సాక్షి, విజయవాడ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. మాటలగారడీతో చంద్రబాబు నాలుగేళ్లుగా అగ్రిగోల్డ్ బాధితుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆందోళన చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను అర్థరాత్రి అరెస్ట్ చేయడాన్ని తప్పుపట్టారు. వాళ్లేమైనా టెర్రరిస్టులా.. ఆ సమయంలో అరెస్ట్ చేయాల్సిన అవరసరం ఏముందని ప్రశ్నించారు.
కరెంట్ తీసేసి, దీక్షా శిబిరాన్ని భగ్నం చేయడమేంటని నిలదీశారు. ఈ రోజు సాయంత్రంలోపు అగ్రిగోల్డ్‌పై ప్రభుత్వం స్పందించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అగ్రిగోల్డ్ ఆస్తులు ఉన్నా.. బకాయిలు ఎందుకు చెల్లించకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అగ్రిగోల్డ్ సమస్యను నాలుగేళ్లుగా ప్రభుత్వం నాన్చుతోందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిచాలని.. లేని పక్షంలో వచ్చే ఎన్నికల్లో అగ్రిగోల్డ్ భాదితులు తగిన గుణపాఠం నేర్పుతారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment