సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయకుంటే అగ్రిగోల్డ్ భూముల్ని ఆక్రమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి హెచ్చరించారు. హిమాయత్‌నగర్‌లో మఖ్దూంభవన్‌లో భాగం హేమంతరావు అధ్యక్షతన గురువారం జరిగిన అగ్రిగోల్డ్ బాధితులు సమావేశంలో ఆయన మాట్లాడారు.
అగ్రిగోల్డ్ సంస్థ మూతబడి ఏడేళ్లు కావస్తున్నా తెలంగాణలో బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారికి న్యాయం చేయాలని, లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగిస్తూ అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని బాధితులకు డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితుల సంఘం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment