intoxicated
-
ఫుల్లుగా తాగి పడుకున్న పంచాయతీ కార్యదర్శి.. మంత్రి ఆకస్మిక తనిఖీ..
లక్నో: యూపీలోని కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామం పంచాయతీ కార్యాలయంలో మంత్రి అసీమ్ అరుణ్ ఆకస్మిక తనిఖీ చేశారు. శుక్రవారం ఆయన పంచాయతీ కార్యాలయానికి వచ్చేసరికి ప్రధాన కార్యదర్శి ఫుల్లుగా తాగి పడుకున్నాడు. మంత్రి స్వయంగా ఆ పెద్దమనిషిని లేపారు. లేచాక ఆ కార్యదర్శి చేసిన హంగామాకు చుట్టూ ఉన్నవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మిషన్-2024లో భాగంగా యూపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ మొదట కన్నౌజ్‌లోని జసర్‌పురా సరయ్య గ్రామంలో పర్యటించారు. స్థానిక బీజేపీ నాయకులతో మొదట చర్చలు నిర్వహించిన మంత్రి తర్వాత వారితో కలిసి టిఫిన్ కూడా చేశారు. అనంతరం ఆ గ్రామంలోని పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించారు. కార్యాలయం లోపలికి వెళ్లేసరికి పంచాయతీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర కమల్ ఫుల్లుగా తాగి మంచం మీద పడుకుని హాయిగా నిద్రిస్తున్నారు. మంత్రి తన కళ్ళను తాను నమ్మలేకపోయారు. దగ్గరకు వెళ్తూ.. "ఎవరీయన..?" అనడిగారు. "ఆయన ఇక్కడి పంచాయతీ ప్రధాన కార్యదర్శి" అని అక్కడున్నవారు బదులిచ్చారు . షాకైన మంత్రి అతడిని తట్టి లేపగా గాఢ నిద్రలో ఉన్న కార్యదర్శి మెల్లగా కళ్ళు తెరిచి చుట్టూ జనం ఉండటాన్ని చూసి మత్తులోనే లేచే ప్రయత్నం చేశాడు. లేస్తూ తూలిపడబోగా అతడిని స్వయంగా మంత్రి పట్టుకుని ఊతమిచ్చారు. మొత్తానికి తేరుకున్న ఆ పెద్దమనిషిని చూస్తూ "నేను మంత్రిని" అని తనని తాను పరిచయం చేసుకుని "మీరు ఇక్కడ కార్యదర్శా..?" అని ప్రశ్నించారు. అవునన్నట్టు తల ఊపాడు సతీష్ చంద్ర. "తాగి ఉన్నావా?" అనడిగితే నేను తాగలేదని చెబుతూ మంత్రి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరాడు. ఒకసారి నడిచి చూపించమని మంత్రి అడగ్గా అడుగులో అడుగు వేసుకుంటూ జాగ్రత్తగా రెండడుగులు వేశాడు. నీ పేరేంటి అనడిగితే కార్యాలయం బయట సతీష్ చంద్ర కమల్ అని ఉన్న నేమ్ ప్లేటును చూపించాడు. మరీ ఇంతలాగా తాగితే ఎలా పని చేస్తారని మంత్రి ప్రశ్నించగా కార్యదర్శి కళ్లనీళ్లు పెట్టుకుని క్షమించమని కోరాడు. ఇంతలో అక్కడున్నవారు ఇదే కార్యాలయంలో సహాయ కార్యదర్శిగా ఒక మహిళను నియమించారని ఆమే అన్ని పనులను చక్కబెడుతుందని మంత్రి అసీమ్ అరుణ్ కు వివరించారు. మంత్రి కార్యదర్శికి నాలుగు చీవాట్లు పెట్టి వారించి అక్కడినుండి వెళ్లిపోయారు. ఈ తంతు జరుగుతున్నంత సేపు అక్కడున్నవారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. Intoxicated Pradhan Ji, Minister reached office 😳 WATCH .#PanchayatOffice #AseemArun #Kannauj #UttarPradesh #ViralVideo #ViralPost #ViralNews #ViralShorts #ViralReels #viralpage #AsianetNewsable pic.twitter.com/Otn8QoRCLy — Asianet Newsable (@AsianetNewsEN) July 15, 2023 ఇది కూడా చదవండి: మీ ఇంట్లో గేదెలు పాలు ఇవ్వకపోయినా మేమే కారణమా? -
మద్యం మత్తులో పెళ్లి చేసుకోవాల్సిన విషయమే మర్చిపోయిన వరుడు
ఇటీవల కాలంలో చాలా వివాహతంతు సమయంలో చాలా వింత ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మొన్నటి మొన్న ఒక వ్యక్తి ఫుల్‌గా తాగేసి పెళ్లి పీటలపైనే నిద్రపోయాడు. ఆ ఘటన మరువకు మునేపే అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఏకంగా తన పెళ్లి చేసుకోవాల్సిl విషయం మర్చిపోయాడు. తన పెళ్లికి తానే అటెండెంట్ కాలేకపోయాడు. ఈ విచిత్ర ఘటన బిహార్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..బిహార్‌లో ఓ పెళ్లి వేడుకు చాలా ఘనంగా జరుగుతోంది. మండంలో వధువు తరుఫు కుటుంబ సభ్యులు వరుడు కోసం ఎదురు చూస్తున్నారు. ఐతే వరుడు ఫుల్‌గా తాగేసి మండపానికి రావడం మర్చిపోయాడు. అక్కడ ఏమో వరుడు రాక కోసం చూసి, చూసి.. పెళ్లి రద్దు చేసుకుని ఇంటికి వచ్చేశారు వధువు కుటుంబ సభ్యులు. ఆ తర్వాత రోజు వరుడుకి స్పుహ వచ్చి వధువు వధువు ఇంటికి వెళ్లి క్షమాపణలు చెప్పేందుకు యత్నించినా..ఆమె పెళ్లి చేసుకునేందుకు నిరాకరించింది. జీవితంలో అతి ముఖ్యమైన విషయంలోనే ఇంత భాధ్యతరాహిత్యంగా ప్రవర్తించాడు ఇక అతడితో జీవితం ఏం బావుంటుందని గట్టిగా నిలదీసింది వధువు. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. పోలీసుల రాకతో ఒక్కసారిగా సద్దుమణిగింది. ఐతే వధువు కుటుంబ సభ్యులు పెళ్లికి అయిన ఖర్చును తిరిగి ఇవ్వాల్సిందిగా వధువు కుటుంబాన్ని డిమాండ్ చేశారు. (చదవండి: పనిలోంచి తీసేశారని క్లీనర్ రివేంజ్..కార్లపై యాసిడ్ పోసి..) -
నాగుపామును ముద్దాడి మృత్యువు ఒడిలోకి..
పాట్నా: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేజేతులారా ప్రాణం తీసుకున్నాడు. అది చాలా విచిత్రంగా ప్రవర్తించి. ఓ నాగుపామును దొరకబుచ్చుకుని మెడలో వేసుకుని వీరంగం సృస్టించాడు. దానిని ముద్దాడి.. ఆటాడి.. పూజించి.. చివరకు కాటేయించుకుని ప్రాణం పొగొట్టుకున్నాడు. నాగుపాముతో ఆటాడి ప్రాణం పొగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును మెడలో వేసుకుని.. దాని ముద్దాడాడు ఆ వ్యక్తి. ఆపై అక్కడే ఉన్న ఓ గుడి ముందుకు చేరి పాము మెడలో ఉండగానే వంగి వంగి దండాలు పెట్టాడు. మళ్లీ రోడ్డు మీదకు చేరి డ్యాన్స్ చేస్తూ పామును ముద్దాడాడు. ఈ క్రమంలో అది అతన్ని కాటు వేసింది. వద్దని చుట్టుపక్కల వాళ్లు ఎంత వారించినా వినకుండా పాముతో ఆటలాడాడతను. ఆపై పామును వదిలేశాడతను. అయితే కాసేపటికే అతను కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాము విషం ఎక్కి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటన బీహార్ నవాడాలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడ్ని దిలీప్ యాదవ్‌గా గుర్తించారు. తప్పతాగి అతను గ్రామస్తులు చెప్పినా వినకుండా.. అలా పాముతో ఆటలాడాడని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు చెబుతున్నారు. शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब के नशे में सांप के साथ खेल रहा है. कभी गले में लपेटकर तो कभी हाथों में पकड़कर नचा रहा. नतीजा सांप ने डंसा और शख्स की मौत हो गई. वीडियो-अमन राज. Edited By-@Sinhamegha8 pic.twitter.com/IhD1G3Jo8a — Prakash Kumar (@kumarprakash4u) March 4, 2023 -
నాలుగు వారాల పాటు ఆ నగరమంతా మత్తులోనే..?
ఒకటీ రెండూ రోజులు కాదు ఏకంగా నాలుగు వారాల పాటు నగరమంతా మత్తులో జోగిందంటే నమ్మగలరా? రష్యాలో జరిగిందిది. 1917లో జార్ పాలనకు అంతం పలుకుతూ సోవియట్ యూనియన్ ఏర్పాటు దిశగా తిరుగుబాటు చెలరేగింది. ఆ ఏడాది అక్టోబర్‌లో బోల్ష్విక్ ప్రజావిప్లవకారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ భవనాలు స్వాధీనం చేసుకోవడం ప్రారంభించారు. ఇది అప్పటి రష్యన్ చక్రవర్తుల పరిపాలన కేంద్రమైన పెట్రోగార్డ్ (ఇప్పటి సెయింట్స్ పీటర్స్బర్గ్) నగరంలో మొదలయ్యింది. ఈ నగరంలో చక్రవర్తి అధికారిక నివాసం అయిన వింటర్ ప్యాలెస్‌ను విప్లవకారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో సోవియట్ యూనియన్ ఏర్పాటుకు మార్గం సుగమమైనట్లు వారు భావించారు. ఈ సందర్భాన్ని పండుగలా జరుపుకోవాలనుకున్నారు. ఈ ప్రయత్నంలో వారికి విశాలమైన వింటర్ ప్యాలెస్ భవనంలో ప్రపంచంలోనే అతిపెద్ద వైన్ సెల్లార్ కనపడింది. అందులో సుమారు 100 మిలియన్ డాలర్ల విలువైన మందు ఉంది. దీంతో బోల్ష్విక్ సైనికులు ఉత్సాహంగా ఆ మందు తాగి, చిందులు వేయడం ప్రారంభించారు. ఈ విషయం ఆ నోటా ఈ నోటా నగరంలోని పౌరుల చెవిన పడింది. వెంటనే వారూ ఆ భవనానికి చేరుకొని తాగడం మొదలుపెట్టారు. ఇలా ఏకంగా నాలుగు వారాల పాటు తాగుతూ, మత్తులోనే జోగుతూ ఉండిపోయారంతా. చివరికి సెల్లార్‌లోని మందు అయిపోవడంతో వాళ్ల హ్యాంగోవర్‌కు బ్రేక్ పడింది. ఈ కారణంగానే ఇది ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘకాలం మత్తులో జోగిన సంఘటన (బిగ్గెస్ట్ హ్యాంగోవర్)గా చరిత్రకెక్కింది. ప్రస్తుతం ఈ వింటర్ ప్యాలెస్‌ను మ్యూజియంగా మార్చారు. చదవండి: ఓం నమః శివాయ అంటున్న ఇజ్రాయెల్ వాసులు -
మద్యం మత్తులో ‘గాంధీ’ సెక్యూరిటీ గార్డుల డ్యాన్స్
సాక్షి, హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో టిక్‌టాక్‌ల వ్యవహారం సద్ధుమణగక ముందే ఆస్పత్రి అత్యవసర విభాగంలో మద్యం మత్తులో సెక్యూరిటీ గార్డులు చేసిన డ్యాన్సులు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దిద్దుబాటు చర్యలు చేపట్టిన ఆస్పత్రి పాలనయంత్రాంగం నలుగురు సెక్యూరిటీ గార్డులను విధుల నుంచి తొలగించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. గాంధీ ఆస్పత్రిలో ఎజిల్ సెక్యూరిటీ సంస్థ తరుపున సుమారు 200 మంది సెక్యూరిటీ గార్డులు విధులు నిర్వహిస్తున్నారు. అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో వి«ధి నిర్వహణలో ఉంటూనే మద్యం మత్తులో కే.కట్టయ్య అనే గార్డు డ్యాన్స్ చేస్తుండగా అదే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న బీ. శ్రీనివాస్, ఎన్ వెంకటస్వామి, వి. వెంకటేష్ అనే గార్డులు మరింత ఉత్తేజ పరుస్తూ సెల్ఫోన్లో వీడియో చిత్రీకరించారు.సదరు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ చేపట్టి మద్యం మత్తులో డ్యాన్స్ చేసిన కట్టయ్యతోపాటు మిగిలిన ముగ్గురిని విధుల నుంచి తొలగించామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. సదరు వీడియో ఈనెల 21వ తేది ఉదయం 8.30 గంటలకు అత్యవసర విభాగంలోని రెండవ అంతస్తులో చిత్రీకరించగా, శనివారం సామాజక మాధ్యమాల్లో వైరల్ కావడం గమనార్హం. నిర్వహణ సంస్థ ఎజిల్ సెక్యూరిటీ సంస్థకు నోటీసులు జారీ చేశారు. టిక్‌టాక్ వ్యవహారంపై సీరియస్... గాంధీ ఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగంలో జరిగిన టిక్ టాక్ వ్యవహారాన్ని ఆస్పత్రి పాలనయంత్రాంగం సీరియస్‌గా తీసుకుంది. సదరు అప్రెంటీస్ విద్యార్థులను తొలగించడంతో పాటు రాంనగర్ సాధన పారామెడికల్ కాలేజీ, అత్తాపూర్ జెన్ ఓకేషనల్ కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ స్పష్టం చేశారు. ఇకపై సదరు కాలేజీలకు చెందిన విద్యార్థులకు గాంధీ ఆస్పత్రిలో శిక్షణ ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులు, జూనియర్ వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్యులు ఇతర సిబ్బంది విధి నిర్వహణలో ఉంటు టిక్ టాక్‌లు, సుదీర్ఘ సెల్‌ఫోన్ సంభాషణలు, చాటింగ్, వీడియో చిత్రీకరణ చేపట్టరాదని ఆదేశాలు జారీ చేశారు. ఫిజియోథెరపీ విభాగ వైద్యులకు నోటీసులు ఇవ్వడంతోపాటు కమిటీని ఏర్పాటు చేశామని ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రవణ్‌కుమార్ తెలిపారు. -
తాగి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయింది
తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ ఓ యువతి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. 23 ఏళ్ల వైట్నీ బీల్ ...అమెరికాలోని లేక్ ల్యాండ్, ఫ్లోరిడాలో తాగిన మత్తులో కారు నడిపింది. అయితే అదే సమయంలో తన ఫోన్ లో తన చేష్టలని వీడియో తీస్తూ ఆన్ లైన్ గ్రూప్(పెరీస్కోప్) లో చాట్ చేసింది. ఆ వీడియోను చూసిన వాళ్లు వైట్నీ బీల్ తాగిన మత్తులో కారు నడిపి ఎక్కడ ప్రమాదానికి గురిఅవుతుందోనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ఆధారంగా ఆమె ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే వెంబడించారు. వైట్నీ బీల్ ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చివరకు ఫుట్ పాత్‌ను ఢీకొట్టి కారును ఆపింది. తాగి వాహనం నడిపినందుకుగానూ ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.