
ఇటీవల కాలంలో చాలా వివాహతంతు సమయంలో చాలా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న ఒక వ్యక్తి ఫుల్‌గా తాగేసి పెళ్లి పీటలపైనే నిద్రపోయాడు. ఆ ఘటన మరువకు మునేపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏకంగా తన పెళ్లి చేసుకోవాల్సిl విషయం మర్చిపోయాడు. తన పెళ్లికి తానే అటెండెంట్ కాలేకపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే..బిహార్‌లో ఓ పెళ్లి వేడుకు చాలా ఘనంగా జరుగుతోంది. మండంలో వధువు తరుఫు కుటుంబ సభ్యులు వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే వరుడు ఫుల్‌గా తాగేసి మండపానికి రావడం మర్చిపోయాడు. అక్కడ ఏమో వరుడు రాక కోసం చూసి, చూసి.. పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వచ్చేశారు వధువు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత రోజు వరుడుకి స్పుహ వచ్చి వధువు వధువు ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా..ఆమె పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది.
జీవితంలో అతి ముఖ్యమైన విషయంలోనే ఇంత భాధ్యతరాహిత్యంగా ప్రవర్తించాడు ఇక అతడితో జీవితం ఏం బావుంటుందని గట్టిగా నిలదీసింది వధువు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రాకతో ఒక్కసారిగా సద్దుమణిగింది. ఐతే వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అయిన ఖర్చును తిరిగి ఇవ్వాల్సిందిగా వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశారు.
(చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..)
Comments
Please login to add a commentAdd a comment