రాజంపేటలో ‘చుట్టాలబ్బాయ్‌’ | hero aadi tour in kadapa | Sakshi
Sakshi News home page

రాజంపేటలో ‘చుట్టాలబ్బాయ్‌’

Published Wed, Aug 24 2016 10:44 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

రాజంపేటలో ‘చుట్టాలబ్బాయ్‌’

రాజంపేటలో ‘చుట్టాలబ్బాయ్‌’

రాజంపేట టౌన్‌ :
 డైలాగ్‌ కింగ్‌ సాయికుమార్‌ తనయుడు ఆది హీరోగా నటించిన చుట్టాలబ్బాయి విజయోత్సవ యాత్ర బుధవారం రాత్రి రాజంపేటకు చేరుకుంది. రాజంపేట సమద్‌ థియేటర్‌లో చుట్టాలబ్బాయి చిత్రం ప్రదర్శించబడుతోంది. ఈనేపథ్యంలో ఆ చిత్రంలో నటించిన హీరో ఆది, హీరోయిన్‌ నమిత ప్రమోద్, డైరెక్టర్‌ వీరభద్రంలు సమద్‌ థియేటర్‌కు చేరుకొని ప్రేక్షకులను కలుసుకున్నారు. అలాగే ఆది అభిమానులు పెద్దఎత్తున థియేటర్‌కు చేరుకొని ఆయనతో కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు.

ఈసందర్భంగా ఆది అభిమానులనుద్దేశించి మాట్లాడుతూ చుట్టాలబ్బాయిని ప్రేక్షకులు సూపర్‌ హిట్‌ చేశారని, ఇందుకు మీ అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చుట్టాలబ్బాయి తొలి మార్నింగ్‌ షో నుంచే హిట్‌ టాక్‌ తెచ్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. డైరెక్టర్‌ వీరభద్రం మాట్లాడుతూ మీ అందరి ఆదరాభిమానులు ఇలాగే ఉంటే ఇంకా మంచి సినిమాలు తీస్తానని తెలిపారు.  హీరోయిన్‌ నమితప్రమోద్‌ మాట్లాడుతూ మీ అందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో ఎగ్జిబిటర్లు హబీబ్, మనోహర్‌రెడ్డి, పాపినేని విశ్వనాథ్‌రెడ్డి, సుబ్రమణ్యంనాయుడు, అదృష్టదీపుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement