తాగి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయింది | Drunk woman Periscopes herself driving while intoxicated - then gets arrested | Sakshi
Sakshi News home page

తాగి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయింది

Published Tue, Oct 13 2015 5:55 PM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

తాగి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయింది - Sakshi

తాగి వీడియో తీసి అడ్డంగా దొరికిపోయింది

తాగిన మైకంలో కారు డ్రైవ్ చేస్తూ ఓ యువతి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. 23 ఏళ్ల వైట్నీ బీల్ ...అమెరికాలోని లేక్ ల్యాండ్, ఫ్లోరిడాలో తాగిన మత్తులో కారు నడిపింది. అయితే అదే సమయంలో తన ఫోన్ లో తన చేష్టలని వీడియో తీస్తూ ఆన్ లైన్ గ్రూప్(పెరీస్కోప్) లో చాట్ చేసింది.


ఆ వీడియోను  చూసిన వాళ్లు వైట్నీ బీల్ తాగిన మత్తులో కారు నడిపి ఎక్కడ ప్రమాదానికి గురిఅవుతుందోనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఫోన్ ఆధారంగా ఆమె ప్రయాణిస్తున్న ప్రాంతాన్ని గుర్తించిన  పోలీసులు వెంటనే వెంబడించారు. వైట్నీ బీల్  ఆపడానికి పోలీసులు ప్రయత్నించగా తప్పించుకోవడానికి ప్రయత్నించింది. చివరకు ఫుట్ పాత్ను ఢీకొట్టి కారును ఆపింది. తాగి వాహనం నడిపినందుకుగానూ ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement