Forgetfulness
-
‘హారిస్‌కు బైడెన్‌ను మించిన సమస్యలున్నాయ్’
వాషింగ్టన్: వృద్ధాప్యం, మతిమరుపు, తడబాటు సమస్యలతో సతమతమవుతూ అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్‌తో కమలా హారిస్‌ను పోలుస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. జార్జియా రాష్ట్రంలో బుధవారం జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రచార సభలో కార్యకర్తలనుద్దేశించి ట్రంప్ మాట్లాడారు. ‘‘ఉపాధ్యక్షురాలు హారిస్‌ను చూసి ప్రపంచమే నవ్వుతోంది. ఎందుకో తెలుసా?. ఆమె అధ్యక్షురాలు కాబోయే ఛాన్సుందని తెల్సి నమ్మశక్యంకాక నవ్వుతున్నారు. ఇక ఆలోచనా శక్తి గురించి మాట్లాడితే ఈమెకు బైడెన్‌ను మించిన సమస్యలున్నాయి. అధిక ధరలు, గందరగోళ పాలనకు మనం తెరదించబోతున్నాం. కమల, అసమర్థ బైడెన్ కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల కారణంగా మనకు ధరలు పెరిగి ఇబ్బందులు పడుతున్నాం’’అని అన్నారు. సొంత డబ్బా కొట్టుకున్న ట్రంప్హంగేరి ప్రధాని విక్టర్ అర్బాన్ గురించి ట్రంప్ మాట్లాడుతూ పనిలోపనిగా ట్రంప్ సొంత గొప్పలు చెప్పుకున్నారు. ‘‘విక్టర్ సమర్థవంతమైన నేత. విదేశీయులు ఎవరినీ తన దేశంలోకి రానివ్వడు. ప్రపంచంలో ఎందుకు ఇన్ని సమస్యలు?. మధ్యప్రాశ్చ్యంలో యుద్ధాలెందు జరుగుతున్నాయి. మూడో ప్రపంచయుద్ధం దిశగా రష్యా ఎందుకు పయనిస్తోందని విక్టర్‌ను అంతా అడిగితే ఆయన ఒక్కటే సులువైన పరిష్కారం చెప్పారు. ట్రంప్ దేశాధ్యక్ష పీఠంపై లేకపోవడం వల్లే. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నపుడు అంతా అతడిని చూసి భయపడ్డారు. చైనా, రష్యా.. అందరికీ భయమే. నేను అధికారంలో ఉన్నప్పుడు ఉక్రెయిన్‌లోకి రష్యా అడుగుపెట్టలేకపోయింది. నేను దిగిపోగానే ఉక్రెయిన్ గడ్డపై రష్యా దురాక్రమణ జెండా ఎగరేసింది. ఇక హారిస్ నాలుగేళ్లు అధ్యక్ష పీఠంపై కూర్చుంటే అమెరికాలో పరిశ్రమలు లేకుండా చేస్తుంది. దేశాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు మన ప్రజాస్వామ్యం మనుగడలో ఉండదు. మన పని అయిపోతుంది. డెమొక్రాట్ల విధాన నిర్ణయాలు చాలా దారుణంగా ఉంటాయి’’అని ఆరోపించారు. ఇరాన్ నుంచి హత్యాయత్నం ముప్పుఅమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ నుంచి ప్రాణహాని పొంచి ఉందని అమెరికా నిఘా వర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాలు ఈ మేరకు తమకు సమాచారం అందించాయని ట్రంప్ ప్రచార బృందం తాజాగా ప్రకటించింది. వివరాలను ట్రంప్ ప్రచార విభాగ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చియంగ్ వెల్లడించారు. ‘‘అమెరికాలో అస్థిరత, గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా మిమ్మల్ని హత్య చేయడానికి ఇరాన్ కుట్ర పన్నుతోందని మంగళవారం ఉదయం భేటీ సందర్భంగా ట్రంప్‌కు జాతీయ నిఘా విభాగ డైరెక్టర్ వివరించారు. నిరంతరం సమన్వయంతో హత్య కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే ట్రంప్‌ను కాపాడేందుకు అన్ని నిఘా, భద్రతా సంస్థలు పనిచేస్తున్నాయి. ఎలాంటి ఆటంకాలు, అవాంఛనీయ ఘటనలు లేకుండా స్వేచ్ఛగా దేశంలో ఎన్నికలు జరిపేందుకు సంస్థలు కృషిచేస్తున్నాయి’’అని స్టీవెన్ అన్నారు. జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రంలోని బట్లర్ పట్టణంలో సభలో ఒక ఆగంతకుడు ట్రంప్‌పైకి బుల్లెట్ల వర్షం కురిపించగా ఒక బుల్లెట్ ట్రంప్ కుడి చెవి సమీపంగా దూసుకుపోవడం, వెనక కూర్చున్న ఒక వ్యక్తి మరణించడం తెల్సిందే. వెస్ట్ పామ్‌బీచ్ క్లబ్లో గోల్ఫ్ ఆడుతున్న ట్రంప్‌ను చంపేందుకు రౌత్ అనే వ్యక్తి ప్రయత్నించడం తెల్సిందే. హారిస్ ప్రచార కార్యాలయంపై కాల్పులువాషింగ్టన్: డెమొక్రాట్ల అధ్యక్ష అభ్యర్థి కమలా హారిస్ ప్రచార కార్యాలయంపై దాడి జరిగింది. అరిజోనాలో ఫీనిక్స్ శివార్లలో ఉన్న కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు పెల్లెట్ గన్‌తో కిటికీలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన జరిగింది. దాంతో కార్యాలయ తలుపుకు, కిటికీలకు రంధ్రాలు పడ్డాయి. ‘‘ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేరు. దాంతో ఎవరికీ ఏ హానీ జరగలేదు’’అని పోలీసు లు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యాలయంపై ఈ నెలలోనే ఇది రెండో దాడి. సెప్టెంబర్ 16న కూడా ఇలాగే పెలెట్ గన్‌తో కాల్పులు జరిగాయి. దాంతో ప్రచార కార్యాలయంతో పాటు పరిసర ప్రాంతాలకు భద్రత పెంచారు. హారిస్ శుక్రవారం అరిజోనాలో మెక్సికో సరిహద్దును సందర్శించనున్న నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఈ ముప్పును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అరిజోనా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్షుడు యోలాండా బెజరానో చెప్పారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై ఇప్పటికే రెండుసార్లు హత్యాయత్నం జరగడం తెలిసిందే. -
అత్యాచార బాధితురాలిపై శివరాజ్ సర్కార్ నిర్లక్ష్యం
ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో నెల రోజుల క్రితం అత్యాచారానికి గురై, రక్తంతో తడిసిన దుస్తులతో రోడ్డుపై తిరుగుతూ, తనను కాపాడాలంటూ పలువురి ఇంటి తలుపులు తట్టిన యువతి ఉదంతం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఉజ్జయిని పోలీసులు రంగంలోకి దిగి యువతిపై అత్యాచారం చేసిన నిందితుడిని, అతనికి సహాయం అందించిన వ్యక్తిని పట్టుకున్నారు. అయినా న్యాయం ఆమెకు అందనంత దూరంలో ఉంది. ఈ ఘటన తర్వాత శివరాజ్ సర్కార్ బాధితురాలిని ఆదుకుంటామని పలు వాగ్దానాలు చేసింది. ఇప్పుడు బాధితురాలు తన ఇంటిలోనే ఉంది. ఆరోగ్యం కూడా మెరుగుపడింది. అయితే ప్రభుత్వ వాగ్దానాలు ఇప్పటికీ నెరవేరలేదు. తాజాగా ఒక మీడియా బృందం ఉజ్జయినికి 700 కిలోమీటర్ల దూరంలోని బాధితురాలి ఇంటికి వెళ్లి, అక్కడి పరిస్థితులు పరిశీలించనప్పుడు అనేక విషయాలు వెలుగు చూశాయి. ఈ ఘటన సెప్టెంబర్ 25న చోటుచేసుకుంది. ఉజ్జయినిలో ఒక ఆటోడ్రైవర్ బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాధితురాలు దీనంగా తనను కాపాడాలంటూ కనిపించినవారినందరినీ వేడుకుంది. ఒక సన్యాసి ఆమెకు సహాయం అందించాడు. అనంతరం బాధితురాలిని పోలీసులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలు అక్టోబర్ 12న తన ఇంటికి చేరుకుంది. నెల రోజులు దాటినా బాధితురాలికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు. బాధితురాలు కుటుంబ సభ్యులతో కలసి ఒక పూరిగుడిసెలో నివసిస్తోంది. భయంభయంగానే కాలం వెళ్లదీస్తోంది. బాధితురాలి ఇంట్లో ఇప్పటికీ మట్టి పొయ్యినే వినియోగిస్తున్నారు. తాగునీటి కోసం 300 మీటర్ల దూరంలోని కుళాయి వద్దకు కుటుంబ సభ్యులు వెళ్లాల్సి వస్తుంటుంది. బాధితురాలు షెడ్యూల్డ్ కులానికి చెందినది. బాధితురాలి సోదరుడు మాట్లాడుతూ తాము తక్కువ కులానికి చెందిన వారమని, తమ మాట వినేవారే లేరని వాపోయాడు. బాధితురాలు ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ ప్రాంత బీజేపీ నేత సురేంద్ర సింగ్ గరేవార్ వారి ఇంటికి వచ్చి, రేషన్ సరుకుల కోసమంటూ రూ. 1500 రూపాయలు ఇచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రభుత్వం నుండి తమకు నెలకు రూ. 600 చొప్పున సామాజిక న్యాయ పింఛను అందుతుందని బాధిత కుటుంబం తెలిపింది. నెల రోజుల క్రితం చావుబతుకుల మధ్య పోరాడిన బాధితురాలు ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలవుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన కాంగ్రెస్ సీనియర్ నేత -
మద్యం మత్తులో పెళ్లి చేసుకోవాల్సిన విషయమే మర్చిపోయిన వరుడు
ఇటీవల కాలంలో చాలా వివాహతంతు సమయంలో చాలా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న ఒక వ్యక్తి ఫుల్‌గా తాగేసి పెళ్లి పీటలపైనే నిద్రపోయాడు. ఆ ఘటన మరువకు మునేపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏకంగా తన పెళ్లి చేసుకోవాల్సిl విషయం మర్చిపోయాడు. తన పెళ్లికి తానే అటెండెంట్ కాలేకపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లో ఓ పెళ్లి వేడుకు చాలా ఘనంగా జరుగుతోంది. మండంలో వధువు తరుఫు కుటుంబ సభ్యులు వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే వరుడు ఫుల్‌గా తాగేసి మండపానికి రావడం మర్చిపోయాడు. అక్కడ ఏమో వరుడు రాక కోసం చూసి, చూసి.. పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వచ్చేశారు వధువు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత రోజు వరుడుకి స్పుహ వచ్చి వధువు వధువు ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా..ఆమె పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. జీవితంలో అతి ముఖ్యమైన విషయంలోనే ఇంత భాధ్యతరాహిత్యంగా ప్రవర్తించాడు ఇక అతడితో జీవితం ఏం బావుంటుందని గట్టిగా నిలదీసింది వధువు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రాకతో ఒక్కసారిగా సద్దుమణిగింది. ఐతే వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అయిన ఖర్చును తిరిగి ఇవ్వాల్సిందిగా వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
పెళ్లి రోజు మర్చిపోయిన భర్త.. ఊహించని షాకిచ్చిన భార్య
ఇటీవల భార్తభర్తల గొడవలు చాలా సిల్లీగా ఉంటున్నాయి. పైగా వాటిని పోలీస్టేషన్ల వరకు తీసుకువచ్చి పంచాయితీ పెడుతుండటం మరింత విడ్డూరం. నాలుగోడల మధ్య పరిష్కరించుకోవాల్సి చిన్నపాటి తగాదా కాస్త దాడి చేసుకునేంత వరుకు వెళ్లిపోతుండటం బాధకరం. అచ్చం అలాంటి విచిత్ర ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ముంబైలో ఘట్కోపర్లో నివశిస్తున్న 32 ఏళ్ల విశాల్ నాంగ్రే అనే వ్యక్తి కొరియర్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య కల్పన ఫుడ్ అవుట్‌లెట్‌లో పనిచేస్తోంది. అతని భార్య కల్పన ఇద్దరూ కలిసి బెగన్‌వాడిలో నివశిస్తున్నారు. ఆ జంటకు 2018లో వివాహమైంది. ఫిబ్రవరి 18 వారి పెళ్లిరోజు. ఆ విషయాన్ని నాంగ్రే మర్చిపోయాడు. ఈ విషయమై భర్తపై కోపంతో తన తల్లిదండ్రులు, సోదరడుని ఇంటికి పిలిపించి మరి గొడవకు దిగింది. అక్కడితో ఆగక ఆమె అతడిని తీవ్రంగా దుర్భాషలాడుతూ, అతడి తల్లిపై చేతివాటం చూపింది. దీంతో వివాదం కాస్త తారాస్థాయికి చేరింది. ఐతే ఆమె భర్త నాంగ్రే గాయపడిన తన తల్లిని హుటాహుటినా ఆస్పత్రికి తీసుకువెళ్లి తదనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు అతడి భార్య, ఆమె తల్లిదండ్రులు, సోదరుడుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభించారు. (చదవండి: మిరాకిల్ ఘటన: ఘోర కారు ప్రమాదం..బతికే ఛాన్సే లేదు! కానీ..) -
ఇవి కూడా అల్జైమర్స్ లక్షణాలేనట!!
మామూలు మతిమరపునకు, అల్జైమర్స్కీ తేడా చాలామందికి తెలిసిందే. అయినా చెప్పుకోవాలంటే ఏదైనా ఒక వస్తువు ఎక్కడ పెట్టామో మరచిపోవడం మతిమరపు అయితే... అసలు ఆ వస్తువనేదొకటుంటుందనే కాన్సెప్ట్నే మరచిపోవడం అల్జైమర్స్. ఉదాహరణగా చెప్పాలంటే... కారు తాళాలను మరచిపోవడం మతిమరపైతే... అసలు కారు డ్రైవింగ్‌నే మరచిపోవడం అలై్జమర్స్ అనుకోవచ్చు. పెద్ద వయసు వచ్చాక చేసే ఆ ఐదు రకాల పనులు అల్జైమర్స్‌ను సూచిస్తాయంటున్నారు లాస్ ఏంజిలిస్‌లోని యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యూఎస్సీ)కు చెందిన పరిశోధకులు. వారు చెప్పేదాన్నిబట్టి... కాస్త వయసు పైబడ్డాక చేసే పనులు వారిలో అలై్జమర్స్ వచ్చే సూచనలను పట్టి ఇస్తుంటాయని యూఎస్సీ అధ్యయనవేత్తలు చెబుతున్నారు. వాటిల్లో కొన్ని సూచనలివి... 1. దుస్తులు తొడుక్కోవడంలో శుభ్రత పాటించకపోవడం, బట్టలు నీట్‌గా ధరించకపోవడం... వీళ్లు పొందిగ్గా కాకుండా నిర్లక్ష్యంగా, మురికిగా దుస్తులు తొడుక్కుంటుంటారు. 2. పార్కింగ్ చేస్తున్నప్పుడు వాహనాన్ని కుదురుగా కాకుండా... ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తుంటారు. 3. మంచి ఆరోగ్యకరమైన హాస్యాన్నీ, మంచి అభిరుచితో ఉండే హ్యూమర్ ను కాకుండా... ఒకరు బాధిస్తుంటే ఇతరులు బాధపడుతుంటే చూసి ఆనందించే తరహా హాస్యాన్ని (బ్యాడ్ టేస్ట్ హ్యూమర్ ను / అపహాస్యాలను) ఇష్టపడుతుంటారు. 4. అందరి ముందూ మాట్లాడే సమయంలో పాటించాల్సిన నియమాలు పాటించకపోవడం వంటివి చేస్తుంటారు. ఉదాహరణకు మాట్లాడే సమయంలో విచక్షణ పాటించకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం, పిల్లల ముందు మాట్లాడకుండా ఉండాల్సినవి కూడా మాట్లాడటం, వారి ముందర ఉచ్చరించకుండా ఉండాల్సిన అవాచ్యాలను, అశ్లీల పదాలను పలుకుతుంటారు. 5. అన్నింటికంటే ముఖ్యంగా ఇవ్వకూడని వారికి ఇష్టం వచ్చినంత పెద్దమొత్తంలో డబ్బులు ఇస్తుంటారు. ఇలా చేయడం ద్వారా కొన్ని సమస్యల్లోనూ చిక్కుకుంటుంటారు. కాబట్టి ఓ వయసు దాటక ఇవన్నీ అసంకల్పితంగానూ, చాలా ఎక్కువగానూ చేస్తూ ఉంటే... ఎందుకైనా మంచిది... ఒకసారి డాక్టర్ / న్యూరాలజిస్ట్‌కు చూపించడం చాలా మేలు చేసే అంశం. -
ఇదేం రూల్ సామి.. భార్య బర్త్‌డే మర్చిపోతే.. జైళ్లో పడేస్తారా !
దేశానికో భాష ఉన్నట్లే చట్టాలు కూడా ఒక్కో దేశానికి ఒక్కోలా ఉంటాయి. సాధారణంగా ప్రజలు చేసే తప్పులకు కొన్ని దేశాల్లో అక్కడి చట్టాలనుసరించి కఠినంగా వ్యవహరిస్తే మరికొన్ని వాటిలో అవే తప్పులకు కాస్త వెసలుబాటును కల్పిస్తుంటాయి. ఇప్పుడిదంతా ఎందుకంటారా.. సమెవా అనే ప్రాంతంలో ఓ వింత చట్టం అమలవుతోంది. ఆ చట్టాన్ని వింటే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే. వివరాల్లోకి వెళితే.. పసిఫిక్ సముద్రం సమీపంలో ఉన్న సమోవా అనే ఓ ఐలాండ్‌లో ఉంది. ఆ ఐలాండ్ ఎంత అందంగా ఉంటుందో అక్కడి ఉండే చట్టాలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. తాజాగా.. అక్కడ భర్తలు తమ భార్య పుట్టిన రోజును మర్చిపోతే జైలు శిక్ష అనుభవించాలని అక్కడి ప్రభుత్వం ఓ చట్టాన్ని తీసుకువచ్చింది. సతీమణి పుట్టినరోజును పొరపాటున మర్చిపోతే కూడా అక్కడ నేరంగా పరిగణిస్తారట. అయితే ఈ విషయంలో భార్య ఫిర్యాదు కీలకం. ఆమె ఫిర్యాదు చేస్తే మొదట సారి పోలీసులు హెచ్చరించి వదిలేస్తారు. అదే మళ్లీ పునరావృతం అయితే రెండో సారి జైలు శిక్ష తప్పదు. భార్యపై నిర్ళక్ష్యం చూపకూడదే ఉద్దేశ్యంతో అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇటీవల చైనా కూడా పిల్లలు తప్పు చేస్తే వారి తల్లిదండ్రులను శిక్షించాలని ఓ చట్టాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. చదవండి: Guinness World Record: ఎంత బిగుతైన గడ్డామో! 63 కేజీల యువతిని ఎత్తాడు..!! -
యువతలో గజినీలు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): స్కూల్‌కు టైమ్ అవుతోందనే హడావుడిలో పిల్లలు అమ్మ ఇచ్చిన లంచ్ బాక్స్ మరిచిపోతున్నారు.. ఆఫీస్‌కు లేటవుతున్నామనే భావనతో ఉద్యోగులు బైక్ కీస్ మరిచి గబగబ మెట్లు దిగిపోతున్నారు. వీరే కాదు మతిమరుపుతో అవస్థలు పడుతున్న వారు మరెందరో ఉన్నారు. ఒకప్పుడు ఆరవై ఏళ్లు దాటితే కానీ కనిపించని మతిమరుపు ఇప్పుడు 16 ఏళ్లకే పలకరిస్తోంది. పాతికేళ్ల వారిలో ఇది తీవ్రస్థాయిలో కనిపిస్తోంది. పరీక్షల భయం, పని వత్తిడి, ఆందోళన వంటివి మతిమరుపునకు ప్రధాన కారణాలు. పౌష్టికాహార లోపం, కొన్ని రకాల వ్యాధులు కూడా మతిమరుపునకు దారితీస్తున్నాయని మానసిక వైద్య నిపుణులు చెపుతున్నారు. టీనేజ్లోనే బీజం మతిమరుపు సమస్యకు టీనేజ్‌లో బీజం పడుతోంది. 25 నుంచి 35 ఏళ్ల వయస్సు వారిలో అది తీవ్రస్థాయికి చేరుతోందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 20 నుంచి 30 శాతం మంది యువత మతిమరుపుతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. లోపిస్తున్న ఏకాగ్రత ఒక విషయాన్ని సమగ్రంగా వినడంలోనూ యువతలో ఏకాగ్రత లోపిస్తోంది. వినడం, విన్నదానిని మదిలో ముద్రించుకోవడం, తిరిగి దానిని చెప్పడం, చెప్పే విషయాల్లో యువతలో తీవ్రమైన మార్పులోస్తున్నాయి. విన్న విషయాన్ని మనసులో ముద్రించుకోకపోవడం వల్లే మతిమరుపు వస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. చాలా మంది ఒక పనిని చేస్తూ మరికొరితో మాట్లాడుతుంటారు. ఈ సమయంలో వారు చెప్పే విషయాలు పెద్దగా వినక పోవడంతో ఆ తర్వాత గుర్తు చేసుకుందామన్నా జ్ఞప్తికి రాని పరిస్థితి ఉంటోంది. అంతు చూస్తున్న వత్తిడి చేసే పనిలో టెన్షన్, యాంగ్జ్జయిటీ, సైకలాజికల్ అంశాలు జ్ఞాపక శక్తిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యమైన అంశాలను గుర్తు పెట్టుకోవడంలోనూ యువతలో జ్ఞాపకశక్తి తగ్గుతోంది. ఉదయం లేవగానే ఏదో పనిచేయాలని అనుకుంటారు. తీరా చెప్పే సమయం వచ్చేసరికి అది గుర్తుకు రాదు. అంతలా వారి మెదడు మొద్దుబారుతోంది. యాంగ్జయిటీతో ముప్పు జ్ఞాపకశక్తి తగ్గిపోవడానికి, మానసిక సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం యాంగ్జాయిటీ. ఏ పనిచేసినా ఆందోళనతో చేయడం, హడావుడిగా మాట్లాడటం వల్ల ఒత్తిడి పెరిగిపోతోంది. అది మనసుపై ప్రభావం చూపుతోంది. దీంతో విన్న విషయం అవసరమైనప్పుడు గుర్తుకురావడం లేదు. ఉద్యోగంలో పనివత్తిడి, కుటుంబ సమస్యలు, ఆర్థిక అంశాలు కూడా యువతపై ప్రభావం చూపుతున్నాయి. పిల్లల్లో హోం వర్క్, పరీక్షల మార్కులపై వత్తిడి, శిక్షలు, వారిలో వత్తిడి పెంచి అదికాస్తా మతిమరుపునకు కారణం అవుతోందని వైద్యులు పేర్కొంటున్నారు. బీపీ, మధుమేహం ప్రభావం మధుమేహం, రక్తపోటు, థైరాయిడ్ వంటివి సోకి ఐదేళ్లు దాటిన వారిలో మతిమరుపు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ వ్యాధులు ఉన్న వారిలో హార్మోన్ల అభివృద్ధిలో లోపాలు చోటుచేసుకుంటాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి విటమిన్ బీ–12 కారణమని, దాని లోపం వల్ల మతి మరుపు పెరుగుతుందని వైద్యులు చెపుతున్నారు. పౌష్టికాహారం లేక పోవడం వల్ల బ్రెయిన్ సెల్స్ అభివృద్ధి లోపిస్తుందని పేర్కొంటున్నారు. రెడీమేడ్ ఫుడ్ జోలికెళ్లకూడదని సూచిస్తున్నారు. మాంసాహారంలో బీ12 పుష్కలంగా లభిస్తుందని, పచ్చని ఆకు కూరగాయలు తింటే కాస్త జ్ఞాపకశక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఏకాగ్రత తగ్గుతోంది యువత, విద్యార్థుల్లో ఏకాగ్రత తగ్గుతోంది. దీంతో తాము చేయాల్సిన దానిపై దృష్టి సారించలేక పోతున్నారు. ప్రతి చిన్న విషయానికీ వస్తువులపై ఆధారపడుతున్నారు. లెక్కలు చేయాలంటే కాలిక్యులేటర్ వాడుతున్నారు. ఎక్కువ సమయం సెల్‌ఫోన్‌తో గడుపుతున్నారు. దీంతో ప్రతి విషయాన్నీ మరిచిపోతున్నారు. ఒత్తిడిని జయించేందుకు మెదడుకు పదును పెట్టాలి. స్వతహాగా లెక్కలు కట్టడం, ఫోన్ నంబర్లు గుర్తు పెట్టుకోవడం వంటివి చేయాలి. పౌష్టికాహారం తీసుకోవడం చాలా అవసరం. మార్కులు కోసం తల్లిదండ్రులు పిల్లలపై వత్తిడి తేకూడదు. ఇది వారిని మరింత ఆందోళనకు గురిచేస్తుంది. – డాక్టర్ వి.రాధికారెడ్డి, మానసిక వైద్య నిపుణులు, విజయవాడ ప్రభుత్వాస్పత్రి