రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం కోరుకొండలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్‌ను అగ్రిగోల్డ్ బాధితులు కలిశారు. తమకు జరుగుతన్న అన్యాయాన్ని వారు జననేతకు వివరించారు.