
సాక్షి, హైదరాబాద్: అగ్రిగోల్డ్ బాధితులకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం న్యాయం చేయకపోతే ప్రగతిభవన్ ముట్టడిస్తామని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి హెచ్చరిచ్చారు. గాంధీభవన్‌లో అగ్రిగోల్డ్ బాధితులతో కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ బాధితులను టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. న్యాయం కోసం బాధితులు సచివాలయంకు వెళ్తే హోంమంత్రి అరెస్ట్ చేయమనడం దారుణమన్నారు. అగ్రిగోల్డ్ సంస్థపై చర్యలు తీసుకోకపోవడంలో ఉన్న మతలబేంటని ప్రశ్నించారు.
బాధితులకు అండగా ఉంటాం: ఉత్తమ్
అగ్రిగోల్డ్ బాధితులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు. లక్షలాది మందికి అగ్రిగోల్డ్ సంస్థ మోసం చేయడం దారుణమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండేది ఇంకా 9 నెలలేనని జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment