
చేజేతులారా ఓ వ్యక్తి చావుతో చెలగాటం ఆడాడు. వద్దని వారిస్తున్నా..
పాట్నా: మద్యం మత్తులో ఓ వ్యక్తి చేజేతులారా ప్రాణం తీసుకున్నాడు. అది చాలా విచిత్రంగా ప్రవర్తించి. ఓ నాగుపామును దొరకబుచ్చుకుని మెడలో వేసుకుని వీరంగం సృస్టించాడు. దానిని ముద్దాడి.. ఆటాడి.. పూజించి.. చివరకు కాటేయించుకుని ప్రాణం పొగొట్టుకున్నాడు.
నాగుపాముతో ఆటాడి ప్రాణం పొగొట్టుకున్న ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పామును మెడలో వేసుకుని.. దాని ముద్దాడాడు ఆ వ్యక్తి. ఆపై అక్కడే ఉన్న ఓ గుడి ముందుకు చేరి పాము మెడలో ఉండగానే వంగి వంగి దండాలు పెట్టాడు. మళ్లీ రోడ్డు మీదకు చేరి డ్యాన్స్ చేస్తూ పామును ముద్దాడాడు. ఈ క్రమంలో అది అతన్ని కాటు వేసింది. వద్దని చుట్టుపక్కల వాళ్లు ఎంత వారించినా వినకుండా పాముతో ఆటలాడాడతను.
ఆపై పామును వదిలేశాడతను. అయితే కాసేపటికే అతను కుప్పకూలిపోగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే పాము విషం ఎక్కి అతను మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటన బీహార్ నవాడాలోని నారాయణపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. మృతుడ్ని దిలీప్ యాదవ్‌గా గుర్తించారు. తప్పతాగి అతను గ్రామస్తులు చెప్పినా వినకుండా.. అలా పాముతో ఆటలాడాడని తెలుస్తోంది. పోస్ట్‌మార్టం రిపోర్ట్ వచ్చాక.. ఈ ఘటనపై ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని పోలీసులు చెబుతున్నారు.
शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब के नशे में सांप के साथ खेल रहा है. कभी गले में लपेटकर तो कभी हाथों में पकड़कर नचा रहा. नतीजा सांप ने डंसा और शख्स की मौत हो गई. वीडियो-अमन राज. Edited By-@Sinhamegha8 pic.twitter.com/IhD1G3Jo8a
— Prakash Kumar (@kumarprakash4u) March 4, 2023