ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లిరోజు వేడుకల్ని షేర్ చేసుకున్నారు.
న్యూఢిల్లీ: ఫేస్ బుక్ సీఈవో మార్క్ జూకర్ బర్గ్ సోషల్ మీడియా ద్వారా తన పెళ్లిరోజు వేడుకల్ని షేర్ చేసుకున్నారు. మే 19, 2016న తన వైవాహిక జీవితంలో నాలుగేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా వేడుకలకు సంబంధించిన ఫోటోలను తన ఫేస్ బుక్ లో ఉంచారు. అమెరికన్ మ్యూజికల్ నైట్ కు వెళ్లి జాలీగా గడిపారు. హామిల్టన్ ప్లేను ఎంజాయ్ చేసినట్టు తెలిపారు దీంతోపాటు హామిల్టన్ రచయిత, ప్రసిద్ధ సంగీతకారుడు లిన్ మాన్యుల్ మిరిందాతో కలిసిన ఆనంద క్షణాలను అభిమానులతో పంచుకున్నారు.
కాగా మే19,2012న జుకర్ ప్రిస్సిల్లా చాన్ ను వివాహం చేసుకున్నారు. ఆరునెలల కిందట జుకర్ కు కూతురు మాక్సిమా జన్మించిన విషయం తెలిసిందే.