సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేవరకు తమ పోరాటం కొనసాగుతుందని అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ నేత, వైఎస్సార్‌సీపీ నాయకుడు అడపా శేషు స్పష్టం చేశారు. ఈ నెల 20న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో అగ్రిగోల్డ్ బాధితుల విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ సమావేశాలు జరగనున్నాయని, అగ్రిగోల్డ్ బాధితులకు సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి.. వారికి న్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment