రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిచెరువుకట్ట వద్ద గురువారం ఆటో బోల్తా పడిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజంపేట నుంచి మందరం గ్రామంలో పని నిమిత్తం కూలీలు ఆటోలో బయలుదేరారు.
రాజంపేట: రాజంపేట–నెల్లూరు రహదారిలోని పోలిచెరువుకట్ట వద్ద గురువారం ఆటో బోల్తా పడిన సంఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. రాజంపేట నుంచి మందరం గ్రామంలో పని నిమిత్తం కూలీలు ఆటోలో బయలుదేరారు. పోలిచెరువుకట్ట సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలకు గాయాలయ్యాయి. వీరినిచికిత్స నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.