పెళ్లి రోజు మర్చిపోయిన భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య | Wife In Laws Assault Man For Forgetting Wedding Anniversary At Mumbai | Sakshi
Sakshi News home page

పెళ్లిరోజు మర్చిపోయినందుకు భర్తపై దాడి..నివ్వెరపోయిన పోలీసులు

Published Fri, Feb 24 2023 4:56 PM | Last Updated on Fri, Feb 24 2023 5:36 PM

Wife In Laws Assault Man For Forgetting Wedding Anniversary At Mumbai - Sakshi

ఇటీవల భార్తభర్తల గొడవలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. పైగా వాటిని పోలీస్టేషన్‌ల వరకు తీసుకువచ్చి పంచాయితీ పెడుతుండటం మరింత విడ్డూరం. నాలుగోడల మధ్య పరిష్కరించుకోవాల్సి చిన్నపాటి తగాదా కాస్త దాడి చేసుకునేంత వరుకు వెళ్లిపోతుండటం బాధకరం. అచ్చం అలాంటి విచిత్ర ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలో ఘట్‌కోపర్‌లో నివశిస్తున్న 32 ఏళ్ల విశాల్‌ నాంగ్రే అనే వ్యక్తి కొరియర్‌ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కల్పన ఫుడ్‌ అవుట్‌లెట్‌లో పనిచేస్తోంది. అతని భార్య కల్పన ఇద్దరూ కలిసి బెగన్‌వాడిలో నివశిస్తున్నారు. ఆ జంటకు 2018లో వివాహమైంది. ఫిబ్రవరి 18 వారి పెళ్లిరోజు. ఆ విషయాన్ని నాంగ్రే మర్చిపోయాడు. ఈ విషయమై భర్తపై  కోపంతో తన తల్లిదండ్రులు, సోదరడుని ఇంటికి పిలిపించి మరి గొడవకు దిగింది. 

అక్కడితో ఆగక ఆమె అతడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, అతడి తల్లిపై చేతివాటం చూపింది. దీంతో వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఐతే ఆమె భర్త నాంగ్రే గాయపడిన తన తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లి తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడి భార్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. 

(చదవండి:  మిరాకిల్‌ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement