మాట్లాడుతున్న కొర్రపాడు హుసేన్‌పీరా
సాక్షి, గార్లదిన్నె : రాష్ట్రంలో అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు రావాలంటే బాబు జాబుపోవాలి..వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రావాలని అనంతపురం మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, అగ్రిగోల్డ్ బాసట కమిటీ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, జేఏసీ నాయకులు సుధాకర్‌రెడ్డి తదితరులు తెలిపారు.ఆదివారం మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ నాయకులు వై.నారాయణరెడ్డి నివాసంలో ఆయన ఆధ్వర్యంలో అగ్రీగోల్డ్ బాసట కమిటీ సభ్యులు, జేఏసీ నాయకులు విలేకరులతో మాట్లాడారు. పేదలు,నిరుపేదలు రోజూ కష్టపడి సంపాదించిన డబ్బు అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారని, సంస్థ దివాలా తీయడంతో ఇక తమ డబ్బులు రావని, మనస్థాపంతో రాష్ట్రంలో 263 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
బాధిత కుటుంబాలకు టీడీపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నారు. ఈసమయంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అగ్రిగోల్డ్ బాధితుల సమస్యలు గుర్తించారన్నారు. గత ఏడాది డిసెంబర్ 28న అగ్రిగోల్డ్ అసోసియేషన్ అమర నిరాహారణ దీక్షలు చేయగా, ప్రభుత్వం మాత్రం రూ.250 కోట్లు డబ్బులేని జీవో ఇచ్చి చేతులు దులుపుకుందన్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని కలిస్తే మన అందరి ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే మూడు నెలలో రూ.1,183 కోట్లు విడుదల చేసి, రూ.20వేల లోపు ఉన్న 14 లక్షల మందికి ఉపశమనం కలిగిస్తామని భరోసా ఇచ్చారన్నారు.
శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, అభ్యర్థి జొన్నల గడ్డ పద్మావతి, ఎంపీ అభ్యర్థి తలారి పీడీ రంగయ్యతోపాటు జిల్లాలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అఖండ మోజార్టీతో గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఈనెల 8న జిల్లా కేంద్రంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తామన్నారు. కార్యక్రమంలో బాసట కమిటీ జేఏసీ నాయకులు రాజగోపాల్, దస్తగిరి, రామచంద్ర ఆచారి, కుళ్లాయప్ప, గోపాల్ రెడ్డి, కృష్టమోహన్, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment