‘బాబు వల్ల చెరుకు రైతులు నాశనం అయిపోయారు. నిజాం షుగర్స్ ప్రైవేటు సంస్థకు అమ్మి రైతులకు అన్యాయం చేసారు. పార్వతీపురం మున్సిపాలిటీలో తాగడానికి నీరు మూడురోజులకు ఒకసారి ఇస్తున్న పరిస్థితి ఉంది. అభివృద్ధి గురించి ఆలోచిస్తే పార్వతిపురంలో అసలు అభివృద్ధి లేదు. పార్వతీపురం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు, అగ్రిగోల్డ్ బాధితులు ఇక్కడ ఎక్కువ. వారిని పట్టించుకునే నాథుడు లేడు. అగ్రిగోల్డ్ ఆస్తులను అన్నింటినీ చంద్రబాబు, లోకేష్, బినామిలు కాజేస్తున్నారు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువను పధకం ప్రకారం తగ్గిస్తున్నారు.