కోర్టు క్లాంపెక్స్ కోసం స్థల పరిశీలన
రాజంపేట: జిల్లా ప్రిన్సిపల్ జడ్జి ఆదేశాల మేరకు జిల్లా మూడవ అదనపు జడ్జి ఎం.తిరుమలరావు శుక్రవారం కోర్టు క్లాంపెక్స్ కోసం వివిధ ప్రాంతాలను పరిశీలించారు. ఇందులో భాగంగా అఫిషియల్‌క్లబ్, సబ్ కలెక్టరేట్ క్యాంపస్‌లోని ఖాళీ స్థలాలను, స్థానిక తహసీల్దారు కార్యాలయాలను పరిశీలించారు. జడ్జి ఆదేశాల మేరకు ఇంజనీరింగ్ సిబ్బంది అఫిషియల్ క్లబ్ భవనం, క్రీడాస్థలం, సబ్ కలెక్టరులోని నూనివారిపల్లె వైపు ఖాళీ స్థలం, సబ్‌జడ్జి బంగళా, మెజిస్ట్రేట్ బంగళాను సర్వే చేపట్టి కొలతలు తీసుకున్నారు. అన్ని స్థలాలను క్షుణ్ణంగా పరిశీలించి, కోర్టు క్లాంపెక్స్‌కు ఏదీ ఆమోదయోగ్యమో దాన్ని జిల్లా జడ్జి, హైకోర్టుకు నివేదించనున్నారు. ఈ సందర్భంగా అఫిషియల్ క్లబ్ సభ్యులు రామచంద్రరాజు, శివారెడ్డి, సుధాకరరెడ్డి, వాసు, బాలరాజు తదితరులు అఫిషియల్ క్లబ్ వ్యవస్థ, దాని విశిష్టత, దాని ప్రస్తుత అవసరం గురించి ఏడీజేకి విన్నవించారు. ఏడీజే వెంట రాజంపేట బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కొండూరు శరత్‌కుమార్‌రాజు, ఏజీపీ లక్ష్మీనారాయణ, పీపీ వెంకటస్వామి, న్యాయవాదులు ఎబీ సుదర్శనరెడ్డి, కృష్ణారెడ్డి, సురేష్, కత్తి సుబ్బరాయుడు, వీవీరమణ, శ్రీనువాసరాజు, నాసురుద్దీన్, జఫురుద్దీన్, కేవీరమణ, తదితరులు పాల్గొన్నారు.
.
.