వైఎస్‌ జగన్‌ను కలిసిన అగ్రిగోల్డ్‌ బాధితులు  | Agrigold Victims Met YS Jagan In PrajaSankalpaYatra At Vizianagaram | Sakshi
Sakshi News home page

Published Sun, Sep 30 2018 2:20 PM | Last Updated on Sun, Sep 30 2018 5:26 PM

Agrigold Victims Met YS Jagan In PrajaSankalpaYatra At Vizianagaram - Sakshi

సాక్షి, విజయనగరం: రాష్ట్రంలోని ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గం కోరుకొండలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్‌ జగన్‌ను అగ్రిగోల్డ్‌ బాధితులు కలిశారు. తమకు జరుగుతన్న అన్యాయాన్ని వారు జననేతకు వివరించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల పోరాటానికి బాసటగా నిలబడాలని కోరారు. మరోవైపు పాదయాత్రలో ఉన్న జననేతను బలరాంపురం వద్ద ఏపీ ఎయిడ్స్‌ కంట్రోల్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు కలిశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను వారు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువెళ్లారు. సమాన పనికి సమాన వేతనం కల్పించడంపై, హెచ్‌ఆర్‌ పాలసీ అమలుపై వారు జననేతకు వినతిపత్రం అందజేశారు.

అదే విధంగా తనను కలిసిన విశ్వబ్రాహ్మణుల సమస్యలపై జననేత సానుకూలంగా స్పందించారు. విశ్వబ్రాహ్మణులకు ఇబ్బందికరంగా ఉన్న జీవో నం. 272లో చట్టసవరణ చేస్తామని హామీ ఇచ్చారు. దొంగ బంగారం పేరుతో పోలీసుల వేధింపులు లేకుండా చట్టంలో మార్పు తీసుకొస్తామని అన్నారు. విశ్వబ్రాహ్మణులకు ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తామని కూడా పేర్కొన్నారు. నాలుగేళ్లుగా టీడీపీ హయాంలో సాగుతున్న అక్రమాలను ఎండగడుతూ.. ప్రజలకు భవిష్యత్తుపై భరోసానిస్తూ వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తోంది. ప్రతిచోట ప్రజలు జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement