
సాక్షి, విజయవాడ : టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మంగళవారం సీఎం అధ్యక్షతన జరిగే రాజంపేట పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చిన బ్రహ్మయ్యకు గుండెపోటు రావడంతో హుటాహుటిన ఆయనను రమేష్ హాస్పిటల్‌కు తరలించారు. ఐసీయూలో ఉంచి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య కొంతకాలంగా రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు. రాజంపేట అసెంబ్లీ సీటును ఆయన ఆశిస్తున్నారు. కాగా, బ్రహ్మయ్య అభ్యర్థనను చంద్రబాబు నిరాకరించినట్టు సమాచారం. నిన్న కడపలో జరిగిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ.. ‘పార్టీలో కష్టపడిన వారికి కాకుండా వలస వచ్చిన నేతలకే ప్రాధాన్యం ఇస్తున్నారు’ అని ఆవేదన వ్యక్తం చేశారు. (టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు)
Comments
Please login to add a commentAdd a comment