తులను బహిరంగ మార్కెట్లో ఖచ్చితంగా అమ్మగలిగితే రూ.35 వేల కోట్లు విలువ చేస్తాయని అంచనా. బాధితుల వెతలెన్నో.. అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేయడంతో న్యాయం కోసం బాధితులు ఏళ్ల తరబడి అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. 2015 నుంచి రాష్ట్రవ్యాప్తంగా బాధితులు చేపట్టిన ఉద్యమాలకు లెక్కేలేదు. బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, సీపీఐ, సీపీఎం, బీజేపీలు అండగా నిలిచాయి. బాధితులకు డిపాజిట్లు చెల్లించకపోగా చనిపోతే పరిహారం అందించి సరిపెట్టడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇప్పటివరకు దాదాపు 280 మందికి పైగా బాధితులు మరణించగా వారిలో 143 మందికి మాత్రమే రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చి సరిపెట్టారు. అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు డబ్బులు చెల్లిస్తామని రెండేళ్ల క్రితం చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఆ దిశగా పూర్తి చర్యలు చేపట్టలేదు. రెండు నెలల క్రితం రూ.250 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం ఇటీవల జీవో విడుదల చేసింది. అయితే ఆ మొత్తం ఇంతవరకు విడుదల చేయకపోవడం గమనార్హం. మరోవైపు ప్రతి జిల్లాలోనూ ఉన్న వేలాది మంది డిపాజిటర్లు బాండ్ల పరిశీలనకు దూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు వెళ్లడానికి తీవ్ర వ్యయప్రయాసలు పడుతున్నారు. గత నెల 19న ప్రారంభించిన బాండ్ల పరిశీలన ఈ నెల 11 వరకు కొనసాగుతుంది. అయితే బాండ్ల పరిశీలన నత్తనడకన సాగుతుండటంతో ఈ నెల 20 వరకు పొడిగించాలని బాధితులు కోరుతున్నారు. కాగా, బాండ్ల పరిశీలనలో.. రోజువారీగా కట్టిన బాండ్లు, నెలవారీగా కట్టిన బాండ్లకు సంబంధించిన నగదు రసీదులు, కంపెనీ ఇచ్చిన రూ.పదివేల లోపు చెక్కులు తీసుకోవడం లేదు. కంపెనీ ఇచ్చిన సెటిల్మెంట్ (పే ఆర్డర్ రిసీప్ట్)ను కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదు. ఒకేసారి రూ.10 వేల మొత్తాన్ని చెల్లించినవారి బాండ్లు మాత్రమే పరిగణనలోకి తీసుకోవడంతో వారికే ఇస్తారేమోనన్న అనుమానాన్ని డిపాజిటర్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రూ.10 వేల డిపాజిటర్లకు చెల్లింపు మొత్తాల్లో కోతపెట్టడమే ప్రభుత్వం ఎత్తుగడగా ఉంది. రూ.10 వేలు చెల్లించిన వారు దాదాపు ఎనిమిది లక్షల మంది ఉంటారని చెబుతున్నారు. వారికి ఖచ్చితంగా చెల్లిస్తే కనీసం రూ.363 కోట్లు అవసరం. అయితే ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కోట్లు ఎంతమందికి ఇస్తారన్నది అనుమానమే. బాధితుల పక్షాన వైఎస్సార్సీపీ పోరాటం లక్షలాది మంది అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గట్టి పోరాటం చేస్తోంది. ప్రత్యేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ ఏర్పాటు చేసి లేళ్ల అప్పిరెడ్డి నేతృత్వంలో ఉద్యమాన్ని నడుపుతోంది. డిపాజిట్లు తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, ప్రభుత్వం తక్షణం రూ.20 వేల లోపు ఉన్న డిపాజిట్లు చెలించి, మిగిలినవారికి కాల పరిమితితో కూడిన బాండ్లు ఇవ్వాలని బాధితుల భరోసా కమిటీ డిమాండ్ చేస్తోంది. మానసిక వేదనతో మృతి చెందిన బాధితులు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం అందించాలని కోరుతోంది. కనికరం లేని సర్కార్ ఎండనకా వాననక నెట్టుడు బండిపై అరటి పళ్లు అమ్ముకోగా వచ్చిన డబ్బు రూ.80 వేలను అగ్రిగోల్డ్‌లో దాచుకున్నాను. వృద్ధాప్యంలో ఈ డబ్బు ఉపయోగపడుతుందని ఆశించా. ఇప్పుడా డబ్బులు రావని చెబుతున్నారు. మాలాంటి పేదలపై ఈ ప్రభుత్వానికి కనికరం కూడా లేదు. మా డబ్బు వెనక్కి ఇప్పించేలా ఇకనైనా చర్యలు తీసుకోవాలి. –మాకం గాలెమ్మ, యర్రగొండపాలెం, ప్రకాశం న్యాయం జరగడం లేదు ఎంతో కష్టపడి తమలపాకులు పండించి వచ్చిన పైసా పైసా కూడబెట్టి అగ్రిగోల్డ్‌లో దాచుకున్నాం. డబ్బు చేతికొస్తుందనుకున్న సమయంలో సంస్థ మూతబడింది. టీడీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసింది. అప్పటి నుంచి మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురు చూస్తూనే ఉన్నాం. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదు. – పాచిపెంట నీలకంఠం, విజయనగరం అప్పులు చేసి డబ్బులు కట్టా ప్రతి నెలా రూ.1,500 కట్టాను. సమయానికి డబ్బులు లేకపోయినా అప్పుచేసి కట్టాను. ఆ విధంగా రూ. 50 వేలు కట్టా. దీంతో నేను అప్పులు పాలయ్యాను. ఈ విధంగా అగ్రిగోల్డ్ మోసం చేస్తుందని అనుకోలేదు. ప్రభుత్వం స్పందించి నాకు డబ్బులు చెల్లించే విధంగా చూడాలి. – చెవుల మస్తాన్, అగ్రిగోల్డ్ బాధితుడు, రాజుపాలెం అగ్రిగోల్డ్ మోసానికి డిపాజిటర్ల మృతి అగ్రిగోల్డ్ మోసాలకు ఎంతో మంది డిపాజిటర్లు మృతి చెందారు. నేను పిడుగురాళ్ల ఆఫీసులో 15 ఏళ్లు ఏజెంట్‌గా పనిచేసి రూ.20 లక్షలు డైలీ, ఆర్డీలు, డిపాజిట్లు కట్టించాను. అగ్రిగోల్డ్ వల్ల నష్టపోయిన లబ్ధిదారులకు నా సొంత డబ్బులు రూ.5 లక్షలు చెల్లించాను. దీంతో నా కుటుంబం రోడ్డున పడింది. ఇంకా కొంత మంది ఇస్తావా...చస్తావా.... అని నా వెంట పడుతున్నారు. ప్రభుత్వం కూడా మోసం చేసిన వారికే వంత పాడుతుంది. –జంగం రవీంద్ర, అగ్రిగోల్డ్ ఏజెంట్, రాజుపాలెం రాష్ట్రవ్యాప్తంగా మిన్నంటుతున్న అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రందనలు వినిపించడం లేదా? ఇది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వానికి ఎదురవుతున్న ప్రశ్న. అధికారం చేపట్టిన తొలినాళ్లలో అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ఈ ఐదేళ్లు నాన్చుడు ధోరణి అవలంబించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాయమాటలతో మరోసారి అగ్రిగోల్డ్ బాధితులను మోసం చేసేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏళ్లు గడుస్తున్నా బాధితులను ఆదుకునే దిశగా ప్రభుత్వం గట్టి ప్రయత్నం చేయలేదనే విమర్శలు ఇప్పటికే మిన్నంటాయి. – ఐ. ఉమామహేశ్వరరావు ,సాక్షి, అమరావతి -
అగ్రిగోల్డ్ మోసం సాక్షిగా..
-
దగాపడ్డ జీవితాలు
-
ఇందిరాపార్క్‌లో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్ష
-
ఆగ్రిగోల్డ్ మోసంతో తన బతుకు బడలైందన్న విజయలక్ష్మి
-
అగ్రిగోల్డ్ బాధితుల కోసం వైఎస్ఆర్సీపీ మహాధర్నా
-
అగ్రిగోల్డ్ ఆస్తులపై ఆ ఇద్దరు కన్నేశారు!
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ విజయవాడలో వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో సోమవారం మహాధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాల నుంచి అగ్రిగోల్డ్ బాధితులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, జోగిరమేష్, అడపా శేషు, అప్పిరెడ్డి, డీఎన్ఆర్, బొప్పన భవకుమార్ తదితరులు పాల్గొన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులపై ఆ ఇద్దరు కన్నేశారు అగ్రిగోల్డ్ ఆస్తులపై ఆంధ్రప్రదశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్‌లు కన్నేశారని వైఎస్సార్ సీపీ నేత కే పార్థసారధి వ్యాఖ్యానించారు. అందుకే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగటం లేదన్నారు. సోమవారం వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి ఎస్సెల్ సంస్థ ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అయ్యారని, ఆ తరువాత సదరు సంస్థ వెనక్కి వెళ్ళిపోయిందని తెలిపారు. వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోసం అనేక తాయిలాలు ఇస్తున్న చంద్రబాబు అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో మాత్రం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ పెద్దలు ఆస్తులు కాజేసే కుట్ర: పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అగ్రిగోల్డ్‌కు చెందిన వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వ పెద్దలు కాజేసే కుట్ర జరుగుతోందని వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. సోమవారం వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులు ధైర్యం కోల్పోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 11 వందల కోట్ల రూపాయలు కేటాయిస్తే 70శాతం ఉన్న చిన్న డిపాజిట్ దారులకు న్యాయం జరుగుతుందన్నారు. ఇటీవలి అసెంబ్లీ సమావేశాలలో గవర్నర్ ప్రసంగంలోనూ అగ్రిగోల్డ్ బాధితుల గురించి ప్రస్తావన లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల బీఎసీలో కూడా ఈ అంశాన్ని చేర్చలేదన్నారు. 7.93వేల మందికి కేవలం 363కోట్ల రూపాయలు ఇస్తే ఉపశమనం కలుగుతుందన్నారు. అగ్రిగోల్డ్ విషయంపై ప్రభుత్వం చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఆస్తులను చాలా వరకు గోప్యంగా ఉంచారని, కోర్టుల దృష్టికి తీసుకెళ్లటం లేదని తెలిపారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారంపై ఉన్నారన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో వారికి న్యాయం చేస్తామని చెప్పారు. -
మహబూబ్ నగర్లో అగ్రిగోల్డ్ భూముల వేలం పాట
-
బాబూ..ఇంకెంతమందిని పోట్టనబెట్టుకుంటావు?
-
‘మంత్రివర్గ భేటీలో అగ్రిగోల్డ్ బాధితుల ఊసే లేదు’
సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్ల రూపాయలు ప్రకటించడం పచ్చి అబద్ధమని అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. ఏపీ మంత్రివర్గం నిర్ణయాలకు సంబంధించి మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియాకు విడుదల చేసిన ప్రతులే అందుకు ప్రత్యక్ష నిదర్శనం అని పేర్కొన్నారు. అందులో ఎక్కడా కూడా అగ్రిగోల్డ్ ఊసే లేదని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెలలోనే ముగ్గురు అగ్రిగోల్డ్ బాధితులు గుండెలాగి మరణించినా.. ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికి 263 మంది బాధితులను పొట్టనబెట్టుకున్నా ప్రభుత్వం దాహం తీరలేదా అని ప్రశ్నించారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పోరాటాన్ని ఉధృతం చేస్తాం
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ విజయవాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అడపా శేషు విమర్శించారు. తమకు న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ బాధితులు అనేక ధర్నాలు చేస్తుంటే చంద్రబాబుకు కనపడడం లేదా అని ప్రశ్నించారు. విజయవాడలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన కఠారు శ్రీనివాసరావుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఇప్పటివరకు 260మంది అగ్రిగోల్డ్ బాధితులు చనిపోయారని, వారి మరణాలకు టీడీపీ మూల్యం చెలించక తప్పదని హెచ్చరించారు. ఈ నెల 30న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు, ఇబ్బందులపై అత్యవసర సమావేశం ఏర్పాటుచేశామని, అగ్రిగోల్డ్ బాధితులు తరఫున ఒకటో తేదీనుంచి వైఎస్సార్సీపీ పోరాటం ఉధృతం చేస్తోందని అడపా శేషు వెల్లడించారు. -
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం
అనంతపురం సప్తగిరి సర్కిల్: అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని , అధైర్యపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి తెలిపారు. స్థానిక వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఆదివారం అనంతపురం పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అనంతపురం పార్లమెంటు అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ కన్వీనర్ కొర్రపాడు హుస్సేన్‌పీరా అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ గత నాలుగున్నరేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. వారి సమస్యలను పరిష్కరించడంలో తీవ్రంగా విఫలమైందన్నారు. ప్రభుత్వంతో అమీతుమీ తెల్చుకునేందుకు వైఎస్సార్సీపీ వారికి అండగా నిలబడుతుందన్నారు. రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక కుంభకోణాల్లో అగ్రిగోల్డ్ స్కాం ఒకటని తెలిపారు. అగ్రిగోల్డ్ సంస్థ 8 రాష్ట్రాల్లో తన కార్యకలాపాలను కొనసాగించిందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థ పేద, మధ్య తరగతికి చెందిన లబ్ధిదారులతో రూ. 6,780 కోట్ల డిపాజిట్లను సేకరించారన్నారు. సేకరించిన సొమ్ముకు డిపాజిట్ల గడువు పూర్తయ్యే సమయానికి వాటిని చెల్లించకుండా మోసం చేశారన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు అప్పులకంటే విలువైన ఆస్తులు ఉన్నాయని తెలిపారు. విలువైన ఆస్తుల్లో ప్రధానంగా 16 వేల ఎకరాల భూమి, హాయ్‌ల్యాండ్ ఉన్నాయన్నారు. ఆయా ఆస్తులను కారుచౌకగా కాజేయాలని టీడీపీకి చెందిన పెద్దలు కుట్ర పన్నారన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో బాధితుల వివరాల సేకరణకు కార్యచరణను రూపొందించామన్నారు. జాబితాను సిద్ధం చేసేందుకు ప్రత్యేక దరఖాస్తును రూపొందించామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ బాధితుల వివరాలను సేకరిస్తున్నారన్నారు. జిల్లా కేంద్రంలోని అగ్రిగోల్డ్ బాధితుల వివరాల సేకరణకు జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. దీన్ని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు రాజగోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, శివకేశవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రాఘవేంద్ర, మోహన్‌రెడ్డి, సిలార్‌సాహెబ్, రాజేంద్రప్రసాద్, అల్లాబకష్, తిప్పేస్వామి, వెంకటరామిరెడ్డి, కృష్ణమోహన్, కవిత, షంషాద్‌బేగం తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు పాలనలో అభివృద్ది శూన్యం
-
అగ్రిగోల్డ్ బాధితులను బాబు నమ్మించి మేసం చేశారు
-
20న అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశాలు
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేత, వైఎస్సార్సీపీ నాయకుడు అడపా శేషు స్పష్టం చేశారు. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం
సాక్షి, గుంటూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్ బాసట కమిటీ రాష్ట్ర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో గురువారం బాధితుల పేర్లు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితుల లెక్కలను తగ్గించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. పోలీసుల సర్వేలో 19లక్షల 50వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నట్టు తేలిందని.. కానీ ప్రభుత్వం ముందే 10లక్షల మంది మాత్రమే ఉందని చెప్పడం అన్యాయమని అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని స్పష్టం చేశారు. -
ఇది దౌర్భాగ్యపు ప్రభుత్వం : అప్పిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం : అగ్రిగోల్డ్ బాధితులను మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సర్కారు చేస్తున్న కుట్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పార్టీ నాయకులు, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ అధ్యక్షుడు లేళ్ళ అప్పిరెడ్డి అన్నారు. బాధితులకు అండగా తమ పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు కంటి తుడుపు చర్యగా ప్రభుత్వం ప్రకటనలు చేస్తుందే తప్ప చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని విమర్శించారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ ప్రతి డిపాజిట్ దారునికి అంచెలంచెలుగా పరిహారం చెల్లిస్తామని అని కుటుంబరావు చెబుతున్నారు. కోర్టుకు చూపించని ఆస్తులకు సంబంధించి ఆయన ఈ నెల 8వ తేదీన అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. కానీ ఇంతవరకు ఎటువంటి పురోగతీ లేదు. ఈ కేసులో సీబీసీఐడి దర్యాప్తు లోపభూయిష్టంగా జరిగింది’ అని ఆరోపించారు. ఇంతటి దౌర్భాగ్యమా? అగ్రిగోల్డ్ కేసులో కొన్ని ఆస్తులను మాత్రమే కోర్టుకు చూపించి, మిగిలిన ఆస్తులను దోచుకోవాలని చూస్తున్న దౌర్భాగ్య ప్రభుత్వమిదని అప్పిరెడ్డి మండిపడ్డారు. బాధితుల సంఖ్య, వివరాలు, డిపాజిట్ తదితర వివరాలను చెప్పకుండా, అగ్రిగోల్డ్‌కు సంబంధించి వివరాలు ఆన్లైన్లో పెట్టకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. బాధితులకు ప్రస్తుతం 80 శాతం అంటే రూ.1180 కోట్లు, మిగిలిన 20 శాతం బాండ్ల రూపంలో చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ పార్టీ అధికారంలోకి రాగానే ఆరునెల్ల కాలంలో తాము డిమాండ్ చేసిన మొత్తాన్ని చెల్లిస్తామని పేర్కొన్నారు. నియోజక వర్గాల స్థాయిలో ఈనెల 18న సమావేశాలు నిర్వహించి, బాధితుల్లో మనోధైర్యాన్ని నింపుతామని వెల్లడించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని, ప్రభుత్వంపై ఉద్యమించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. -
అగ్రిగోల్డ్లానే అక్షయగోల్డ్ బాధితులనూ ఆదుకుంటాం
-
‘చంద్రబాబు మాట్లాడేది ఆయనకే అర్థం కావడం లేదు’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారా అని ప్రశ్నించారు. చుక్క భూములు కూడా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆ భూములను చంద్రబాబుకి చెందిన వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు. వైఎస్ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును హైకోర్టు జాతీయ దర్యాప్తు సంస్థకు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా? అంటూ సూటిగా ప్రశ్నించారు. అబద్ధాలకు అవార్డ్స్, రివార్డ్స్ ఇస్తే చంద్రబాబుకు ఇవ్వచ్చని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పూటకో మాట.. రోజుకో మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎవరితోనూ పొత్తులు ఉండవని.. ఒంటరిగానే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. 100 రోజులు ఆగితే ప్రజా వ్యతిరేకత అంటే ఏమిటో చంద్రబాబుకు తెలుస్తుందన్నారు. త్వరలో వైఎస్సార్ సీపీలోకి భారీ ఎత్తున చేరికలు ఉంటాయని అన్నారు. చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు.. చంద్రబాబు నాయుడు ఓ వీడియో ప్లే చేసి చిల్లర రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ మిథున్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మదనపల్లిలో ఆగస్టు నుంచి తిప్పారెడ్డి 60వేల గడియారాలు పంచుతున్నారని తెలిపారు. ఓ గడియారంలో టీఆర్ఎస్ ఫొటో ఉంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కుట్ర కోణమని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. రాజధాని శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను పిలవలేదా అని గుర్తుచేశారు. ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నాయకుడు రేవంత్ రెడ్డికి ఇచ్చింది మీ డబ్బు కాదా అని నిలదీశారు. నందమూరి హరికృష్ణ మృతదేహం దగ్గర టీఆర్ఎస్తో పొత్తుకు ప్రయత్నించారని కేటీఆర్ చెబితే.. అందులో తప్పేముందని చంద్రబాబు వ్యాఖ్యానించడం చూస్తే ఆయన వ్యక్తిత్వం ఎంటో అర్థమవుతుందన్నారు. వైఎస్సార్ సీపీకి ఎవరితోను కుమ్మక్కు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పోటీ చేస్తామని పేర్కొన్నారు. -
రాష్ట్ర డీజీపీకి చట్టాలు తెలుసా? తెలియవా?
-
చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..
-
‘వైఎస్ జగన్ పోరాటంతోనే ప్రభుత్వంలో చలనం వచ్చింది’
సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితులు తరఫున వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో పోరాడిన తరువాతే రాష్ట్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని అగ్రిగోల్డ్ బాసట కమిటీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నాయకులు లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. గురువారం అగ్రిగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ ధర్నా చేపట్టింది. గుంటూరు కలెక్టరేట్ ఎదుట అప్పిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా, బాపట్ల పార్లమెంటరీ సమన్వయకర్త నందిగం సురేష్‌లు పాల్గొన్నారు. ఈ ధర్నాలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున అగ్రిగోల్డ్ బాధితులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదని అన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ఏ విధంగా కొట్టేయాలన్న ఆలోచన మాత్రమే ప్రభుత్వానికి ఉందని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 260 మంది ఆత్మహత్య చేసుకుంటే.. ప్రభుత్వం 140 మందికి పరిహారం ఇచ్చి చేతులు దులుపుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ బాధితుల జాబితాను ఆన్లైన్లో ఎందుకు పెట్టడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాబితాలో తమ పేరు ఉందో లేదో అని అగ్రిగోల్డ్ బాధితులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. బాధితులను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే 1180 కోట్ల రూపాయలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారు. బాధితులకు చివరి పైసా వచ్చేవరకు వారి తరఫున పోరాటం చేస్తామన్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ఆరు నెలల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే ప్రభుత్వ పెద్దలు కొట్టేసిన అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని.. దొంగలను జైలుకు పంపుతామని హెచ్చరించారు. ముస్తాఫా మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తును టీడీపీ నాశనం చేసిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం 50 ఏళ్ల వెనక్కి వెళ్లిందన్నారు. అగ్రిగోల్డ్ సంస్థకు కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులు ఉన్న ప్రభుత్వం బాధితులకు న్యాయం చేయలేకపోయిందని మండిపడ్డారు. బాధితులు ధైర్యంగా ఉండాలని.. వారికి వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని తెలిపారు. నందిగం సురేశ్ మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో చంద్రబాబు ప్రభుత్వం కుమ్మక్కయిందని ఆరోపించారు. ప్రభుత్వం బాధితులకు న్యాయం చేసే పరిస్థితిలో లేదన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం అవుతుందని భరోసా నిచ్చారు. వైఎస్సార్ సీపీ బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. -
గుంటూరులో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా
-
అనంతపురంలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా
-
విశాఖలో అగ్రిగోల్డ్ బాధితులు ధర్నా
-
విశాఖ జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి
-
అగ్రిగోల్డ్ బాధితులకు అండగా వైఎస్సార్సీపీ ధర్నా
సాక్షి, అమరావతి : అగ్రిగోల్డ్ బాధితులకు అండగా, వారికి పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం రాష్ట్రంలోని 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాలు చేపట్టింది. ఈ ధర్నాలో అగ్రిగోల్డ్ బాధితులు పెద్దఎత్తున పాల్గొని తమ నిరసనను ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా 19లక్షల 70వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు విలవిలలాడిపోతున్నా..సర్కార్‌లో కనీస చలనం లేకపోవడం సిగ్గుచేటన్నారు. అగ్రిగోల్డ్ ఆస్తులు, అప్పులు, బాధితుల వివరాలను ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా చంద్రబాబు సర్కార్ స్పందించపోవటం దారుణమన్నారు. మరణించిన అగ్రిగోల్డ్ బాధితులందరికీ వెంటనే ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ముఖ్య నాయకులతో పాటు బాధితులు పెద్దఎత్తున పాల్గొని ధర్నాని విజయవంతం చేశారు. విశాఖ : యలమంచిని నియోజకవర్గ కన్వీనర్ యూవీ రమణమూర్తి రాజు ఆదేశాల మేరకు నియోజకవర్గంలో గల అగ్రిగోల్డ్ బాధితులు ధర్నాకు దిగారు. బలిరెడ్డి శ్రీను ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ దర్నాకు బాధితులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ధర్నాలో యూవీ రమణ మూర్తి రాజుతో పాటు సుకకుమార వర్మ, వైఎస్సార్సీపీ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కృష్ణా : అగ్రీగోల్డ్ బాధితులకు బాసటగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన ధర్నాకు బాధితులు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. మచిలీపట్నం నుండి వైఎస్సార్సీపీ సమన్వయకర్త పేర్ని నాని ఆధ్వర్యంలో బస్సులో అగ్రిగోల్డ్ బాధితులు విజయవాడకు బయలుదేరారు. విజయవాడలోని లెనిన్ సెంటర్లో నిర్వహించిన ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ నాయకులు, మాజీమంత్రి కె.పార్థసారధి, ఎమ్మెల్యే రక్షణనిధి, నగర పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్, అగ్రీగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేతలు అడపా శేషు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుంటూరు : ప్రభుత్వం వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ గుంటూరు కలెక్టరేట్ ముందు వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాధిత రాష్ట్ర కమిటి ధర్నాకు దిగింది. అగ్రిగోల్డ్ బాధితుల కమిటీ చైర్మన్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్యర్యంలో జరుగుతున్న ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి భారీగా బాధితులు తరలివచ్చారు. అనంతపురం : కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ బాసట కమిటీ ధర్నాకు దిగింది. ఈ ధర్నాలో ఆ పార్టీ ఎమ్మెల్సీ వెన్నపూసగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, అనంతపురం పార్లమెంట్ సమన్వయకర్త తలారి రంగయ్య, హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు శంకర్ నారాయణ, తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేతలు కొర్రపాడుహుస్సేన్ పీరా, శంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. కర్నూలు : అగ్రిగోల్డ్ భాదితులకు అండగా భారి ర్యాలి నిర్వహించారు .అగ్రిగోల్డ్ భాదితులకు న్యాయం చెయ్యాలంటూ అగ్రిగోల్డ్ బాసట కమిటి కలెక్టరేట్ ముట్టడించింది.ఈ ధర్నాలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఐజయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి ,కాటసాని రామిరెడ్డి ,కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బివై రామయ్య0, బాసట కమిటి సభ్యులు రుద్రగౌడ్ , కర్ర హర్షవర్దన్ రెడ్డి ,నంద్యాల నియోజకవర్గం సమన్వయకర్త శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక విశాఖలో జిల్లాలో అగ్రిగోల్డ్ ఏజెంట్ మృతి మునగపాక (యలమంచిలి) : అగ్రిగోల్డ్ ఏజెంట్ కరట్ల తాతరాజు (60) కస్టమర్ల ఒత్తిడి తట్టుకోలేక మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి మృతి చెందారు. విశాఖపట్నం జిల్లా యలమంచిలి నియోజకవర్గం మునగపాక మండలం నాగులాపల్లికి చెందిన తాతరాజు 15 ఏళ్లపాటు అగ్రిగోల్డ్ సంస్థలో ఏజెంట్‌గా పనిచేశారు. తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, ఇతర కస్టమర్లతో రూ.లక్షల్లో డిపాజిట్లు చేయించారు. అగ్రిగోల్డ్ సంస్థ బోర్డు తిప్పేసిన నేపథ్యంలో నాలుగేళ్లుగా ఈ సంస్థ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కస్టమర్లు తమ డిపాజిట్లు తిరిగి ఇప్పించాలంటూ తాతరాజుపై ఒత్తిడి తీసుకురావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం అపసార్మక స్థితికి చేరుకున్నారు. ఆస్పత్రికి తరలించేలోగా రాత్రికి మృతి చెందారు. పెద్దదిక్కుగా ఉన్న తాతరాజు మృతితో కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది. -
అగ్రిగోల్డ్ బాధితుల కోసం ఎందాకైనా
-
అగ్రిగోల్డ్ బాధితులకు కోసం ఎందాకైనా..
సాక్షి, అమరావతి: తీవ్ర మానసిక వేదనతో కుమిలిపోతున్న అగ్రిగోల్డ్ పాలుకావడంతో బాధితులకు న్యాయం జరిగేలా అండగా నిలిచి ఎందాకైనా పోరాడాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ ప్రాంతీయ సమావేశం ఉద్ఘాటించింది. విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశానికి పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన బాసట కమిటీ అసెంబ్లీ నియోకవర్గాల కో– ఆర్డినేటర్లు హాజరయ్యారు. బాసట కమిటీ రాష్ట్ర కో– ఆర్డినేటర్ లేళ్ల అప్పిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మంది ఖాతాదారులకు సంబంధించిన అగ్రిగోల్డ్ సమస్యపై రాజకీయ కోణంలో కాకుండా, వారికి న్యాయం జరగాలన్న లక్ష్యంతోనే తమ ఉద్యమం ఉంటుందని స్పష్టం చేశారు. ఆదుకుంటామంటూ హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అవకాశం ఉన్నప్పటికీ కావాలనే కాలయాపన చేసిందని, ఎన్నికల ముందు మళ్లీ బాధితులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. బాధితులకు బాసటగా నిలుద్దామని, వారిలో ఆత్మస్థైర్యం నింపడం ద్వారా ఏ ఒక్కరు ఆత్మహత్య చేసుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు అసెంబ్లీ కో– ఆర్డినేటర్లు మాట్లాడుతూ జనవరి 3వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేసేలా శ్రేణుల్ని సమాయత్తం చేస్తామన్నారు. బాధితుల్ని కలసి ధర్నాలో పాల్గొనేలా చేసి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. ఉద్యమంలో ఎవరు కలిసి వచ్చినా ఆహ్వానిస్తామని, బాధితులకు న్యాయం జరుగుతుందంటే అన్ని సంఘాలతోనూ కలిసి పోరాడాతామని వారు ప్రకటించారు. ప్రభుత్వం స్పందించకపోతే పాలనను స్తంభింపచేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్ నుంచి బాధితులకు ఇవ్వాల్సిన ప్రతి పైసా వసూలు చేసి ఇస్తారని, ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. సమావేశంలో పార్లమెంట్ నియోజకవర్గ కో– ఆర్డినేటర్లు రావూరి వీరవెంకట సత్యదుర్గాప్రసాద్(ఏలూరు), కొఠారి శ్రీనివాస్(మచిలీపట్నం), అడపా శేషు(విజయవాడ), మర్రి సుబ్బారెడ్డి(నరసరావుపేట), వనమా బాల వజ్రబాబు(గుంటూరు), చేజర్ల నారాయణరెడ్డి(బాపట్ల) మాట్లాడారు. పశ్చిమగోదావరి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల కో– ఆర్డినేటర్లు రాయప్రోలు శ్రీనివాసమూర్తి(భీమవరం), బాలం వెంకటేశ్వరరావు(గోపాలపురం), ఆర్.సూర్యనారాయణ(నిడదవోలు), కడియాల సూర్యనారాయణ(తణుకు), చింతకాయల సత్యనారాయణ(తాడేపల్లిగూడెం), గాజుల వెంకటేశ్వరరావు(ఉంగుటూరు), టి.నాగమురళి(దెందులూరు), బాలేపల్లి నాగరాజు(చింతలపూడి) తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాకు చెందిన చక్కా జగన్మోహనరావు(కైకలూరు), ఎండీ హాఫీజు రెహమాన్(మచిలీపట్నం), బంక ప్రసాద్(తిరువూరు), బొడ్డు అప్పలనాయుడు(విజయవాడ తూర్పు), లింగాల నిరిక్షణంకుమార్(మైలవరం), ముత్యాల వెంకటచలం(జగ్గయ్యపేట) మాట్లాడారు. గుంటూరు జిల్లాకు చెందిన టి.బ్రహ్మారెడ్డి(తాడికొండ), బొమ్మ నాగిరెడ్డి(తెనాలి), మామిడి రాము(గుంటూరు పశ్చిమ), ఈర్ల శివరామకృష్ణ (పెద్దకూరపాడు), సీహెచ్. పుల్లారెడ్డి(వినుకొండ), ఎన్.సత్యనారాయణ(గురజాల), కె.చంద్రశేఖర్(మాచర్ల), సన మహేందర్(బాపట్ల) ప్రసగించారు. -
సాయంత్రంలోపు ప్రభుత్వం స్పందించకపోతే..
సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. మాటలగారడీతో చంద్రబాబు నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా.. ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవరసరం ఏముందని ప్రశ్నించారు. కరెంట్ తీసేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడమేంటని నిలదీశారు. ఈ రోజు సాయంత్రంలోపు అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా.. బకాయిలు ఎందుకు చెల్లించకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను నాలుగేళ్లుగా ప్రభుత్వం నాన్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భాదితులు తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు. -
అగ్రీగోల్డ్ బాధితుల దీక్షను భగ్నం చేసిన పోలీసులు
-
అగ్లీగోల్డ్
-
‘అగ్రిగోల్ట్ బాధితులకు అండగా ఉంటాం’
సాక్షి, విజయవాడ : న్యాయం కోసం 20 లక్షల మంది అగ్రిగోల్ట్ బాధితులు ఆందోళన చేస్తుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. అగ్రిగోల్ట్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నాచౌక్‌లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రోజు రిలే దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ.. అగ్రిగోల్ట్ ఆస్తులు కాజేయాడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఇప్పటి వరకు బాధితులకు ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి సాయం కూడా అందలేదని ఆరోపించారు. 260మంది అగ్రిగోల్ట్ బాధితులు ఆత్మహత్య చేసుకుంటే కేవలం 143మందికి మాత్రమే పరిహారం ఇచ్చి చేతులు దులుపుకున్నారని మండిపడ్డారు. బాధితుల జాబితా ఇప్పటి వరకు ఆన్లైన్లో పెట్టలేదన్నారు. అగ్రిగోల్ట్ బాధితుల సమస్యలపై వైఎస్ జగన్ అసెంబ్లీలో ప్రశ్నించారని గుర్తు చేశారు. కృష్ణా జిల్లాలో అగ్రిగోల్ట్ సంస్థకు వెయ్యి కోట్ల ఆస్తి ఉందని ఆరోపించారు. బాధితులకు అండగా ఉంటూ..న్యాయం జరిగేవరకు ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితుల మరో సమరం
సాక్షి, అమరావతి: తమను ఆదుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు ప్రభుత్వంపై అగ్రిగోల్డ్ బాధితులు మరో సమరానికి సన్నద్ధమవుతున్నారు. గత మూడున్నరేళ్లుగా దశలవారీగా ఉద్యమాలు చేపట్టిన బాధితులు ఇకపై వివిధ రూపాల్లో పోరాటాలకు కార్యాచరణ రూపొందించారు. రాష్ట్రంలో 19.52 లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. పైసా పైసా కూడబెట్టి, అగ్రిగోల్డ్‌లో పెడితే ఉన్నదంతా ఊడ్చుకుపోయిందని, ఇక తాము ఎలా బతకాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను మోసం చేసిన అగ్రిగోల్డ్ యజమానులు బెయిల్‌పై బయటకు వచ్చి దర్జాగా తిరుగుతున్నారని, రూ.లక్షలు నష్టపోయిన తాము న్యాయం కోసం రోడ్డెక్కితే ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని మండిపడుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ‘స్పెషల్ పర్పస్ వెహికల్’ ఏర్పాటు చేసి, తమను ఆదుకోవచ్చని, అయినా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తదుపరి పోరాటంలో భాగంగా డిసెంబర్ 4వ తేదీ నుంచి 20వ తేదీ వరకు అన్ని మండల కేంద్రాల్లో బైక్, సైకిల్ ర్యాలీలు నిర్వహించనున్నారు. డిసెంబర్ 23 నుంచి 27వ తేదీ వరకు విజయవాడ ధర్నాచౌక్‌లో ఐదు రోజులపాటు రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. డిసెంబర్ 28వ తేదీన విజయవాడ ధర్నా చౌక్‌లో ఆమరణ దీక్ష చేపడతామని అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అధ్యక్షుడు బి.విశ్వనాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు ఆదివారం విజయవాడలో మీడియా సమావేశంలో ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం కాలయాపన చేస్తోందని ఆరోపించారు. ఆదుకుంటామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పుతున్నారని, న్యాయం చేయాలని కోరితే అసహనం వ్యక్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మీడియా సమావేశంలో ఉపప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్కే షరీఫ్, మీడియా కో–ఆర్డినేటర్ యశ్వంత్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రిగోల్డ్ బాధితునికి సీఎం చెంపదెబ్బ
అనంతపురం/అనంతపురం అర్బన్: పెట్టుబడి పెట్టిన డబ్బులన్నీ పోగొట్టుకుని, ఇప్పటికే తీరని దుఃఖంలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితుల పట్ల సీఎం చంద్రబాబు దౌర్జన్యంగా వ్యవహరించారు. తమ గోడు చెప్పుకునేందుకు వచ్చిన ఓ బాధితుడిపై చేయి చేసుకున్నారు. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అనం తపురంలో పర్యటిస్తున్న సీఎం జిల్లా కేంద్రం లోని ఆర్అండ్బీ అతిథిగృహంలో బస చేశారు. శనివారం ఉదయం ఆయనను కలిసేందుకు అగ్రిగోల్డ్ బాధితులు వచ్చారు. బాబు బయటకు వస్తున్నప్పుడు బాధితులంతా వినతిపత్రం అందజేసేందుకు ప్రయత్నించారు. ‘‘సార్! మేం అగ్రిగోల్డ్ బాధితులం. మాకు న్యాయం జరిగేలా చూడండి’’ అని అగ్రిగోల్డ్ బాధితుల ప్రతినిధి సిద్ధేశ్వర్ కోరాడు. ‘‘న్యాయం చేస్తున్నాం కదా’’ అని చంద్రబాబు బదులిచ్చారు. ‘‘నాలుగేళ్లుగా తిరుగుతున్నాం. న్యాయం చేస్తున్నామం టున్నారు. బాధితులెవరికీ ఇప్పటిదాకా నయాౖ పెసా రాలేదు’’ అని సిద్ధేశ్వర్ చెప్పబోయాడు. సీఎం స్పందిస్తూ.. ‘‘ఏయ్ వినయ్యా.. కోర్టులో ఉంది కదా’’ అని అన్నారు. ‘‘మన రాష్ట్రంలోనే 20 లక్షల మంది బాధితులు ఉన్నారు సార్’’ అంటూ సిద్ధేశ్వర్ తిరిగి బదులివ్వగా చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘ఏయ్ వినయ్యా’’ అంటూ సిద్ధేశ్వర్ చెంప చెల్లుమనిపించారు. ‘‘వేరే రాష్ట్రంలో ఎవరైనా పట్టించుకున్నారా? వాళ్లు(అగ్రిగోల్డ్ నిందితులు) పారిపోకుండా చూస్తున్నాం. న్యాయం చేస్తాం’’ అని సీఎం అన్నారు. ‘‘రాజ్యాంగం ఉండేది కూడా ప్రజల కోసమే కదా సార్. ఈ వారంలోనే ఐదుగురు బాధితులు చనిపోయారు’’ అంటూ సిద్ధేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సరేనయ్యా న్యాయం చేస్తామంటూ సీఎం అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి ముందుకు కదిలారు. కాతగాప్రభుత్వ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని, అధికారులను బాబు ఆదేశించారు. సీఎం శనివారం అనంతపురంలో అధికారులతో సమీక్షించారు. ఇందుకు పలు సూచనలు చేశారు. -
హే.. వినయ్యా నువ్వు: చంద్రబాబు అసహనం
సాక్షి, అనంతపురం : అగ్రిగోల్డ్ బాధితులపై సీఎం చంద్రబాబు నాయుడు దురుసుగా ప్రవర్తించారు. తమకు న్యాయం చేయాలని కోరిన అగ్రిగోల్డ్ బాధితుడు సిద్ధేశ్వర్‌ను హుంకరించిన చంద్రబాబు అసహనంతో చేయెత్తారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నాలుగేళ్లుగా పొరాడుతున్నా ఎలాంటి న్యాయం జరగలేదని చంద్రబాబు ఎదుట అగ్రిగోల్డ్ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే బాధితుడు సిద్ధేశ్వర్.. చంద్రబాబును నిలదీయగా.. ‘హే .. వినయ్యా నువ్వు!, ఆ కోర్టు వుంది కదా.. ఎవడేం చేస్తాడు. వేరే స్టేట్‌లో పట్టించుకున్నారా’ అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారు. మిగిలిన రాష్ట్రాల కంటే తానే బాగా చేస్తున్నానంటూ చంద్రబాబు కోపంతో ఊగిపోయారు. అగ్రిగోల్డ్ విషయంలో చేయాల్సిందంతా చేస్తున్నామంటూ అసహనంతో చంద్రబాబు మండిపడ్డారు. కాగా, సీఎం వైఖరిని అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తీవ్రంగా ఖండించింది. -
హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌లో భాగమే!
సాక్షి, హైదరాబాద్: హాయ్‌ల్యాండ్ తమది కాదని గత వారం చెప్పిన అగ్రిగోల్డ్ యాజమాన్యం ఇప్పుడు మళ్లీ మాట మార్చింది. సమాచార లోపంవల్లే ఆ పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ కూడా అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో భాగమేనని అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఈ విషయాలన్నింటితో వచ్చే వారం పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేస్తానని తెలిపారు. ఇదే సమయంలో సీఐడీ అధికారులు సైతం హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీదేనని హైకోర్టుకు నివేదించారు. అందుకు సంబంధించిన యాజమాన్య వివరాలను, తాజాగా దర్యాప్తు వివరాలను సీల్డ్ కవర్లో కోర్టు ముందుంచారు. వీటిని పరిశీలించిన హైకోర్టు, దర్యాప్తునకు సంబంధించిన వివరాలను పక్కన పెట్టి మిగిలిన వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. అదే విధంగా హాయ్‌ల్యాండ్‌ను తాకట్టుపెట్టి దాని యాజమాన్యం రుణం తీసుకున్న నేపథ్యంలో, ఆ రుణ దరఖాస్తును, ఎప్పుడు రుణం ఇచ్చారు.. రుణం తీసుకున్నప్పుడు.. హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. ప్రస్తుతం హాయ్‌ల్యాండ్ యజమానులు ఎవరు?.. తదితర వివరాలను తమ ముందుంచాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)ను హైకోర్టు ఆదేశించింది. మరోవైపు.. 2014లో హాయ్‌ల్యాండ్‌కు చెందిన 8 ఎకరాల భూమిని తాము కొనుగోలు చేశామని, అందువల్ల జప్తు నుంచి ఆ భూమిని విడుదల చేసేలా ఆదేశాలు జారీచేయాలని కోరుతూ శ్రీనివాసరావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని అటు ఎస్బీఐని, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్వి భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. విచారణ సందర్భంగా ఏపీ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ రెండు సీల్డ్ కవర్లను ధర్మాసనం ముందుంచారు. హాయ్‌ల్యాండ్ యాజమాన్యానికి సంబంధించిన వివరాలతో పాటు, సీఐడీ దర్యాప్తు నివేదికలు అందులో ఉన్నాయని తెలిపారు. హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ యాజమాన్యానిదేనని తెలిపారు. దీనిపై ధర్మాసనం అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డిని ప్రశ్నించింది. సమాచారం లోపంవల్ల పొరపాటు జరిగిందని, హాయ్‌ల్యాండ్ ఆర్కా లీజర్ అండ్ ఎంటర్టైన్మెంట్కు చెందిందని, ఇది అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీల్లో ఒకటని ఆయన కోర్టుకు నివేదించారు. గత వారం హాయ్‌ల్యాండ్ వ్యవహారంపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించామని, అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని ఆయనను ధర్మాసనం ప్రశ్నించింది. వచ్చే వారం పూర్తి వివరాలతో దాఖలు చేస్తానని జానకిరామిరెడ్డి చెప్పగా, ఏం వివరాలతో అఫిడవిట్ వేయాలని ఆలోచిస్తున్నారా? అంటూ ధర్మాసనం వ్యంగ్యంగా ప్రశ్నించింది. ఈ సమయంలో హాయ్‌ల్యాండ్ తరఫు సీనియర్ న్యాయవాది శ్రీధరన్ స్పందిస్తూ, అగ్రిగోల్డ్‌తో తమకు సంబంధం లేదంటూ గత వారం తాము దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని తనకు మౌఖిక సూచనలు వచ్చాయన్నారు. హాయ్‌ల్యాండ్ ఎండీ అరెస్టయ్యారని, అందువల్ల లిఖితపూర్వక సూచనలు రాలేదన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అగ్రిగోల్డ్, హాయ్‌ల్యాండ్ యజమానులు చాలా తెలివిగా సాలెగూడు అల్లారని, ఇందులో ఇప్పుడు వారే చిక్కుకుపోతున్నారని వ్యాఖ్యానించింది. తమ ముందున్న అన్ని డాక్యుమెంట్లను పరిశీలించి హాయ్‌ల్యాండ్ కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. -
గళాలకు సంకెళ్లు.. అగ్రిగోల్డ్ బాధితులపై ఉక్కుపాదం!
సాక్షి, గుంటూరు/ సాక్షి, అమరావతి/ నెట్వర్క్: అడుగడుగునా పోలీసులు... గజానికో బారికేడ్.. హాయ్‌ల్యాండ్ చుట్టూ 15 చెక్‌పోస్టులు... మిలటరీ దుస్తుల్లో భుజాన తుపాకులతో రిజర్వ్ పోలీసు బలగాలు... ‘అగ్రిగోల్డ్’, ‘హాయ్‌ల్యాండ్’.. అనే పేర్లు వినపడితే చాలు కన్నెర్ర చేస్తూ అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్లకు తరలింపు!.. ఇవీ బుధవారం విజయవాడ – గుంటూరు జాతీయ రహదారిపై కనిపించిన దృశ్యాలు. రాజధాని సమీపంలోని హాయ్‌ల్యాండ్‌కు వెళ్లే అన్ని మార్గాల్లో పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను అణువణువూ తనిఖీ చేశారు. హాయ్‌ల్యాండ్ వద్దకు ఎవరూ వెళ్లకుండా సెలవు ప్రకటిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు, వామపక్షాలు, వైఎస్సార్ సీపీ నేతలను అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీసు స్టేషన్లకు తరలించారు. మహిళలని కూడా చూడకుండా ఈడ్చుకుంటూ వ్యానుల్లోకి గెంటేశారు. ఉరితాళ్లతో మహిళల ఆందోళన అగ్రిగోల్డ్ ఏజెంట్లు, వినియోగదారుల సంక్షేమ సంఘం చేపట్టిన ‘చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి విజయవాడ, గుంటూరులోని రైల్వే స్టేషన్లు, బస్టాండ్లకు చేరుకున్న అగ్రిగోల్డ్ బాధితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కన్నుగప్పి హాయ్‌ల్యాండ్ వద్దకు వచ్చిన ఏలూరుకు చెందిన వృద్ధురాలిని అడ్డుకుని ఆటోలో తాడేపల్లి తరలించారు. మంగళగిరి ‘వై’ జంక్షన్ వద్ద పోలీసులను ప్రతిఘటించిన బాధిత మహిళలు తమను అరెస్ట్ చేస్తే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ ఉరితాళ్లను పట్టుకుని హెచ్చరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ‘మా ఆగ్రహ జ్వాలల్లో మాడిమసైపోతావ్ చంద్రబాబూ..’ అంటూ మహిళలు శాపనార్ధాలు పెట్టారు. పైసాపైసా కూడబెట్టి డబ్బు దాచుకుంటే తమ కడుపు కొడతారా? అంటూ కన్నీరుమున్నీరయ్యారు. ‘ఇంత విషం పెట్టి చంపండి.. లేదంటే అగ్రిగోల్డ్ యాజమాన్యాన్నైనా ఉరి తీయండి..’ అంటూ ఆక్రోశించారు. అరెస్టులు, గృహ నిర్బంధం అగ్రిగోల్డ్ బాధితులకు సంఘీభావంగా హాయ్‌ల్యాండ్ వద్దకు బయల్దేరిన సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, పి.మధు, హరినాధరెడ్డి, ఏపీ మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌లను పోలీసులు అరెస్టు చేశారు. బాధితులకు బాసటగా నిలిచిన వైఎస్సార్ సీపీ నేత, అగ్రిగోల్డ్ బాధితుల భరోసా కమిటీ కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డిని గుంటూరులో గృహ నిర్బంధం చేశారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా పోలీసుల్ని మోహరించారు. చలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి అనుమతి లేదని, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ముందస్తుగా కొంతమందిని అరెస్ట్ చేసినట్టు గుంటూరు అర్బన్ ఎస్పీ విజయరావు తెలిపారు. తాడేపల్లి కళ్యాణ మండపంలో బాధితుల ధర్నా గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులు, రోజువారీ కూలీలు, పనుల నిమిత్తం వెళుతున్న వారిని సైతం కిందకు దించి నడుచుకుంటూ వెళ్లాలని పోలీసులు ఆదేశించడంతో అవస్థలు పడ్డారు. హాయ్‌ల్యాండ్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు మంగళవారం నుంచే పలువురు నేతలు, అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులను గృహ నిర్భంధంలోకి తీసుకోవడంతోపాటు నోటీసులు జారీ చేసి హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. అయినప్పటికీ అగ్రిగోల్డ్ బాధితులు హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి రావడంతో అరెస్టులు చేసి తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా పోలీసులు అనుమతించకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సుమారు 2 గంటల పాటు ధర్నా నిర్వహించారు. మరోవైపు హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్ గ్రూపు కంపెనీలకు చెందినదేనంటూ హైకోర్టుకు సమర్పించిన తమ నివేదికను వక్రీకరించడంపై మానసిక వ్యధకు గురైనట్లు మేనేజింగ్ డైరెక్టర్ అల్లూరు వెంకటేశ్వరరావు పేరుతో ప్లెక్సీలను హాయ్‌ల్యాండ్ వద్ద ఏర్పాటు చేశారు. లెఫ్ట్ నేతల అరెస్టులు.. హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి తరలి వస్తున్న పలువురు నేతలు, అగ్రిగోల్డ్ బాధితుల పట్ల పోలీసులు జులుం ప్రదర్శించారు. హాయ్‌ల్యాండ్‌కు వస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణలను కనకదుర్గ వారధి వద్ద అరెస్టు చేసి విజయవాడకు తరలించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రా మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, సినీనటుడు నాగినీడులతోపాటు అగ్రిగోల్డ్ ఏజెంట్లు, బాధితులను మంగళగిరి వద్ద పోలీసులు అరెస్టు చేసి నల్లపాడు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బాధితులు పోలీసు స్టేషన్లో బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. బాధితులకు న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని ముప్పాళ్ల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ముందస్తు అరెస్టులు, గృహ నిర్భంధాలపై ఆయన మండిపడ్డారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. బాధితులకు బాసటగా వైఎస్సార్ సీపీ ర్యాలీ అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆక్రోశం చంద్రబాబుకు అగ్రిగోల్డ్ నుంచి పార్టీ ఫండ్...చంద్రబాబు నాయుడు 1995లో విజయవాడలో అగ్రిగోల్డ్ సంస్థను ప్రారంభించి ఆ సంస్థ నుంచి పార్టీ ఫండ్‌గా కొంత సొమ్ము తీసుకున్నారు. అనంతరం ఆయన హయాంలోనే 2015లో అగ్రిగోల్డ్ ప్లేటు ఫిరాయించింది. అనేకసార్లు చర్చలకు పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రూ.11 వేల కోట్లు విడుదల చేసి బాధితులకు న్యాయం చేయాలి. – విశ్వనాధరెడ్డి, అనంతపురం ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం... అగ్రిగోల్డ్‌లో రూ.60 లక్షల దాకా డబ్బులు కట్టించాం. బాధితులంతా మా ఇంటికి వచ్చి నిలదీయడంతో ఊళ్లో తలెత్తుకోలేకపోతున్నాం. వాళ్లు అడిగే మాటలకు ఒక్కోసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మా మీద నమ్మకంతో అంత సొమ్ము కట్టిన వారికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఇలా వ్యవహరించడం దారుణం. – రాజ్యలక్ష్మి, నెల్లూరు ఉరి తీయాలి... అగ్రిగోల్డ్ సంస్థలో కట్టిన డబ్బులు నా పిల్లాడి వైద్యానికి పనికొస్తాయనుకున్నాం. 2015 జనవరి 1వ తేదీన మా బాబుకు రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మూడు రోజుల్లో డబ్బులొస్తాయి, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించవచ్చనుకున్నాం. రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్ చేయించినా మా అబ్బాయి ఆరోగ్యం క్షీణించింది. దీనికి బాధ్యులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలి. – భాగ్యవతి, చిత్తూరు హాయ్‌ల్యాండ్‌పై బాబు కన్ను పడకుంటే న్యాయం జరిగేది.. చంద్రబాబు ఉద్యమం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. చివరకు కోర్టులను సైతం మభ్యపెడుతూ అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఆయన హాయ్‌ల్యాండ్‌పై కన్నేయకుంటే ఈపాటికి బాధితులకు న్యాయం జరిగేది. బాధితులకు అన్యాయం చేస్తే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పటం ఖాయం. – ఎం.అప్పలనాయుడు (విజయనగరం) నేరస్తుల్లా దెబ్బలు తినే దుస్థితి కల్పించింది... పేదలు కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్‌లో కట్టి మోసపోయారు. న్యాయం చేయాల్సిన ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించి నీరుగార్చింది. సొమ్ము కట్టి మోసపోయింది కాకుండా నేడు నేరస్తుల్లా పోలీసులతో దెబ్బలు తినాల్సిన పరిస్థితిని ప్రభుత్వం మాకు కల్పించింది. – బి. వెంకాయమ్మ, అగ్రిగోల్డ్ బాధితురాలు, తణుకు పోలీసులను ఉసిగొల్పారు.. అగ్రిగోల్డ్‌కు చెల్లించిన డబ్బులిప్పిస్తామని ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచింది. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ మా కడుపు కొడుతోంది. డబ్బులు ఇప్పించకపోగా పోలీసులను ఉసిగొలిపి చోద్యం చూస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతాం. – జి.వీరలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా మేం చేసిన తప్పేంటి? కష్టపడి సంపాదించిన డబ్బు కట్టి మోసపోవడమే మేం చేసిన తప్పా? కడుపుమండి రోడ్లపైకి వస్తే ప్రభుత్వం మాపై పోలీసులను ప్రయోగించి దారుణంగా ప్రవర్తిస్తోంది. శ్రీకాకుళం నుంచి వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చా. పోలీసులు నేరస్తుడిలా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లో పెట్టారు. – డి.బెహర, శ్రీకాకుళం ఊరు వదిలి దాక్కుని బతుకుతున్నా... నేను అగ్రిగోల్డ్ ఏజెంట్‌గా పని చేశా. మా ఊరి ప్రజల నుంచి రూ.50 లక్షల వరకూ డబ్బులు కట్టించా. ఇప్పుడు వాళ్లంతా మా ఇంటి మీద పడుతున్నారు. సమాధానం చెప్పుకోలేక ఊరు వదిలి దాక్కొని బతుకుతున్నా. ఇలా ఇంకా ఎన్ని రోజులు దాక్కొని బతకాలి? ప్రభుత్వం ఇప్పటికైనా అగ్రిగోల్డ్ ఆస్తులు వేలం వేసి మాకు డబ్బు చెల్లించి న్యాయం చేయాలి. లేకుంటే చావే శరణ్యం. – కె. సురేశ్, రాజమండ్రి వైఎస్సార్సీపీ నాయకుల గృహ నిర్బంధం అగ్రిగోల్డ్ బాధితులు చేపట్టిన హాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. వైఎస్సార్ సీపీ నేత లేళ్ల అప్పిరెడ్డిని ఆయన కార్యాలయంలో గృహ నిర్భంధం చేసిన పోలీసులు పార్టీకి చెందిన పలువురు నేతలకు నోటీసులిచ్చారు. హౌస్ అరెస్టులో ఉన్న అప్పిరెడ్డిని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫా, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త చంద్రగిరి ఏసురత్నం, పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహర్‌నాయుడు తదితరులు పరామర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు భరోసాగా నిలవకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి దౌర్జన్యాలకు పాల్పడడం దారుణమని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు గుంటూరు లాడ్జి సెంటర్ నుంచి శంకర్‌విలాస్ సెంటర్ వరకు అగ్రిగోల్డ్ బాధితులకు మద్దతుగా నిరసన ర్యాలీ నిర్వహించారు. రెండు రోజులుగా గృహ నిర్భంధంలో ఉన్న సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను వైఎస్సార్ సీపీ గుంటూరు పార్లమెంట్ సమన్వయకర్త కిలారి వెంకట రోశయ్య, తూర్పు ఎమ్మెల్యే షేక్ మహమ్మద్ ముస్తఫాలు కలిసి సంఘీభావం తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని ప్రకటించారు. మరో అగ్రిగోల్డ్ బాధితుడు మృతి మాచర్ల: హాయ్‌ల్యాండ్‌కు సంబంధించి వస్తున్న వార్తల నేపథ్యంలో తీవ్ర ఆందోళనకు గురైన ఓ అగ్రిగోల్డ్ బాధితుడు మనోవేదనతో మరణించాడు. గుంటూరు జిల్లా మాచర్లలో చిరు వ్యాపారంతో పొట్టపోసుకుంటూ రూపాయిరూపాయి కూడబెట్టి.. అగ్రిగోల్డ్‌లో పొదుపు చేసిన కొమెర గోవిందు (52) బుధవారం కన్నుమూశాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు.. పట్టణంలోని రైల్వేస్టేషన్ రోడ్‌కు చెందిన గోవిందు బడ్డీ కొట్టు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అందులో వచ్చిన కొద్దికొద్ది మొత్తాన్ని రూ.1.70 లక్షల మేర కూడబెట్టి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడుతుందని అగ్రిగోల్డ్‌లో డిపాజిట్ చేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి అగ్రిగోల్డ్ చేతులెత్తేయడంతో తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. న్యాయం జరగకపోతుందా? అని ఇన్నాళ్లూ ఎదురు చూసిన గోవిందు.. హాయ్‌ల్యాండ్ తమది కాదంటూ అగ్రిగోల్డ్ పిటిషన్ వేసినట్లు తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తినోతినకో పొదుపు చేసిన సొమ్ము భవిష్యత్‌లో అక్కరకు వస్తుందని మదుపు చేస్తే.. నిండా మునిగిపోయామని కుమిలిపోయాడు. మూడు రోజులుగా బయటకు రాకుండా మంచానికే పరిమితమయ్యాడు. దీంతో కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. గోవిందుకు భార్య దుర్గ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉంది. పెద్ద కుమారుడు ప్రసాద్ బీటెక్ పూర్తిచేయగా.. రెండో కుమారుడు శివ డిగ్రీ, కుమార్తె శిరీష ఎంబీఏ చదువుతున్నారు. గోవిందు మృతి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదుల సంఘం నాయకులు డేవిడ్ రాజు, మార్కొండారెడ్డి, సీపీఐ నేతలు బాలస్వామిరెడ్డి, బాబూరావు తదితరులు అతని ఇంటికి చేరుకొని కుటుంబసభ్యుల్ని పరామర్శించారు. గోవిందు అగ్రిగోల్డ్ బాధితుల సమావేశం జరిగిన ప్రతిసారీ పాల్గొనేవాడని.. మూడు, నాలుగు రోజులుగా జరుగుతున్న పరిణామాలతో ఆందోళనకు గురై మృతి చెందాడని ఆ సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. -
అగ్రిగోల్డ్: న్యాయ విచారణపై వెనకడుగు
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ భూములను కారుచౌకగా కొట్టేశారనే ఆరోపణలపై జ్యుడీషియల్ కమిటీతో న్యాయ విచారణ జరిపిస్తామని శాసనసభ సాక్షిగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం ఏడాదిన్నరగా పట్టించుకోకుండా బాధితులను గాలికి వదిలేసింది. విచారణ కమిటీ ఏర్పాటైతే ప్రభుత్వంలో కొనసాగుతున్న వారి భూ దందాలు వెలుగులోకి వస్తాయనే భయంతో దీనిపై వెనక్కి తగ్గిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్ష్యాధారాలతో సభ దృష్టికి తెచ్చిన ప్రతిపక్ష నేత అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో బుధవారం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సిద్ధమైన బాధితులు.. హాయ్‌ల్యాండ్‌ను కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని స్పష్టం చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితుల తరపున ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 2016, 2017 బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయటం తెలిసిందే. ప్రభుత్వంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తులు అగ్రిగోల్డ్ భూములను కాజేసి డిపాజిటర్ల పొట్టకొట్టేందుకు ప్రయత్నించటాన్ని ఆయన సాక్ష్యాధారాలతో సభకు వివరించారు. మంత్రులు, సీఎం, స్పీకర్ కూడా అడుగడుగునా ప్రతిపక్షనేత ప్రసంగానికి అడ్డుపడినప్పటికీ బాధితుల తరపున చట్టసభలో పోరాడారు. అటాచ్‌మెంట్‌కు నెల ముందు భూములు కొన్న మంత్రి భార్య... అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీబీఐతో విచారణ జరిపించాలని 2016 మార్చి 28వ తేదీన వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. హైకోర్టు జడ్జి ఆధ్వర్యంలో అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం చేపట్టాలని, సీఐడీ విచారణతో బాధితులకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. విలువైన హాయ్‌ల్యాండ్, విశాఖ యారాడలోని భూములను అటాచ్మెంట్ నుంచి మినహాయించి కాజేసేందుకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలను అసెంబ్లీలో ఎండగట్టారు. అటాచ్‌మెంట్‌కు కేవలం నెల ముందు అగ్రిగోల్డ్ భూములను మంత్రి భార్య వెంకాయమ్మ కొనుగోలు చేశారని వెల్లడించారు. 20 నిమిషాలు టైమిస్తే ఆధారాలతో నిరూపిస్తానన్న ప్రతిపక్ష నేత.. 2017 మార్చి 23న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేత జగన్ గట్టిగా ఒత్తిడి తెచ్చారు. అగ్రిగోల్డ్ అనుబంధ సంస్థ హాయ్‌ల్యాండ్ సీఈగా, డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఉదయ దినకర్ నుంచి 14 ఎకరాల భూమిని మంత్రి పుల్లారావు భార్య వెంకాయమ్మ తక్కువ ధరకు కొనుగోలు చేశారని, అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా సీఐడీ నిర్లక్ష్యం వహిస్తోందని సభ దృష్టికి తెచ్చారు. అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేయాలంటూ వాయిదా తీర్మానం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిటీ నియమించాలని కోరారు. బాధితులకు రూ. 1,182 కోట్లు ఇస్తే 13,83,574 మంది డిపాజిటర్లకు ఉపశమనం కలుగుతుందని, ప్రభుత్వం దీనిపై ప్రకటన చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. మంత్రి ప్రత్తిపాటి భార్య అగ్రిగోల్డ్ భూములను కొనుగోలు చేయటానికి సంబంధించి 20 నిముషాలు సమయం ఇస్తే ఆధారాలన్నీ బయట పెడతానని ప్రతిపక్షనేత సభలో పేర్కొన్నా స్పీకర్ అందుకు అనుమతి ఇవ్వలేదు. జ్యుడీషియల్ కమిటీపై వెనక్కి ఈ సమయంలో సీఎం చంద్రబాబు శాసన సభలో మాట్లాడుతూ విపక్ష నేత మంత్రిపై చేసిన ఆరోపణలపై న్యాయ విచారణ జరిపించేందుకు సిద్ధమేనని ప్రకటించారు. అనంతరం సీఎం మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్ వ్యవహారంలో మంత్రి పుల్లారావుపై వచ్చిన ఆరోపణలపై జ్యుడీషియల్ విచారణ కోసం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినా ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, దీనిపై వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో ఎలా స్పందిస్తుందో చూశాక విచారణ కమిటీపై నిర్ణయం తీసుకుంటామని, షరతులకు వారు (విపక్షం) అంగీకరించినా అంగీకరించకున్నా జ్యుడీషియల్ కమిటీ ఏర్పాటుపై ముందుకు వెళ్తామని చెప్పారు. అయితే గత ఏడాది మార్చి 23వ తేదీన అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చేసిన ప్రకటనను అనంతరం సీఎం విస్మరించారు. ఏడాదిన్నర దాటినా జ్యుడీషియల్ కమిటీ ఊసే మరిచారు. ఈ కమిటీ ఏర్పాటైతే మంత్రి ప్రత్తిపాటి భార్య కొనుగోలు చేసిన భూముల వ్యవహారమే కాకుండా హాయ్‌ల్యాండ్, యారాడలోని విలువైన భూములను కొట్టేసేందుకు చేసిన ప్రయత్నాలు వెలుగు చూస్తాయనే భయంతో వెనక్కి తగ్గారు. ‘అసెంబ్లీలో సీఎం ప్రకటన చేస్తే దానికి కట్టుబడి ఉండాలి. అసెంబ్లీలో చెప్పిన మాటకే విలువ లేకపోతే ఇక అసెంబ్లీకి విలువేమిటి?’ అని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. హాయ్‌ల్యాండ్‌ను కాజేసే ఎత్తుగడ.. రాజధానికి అత్యంత సమీపంలో, జాతీయ రహదారి పక్కనే ఉన్న అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్ భూములు అత్యంత విలువైనవి. వీటిపై కన్నేసిన ప్రభుత్వ పెద్దలు తమకు సన్నిహితుడైన పోలీస్ ఉన్నతాధికారి ద్వారా అగ్రిగోల్డ్ యాజమాన్యంతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే అగ్రిగోల్డ్ కుంభకోణంపై సీఐడీ విచారణకు మోకాలడ్డుతూ వచ్చారు. చివరకు హైకోర్టు ఆగ్రహించడంతో అగ్రిగోల్డ్ ఛైర్మన్, డైరెక్టర్లను అరెస్టు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా బాధితులకు న్యాయం చేయాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందుకు ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో హాయ్‌ల్యాండ్ ఎండీ ఆలూరు వెంకటేశ్వరరావుతో ప్రభుత్వ పెద్దలే హైకోర్టులో వ్యూహాత్మకంగా అఫిడవిట్ దాఖలు చేయించినట్లు ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్‌కు, హాయ్‌ల్యాండ్‌కు సంబంధం లేదని అఫిడవిట్లో పేర్కొనడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వ పెద్దల వ్యూహం బెడిసికొట్టింది. దీంతో నష్ట నివారణ చర్యల్లో భాగంగా హాయ్‌ల్యాండ్ అగ్రిగోల్డ్‌దేనని ప్రకటనలు ఇప్పించారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పారు. భూముల కొనుగోలు నిజమేనని ఒప్పుకున్న ప్రత్తిపాటి ప్రతిపక్ష నేత ప్రకటించినట్లుగా అగ్రిగోల్డ్ డైరెక్టర్ ఉదయ్ దినకల్ నుంచి తన భార్య భూములు కొనుగోలు చేయడం నిజమేనని మంత్రి పుల్లారావు కూడా అంగీకరించారు. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్మెంట్ జీవో ఇవ్వడానికి నెల ముందు ఈ భూములను కొనుగోలు చేశారు. అగ్రిగోల్డ్‌కు చెందిన విలువైన భూములను కీలక వ్యక్తులు కొనుగోలు చేసిన తరువాత అటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. సీఐడీ విచారణ సందర్భంగా అగ్రిగోల్డ్‌కు 16,857 ఎకరాలతో పాటు 82,707 ఇళ్ల స్థలాలు ఉన్నాయని గుర్తించినట్లు 2016 మార్చిలో అసెంబ్లీలో చర్చ సందర్భంగా హోంమంత్రి చినరాజప్ప చెప్పారు. హైకోర్టు ఆదేశాల మేరకు అదే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలల్లో ఆస్తులు వేలం వేస్తామన్నారు. ఇప్పుడు విలువైన భూములు మాయం కావడం వెనుక రహస్యం ఏమిటో ఊహించవచ్చు. -
నేడు చలో హాయ్‌ల్యాండ్
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ యాజమాన్యంతో అమీతుమీకి బాధితులు సిద్ధమయ్యారు. అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పిలుపు మేరకు బుధవారం ‘ఛలో హాయ్‌ల్యాండ్’ పేరుతో ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ప్లేట్ ఫిరాయించిన అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ తమదేనంటూ మంగళవారం హడావుడిగా ప్రకటన చేసింది. అయితే తమ కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని అగ్రిగోల్డ్ బాధితులు స్పష్టం చేశారు. ఇలాంటి నాటకాలు యాజమాన్యానికి మామూలేనని పేర్కొంటూ తమకు న్యాయం జరిగే వరకు పోరాడతామని ప్రకటించారు. 32 లక్షల మంది బాధితుల కడుపుకొట్టేందుకు అగ్రిగోల్డ్ యాజమాన్యం సిద్ధమైందని, కోర్టు చీవాట్లు పెట్టినందువల్లే ప్లేట్ ఫిరాయించారని పేర్కొంటున్నారు. తాము తలపెట్టిన హ్యాయ్‌ల్యాండ్ ముట్టడి కార్యక్రమానికి ఆటంకం కల్పించవద్దని, శాంతియుతంగా జరిగే ఈ కార్యక్రమానికి పోలీసు బందోబస్తు వద్దని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పోలీసు అనుమతికి దరఖాస్తు.. ఛలో హాయ్‌ల్యాండ్ కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ అగ్రిగోల్డ్ వినియోగదారులు, ఏజెంట్ల సంక్షేమ సంఘం పోలీసుశాఖకు సోమవారమే దరఖాస్తు చేసుకున్నారు. అనుమతి లేదనే సాకుతో పోలీసులు తమపై విరుచుకుపడితే జరగబోయే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని సంక్షేమం సంఘం హెచ్చరించింది. తమకు రావాల్సిన న్యాయమైన డిపాజిట్ల కోసం ‘ఛలో హాయ్‌ల్యాండ్’ నిర్వహించడం తప్పా? అని సంఘం ప్రశ్నించింది. అక్రమ అరెస్టులకు ఖండన... ఛలో హాయ్‌ల్యాండ్ నేపథ్యంలో పలువురు నేతలను పోలీసులు అరెస్ట్‌లు చేయడంతోపాటు గృహ నిర్బంధంలోకి తీసుకుంటున్నారు. గుంటూరులో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌ను, అసోసియేషన్ నాయకులు కోట మాల్యాద్రి, ఉపవలపూడి రాము, బుదాల శ్రీనివాస్, వెంకట్రావ్, బొర్రా మల్లిఖార్జునరావు, చిన్న తిరుపతయ్య, హరినాధ్ తదితరులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి తిరుపతిరావు కదలికలపై పోలీసులు నిఘా పెట్టారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఇప్పటికే పలువుర్ని అరెస్ట్ చేయటాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. నాలుగున్నరేళ్లుగా న్యాయం కోసం పోరాడిన బాధితులు గత్యంతరం లేక పోరాటానికి దిగితే అరెస్టులు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు బృందాలుగా ముట్టడి.. – అగ్రిగోల్డ్ బాధితులు నేడు చినకాకాని నుంచి ‘ఛలో హాయ్‌ల్యాండ్’ కార్యక్రమానికి ర్యాలీగా బయలుదేరి ముట్టడిస్తారు. – విజయవాడ కనకదుర్గ వారధి వైపు ఒక బృందం, మంగళగిరి శివార్ల నుంచి మరో బృందం హాయ్‌ల్యాండ్‌కు చేరుకుంటుంది. -
అగ్రిగోల్డ్ ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారు
-
వైఎస్ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
-
అగ్రిగోల్డ్ వ్యవహారంలోకి కేంద్రాన్ని లాగే దిశగా..
సాక్షి, అమరావతి: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే.. ఈ విషయంలో కేంద్రాన్ని లాగి రాజకీయం చేయాలనుకుంటోంది. ఈ మేరకు మంగళవారం జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అగ్రిగోల్డ్ వ్యవహారంపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. అయితే, బాధితులకు న్యాయం చేసేలా కేబినెట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీజేపీ నేతలు అగ్రిగోల్డ్ బాధితులను రెచ్చగొడుతున్నారని, నిజంగానే వారికి ఈ విషయంలో సానుభూతి ఉంటే కేంద్రంతో చెప్పి 75 శాతం మొత్తాన్ని రాష్ట్రానికి ఇప్పించాలనే కొత్త వాదనకు తెరతీసింది. అంతేకానీ.. ఆరు రాష్ట్రాల్లోని బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలనే దానిపై ఆలోచన చేయలేదు. అంతేకాకుండా ఇప్పటివరకు అగ్రిగోల్డ్ ఆస్తులను అధికారికంగా ప్రకటించని రాష్ట్ర ప్రభుత్వం.. ఆస్తుల విలువపై రోజుకో మాట మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల విలువపై క్లారిటీ ఇవ్వకుండా.. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే, కేంద్రం 75 శాతం మొత్తాన్ని ఇవ్వాలనే డిమాండ్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. అగ్రిగోల్డ్ బాధితులు నిరసనలు, ధర్నాలు చేపడుతున్నా.. ఏజెంట్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై త్వరగా ఓ నిర్ణయం తీసుకునే సూచనలు కనబడటం లేదు. -
అగ్రిగోల్డ్ వ్యవహారంలో రాజకీయం చేస్తున్న బాబు సర్కార్
-
ముగిసిన అగ్రిగోల్డ్ బాధితుల ముప్పై గంటల దీక్ష
-
చంద్రబాబుకు తప్పక గుణపాఠం చెప్తాం: అగ్రిగోల్డ్ బాధితులు
-
అగ్లీ గోల్డ్!
-
అగ్రిగోల్డ్ అక్రమాలపై ఆందోళనకు సిద్దమైన బీజేపీ
-
వైఎస్ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
-
వైఎస్ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
సాక్షి, విజయనగరం: రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం కోరుకొండలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. తమకు జరుగుతన్న అన్యాయాన్ని వారు జననేతకు వివరించారు. అగ్రిగోల్డ్ బాధితుల పోరాటానికి బాసటగా నిలబడాలని కోరారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న జననేతను బలరాంపురం వద్ద ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంపై, హెచ్ఆర్ పాలసీ అమలుపై వారు జననేతకు వినతిపత్రం అందజేశారు. అదే విధంగా తనను కలిసిన విశ్వబ్రాహ్మణుల సమస్యలపై జననేత సానుకూలంగా స్పందించారు. విశ్వబ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నం. 272లో చట్టసవరణ చేస్తామని హామీ ఇచ్చారు. దొంగ బంగారం పేరుతో పోలీసుల వేధింపులు లేకుండా చట్టంలో మార్పు తీసుకొస్తామని అన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామని కూడా పేర్కొన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ హయాంలో సాగుతున్న అక్రమాలను ఎండగడుతూ.. ప్రజలకు భవిష్యత్తుపై భరోసానిస్తూ వైఎస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. ప్రతిచోట ప్రజలు జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. -
హాయ్‌ల్యాండ్ వేలం వేసుకోండి
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల్లో విలువైన హాయ్‌ల్యాండ్‌ను వేలం వేసేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కు హైకోర్టు అనుమతి నిచ్చింది. హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి అగ్రిగోల్డ్ యాజమాన్యం దాదాపు రూ. 100 కోట్లు అప్పు తీసుకున్న నేపథ్యంలో సర్ఫేసీ (సెక్యూరిటైజేషన్ అండ్ రీకనస్ట్రక్షన్ ఆఫ్ ఫైనాన్షియల్ అస్సెట్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్యూరిటీ) చట్టం కింద వేలం ద్వారా ఆ అప్పును రాబట్టుకునేందుకు అనుమతి తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అగ్రిగోల్డ్ మోసంపై దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం వాటిని మరోసారి విచారించింది. లక్షల మంది డిపాజిటర్ల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఈ సందర్భంగా ధర్మాసనం పేర్కొంది. హాయ్‌ల్యాండ్ వేలం తరువాత అందుకు సంబంధించిన వివరాలతో నివేదికను తమ ముందుంచాలని, ఆ నివేదికను పరిశీలించిన తరువాతే వేలాన్ని ఖరారు చేస్తామని ఎస్బీఐ తరఫు సీనియర్ న్యాయవాది నరేందర్‌రెడ్డికి తెలిపింది. అదే విధంగా అగ్రిగోల్డ్ యాజమాన్యం తాకట్టుపెట్టిన ఆస్తులన్నింటినీ కూడా వేలం వేసుకునేందుకు ఇతర బ్యాంకులకు కూడా హైకోర్టు అనుమతినిచ్చింది. తాకట్టు ఉన్న ఆస్తుల వేలానికి ఇకపై తమ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని బ్యాంకులకు హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక తదుపరి విచారణ నాటికి జిల్లాల వారీగా అగ్రిగోల్డ్‌కు చెందిన 234 ఆస్తుల వివరాలు, వాటి రిజిస్ట్రేషన్, మార్కెట్, రియల్టర్ల విలువలను తమ ముందుంచి తీరాలని, ఇది తామిస్తున్న చివరి అవకాశమని సీఐడీ, ఉభయ రాష్ట్రాలు, పిటిషనర్లకు హైకోర్టు తేల్చి చెప్పింది. ఇటీవల అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన కీలక వ్యక్తి అరెస్టయిన నేపథ్యంలో అగ్రిగోల్డ్ నగదు మళ్లింపు వ్యవహారంపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, దాని నివేదికను తమ ముందుంచాలని సీఐడీని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 11కి వాయిదా వేసింది. ధర్మాసనం తీవ్ర అసంతృప్తి.. జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను సమర్పించాలని తాము గతంలో ఇచ్చిన ఆదేశాలపై ధర్మాసనం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలు, పిటిషనర్లు, అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ప్రశ్నించింది. దీనికి ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది కృష్ణప్రకాశ్ స్పందిస్తూ, తాము జిల్లాల వారీగా 54 ఆస్తుల వివరాలను ఓ నిర్ధిష్ట నమూనాలో సిద్ధం చేశామని తెలిపారు. ఆ నమూనాను పరిశీలించిన ధర్మాసనం ఇదే రీతిలో మిగిలిన ఆస్తుల వివరాలను సమర్పించాలంది. తెలంగాణ ప్రభుత్వం కూడా జిల్లాల వారీగా ఆస్తుల వివరాలిచ్చింది. అయితే అటు పిటిషనర్లు, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యం వివరాలు సమర్పించకకోవడంపై ధర్మాసనం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. హాయ్‌ల్యాండ్ విలువ ఎంత?.. హాయ్‌ల్యాండ్ విలువ ఎంత కట్టారని ఎస్బీఐ న్యాయవాది నరేందర్‌రెడ్డిని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో కట్టిన విలువ రూ. 366 కోట్లని ఆయన సమాధానం ఇచ్చారు. దీనికి అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం చెబుతూ.. హాయ్‌ల్యాండ్ ప్రస్తుత విలువ రూ. 1000 కోట్లు ఉంటుందని, గత ఏడాది ప్రభుత్వమే రూ.600 కోట్లుగా లెక్కకట్టిందని తెలిపారు. హాయ్‌ల్యాండ్ విలువపై సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు న్యాయవాది రాహుల్ స్పందిస్తూ.. తమ వద్ద వివరాలు వేవన్నారు. ఇక శ్రీకాళహస్తిలోని సర్వే నంబర్ 272లో అగ్రిగోల్డ్‌కు చెందిన 5.86 ఎకరాలను రిత్విక్ ఎనర్జీస్ సంస్థ రూ.8.88 కోట్లకు కొనుగోలుకు ముందుకొచ్చిందని నరేందర్‌రెడ్డి తెలిపారు. తమకు రావాల్సింది రూ.7.66 కోట్లను మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని హైకోర్టు వద్ద డిపాజిట్ చేస్తామని తెలిపారు. ఇందుకు ధర్మాసనం అంగీకరిస్తూ వేలానికి అనుమతి ఇచ్చింది. అలాగే విజయవాడ, మొఘల్రాజపురంలో ఉన్న అగ్రిగోల్డ్ కార్పొరేట్ కార్యాలయం వేలంలో రూ. 11.11 కోట్లకు బిడ్ దాఖలు చేసిన టి.చంద్రశేఖరరావు మిగిలిన మొత్తం చెల్లిస్తే, ఆ భవనాన్ని అతనికి స్వాధీనం చేయాలని కూడా ధర్మాసనం ఆదేశించింది. -
వేలానికి హాయ్‌ల్యాండ్!
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ ప్రతిపాదన నుంచి ఎస్సెల్ గ్రూపునకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్ వెనక్కి తగ్గిన నేపథ్యంలో హైకోర్టు తాజాగా హాయ్‌ల్యాండ్ విక్రయంపై దృష్టి సారించింది. హాయ్‌ల్యాండ్‌ను వేలం వేయడం ద్వారా భారీగా డబ్బు సమకూరే అవకాశం ఉండటంతో ఆ దిశగా సన్నాహాలు చేస్తోంది. అగ్రిగోల్డ్ యాజమాన్యం హాయ్‌ల్యాండ్ భూములను తాకట్టు పెట్టి స్టేట్ బ్యాంక్ ఇండియా (ఎస్బీఐ) నుంచి రుణం తీసుకుంది. ఈ నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో హాయ్‌ల్యాండ్ విలువ, అప్పుల వివరాలను తెలియచేయాలని ఎస్బీఐ తరఫు న్యాయవాదిని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. హాయ్‌ల్యాండ్ వేలానికి తొలి ప్రాధాన్యం ఇస్తామని, దీనివల్ల డబ్బు సమకూరి డిపాజిటర్లకు మొదటి ఇన్స్టాల్మెంట్ కింద ఎంతో కొంత చెల్లించేందుకు ఆస్కారం ఉంటుందని అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల విలువెంత? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ ఆస్తుల వివరాలను జిల్లాల వారీగా విభజించి బహిరంగ మార్కెట్ విలువ, రియల్టీ విలువ, సబ్ రిజిష్ట్రార్ విలువను పట్టిక రూపంలో సమర్పించాలని ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని, పిటిషనర్లను హైకోర్టు ఆదేశించింది. ఎవరికి వారు స్వతంత్రంగా ఈ వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది. వీటిని పరిశీలించి ఒక్కో ఆస్తి కనీస వేలం ధరను నిర్ణయిస్తామని తెలిపింది. ఇకపై అగ్రిగోల్డ్ ఆస్తులను జిల్లా కమిటీల ద్వారా ఏకకాలంలో వేలం వేస్తామని పేర్కొంది. మినహాయిస్తామని మొదటి రోజే చెప్పాం.. అగ్రిగోల్డ్ ఆస్తుల టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని, దీనికి అనుమతినిస్తూ తాము డిపాజిట్ చేసిన రూ.10 కోట్లను తిరిగి ఇవ్వాలని కోరుతూ సుభాష్‌చంద్ర ఫౌండేషన్ దాఖలు చేసిన పిటిషన్‌పై నిర్ణయాన్ని హైకోర్టు వాయిదా వేసింది. అయితే మొత్తం రూ.10 కోట్లను వెనక్కి ఇచ్చే ప్రసక్తే లేదని, కొంత మినహాయించి మిగిలింది ఇస్తామని ప్రకటించింది. టేకోవర్ నుంచి వెనక్కి వెళ్లిపోయారన్న కారణంతో తాము ఈ పని చేయడం లేదని, ఎంతో కొంత మొత్తాన్ని మినహాయిస్తామని ఈ కేసులో ప్రతివాదిగా చేరిన మొదటి రోజే చెప్పామని గుర్తు చేసింది. ఆస్తుల టేకోవర్‌కు తాము శక్తివంచన లేకుండా కృషి చేశామని, తమ అదుపులో లేని కొన్ని పరిస్థితుల వల్ల వెనక్కి వెళ్లిపోతున్నామని, సుభాష్ చంద్ర ఫౌండేషన్ తరఫు సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురాం తెలిపారు. ఇక ప్రతి శుక్రవారం కేసు విచారణ అగ్రిగోల్డ్ ఆస్తుల విషయంలో ఫోరెన్సిక్ ఆడిట్‌కు సంబంధించి సీఐడీ నివేదికను తదుపరి విచారణ సమయంలో పరిశీలిస్తామని హైకోర్టు తెలిపింది. ఇకపై ఈ కేసును ప్రతి శుక్రవారం విచారించనున్నట్లు పేర్కొంటూ తదుపరి విచారణను ఈనెల 28వ తేదీకి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ డిపాజిటర్లు హైకోర్టులో దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం ఈమేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో మీ పాత్ర చాలా పరిమితం... వేలం నిమిత్తం అగ్రిగోల్డ్ ఆస్తుల్లో 50 వరకు గుర్తించినట్లు సీఐడీ తరఫున వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) కృష్ణప్రకాశ్ జాబితాను కోర్టుకు సమర్పించారు. కొన్ని ఆస్తులకు సీఐడీ చెబుతున్న ధర చాలా తక్కువగా ఉందని అగ్రిగోల్డ్ తరఫు న్యాయవాది జానకిరామిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేయగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ద్వారా జరిగే వేలంలో భూములకు తక్కువ ధరే వస్తుందని పేర్కొంది. ‘మీరు (అగ్రిగోల్డ్) మీ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లకు పైగా చెప్పారు. చివరకు అది రూ.2 వేల కోట్ల వద్ద ఆగిపోయింది. మీరు ఒక్క వేలందారుడిని కూడా తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆస్తుల విలువ తక్కువగా ఉందంటున్నారు. ఈ కేసులో ఇకపై మీ పాత్ర చాలా పరిమితం. టేకోవర్ ప్రతిపాదన నుంచి వెనక్కివెళ్లిపోవడానికి మీరు కూడా కారణమని సుభాష్‌చంద్ర ఫౌండేషన్ చెబుతోంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగానే అగ్రిగోల్డ్ ఆస్తుల్లో అత్యంత విలువైన హాయ్‌ల్యాండ్ గురించి హైకోర్టు ఆరా తీసింది. -
‘మోసం చేయడంలో ఆయన దిట్ట’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ సమస్య పరిష్కార విషయంలో టీడీపీ ప్రభుత్వం దాగుడుమూతలు ఆడుతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఖ్య దేశం మొత్తం మీదట 32 లక్షలకు పైగా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఈ సంఖ్య 20 లక్షలకు పైగా ఉందని తెలిపారు. ఈ సమస్య పరిష్కార విషయంలో ప్రభుత్వ అసమర్థత స్పష్టంగా కనిపిస్తుందన్నారు . నాలుగున్నరేళ్లుగా మాయ మాటలు చెప్పి 200 మందికి పైగా ఆత్మహత్యలకు సీఎం చంద్రబాబు నాయుడే కారణమని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ సంస్థకు అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నా కుట్రతో కొందరు గందరగోళం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం 1180 కోట్లు ఇస్తే 14 లక్షల కుటుంబాల సమస్య తీరుతుందని తెలిసినా స్పందించకపోవడం దుర్మార్గమన్నారు. దీనిపై సీబీఐ విచారణకి చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. అగ్రిగోల్డ్ ఇష్యూపై బీజేపీ కూడా స్పందించాలని డిమాండ్ చేశారు. అందరినీ మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. ఫీజ్ రియంబర్స్‌మెంట్‌కి ఏపీ సీఎంకు అర్థం తెలుసా అని ఎద్దేవ చేశారు. అర్హులైన విద్యార్థులకు ఫీజు మొత్తం చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ విధానం రద్దు చేయాలని ఉద్యోగులు కోరుతుంటే ఇప్పుడు కొత్తగా కమిటి వేస్తాననడం హాస్యాస్పదమన్నారు. -
వారి అత్మహత్యలకు చంద్రబాబే కారణం
-
కదిలిస్తే కన్నీరే..!
సాక్షి కడప: ఎవరిని కదిపినా కన్నీరే. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించిన డబ్బును అగ్రిగోల్డ్‌లో దాచితే.. అప్పనంగా కాజేసి యాజమాన్యం కనుమరుగైంది.సొమ్ము కనబడకపోయే సరికి బాధితుల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నా ఏమి చేయలేని పరిస్థితి. అయితే రాష్ట్రంలో లక్షల మంది కట్టిన డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూడేళ్ల కిందట ఆందోళన నిర్వహించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒకవైపు బా«ధితులు న్యాయపోరాటం చేస్తూనే..ఇంకోవైపు ఆందోళనలు సాగిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కేసును సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో జిల్లాలో అగ్రిగోల్డ్ స్థలాలను అధికారులు పరిశీలిస్తున్నారు. స్థలాలను స్వాధీనం చేసుకుని వెంటనే డిపాజిట్లు అందించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే మొత్తాలు అందించడంలో ఆలస్యం అయ్యేకొద్ది వీరిలో అలజడి పెరిగిపోతోంది. ఇప్పటికే 17 మంది డిపాజిట్‌దారులు బలవన్మరణానికి పాల్పడ్డారు. జిల్లాలో భారీగా డిపాజిట్ దారులు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో అగ్రిగోల్డ్‌కు సంబంధించిన డిపాజిట్‌దారులు అధిక సంఖ్యలో ఉన్నారు. పది నియోజకవర్గాల్లో దాదాపుగా 1.18 లక్షల మంది ఉన్నారు. ఈ వ్యవహారం రెండు, మూడేళ్లుగా నానుతున్నా ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో డిపాజిట్ వెనక్కి వస్తుందా, రాదా అన్న సందిగ్ధత ఏర్పడుతోంది. జిల్లాలో డిపాజిట్‌దారులతోపాటు ప్రత్యేకంగా ఏజెంట్లు కూడా 4500–5000 మంది ఉన్నారు. ఏడు బ్రాంచ్‌ల పరిధిలో ఎప్పటికప్పుడు ఏజెంట్లు డిపాజిట్లు చేయిస్తూ వచ్చారు. సుమారు రూ. 130 కోట్ల డిపాజిట్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఎదురుచూపులు అగ్రిగోల్డ్ సంస్థ 2015 జనవరి 4వ తేదీన బోర్డు తిప్పేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు జనాలు పెట్టిన పెట్టుబడి ఎప్పుడు వెనక్కి ఇస్తారా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటు చేయగా, తర్వాత అదిగో..ఇదిగో అంటూ ఏదో ఒక సాకుతో కాలాన్ని సాగదీస్తుందే తప్ప చిత్తశుద్దితో వెంటనే డిపాజిట్లు అందించే చర్యలు చేపట్టడం లేదని బాధితులు మండిపడుతున్నారు. 2015 నుంచి డిపాజిట్ సొమ్ముల కోసం ఏజెంట్లతోపాటు డిపాజిట్ దారులకు నిరీక్షణ తప్పలేదు. కొనసాగుతున్న ఆందోళనలు జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితులు ఎప్పటికప్పుడు ఆందోళనబాట పడుతున్నారు. బాధితుల కమిటీ పిలుపు మేరకు 2015 నుంచి ఇప్పటివరకు పోరు సాగిస్తున్నారు. ర్యాలీలు, ధర్నాలు, నిరసనలు, కలెక్టరేట్ వద్ద దీక్షలు సాగిస్తూనే ఉన్నారు. నాలు గురోజుల కిందట ఏకంగా కడపలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద అగ్రిగోల్డ్ బాధితులు గుండు గీయిం చుకొని నిరసన చేపట్టారు. మూడేళ్లుగా న్యాయం కోసం ఉద్యమ పంథాను కొనసాగిస్తున్నారు. బాధితులకు అండగా వైఎస్సార్ సీపీ రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటూ వస్తోంది. విజయవాడలో దీక్ష చేసే సమయంలో కూడా పార్టీ కీలక నేతలు వెళ్లి పరామర్శించారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ప్రస్తుత టీడీపీ సర్కార్ బాధితుల సొమ్ము పట్ల నిర్లక్ష్యం వహిస్తే..అధికారంలోకి రాగానే వెంటనే డిపాజిట్లు వెనక్కి ఇస్తామని ప్రకటించారు. అగ్రిగోల్డ్ బాధితుల ఆందోళనలకు ఎప్పటికప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సంఘీభావం ప్రకటించి ఉద్యమంలో పాలుపంచుకుంటోంది. మొత్తం సొమ్ము అందించేవరకు అండగా ఉండాలని నిర్ణయించి.. ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘాన్ని కూడా వైఎస్సార్సీపీ ఏర్పాటు చేసింది. అధికారంలోకి రాగానే మొదటి ప్రాధాన్యతగా డిపాజిట్లు చెల్లిస్తాం అగ్రిగోల్డ్‌కు సంబంధించి ఒక్క ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా బాధితులు ఉన్నారు. మంత్రి లోకేష్, ఎంపీలు సుజనాచౌదరి, మురళీమోహన్లకు విలువైన అగ్రిగోల్డ్ ఆçస్తులను కట్టబెట్టాలని ప్రభుత్వం చూస్తుందే తప్ప చిత్తశుద్ధితో సీఎం వ్యవహరించడం లేదు. బినామీ ద్వారా కోర్టులో పిల్ వేయించి ఆస్తులు ఇస్తామని మభ్య పెడుతున్నారు. నాలుగేళ్లుగా ప్రభుత్వం కాలాయాపన చేస్తుందే తప్ప డిపాజిట్ దారులకు న్యాయం చేయడం లేదు. వెంటనే అగ్రిగోల్డ్ ఆస్తులను స్వాధీనం చేసుకుని..వెయ్యి కోట్లు యుద్ధప్రాతిపదికన అందించాలి. బాధితులను ఆదుకోవాలనే స్పృహ ప్రభుత్వానికి ఎంతమాత్రం లేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రిగోల్డ్ బాధితులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మొదటి ప్రాధాన్యత కింద డిపాజిట్‌దారులకు డిపాజిట్లు అందజేస్తాం. – కె.సురేష్‌బాబు, వైఎస్సార్ సీపీ అగ్రిగోల్డ్ బాధితుల బాసట సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు -
అగ్రిగోల్డ్ సమస్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది
-
‘ప్రగతి భవన్‌ను ముట్టడిస్తాం’
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరిచ్చారు. గాంధీభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం కోసం బాధితులు సచివాలయంకు వెళ్తే హోంమంత్రి అరెస్ట్ చేయమనడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు. బాధితులకు అండగా ఉంటాం: ఉత్తమ్ అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. లక్షలాది మందికి అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా 9 నెలలేనని జోస్యం చెప్పారు. -
‘అవినీతిలో బిహార్‌ను మించిపోయిన ఏపీ’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ పాలనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. అంతేకాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశారని బొత్స నిలదీశారు. బాబు పాలనను గాలికొదిలేసి.. ప్రతిపక్షంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. చంద్రబాబు చేసిన ఆరోపణలపై నిజనిర్ధారణకు చంద్రబాబు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఎయిర్ ఏషియా స్కామ్‌లో కేంద్రాన్ని విచారణ కోరగలరా అని బొత్స ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం పేరుతో రూ. లక్షల కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ అవినీతిలో బిహార్‌ను మించిపోయిందని.. ఏపీలో అవినీతి, అక్రమాలు, దోపిడీలు పెరిగిపోయాయని అన్నారు. మట్టి, ఇసుక, మద్యం మాఫియాను రాష్ట్రంలో పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుండా రోడ్డుపైకి తెచ్చారని ప్రభుత్వంపై బొత్స సత్య సత్యనారాయణ ధ్వజమెత్తారు. -
అగ్రిగోల్డ్ బాధితుల పక్షాన వైఎస్ఆర్సీపీ ఉంది