అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం 20వేల రూపాయలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం బాధితులను ఆదుకోని పక్షంలో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. అసలు రాష్ట్రంలో ఆర్థిక, రెవెన్యూ శాఖ మంత్రులు ఉన్నారా అని ప్రశ్నించారు. చుక్క భూములు కూడా పెద్ద స్కాం అని ఆరోపించారు. ఆ భూములను చంద్రబాబుకి చెందిన వ్యక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు.